అరిషడ్వర్గాల బానిసత్వం - పిల్లల పెద్దల పుట్టిన రోజు, పెళ్ళి రోజు శుభాకాంక్షలలో కూడా - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2080 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,876,084; 104 తత్వాలు (Tatvaalu) and views 225,817.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

*ఏవండీ, మీరు చెప్పిన అరిషడ్వర్గాల బానిసత్వం, మాకు ఇప్పుడు అర్ధం అయ్యింది. అది ప్రతి పని లోను, మా చుట్టూ రోజూ కనపడుతుంది. వారు గుడికి ఎందుకు వెళతారో, దాని పరమార్ధం ఏమిటో ఆ కుటుంబాలకే తెలియాలి. మా పిల్లల స్నేహితుల బంధువుల పెద్దల పుట్టిన రోజు, పెళ్ళి రోజు శుభాకాంక్షలలో కూడా. ఉన్న వారికి ఒక విధముగా, లేని వారికి ఒక విధము గా?*

మనుషులలో మనసులలో, సమానత్వం లేదంటే, ఆ మనుషులు దైవాన్ని మానవత్వాన్ని నమ్మరు, అవమానిస్తున్నట్లే.

అవును, అది రావణ దుర్యోధన కాలం నుంచే ఉంది ఈ అరిషడ్వర్గాల బానిసత్వం, అందుకే వారు పతనము అయ్యారు, అని కూడా చదివాము.

సాధారణము గా రాజకీయాలలో, సినిమా ల లో ఇలా ఉంటుంది. కానీ ఇప్పుడు నాగరికత పెరిగి, ప్రతి ఇంట్లో నూ ప్రతి ఒంట్లోనూ, ఇదే నటన ఉంటుంది.

అయినా, మనకు సంస్కార లేదు, మన పిల్లలకు నేర్పము, మనమూ మారము.

అప్పుడు, పిల్లల పనులు అలాగే ఉంటాయి. రేపు మన చివరి దశలో కూడా మన పిల్లలు, ఇదే ద్వందము చూపుతారు.

మా భాగస్వామికి అందము ఐశ్వర్యము వయస్సు ఉంది, మరి ముదుసలి అయిన మీతో మాకు పనేమిటి అంటారు.

నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా అంటారు? అప్పుడు మనము ఏడవడం తప్ప, చేయగలిగింది ఏమీ లేదు సుమా.

ధనం హోదా పదవి అధికారం ఐశ్వర్యం అవకాశం అవసరం, ఇవే మనము నేర్చుకున్న, మన సంతానానికి నేర్పుతున్న మంచి బుద్దులు.

వీటిలో గుణం అనేదే అసలు ఉండదు, అవి శాశ్వతము కూడా కాదు.

మనకు సంస్కారం ఉంటే, సమ న్యాయం ఉండాలి, అందరి పుట్టినరోజు మరియు పెళ్ళి పండగల కు కూడా, అన్ని రంగాల ప్రముఖుల తో, ముఖాముఖి శుభాకాంక్షలు, వివిధ వీడియోలు బైట్స్ ఉండాలి, లేదా ప్రశాంతముగా విడిగా ఫోన్ లో చెప్పుకోవాలి.

సాత్విక మనుషుల బంధువుల స్నేహితుల మధ్యలో, ధనం హోదా ను బట్టి తేడా చూపరాదు. అప్పుడు మనం కూడా, అరిషడ్వర్గాలు లో బానిసత్వం చేస్తున్నట్లు, ప్రోత్సాహం చేస్తున్నట్లు సమర్థిస్తూ ఉన్నట్లు, మనమే ఒప్పుకుంటున్నాము.

అంటే మన చేతలు మాటలు వేరు, మనుషులలో బేధాలు మనమే చూపిస్తున్నాము.

