శ్రీ కృష్ణుడు, కౌరవ పాండవ సంధి దూత, దుర్యోధన అర్జునలకు వరాలు-13 పద్యాలు DVS Karna - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2076 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2111 General Articles and views 1,868,449; 104 తత్వాలు (Tatvaalu) and views 225,153.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 2 min read time.

Krishna Rayabaram, Kaurava Pandava Sandhi, DVS Karna, 13 Padya/ Poems, NTR, Arjuna, Duryodhana

నందమూరి తారక రామారావు (ఎన్టీయార్ మే 28, 1923 - జనవరి 18, 1996) ఒక గొప్ప నటుడు, ప్రజానాయకుడు. ఎన్టీయార్ వీరాభిమానులము అని, ఊరికే కపట నాటక అబద్దాలు తో గొంతు చించుకుంటూ, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటూ, అవసర అవకాశవాదము తో అటు ఇటూ ఊగడం కాదు, అవసర అవకాశం కోసం ఆయనకు వెన్నుపోటు ద్రోహం చేసిన వారితో చెట్టాపట్టాలు వేసుకుని తిరగడం కాదు, ఈ పద్యాలు పాడి వినిపించి, 4 మాటలు సొంత గా రాసి 4 గురు కి పంపి, మన నిజమైన త్రికరణశుద్ది అభిమానాన్ని అన్నగారిపై చాటండి. అలాగే వాక్సుద్ది పెరుగుతుంది, నిబద్దత కనపడుతుంది.

ఎన్టీయార్ కోట్లాది ప్రజల మనసుల్లో స్థానం సంపాదించారు. శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్‌కు వినమ్రపూర్వకంగా శ్రద్ధాంజలి.

రాజకీయాలతో పాటు చిత్రరంగంలో తన ప్రతిభతో ఆ మహనీయుడు చెరగని ముద్ర వేశారు. తన నటనాకౌశలంతో ఎన్నో చరిత్రాత్మక పాత్రలకు ఎన్టీఆర్‌ జీవం పోశారు, ఇంతవరకు ఇంకో పోటీ దారుడు లేడు, బహుశా రాకపోవచ్చు.

బహుముఖ ప్రజ్ఞతో ఎన్టీఆర్‌ సినీరంగంలో ఖ్యాతిగాంచారు. కోట్ల మంది హృదయాల్లో నిలిచిపోయారు. 300 పైగా చిత్రాల్లో నటించి అలరించారు. రాముడు, కృష్ణుడు, రావణుడు, దుర్యోధనుడు లాంటి పౌరాణిక పాత్రల్లో ఎన్టీఆర్‌ నటనను ఇప్పటికీ స్మరిస్తాము.

అందరు దండలు వేశారు, ఏవో 4 మాటలు చెప్పారు, ఖర్చు పెట్టారు, మమ అనిపించారు. మరి విశ్వసనీయత క్రుతజ్ఞత హ్రుదయ లోతుల్లో నుంచి ఉన్న మనము, అన్న గారికి సమర్పించినవి - మనసు నుండి రాతలు, నాభి నుండి పాటలు? మరి మీరు?

ధర్మం ను మనం కాపాడితే, అది మనల్ని కాపాడుతుంది. అధర్మం వైపు మనము నిలబడితే సమర్ధన చేస్తే, దుష్టచతుష్టయం కర్ణుడు దుశ్శాసనుడు దుర్యోధనుడు అలాగే శకుని లా, ఏదో ఒకనాటికి మన పతనము తప్పదు, పంచభూతాలు విడువవు. శ్రీ క్రిష్ణుడు తన సొంతం కోసం, ఏమీ చేయలేదు, అంతా లోకం లో ధర్మం నిలబెట్టడానికే. రాజ్య పోరు, కౌరవ పాండవులది మాత్రమే.

శ్రీ కృష్ణుడు, కౌరవ పాండవుల మధ్య సంధి చేయటానికి దూతగా, కౌరవుల దగ్గర కు వెళ్ళారు. కౌరవులకు నచ్చ చెప్పడానికి ప్రయత్నము చేసారు, భవిష్యత్ మొత్తము జరగబోయేది విపులీకరించి చెప్పారు. అబ్బే అహంకారపూరితములు అలాగే అరిషడ్వర్గంకు అష్టవ్యసనంకు బానిసలైన కౌరవుల మనసులు, మంచి వినవు, పైగా చెప్పిన వారినే గేళిచేస్తాయి అలాగే నిందిస్తాయి.

ఆ తర్వాత యుద్దమునకు ఇరుపక్షాలు అంగీకరించిన తర్వాత, శ్రీ కృష్ణుడు, దుర్యోధన అర్జునల కు వారి కోరిక మేరకు, వరాలును ఇచ్చారు. తాను ఒక్కడు ఆయుధము లేకుండా ఒకవైపు, అలాగే మిగత యదు వీరులు ఇంకొక వైపు అని. అర్జునుడు, ఊరక నా రధం పై కూర్చో చాలు అని శ్రీ కృష్ణుడు ని కోరారు.

దీనిని బట్టి, మనకు కావలసింది, ధనము ఆస్తులు అధికారం అంగబలం కాదు, మనల్ని కింద పడనీయకుండా, చెడుకు మాయకు బానిసలు కాకుండా, నిష్పక్షపాతము గా గట్టిగా మంచి చెప్పే, గుణము గలిగిన నిష్పక్షపాత వ్యక్తులు సుమా.

ఒకసారి ఈ పద్యాలు విని, నోటితో ప్రయత్నము చేయండి, మంచి కంఠానికి (వాక్సుద్దికి), ఉత్తమ శ్వాస ప్రక్రియ కు ఆరోగ్యానికి, పద్యాలే మంచి పద్దతి. 2022 ఆగస్ట్ లో మనము పాడిన పద్యాలు ఇవి నిన్న మరలా కొత్తగా నెట్ లో పెడితే, అప్పుడే 400 మందికి చేరింది, మరి మీ ద్వారా ఇంకెంత మందికి చేరుతుందో నిజమైన ఎన్టీయార్ అభిమానులకు, ఎంత మంది తామూ పాడటం మొదలు పెడతారో చూద్దాము.

ఎన్టీయార్ విగ్రహాన్ని, మామూలు సాంఘీక రాజకీయ రూపములో పెట్టాలి బయట ప్రదేశాలలో, సొంత ఇంట్లో అయినా. రాముడు, క్రిష్ణుడు, రావణ, దుర్యోధన విగ్రహాలు గా పెట్టకూడదు. రేపు అవతల పార్టీ వారు, సినిమాలలో దొంగ వేషాలు వేసారని, ఆ విగ్రహాలు పెడితే? క్రిష్ణ, శోభన్, హరనాధ్, మరియు ఇతర నటులు కూడా, రాముడు క్రిష్ణుడు గా పాత్రలు వేసి ఉండవచ్చు. వారంతా విగ్రహాలు పెడితే? బ్రమలు వేరు, వాస్తవం వేరు. హైందవ ధర్మాన్ని దేవతలను అవమాన పరచవద్దు, మన అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వముతో, దానికీ ఫలితాలు పొందాలి సుమా.

*శ్రీ కృష్ణుడు, కౌరవ పాండవుల మధ్య సంధి చేయటానికి దూతగా* దాన వీర శూర కర్ణ

**1 తమ్ముని కొడుకులు సగపాలిమ్మనిరి, అటులిష్టపడవయేనియు నైదూ-
ళ్ళిమ్మని రైదుగురకు, ధర్మమ్ముగ నీ తోచినట్లు మనుపుము వారిన్
tammuni kodukulu sagapalimmaniri

**2 తనయుల వినిచెదవో, నీ తనయులతో నేమి యని స్వతంత్రించెదవో
చనుమొక రీతిని, లెదే నని యగు వంశ క్షయంబు నగు, కురునాధా
tanayula vinichedavo

**3 చెల్లియొ చెల్లకో, తమకు చేసిన యెగ్గులు సైచిరందరున్
తొల్లి గతించె, నేడు నను దూతగ బంపిరి సంధిసేయ నీ
పిల్లలు పాపలున్ బ్రజలు బెంపువహింపగ సంధి (పొందు) సేసెదో
ఎల్లి రణంబెగూర్చెదవొ, ఏర్పడ జెప్పుము కౌరవేశ్వరా!
chelliyo chellako tamaku chesina

**4 అలుగుటయే యెరుంగని మహామహితాత్ముడు అజాతసెత్రుడే
అలిగిననాడు సాగరముల్లన్ని ఏకముగాకపోవు నీ క
ర్ణులు పది వేవురైనను నొత్తురు సత్తురు రాజరాజా నా
పలుకులు విశ్వసింపుము విపన్నుల లోకులగావు మెల్లరన్
alugutaye erungani

**5 జెండాపై కపి రాజు 2 ముందు సిత వాజి శ్రేనియున్ గూర్చి నే
దండంబున్ గోని తోలు స్యందనము మీదన్ నారి సారించుచున్
గాండీవంబు ధరించి ఫల్గుణుడు నీ మూకన్ చెండు చున్నప్పు డు-
ఈ కర్ణులు పది వేవురైనను నొత్తురు సత్తురు రాజరాజా, నా పలుకులు విశ్వసింపుము
ఒక్కండున్ 3 నీ మొర నాలకింపడు, కురు క్ష్మా నాధా, సంధింపగన్ ఆ ఆ ఆ
jendapai kapiraju

**6 సంతోషంబున సంధి సేయుదురె, వస్త్రంబూద్చుచొ ద్రౌపదీ-
కాంతన్ జూసిన నాడు, చేసిన ప్రతిజ్ఞల్ దీర్ప భీముండు నీ
పొంతన్, నీ సహ జన్ము రొమ్ము, రుధిరంబున్ ద్రావు నాడైన, సంతోషంబున సంధి సేయుదురె
నిశ్చింతన్ తద్గదయున్ త్వదూరు యుగమున్, ఛేదించు నాడెనియున్, సంతోషంబున సంధి సేయుదురె 2
santoshambuna sandhi seyudure

**7 సమరము చేయరే బలము చాలిన, నల్వురు చూచు చుండ,
పెండ్లము పెరవారిచే కటకటం బడ, చూచుచు ఊరకున్దురే
మమతయు బొంకు మానము అవమానము
సిగ్గులు లేని వారి నెయ్యము తగునయ్యా అవ్వ
భూమి పతులందరు నవ్వరటయ్యా సంధి చేసినన్
samaramu cheyare balamu

- - -
*శ్రీ కృష్ణుడు, దుర్యోధన అర్జునల కు వారి కోరిక మేరకు, వరాలు*

**8 ఎక్కడనుండి రాక ఇట? కెల్లరున్ సుఖులేగదా? యశో-
భాక్కులు నీదునన్నలును భవ్య మనస్కులు నీదు తమ్ములున్
చక్కగ నున్న వారె? భుజశాలి వృకోదరుడగ్రజాజ్ఞకున్
దక్కగ నిల్చి శాంతుగతి దాను చరించునె తెల్పు మర్జునా!
ekkada nundi raka ita

**9 బావా! ఎప్పుడు వచ్చితీవు? సుఖులే భ్రాతల్-సుతుల్-చుట్టముల్?
నీవాల్లభ్యము పట్టు కర్ణుడును మన్నీలున్ సుఖోపేతులే?
మీ వంశోన్నతికోరు భీష్ముడును మీ మేల్గోరు ద్రోణాది భూ-
దేవుల్ సేమముమై నెసంగుదురె? నీ తేజంబు హెచ్చించుచున్. బావా! ఎప్పుడు వచ్చితీవు?
bava eppudu vachchitivu

**10 కౌరవ పాండవుల్ పెనుగు కాలము చేరువ యయ్యె, మాకు న-
వ్వారికి కూడ నెక్కుడగు బంధుసముద్రుడవీవు కాన, నీ
చేరిక మాకు నిర్వురకు సేమము కూర్చెడిదౌట, సాయమున్
కోరగ ఏగుదెంచితిమి గోపకులైక శిరోవిభూషణా! కౌరవ పాండవుల్ పెనుగు కాలము చేరువ యయ్యె
kourava pandavul penugu kalamu

**11 ముందుగ వచ్చితీవు మునుముందుగ అర్జును నేను చూచితిన్
బందుగులన్న యంశ మది పాయకనిల్చె సహాయ మిర్వురున్
చెందుట పాడి; మీకునయి చేసెద సైన్యవిభాగ మందు మీ-
కుందగుదాని గైకొనుడు, కోరుట బాలుని కొప్పుమున్నుగన్
munduga vachchitivu munumunduga

**12 ఆయుధమున్ ధరింప నని కగ్గముగా నొకపట్ల నూరకేసాయము సేయువాడ,
బెలుచన్ నను బిమ్మట నెగ్గు లాడినన్దోయిలి యొగ్గుదున్, నిజము,
తొల్త వచించితి గోరికొమ్ము నీకేయది యిష్టమో, కడమ యీతని పాలగు బాండునందనా
ayudhamun dharimpa nani

**13 నంద కుమార, యుద్ధమున నా రథమందు వసింపుమయ్య, మ-
ధ్యందిన భానుమండల విధంబున నీదగు కల్మి జేసి నాస్యందన మొప్పుగాక,
రిపు సంతతి తేజము దప్పు గాక, నీవెందును నాయుధమ్ము దరి కేగమి కొప్పుదు గాక, కేశవా!
nanda kumara yuddamuna na

krishna messenger sandhi between kaurava pandavas daana veera soora karna, ntr

Daana Veera Soora Karna is a 1977 Indian Telugu-language Hindu mythological film co-written, produced and directed by N. T. Rama Rao under his banner, Ramakrishna Cine Studios.

Based on the life of Karna from the Mahabharata, it stars Rama Rao in 3roles: the title character, Duryodhana, and Krishna.

It also stars Raos sons Nandamuri Harikrishna and Nandamuri Balakrishna, who play the roles of Arjuna and Abhimanyu, respectively. Music for the film was composed by Pendyala Nageswara Rao.

V. Ramakrishna, SP Balu

tammuni kodukulu sagapalimmaniri
tanayula vinichedavo
chelliyo chellako tamaku chesina
alugutaye erungani
jendapai kapiraju
santoshambuna sandhi seyudure
samaramu cheyare balamu

ekkada nundi raka ita
bava eppudu vachchitivu
kourava pandavul penugu kalamu
munduga vachchitivu munumunduga
ayudhamun dharimpa nani
nanda kumara yuddamuna na  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2111 General Articles and views 1,868,449; 104 తత్వాలు (Tatvaalu) and views 225,153
Dt : 21-May-2021, Upd Dt : 21-May-2021, Category : Songs
Views : 2351 ( + More Social Media views ), Id : 1174 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : krishna , messenger , sandhi , kaurava , pandavas , daana , veera , soora , karna , ntr , arjuna , dhuryodhana , Ramakrishna , balu
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content