రాక్షసత్వం తగ్గి రజో తమో గుణం అణిగి- ఎప్పుడు మాయ తొలగి, ఆరోగ్యం- ముదుసలి తల్లి దండ్రుల క్షేమం? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2094 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2129 General Articles and views 1,924,129; 104 తత్వాలు (Tatvaalu) and views 229,766.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

Older parents care - Rakshasatva should decrease - When should get rid of Maya?

*1) కుటుంబము/ మనసు లో రాక్షసత్వం తగ్గి, రజో తమో గుణం అణిగి, మానసిక బలహీనత తగ్గి, సాత్విక ఆలోచనలు పనులు ఆహారం మాటలు పెరగాలి. 2) ఎప్పుడు నుంచి మాయ తొలగి, ఆరోగ్యం గా ఉండాలి అనేది, ఎప్పుడు సాధన మొదలు ముహూర్తం అనేది, అంతరాత్మ, మనసు కు ప్రశ్న 3) ముదుసలి తల్లి దండ్రులను, దగ్గరగా ఉంచి చూడటము అంటే, ఇదా?*

*1) In the family/ mind, Rakshasatva should decrease, Rajo Tamo Guna should be suppressed, mental weakness should decrease, sattvic thoughts, actions, food and speech should increase. 2) From when should get rid of Maya and be healthy, when is the moment to start sadhana, is a question for inner soul and mind 3) Is this, to keep older parents close and care means?*

అసలు ఆ పిచ్చి పిచ్చి ఆలోచనలు నే వద్దు. ఒక మాట అనుకుని వదిలేయాలి. అదే పదే పదే ఆలోచన వద్దు. ఇతరుల పతనం గురించి అసలు వద్దు.

మనతో ఒక గంట మాట్లాడారు అంటే, 2 నెలల కొకసారైనా, మీరైనా ఎవరైనా, కుటుంబము/ మనసు లో రాక్షసత్వం తగ్గి, రజో తమో గుణం అణిగి, మానసిక బలహీనత తగ్గి, సాత్విక ఆలోచనలు పనులు ఆహారం మాటలు మనశ్శాంతి పెరగాలి.

భవిష్యత్తు లో జరగబోయే దానికి, ఇప్పటి నుంచే జాగ్రత్తలు పడాలి, మనవైపు నుంచి. లేకపోతే అసలు, మనతో మాటలు ఎందుకు?

బయట 90 శాతం, పోసుకోలు కపట నటన అవసర అవకాశ కబుర్లు కు, బిజీ బిజీ అంటూనే ఉంటారు, దొరుకుతారు కదా.

చివరకు అన్ని పోయి అందరూ పోయి, ఫేస్బుక్ లో లక్ష మంది ముందు లేదా బయట, ప్లీజ్ పిచ్చి ఎక్కి, మెంటల్ వస్తుంది, ఎవరైనా మాట్లాడరా, వినరా మా బాధ, మీరు రూపాయ ఇవ్వక్కరలేదు, కడుపులో బాధ వెళ్ళగక్కు కుంటాము అంటున్నారు చూసారు కదా.

ముందేమో వీరు విపరీతమైన బిజీ, అసలు కుదరదు అండి స్వయం పతనములో అంటారు. తర్వాత ఏమో వీరు ఖాళీ, అందరూ వీరిని ఎగతాళి, వారిలాగే మిగతా అందరూ బిజీ. ఇదే మాయ, మోహం, బ్రమలు, కపటం, నాటకం, అవసరం, అవకాశం, 2 నాల్కలు, పతనం, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం.

వాట్సాప్ స్టేటస్ చూసి ఉంటే, మీకు సాక్ష్యాలు కనపడి ఉంటాయి, ఇన్ని ఏళ్ళుగా.

ప్రతి వ్యక్తికి, సాత్విక కఠిన సాధనతో అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం ను జయించి, మానసిక బలం పెరగాలి. అది మా కోరిక, అందరికీ విన్నపము తలవంచి నమస్కరిస్తూ 20 ఏళ్ళు పైగా.