వారితో అవసరము అవకాశం, నీకు రేపు అనుకుంటే, వ్యక్తి గత అభిమానం సహాయం గొప్పలు సాష్టాంగ నమస్కారము లు, విడిగా వారితోనే ఇంటికి వెళ్ళి లేదా వీడియో కాల్ లో చూపవచ్చు. కానీ అందరినీ అందరి ఎదుట మాత్రం, హుందాగా సమానంగా చూడాలి గౌరవించాలి. మన అవసరాలకు, ఇతరులను ఎందుకు బలి చేయాలి.

ఇంకోరు చెప్పారు అని, మనము మూర్ఖముగా ఎందుకు పంపాలి? అంటే మనకు జ్ఞానము లేదా?

అయ్యో తప్పు చేసాము అని, చాటు గా అంగీకరించడం కాదు, చేతలలో ఉండాలి, మిగతా వారికి కూడా, వీడియో తో శుభాకాంక్షలు చెప్పాలి.

ఇతరులకు చెప్పిన వారందరూ కూడా, వారి కుటుంబములో, సంస్కారము, దైవ నమ్మకము మరియు సాత్వికత ఆచరణలో ఉంటే, అదే పని చేయాలి.

లేదు మంచి అంగీకరించనప్పుడు, మేము కౌరవ ధన పదవీ అహంకార వారసులం అని అయినా ఒప్పుకోవాలి ధైర్యంగా. కపటం ఎందుకు చిన్న చిన్న విషయాల దగ్గర.

ఎందుకంటే ఇంత చిన్న విషయములో, మన వక్ర బుద్ది బయటపడితే, ఇక ధనం సేవ త్యాగం దైవం దగ్గర, ఇంకెంత వక్ర బుద్ది ఉంటుందో కదా?

మిగతా వారిని తక్కువ గా చూసి, కేవలం రాత మాట సందేశం పెడితే ఎలా? అదే ఆర్భాటం అరుపులు కేకలు ఫోటోలు వీడియోలు ఉండావా? ఒకరికి ఒక నిమిషం వీడియో, ఇంకొకరికి 5 వీడియోలు 5 నిమిషాలు తో నా, 5 గురు మనుషుల కేకలా?

అభిమానం గుండెల్లో ఉండాలా, సోషల్ మీడియా వీడియోలో ఉండాలా? రేపు కష్టం వస్తే, ఒక్కరూ పలుకరు, ఈ ఆర్భాట నటన బంధువులు మిత్రులు, ఇంకా గేళి చేస్తారు.

వీరికి గుణ సౌందర్యం కన్నా, ధన సౌందర్యం ఎక్కువ ఉంటుంది. రావణ దురోధన అహంకార వారసులు అరిషడ్వర్గాల బానిసలు.

ఒకరు గ్రీటింగ్ లు చెప్పమంటే, వెనక వారి పెద్ద భవంతి, విమానం, ఫెరారి కారు, స్విమ్మింగ్ పూలు కనపడేలా చెపుతారు. అవ్వ, వారి మిత్రుని గౌరవిస్తున్నారా? లేక తమ ఆస్తి పాస్తులు చూపుతున్నారా?

ప్రతి పాపం కు అవమానం కు తప్పు లు, ప్రోత్సాహం చేసిన వారికి కూడా, అందులో భాగం ఉంటుంది.

కౌరవులు 100 మందితో పాటు, ఆ తప్పు ను సమర్ధన చేసిన లేదా మౌనముగా, ఆ సభలో ఉన్న నాయకులు కూడా గతించారు, ఆ తప్పులో భాగమై.

Slavery of Arishdvargas in kids elders friends relative birthday wedding greetings  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,876,084; 104 తత్వాలు (Tatvaalu) and views 225,817
Dt : 22-May-2022, Upd Dt : 22-May-2022, Category : General
Views : 495 ( + More Social Media views ), Id : 1401 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : arishdvargas , slavery , kids , elders , friends , relative , birthday , wedding , greetings
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content