APLatestNews.com top Banner

Social Media links
ఓటమి కన్న విలువలు, మనిషి లో 3 రూపాలు, తనకోసం కట్టిన తాజ్ మహల్ - మంచి మాటలు - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
3 నిమిష చదువు సమయం.

మనం పంపే ఫోటో లు వీడియో లు, మనం చేసే పనులు, మన బుద్ధి, మన నడవడిక అన్ని కూడా, ఆచరణలో ఒకే విధంగా ఉంటే నే, మనకు దేవుని చూసే మొదటి మెట్టు దగ్గరకు, అనుమతి.

ఈరోజు మూడు ఫోటో లు లో, నీతి వాక్యాలు చూసారు. మన జీవితంలో అవి ఉన్నాయా, పాటిస్తూ ఉన్నామా అని, ఎవరికి వారు బేరీజు వేసుకోవాలి. ఎందుకంటే, వాటి ఫలితాలు అనుభవించేది మనమే కాబట్టి.

మోహం వ్యామోహం లో పతనం అయ్యే వారు, దానిని ఒప్పకోవాలి. తన తప్పులు తాను సరిచేసుకోకుండా, ఇతరులను నిందించకూడదు. ఇప్పుడు ఒక్కొక్కటిగా వాటి అర్థం చూద్దాం.

1. ఓటమి ఎరుగని వ్యక్తి అనిపించుకోవడం కన్నా, విలువలను వదులుకోని వ్యక్తి అనిపించుకోవడం కష్టం. కానీ దేవుని కి, ఆ కష్టమే ఇష్టం.

ఆదాయ ధనం లేని వాడు, ఉద్యోగం లేని వాడు, ఓడిపోయాడు లేదా వెనక్కి తిరిగి వచ్చాడు, అని జనం అనుకున్నా లేదా ఓటమి పాలు అయినా, లేదా అధః పాతాళానికి పడి పోయినా కూడా, మనల్ని నమ్ముకున్న 74 ఏళ్ల ముదుసలి తల్లి ని వదలకూడదు. ఇతరులు ఎవరూ కూడా, మనం చూపిన ప్రేమ అభిమానం కృతజ్ఞతలు చూపలేరు, మన కన్నతల్లి మీద, ఆఖరుకు తోడబుట్టిన వారైనా కూడా. జీవితములో పోరాడి ఓడిపోదాం, కానీ విలువ లు మాత్రం నిలుపుకుందాం.

నీతి నియమం ధర్మ బద్దంగా లేని, స్నేహితుల సహాయం పొందకూడదు, వారికి సాయం కూడా చేయకూడదు. రెండు వైపులా, అపాత్రాదానము. మన కు లేదా వారికి చేసిన సాయం, మన పుణ్యము వారికి ఇంకా బలమై, ఇంకొన్ని ఎక్కువ పాపాలు చేస్తారు. వారి పాపం లోనూ మనకు భాగం వస్తుంది, వడ్డీ తో సహా మిత్రమా.

2. మనిషి లో మూడు రూపాలు ఉంటాయి. మొదటిది ప్రపంచం కు కనిపించేది. రెండోది కుటుంబం కు స్నేహితులు కు మాత్రమే తెలుస్తుంది. మూడవ రూపం ఏవరికీ చూపించడు. అదే మనిషి అసలు నిజ స్వరూపం.

మరి ఎవరితో పలకకుండా, జవాబు చెప్పకుండా, స్పందించకుండా, గమ్ముగా, గుట్టుగా ఉండే వారితో ఇదే ప్రమాదం. అందుకే తప్పో ఒప్పో, మాట్లాడితే కదా, మన రూపాలు గుణాలు నటన మంచి బయటకు కనపడేది.

ఆ మూడు రూపాలు ఒకే రకంగా ఉన్నవారే, దేవుడు అవుతారు, దేవుని చూసే అర్హతలు పొందుతారు. రాముడు, కృష్ణుడు , బుద్దుడు, మనలో ని మంచి మనుషులు ఉదాహరణ. చూడండి రావణుడు కూడా, నటించ లేదు, దాయ లేదు, తప్పు చేస్తు, తప్పు చేసాను అని ధైర్యముగా చెప్పారు, శిక్ష పొందారు, దేవుడిని చూశారు.

ఈ మూడు కలసిన మంచి వారికి, మాటలు చేతలు ఒకే రకంగా ఉంటాయి, ఎన్నేళ్ళు అయినా కూడా, అవి మారవు అవకాశం ను బట్టి కూడా.

వారు స్పష్టంగా అభిప్రాయం చెపుతారు, చెడు కు వ్యామోహం కు దూరంగా ఉంటారు. తాము నష్టపోయినా కూడా, ఇతరులకు నష్టం చేయరు. మనల్ని కూడా మోహం నుంచి బయట వేస్తారు, రాబోయే భవిష్యత్ శిక్షలు నుంచి కాపాడతారు.

3. తనకోసం కట్టిన తాజ్ మహల్, లోకులు మాత్రమే చూసారు. ముంతాజ్ చూడలేదు. అందుకే బతికి ఉన్నప్పుడు, అయిన వాళ్ళ పట్ల ఆత్మీయత చూపాలి, పోయిన తర్వాత ఎన్ని, ఆర్భాటాలు హంగులు చూపినా వృధాయే కదా.

తల్లి దండ్రులు బతికి ఉన్న కాలం దూరంగా ఉంచి, ఇబ్బందులు తో వదలి, ఆ తర్వాత అంటే పోయాక, జనం ముందు గొప్పగా నటించి, గంధం చెక్క ల మంట తో లక్షల ఖర్చు తో, వేయి మంది పైన భోజనాలు తో, ఎవరికి పుణ్యం, ఎవరికి లాభం?

ఆత్మీయులు దగ్గర లేక గతించిన అమ్మా నాన్నా, కాకుల ద్వారా తినే ముద్ద విలువ కన్నా ఎక్కువ నా, ఆ ఆర్భాటపు అనవసరపు ఖర్చు?

అందుకే అన్ని లక్షలు ధనం, అమ్మ బతికి ఉన్నప్పుడు, ఆమెకే పెట్టాలి. ఆమే అనుభవించాలి, మనతో అన్ని సౌకర్యాలు బతికి ఉన్నప్పుడే ఇహలోకం లోనే, మనకు ఎంత నష్టం ఇబ్బంది అయినా కూడా, పర్లేదు.

ఆమె తదనంతరం, మందికి ఖర్చు అవసరం లేదు, అది వృధాయే కదా. ప్రేమతో గతం తలచుకుని, ఓ ముద్ద పిండం పెట్టిన చాలు కదా.

పై మూడింటి లో , మనము ఎన్ని పాటిస్తూ ఉన్నామో మనకు, మన అంతరాత్మ కు, ఆ సర్వాంతర్వామికీ తెలుసు. పంచ భూతాలను మోసం చేయలేము, మన పాపానికి వాటి శిక్షలు తప్పించుకోలేము. ఓ జీవుడా, మన స్వస్వరూపం తెలుసుకో, దైవ శిక్షలు తప్పించుకో.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 610 General Articles, 46 Tatvaalu
Dt : 30-Jun-2020, Upd Dt : 30-Jun-2020, Category : General
Views : 47 ( + More Social Media views ), Id : 586 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : values over defeat , man 3 forms , taj mahal built , muntaj didnt see , good words
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content