* * *

ఎప్పుడు నుంచి మీకు మాయ తొలగి, ఆరోగ్యం గా ఉండాలి అనేది, ఎప్పుడు సాధన మొదలు ముహూర్తం అనేది, మీ అంతరాత్మ, మనసు కు, మానసిక ఎదుగుదల, నియంత్రణ మరియు బలముకు, ప్రశ్న. మనకు ప్రశ్న కాదు కదా.

జరగబోయేది మీకు, ఇప్పుడు అర్థం కాదు, అంత ముందు చూపు లేదు, మానసిక బలం లేదు, మంచి చెప్పే వారు మీకు తోడు లేరు. చెప్పినా, మీరు వినరు. కర్మ ఫలితం అర్థం అయిన తర్వాత, మీరు మేము, చేయగలిగేది ఏమీ లేదు. రామన్న రాజన్న సావిత్రమ్మ జయలలితమ్మ శ్రీదేవమ్మ కోడెలయ్య కాఫీడేఅయ్య మాల్యయ్య సింఘానియయ్య కధలు చదవండి.

బద్దకము తో లేదా ముందు జాగ్రత్తతో ఇలా ఆలోచన చేస్తారు - వచ్చే జన్మలో, పంచభూత శిక్షణ తర్వాత, అన్ని పోయాక, మనమే పోయాక, మన వారు పోయాక, వచ్చే ఏడాది, వచ్చే నెల వారం రోజు లేదా ఈ రోజు, మీ ఇష్టం ఎప్పుడు అయినా సత్వ గుణ సాధన చేయవచ్చు, కానీ సాధన తప్పదు. మీ మానసిక బలం నియంత్రణ, కర్మ/ఖర్మ ఫలితం బట్టి.

శిక్షణ మొదలు అయ్యాక, సంతానం, అల్లుళ్ళు, కోడలు, భాగస్వామి, బంధువులు, స్నేహితులు, భాగస్వాములు, అందరూ జాలి దయ కరుణ మర్యాద లేకుండా, కఠినముగా గుణపాఠం నేర్పుతారు.

* * *

శిక్షణ మొదలు అయ్యాక, ఎలా ఉంటుందో ఈ కొన్ని ఉదాహరణలు చూడండి, సొంత వారే, రాచి రంపాన పెడుతూ, కూలీలు గా చూస్తారు, నడవలేని నడుము నొప్పులు అయినా, ఇంకో మార్గము లేదు తప్పుకోలేము.

ముదుసలి పెద్ద వారిని, దగ్గరగా ఉంచి చూడటము అంటే, స్వార్ధముగా వాడుకోవడమే, చనిపోయిన దాకా అనే సంతాన ఆడ మగ రాక్షసులు ఉన్నారు సుమీ మన చుట్టూ. మన మంచి మాటలు విని మారకపోతే, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం వీడకపోతే, ఇవి తప్పవు సొంత పిల్లల దగ్గర ఉన్నా.

1) మన దగ్గరలో ఒక ముదుసలి తండ్రి 60+, కారులో బజారు నుంచి కూరగాయలు తెచ్చి, 2 వ అంతస్తుకు అవి మోయలేక, సగం కింద పెట్టి, మరల సగం మధ్యలో మెట్లపై పెట్టి, ఇంకొంచెం పైన పెట్టి, మెట్లు గోడ పట్టుకుని చిన్నగా ఎక్కిదిగుతూ, పడతానేమో అని భయముగా తిరుగుతూ ఉన్నారు. మెట్ల మధ్యలో కాలు పడ్డ కూడా, కింద పడి నడుము/ కాలు విరుగుతుంది, సుమా. ఇదా పెద్దలను చూడటం అంటే? కొడుకు/ కూతురు/ కోడలు/ అల్లుడు తెచ్చుకోలేరా? కనీసం సామాను పైన పెట్టలేరా?

2) ఇంకో ముదుసలి తల్లి 60+, చిన్నగా అడుగులో అడుగు వేసుకుంటూ, పసి పిల్ల వాడిని, బండిలో వేసుకుని, బయట చుట్టూ తిప్పుకుని రావాలి 2 పూటలా, ఎండ అయినా చలి అయినా. ఆమె రాయి తట్టుకుని పడితే, ఆమెకు దిక్కు ఎవరు? అంటే, ముద్ద పెట్టినందుకు కూలీ పని చెయ్యాలా? ఇంక ఇంట్లో కధలు ఎన్నో.

3) ఇంకో ముదుసలి తల్లి, ఇల్లు రాసిచ్చి, వచ్చి పిల్లలతో ఉంటే, వారు ఆ ఇల్లు ఈ ఇల్లు అద్దెకు ఇచ్చి, తమ పిల్లల చదువుల అప్పులకోసం, కన్న తల్లిని అద్దె ఇంట్లో ఒక గదిలో/ పంచలో సర్దుకోమని, గట్టిగా బుద్ది చెప్పారు. పిల్లలకు మనము ఏది నేర్పుతామో చేతలతో చేస్తూ, అదే మనకు చివరకు ఇస్తారు.

చెప్పండి, కన్నీరు కార్చడం తప్ప, మేము ఏమి చెయ్యగలము వారి కర్మ ఫలితాలు వస్తున్నప్పుడు. అన్ని ఆస్తులు సంపాదించి, ఇంతమంది జంతువులను పెంచి, ఏమిటి వారు పొందిన మనశ్శాంతి, సౌకర్యం?

పోనీ వారిని అడిగితే ఏమంటారో తెలుసు, ఆత్మ ద్రోహముతో - మా పిల్లలు బాగానే చూస్తున్నారు అని. దానిని ప్రేమ, దైవ పూజ, సంస్కారం అనరు సుమీ నటిస్తే, కపటం నటన 2 నాల్కలు అంటారు. ఆ వయసులో కూడా నిజాలు చెప్పక పోతే, ఇంక సద్గతి ఎలా వస్తుంది? ఉత్తమ మరు జన్మ ఎలా పొందుతాము?

మేము చేసిన పాపాలకు ఫలితాలు అనుభవిస్తున్నాము అని అప్పుడైనా ఒప్పుకోవాలి. ఎందుకంటే, ఆ పిల్లలు లేదా ఇతరులు మారతారు, మీ అనుభవాల తప్పులతో.

ఆ ముగ్గురూ లేదా ఇలాంటి చాలా మంది 10 ఏళ్ళుగా, అమ్మను చేతి తో పట్టుకుని, మాటలు కధలు వార్తలు చెపుతూ, పాటలు పాడుతూ, నవ్విస్తూ ఒళ్ళు నెప్పులు రోగాలు మానసిక బాధలు మరపిస్తూ, మైలు నడపటం చూసి, కన్నీరు తో తలవంచి, అమ్మకు నమస్కరిస్తూ, ఇది పెద్దల సేవ దేవతలు గా లేదా పసివారుగా భావించి, అని దీవించి వెళుతుంటారు, ఇంటి దగ్గర లేదా పార్క్ లో.

మరలా వీరి పిల్లలు గొప్పగా చెబుతారు, మేము మీ లాగనే, పెద్దలను గౌరవిస్తూ, మాతోనే పెట్టుకున్నాము అని, ఆత్మ ద్రోహముతో, వీరి భవిష్యత్ అంత కన్నా ఘోరముగా ఉండబోతుంది సుమా. మనము ఏది చేస్తే, అదే మనకు తిరిగి వస్తుంది కదా రెట్టింపై.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2129 General Articles and views 1,924,129; 104 తత్వాలు (Tatvaalu) and views 229,766
Dt : 07-May-2024, Upd Dt : 07-May-2024, Category : General
Views : 117 ( + More Social Media views ), Id : 2097 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : parents , close , care , Rakshasatva , decrease , rid , Maya , older
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content