Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.
ప్రధానమంత్రి మోదీ గారి పై, ఏ విధంగా కావాలని, విష ప్రచారం చేస్తున్నారో, ఈ కధనం చదవండి.
వాస్తవం గా మంచి జరుగుతుంది వేరు, వ్యతిరేక మీడియా మరియు స్వార్థ పరులు చేస్తున్న, విష ప్రచారం కు సంబంధం లేదు.
కానీ మోదీ గారు అలాగే యోగి గారు, తమ మీద ఎంత మంది బురద చల్లుతూ ఉన్నా కూడా, కర్మ యోగులు గా, తమ పని లో తాము నిమగ్న మయ్యారు.
గతము లో నే అనుకున్నాము, మోదీ గారి వలన తెలుగు వారికి అన్యాయము జరిగితే, మన నాయకులు కేసీయార్ జగనన్న చంద్రన్న, డిల్లీ బహిరంగ వీధుల్లో, పంజాబ్ రైతుల లాగా ధర్నాలు చేసేవారు, గత 7 ఏళ్ళు గా.
కాబట్టి, తెలుగు వారికి అన్యాయం జరగడం లేదు అని మన నాయకులే మౌనముగా ఉంటున్నారు.
వారి మనసునే మాటనే మీతో పంచుకుంటున్నాను. ఆఖరికి ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు అంతా గప్ చిప్, మనము ఎవరము కూడా డిల్లీలో ధర్నా చేయము, మనకు ఇబ్బంది లేదు.
* చిన్న ఉదాహరణకు, నోట్ల రద్దు వలన, చాలామంది దొంగ వ్యాపారాలకు దెబ్బ తగిలింది మాత్రం నిజం, మనకు తెలిసిన వారిలో కూడా చాలా మంది ఉన్నారు కదూ?
ఆదాయ పన్నులు కట్ట కుండా, దొంగ వ్యాపారాలతో మరియు కబ్జాలతో ఆదాయ పరంగా వారు మాత్రమే పెరుగుతూ ఉంటే, దేశానికి రాష్ట్రానికి జిల్లాకు ఊరికి ఆదాయము తగ్గి, అందరి మీద అప్పులు తెచ్చుకుని ఆస్తులు తాకట్టు పెట్టి, అభివ్రుద్ది చేస్తున్నాము అందరికీ పంచుతున్నాము.
అక్రమార్కుల దగ్గర ధనం అలాగే చాటుగా ఉండి, ఎంతో మంది కన్నీళ్ళకు కారణమై, వారి కుటుంబాలతో పాటుగా, ఎన్నో కుటుంబాలను పతనం చేయడం కళ్ళారా చూస్తున్నాం.
కరోనా తో కూడా వారు వ్యాపారం చేస్తున్నారు కదూ? మోదీ అన్నిటికి చెక్ లు పెడుతూ పోతుంటే, మన వారు ఇబ్బందులు పడుతూ, కొంత మంది పడే బాధను అందరి బాధగా రుద్దుతున్నారు.
2 వేల నోట్లు కూడా మారుతున్నాయి అని పుకార్లు వచ్చాయి ఆ తర్వాత, మరి ఆ శుభవార్త కూడా వినడానికి ఎంతోమంది ఎదురు చూస్తున్నారు.
ఇప్పుడు అందరూ దాదాపుగా బాంకులలో దాస్తున్నారు కాబట్టి, అక్రమ వ్యాపారులు కు తప్ప, మామూలు జనానికి ఇబ్బందులు ఉండకపోవచ్చు.
* కొత్త పార్లమెంట్ కట్టడం గురించి గత పాలనలో ఉజ్జాయింపు ఖర్చు లెక్కింపు, ఇప్పుడు లెక్క ఎంతో మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. అది అవినీతి నిర్మూలన అంటే.
* ఆధార్ తో పాన్ తో ఎంతో మంది అక్రమార్కుల కు ఇబ్బంది కలుగుతూ ఉంది. కానీ ఇంకా వేరు మార్గాలు చూస్తూనే ఉన్నారు. నకిలీ బీపీఎల్ కార్డుదారులు, పేదలు, పిల్లలు, రేషన్ కార్డులు, గాస్ వారు, అందరూ మాయం అయ్యారు.
* ఆన్లైన్ వ్యవస్థ తో, చాలా మంది దళారీలు బ్రోకర్లు కోపంగా ఉన్నారు, మోసగించే దోవలు తగ్గాయని, సాక్ష్యం తో ఉంటుంది అని.
