పాటతో పరమార్ధం- ఇది మౌనగీతం ఒక మూగరాగం - పాలు నీళ్లు - మోహన్ బాబు, జయప్రద, చలం, దాసరి - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2088 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2123 General Articles and views 1,899,712; 104 తత్వాలు (Tatvaalu) and views 227,888.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Idi Mounageetham Oka Mugaragam - Paalu Neelu - Mohan babu, Jaya Prada, Chalam, Dasari - Conquer Arishadvarga Ashtavyasana, Satsang జయించు అరిషడ్వర్గ అష్టవ్యసన, సత్సంగం 5 min నిమిషాలు

ఎవరితో కలవడం ఇష్టం లేకపోతే, ఒంటరిగా ఉండాలి. ఇతరులతో ఉండటం ఇష్ట పడితే, పాలు నీళ్ళు లాగా, కలసి పోవాలి, అది మంచి లక్షణాలు అయితేనే సుమీ. చెడ్డ వారితో అవసర అవకాశాలకు లొంగి కలసిపోతే, ఎటూ పతనము తప్పదు. కర్ణుని చూసాము కదా.

ఎలాంటి కపట, నటన, అహంకారం, మూర్ఖత్వం, 2 నాల్కల చాటు ధోరణి లేకుండా ఉండాలి. స్నేహితులు, బంధువులు, భాగస్వాములు, మనుషులు ఎవరైనా సరే. అవి ఉంటే, ఆ జీవితాలు పతనము, కష్టాలు, కన్నీరు.

ఇద్దరు భార్యా భర్త లలో, మాట మనసు కుదరక విడిపోతే, ఆ పిల్ల వాడు ఎలా ఇబ్బంది పడ్డాడు, ఎలా ఇద్దరును కలిపారు అన్నది మీరు చూడాలి. అలాంటి విపత్కర పరిస్తితులకు దారి తీయకుండా చూసుకోవాలి జీవితాన్ని.

ఈ పాట చాలా ఫేమస్, ఆశాభోశ్లే తెలుగులో పాడిన మొదటి పాట అంటున్నారు. ఎప్పుడూ రేడియోలో వచ్చేది ఈ ఉత్తమ మంచి సాహిత్య పాట.

ఒక్కో సారి విపరీతమైన ఆనందం కలుగుతున్నది. అప్పుడు వచ్చే పాట ఇది. ఈ సన్నివేశములో, తల్లి పిల్లాడిని కలుసుకున్న శుభ సంధర్భం. ఇంకొకరికి పుట్టినరోజు, పెళ్ళిరోజు, ఉద్యోగం వచ్చిన రోజు, లేదా ఇంకోటి, వారి ప్రాపంచి వ్యామోహాలను బట్టి.

కానీ ఆధ్యాత్మిక వాసులకు, ఇక నుంచి నేను అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వము లో ఉండను. రావణ, దుర్యోధన, శూర్పణక, మంధర, కైక, లంఖిణి లాగా ఉండను అని ఏరోజైతే గట్టిగా నిర్ణయం తీసుకుని, స్తిర సాత్విక మనసుతో జీవించడం ప్రారంభించారో, ఆవును మాత్రమే గెలిపిద్దాము అండగా ఉందాము అని ఆచరణలో చూపారో, అదే గొప్ప రోజు మన జీవితం సమూలముగా మనశ్శాంతితో మోక్షము వైపు నడవడానికి.

అప్పుడు మనలో మొదలౌతుంది, ఇది మౌనగీతం, ఒక మూగరాగం, పాడింది పెల్లుబికి, కళ్యాణి రాగం అంటూ శ్లోకాలు పద్యాలు రాగాలు అనురాగాలు దైవం పైన.

పట్టపగలు చందమామ, పొడిచిన రోజూ, ఆకాశం హరివిల్లై, వంగిన రోజూ అని అనిపిస్తుంది. కడలి పొంగి ఆడిన రోజు, మూగ గొంతు పాడిన రోజు అంటూ, మానశిక ఆనందం కలుగుతుంది. దొరకక దొరకక, దొరికిన రోజు, దొరికీ దొరకక, దొరకని రోజు, ఒకే ఒక్క రోజు, తిరిగిరాని రోజు అని వింతగా మనకు అనిపిస్తుంది సుమీ.

వెన్నెలంతా మల్లెలై, పూచిన రోజూ, మల్లెలన్నీ తారలై, మెరిసిన రోజూ గా బ్రమిస్తుంది. గుండెబరువు మరిచిన రోజు, పాల గుండె పొంగిన రోజు గా అనిపిస్తుంది. గీత లో చెప్పిన విధముగా సమతా స్తితి లో ఉండాలి, పొంగక, కుంగక మరువద్దు. మిగలక మిగలక, మిగిలిన రోజు, మిగిలీ మిగలక, మిగలని రోజు, ఒకే ఒక్క రోజు, తిరిగిరాని రోజు అని అనిపిస్తుంది మనల్ని మనం తెలుసుకున్నప్పుడు.

ఆఆఆఆఅ..ఆఆఆఆఆ...
ఇది మౌనగీ..తం. ఒక మూగరా..గం..
పాడింది పెల్లుబికి, కళ్యా.ణి రా.గం 2 - మొత్తము 2 సార్లు

పట్టపగలు చందమా.మ, పొడిచిన రోజూ.
ఆకాశం హరివిల్లై, వంగిన రోజూ.. - మొత్తము 2 సార్లు
కడలి పొంగి ఆడిన రోజు, మూగ గొంతు పాడిన రోజు 2
దొరకక దొరకక...
దొరకక దొరకక, దొరికిన రోజు
దొరికీ దొరకక, దొరకని రోజు
ఒకే ఒక్క రోజు, తిరిగిరాని రోజు 2 ||ఇది మౌనగీతం||

వెన్నెలంతా మల్లెలై., పూచిన రోజూ.
మల్లెలన్నీ తారలై., మెరిసిన రోజూ.. - మొత్తము 2 సార్లు
గుండెబరువు మరిచిన రోజు, పాల గుండె పొంగిన రోజు 2
మిగలక మిగలక
మిగలక మిగలక, మిగిలిన రోజు
మిగిలీ మిగలక, మిగలని రోజు
ఒకే ఒక్క రోజు, తిరిగిరాని రోజు 2 ||ఇది మౌనగీతం||

చిత్రం : పాలు నీళ్ళు (1981); సంగీతం : సత్యం; సాహిత్యం : దాసరి; గానం : ఆషాభోంస్లే  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2123 General Articles and views 1,899,712; 104 తత్వాలు (Tatvaalu) and views 227,888
Dt : 26-Apr-2024, Upd Dt : 26-Apr-2024, Category : Songs
Views : 205 ( + More Social Media views ), Id : 2094 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Paalu Neellu , Palu Neellu , Paalu Neelu , Mohan babu , Jaya Prada , Chalam , Dasari , Asha Bhosle , Idi Mounageetham , Idi Mouna geetham , Idi Mouna geetam
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content