జగనన్న - ఆస్పత్రుల్లో సీటీ స్కాన్, సంస్కారాల‌కు 15 వేలు, బాలినేని కోవిడ్ కేర్ మరియు సమీక్షలు - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2088 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2123 General Articles and views 1,899,174; 104 తత్వాలు (Tatvaalu) and views 227,857.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 2 min read time.

మనం కొన్ని విమర్శలు చేసినప్పుడు, మంచివి కూడా, మన దృష్టికి వచ్చినప్పుడు తప్పక చెప్పాలి.

అన్ని మాదాకా రావు, మీరు పంపినా కూడా, కొన్ని అయినా అందులో ముఖ్యమైనవి అందరితో మా మాటలతో పంచుకుందాము.

మంచి ఎవరు చేసినా, ఏ పార్టీ అయినా, ఏ ఎమ్మెల్యే, అధికారి అయినా ఒకటే కదా.

* * * జగనన్న ఈవారం లో నెల్లూరు, కడప, ఒంగోలు, శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రుల్లో సీటీ స్కాన్, ఎంఆర్ఐ మిషన్ల ప్రారంభించిన విషయం తెలిసిందే.

ఇంకో వైపు, కోవిడ్ మృతుల అంతిమ సంస్కారాల‌కు, 15 వేలు ఇస్తున్నది విన్నారు కదూ. మరి మెడికల్ కాలేజీలు కూడా అందుబాటులోకి వస్తే బాగుంటుంది.

శభాష్, జగనన్న మరియు బాలినేని వాసన్న.

ఆక్సిజన్ ప్లాంట్ లు కూడా, జిల్లాలో పలు చోట్ల, వస్తే బాగుంటుంది అంటున్న ప్రజలు.

బాలినేని గారు తమ పలుకుబడి తో ప్రయత్నం చేసి, ఈ సదుపాయాలు కనీసం ఒంగోలు, చీరాల, కనిగిరి లేదా మార్కాపురం లో అయినా పెట్టించగలరు, జిల్లా అని ప్రజలు కోరుతున్నారు.

ఇవి జిల్లా వైద్య శాఖ, అలాగే రిమ్స్, ఇతర ఏరియా ఆసుపత్రులు, సోషల్ మీడియా వార్తలు మొదలు పెట్టినట్టు సమాచారం లేదు. వారు ప్రచారం చేయరు. లింకు ఉంటే, పంపగలరు. కనీసం మా జగనన్న వాసన్న కార్యక్రమ ఫోటోలు అయినా, దయచేసి, ప్రభుత్వం తరపున పెట్టండి అని 2 ఏళ్ళు గా కోరుతున్నాము.

సోషల్ మీడియాతో, అవినీతి తగ్గుతుంది, ఎక్కువ భాగం ప్రజలకు చేరుతుంది.

ప్రకాశం జిల్లా ప్రజలు, గత 20 ఏళ్ళు గా, వైద్యం కోసం ఇతర జిల్లా లకు పరుగులు తో వెళ్ళకుండా, కనీసం గుంటూరు పెద్ద ఆసుపత్రి స్ధాయి కి, జిల్లా ఆసుపత్రి స్ధాయి ని పెంచాలని, అన్ని సదుపాయాలు కల్పించి అని ప్రజలు ఆశపడుతున్నారు.

* * * మన జిల్లా లో ఒంగోలు రిమ్స్ ప్రభుత్వ వైద్యశాలలో CT స్కాన్ ప్రారంభించిన బాలినేని, కలెక్టర్. లింక్ లో ఫోటోలు. FB link.

ఈ కార్యక్రమం వార్తలు, మన కలెక్టర్ మరియు జిల్లా వైద్య శాఖ మరియు సమాచార శాఖ సోషల్ మీడియా లో, ముగ్గురు కూడా పెడుతున్న, జగనన్న ఖ్యాతి జిల్లా అంతా, అన్ని పార్టీలు వారు చూడటానికి బాగుంటుంది.

కానీ మనం 2 ఏళ్లుగా మొత్తుకుంటున్నా, ఆ శాఖల వారు నిర్లక్ష్యం వీడడం లేదు.

బాలినేని గారు ఇప్పుడు అయినా, జగనన్న కు జరుగుతున్న అన్యాయం ను సరిచేస్తారని, మంత్రి వర్యుల ఫేస్బుక్ తో పాటుగా, ఆయా శాఖల ఫేస్బుక్ లో కూడా ఫోటోలు వీడియో లు పెడితే, జగనన్న పధకాలు ప్రచారం కు తగిన న్యాయం చేసినట్లు అవుతుంది అని అందరి భావన.

* * * ఎన్ టి ఆర్ కళాక్షేత్రంలో ఒంగోలు నగర పాలక సంస్థ అభివృద్ధి పై, కార్పొరేటర్లతో బాలినేని సమీక్షా సమావేశం.

అలాగే, ఒంగోలు మున్సిపల్ కార్పోరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు తో సమావేశం

ఇప్పుడు అయినా, ఒంగోలులో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగాలని, ఆ వివరాలు, మున్సిపల్ కమిషనర్ గారి ఫేస్బుక్ లో, రోజూ పెడుతుంటే బాగుంటుంది, అని మనం ఏళ్లుగా కోరుతున్నాము. కమీషనర్ మారినా, మన ఒంగోలు రాత మారడం లేదు.

వారు ఫేస్బుక్ లో ఇప్పటికే పెడుతుంటే, వాటి లింకు లు ఇవ్వమని, మనం కలెక్టర్ గారిని, జిల్లా అధికారులు ను సంవత్సరాలు గా కోరడం మీకు తెలిసిందే.

* * * బాలినేని ఉచిత కోవిడ్ కేర్ సెంటర్ లో పేషంట్లకు ఉదయాన్నే 7 గంటలకు రాగి జావ, 8 గంటలకు బ్రేక్ ఫాస్ట్, 12.30 గంటలకు భోజనం, 4 గంటలకు అల్పాహారం, రాత్రి 7.30 గంటలకు పుల్కా మరియు భోజనం సదుపాయాలు.

సొంత నిధులతో ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రభుత్వ వైద్యశాల రిమ్స్ నందు, బాలినేని ఉచిత కోవిడ్ కేర్ సెంటర్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

ఇవి ఈ వారంలో మనకు తెలిసిన కొన్ని ముఖ్య కార్యక్రమాలు, మీరూ వాసన్న ఫేస్బుక్ లో చూడవచ్చు.

అలాగే ప్రకాశం జిల్లా ప్రజల మీద దయతో, జీతాలు తీసుకుంటున్న కృతజ్ఞతతో, కలెక్టర్ మరియు జిల్లా అధికారులు, సోషల్ మీడియా లో సమాచారం మనకు కూడా, అనంతపురం జిల్లా ప్రజలకు దక్కిన భాగ్యం ను, కలిగిస్తారని ఆశిద్దాం.

బాలినేని గారు అలాగే ఇతర ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా, తన ఫేస్బుకు లో కన్నా, ప్రభుత్వ సోషల్ మీడియా లో ఫోటోలు వీడియోలు పెట్టింది గొప్పగా భావించి, దాని పై దృష్టి సారిస్తారని ఆశిద్దాం.

మన అభివ్రుద్ది మనమే కాకుండా, ఇతరులు కూడ రాసినప్పుడే, అందరి కీ చేరుతుంది.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2123 General Articles and views 1,899,174; 104 తత్వాలు (Tatvaalu) and views 227,857
Dt : 20-May-2021, Upd Dt : 20-May-2021, Category : Politics
Views : 809 ( + More Social Media views ), Id : 1172 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : jagananna , ct scan , hospitals , rims , ongole , prakasam , funerals , balineni , kovid , care , municipal , reviews
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content