* జీఎస్టీ వ్యవస్థ అమలు తో చాలా మంది వ్యాపారవేత్తలకు కోపం వచ్చింది, అందరూ లెక్క లో కి వస్తున్నారు, ఎక్కడో ఒక చోట చూపించాలి లెక్కలు. కానీ తప్పుడు దోవలు వెతుకుతూనే ఉంటారు.
మిగతా లోపల లింక్ లో చదవగలరు.
FB link
Update May 30, 2021
మోదీ ఏం చేశారు అని అడిగే వారందరికీ, జవాబు ఇక్కడ ఉంది. చదివి అర్థం చేసుకున్న తర్వాత, కాదనే వారు ఉన్నారా?
బయట పుకార్లు నమ్మకండి, లేనిది ఉన్నదిగా ఉన్నది లేనిది గా రాస్తున్నారు. మోదీ ధైర్యము గా చెప్పారు, మీరు ఏమైనా పద్దతిగా విమర్శలు రాసుకోండి, మిమ్మల్ని ఏమీ అనము అని.
ఈ కరోనా పరిస్థితి మోదీ నే ఎదుర్కొనలేకపోతే, మన రాహూల్ ఎదుర్కో గలరా? మనకు మోదీ కన్నా ఇంకో మంచి నాయకులు ఉన్నారా?
నాకెంత ఇచ్చారు, నాకేం వచ్చింది అన్న వ్యక్తి స్వార్థం, కుటుంబ బానిసత్వం, వర్గ అవసర అవకాశ వాదాలు వీడి, ఆలోచన చేయండి.
ఐతే..నాకు ఒరిగిందేమిటీ? అని మన బుద్ది ప్రకారం, ప్రశ్నలు జవాబులు వారే రాశారు వివరముగా.
గతము లోనే అనుకున్నాము, ఇరు తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరిగితే, మన కేసీయార్ చంద్రన్న జగనన్న, ఢిల్లీ రోడ్ల మీద, పంజాబ్ రైతులు మాదిరిగా, కనీసం 2 రోజులు ధర్నా చేయాలి. కానీ 5 ఏళ్ళు గా ఎవరూ చేయలేదు కదా?
కనీసం వ్యతిరేకము గా ఒక్క మాట అనగలిగారా? లేదు కదా, మరి మన తెలుగు పార్టీల అధినాయకులే, మోదీ ని ఏమీ అననప్పుడు, చిన్నవాళ్ళము మనము ఎలా నిందిస్తాము మోదీ గారిని? మీరే చెప్పండి లేదా ఢిల్లీ రోడ్ల మీద తెలుగు నాయకుల ధర్నాలు ఉంటే, ఫోటోలు పంపగలరు దయచేసి.
మంచి చేయడం మనకు ఎటూ రాదు. చేసేవారుని ఎటూ ప్రోత్సాహం చేయం. ఆదాయం లేకపోయినా, బారెడు ఖర్చులు తాకట్టు అమ్మడం, ఇదేనా మంచి?
కనీసం అవమానించకుండా నిందించకుండా ఓడించ కుండా ఉండలేమా? ఆయన ఓడిపోతె, నష్టం మనకు, ఆయనకు కాదు కదా?
ఒక్క ప్రభుత్వ పధకం ఆయన పేరు మీద చూపించ గలరా? మన రాష్ట్రం లో, ప్రజల పన్నులతో కూడా పధకాలకు మన తెలుగు నాయకుల పేర్లు పెట్టుకుంటే, ఇది తప్పు అని 5 ఏళ్ళు గా అడిగిన వారు ఉన్నారా? ఎవరిది నిబద్దత?
కుల వర్గ కుంపట్లు తో 20 ఏళ్లుగా సాధించినది ఏముంది? ఆనాడు ఈనాడు మా జిల్లా వాసులు, గుంటూరు పెద్ద ఆసుపత్రికి పోయే దోవలోనే ప్రాణాలు విడుస్తున్నారు? ఇదేనా మన బానిసత్వం అభివృద్ధి?
మిగతా లోపల లింక్ లో చదవగలరు.
FB link
Sri, Telugu ,
10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 2092 General Articles and views 1,836,886; 104 తత్వాలు (Tatvaalu) and views 221,558
Dt : 20-May-2021, Upd Dt : 20-May-2021, Category : Politics
Views : 755
( + More Social Media views ), Id : 1171
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
propaganda ,
modi ,
yogi ,
gst ,
parliament ,
karma ,
yogi
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments