ఇకనుంచి అందరు మహిళలకు సత్వర న్యాయం? పలుకుబడి వ్యక్తులకు కూడా శిక్ష త్వరగా? - News
           
మిగతా వార్తలనూ విషయాలను చదవగలరు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2175 General Articles and views 2,221,166; 104 తత్వాలు (Tatvaalu) and views 245,394.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

వారిని కూడా దివికి పంపారు. చర్య , ప్రతి చర్యలు జరిగాయి. కొందరు ఆనందించారు, మరి కొందరు బాధ పడ్డారు. ఏది ఏమైనా ఈ మొత్తము సంఘటన, తీవ్రంగా ఖండించ దగ్గది చరిత్ర లో.

వారి వీరి తల్లి దండ్రులు, భార్య పిల్లలు అనాధలు అయ్యారు. కానీ భవిష్యత్తు కు కొన్ని ప్రశ్నలు. శిక్ష తీర్పుతో మన పిల్లలు అయితే వెనక్కు రారు. అసలు జరగకుండా, ముందు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది కదా.

1. మన ఇంట్లో మగ, ఆడ పిల్లల కు జాగ్రత్తలు, మంచి చెడు ఇకనైనా బాధ్యత గా నేర్పుతామా? మన ఉద్యోగ, వ్యాపార, లేదా మొహములలో పడి, పిల్లల బాధ్యతను మరుస్తున్నామా?

2. ఎక్కడ కు వెళ్లి నా, ఏ బండి ఎక్కినా, సెల్ ఫోన్ ఫోటో, వీడియో తీయడం, తమ వాళ్ళ కు పంపడం, గట్టిగా చేయమని చెపుతామా? చెవిలో ఫొన్ లు లేదా పాటలు మాని, పరిసరాల్ని గమనించి మసలుకోమని చెపుతామా?

3. ఎక్కడ ఉన్నారు, ఎక్కడ కు వెళతారు అని బాధ్యత గా తెలుసుకుంటామా? రాత్రి పనులు తగ్గింపు లేదా తోడుగా ఎవరైనా పంపుతామా? లేక అది కేవలం పోలీసులు, ప్రభుత్వ బాధ్యత మాత్రమే అని వదిలేస్తామా ఎప్పుడులాగే?

4. ఇక అందరూ మహిళల కు, ఇంత త్వరగా న్యాయం తీర్పు జరుగుతుందా? పెండింగ్ లో ఉన్న కేసులు ఇంత త్వరగా తీర్పు ఇస్తారా, పూర్తి చేస్తారా?

5. ఇక్కడ నలుగురు కూడా సామాన్య వ్యక్తులు, డబ్బు పలుకుబడి లేనివారు. చదువు సంధ్య కూడా ఉందో లేదో తెలీదు. మరి డబ్బు ఉండి , పలుకుబడి హోదా ఉన్న వ్యక్తులు కు కూడా శిక్ష ఇంత త్వరగా ఉంటుందా? తప్పు ఎవరు చేసినా, తప్పే గదా. గట్టి శిక్ష వెంటనే ఉండాలి కదా?

జరిగిన కాల్పులు ఎన్‌కౌంటర్‌ గురించి కొంతమంది అనుమానాలు, ఆధారాలు లేకపోతే ఇలాగే అనుకుంటారు కదా. లేదు మేము సత్వర న్యాయము కోసము చేసాము ఇక అందరికీ ఇలాగే చేస్తాము అంటే, ఈ ప్రశ్నలు అనవసరము.

1. లారీ లో పనిచేసే వారికి, తుపాకీ లాక్కుని కాల్చే ధైర్యం ఉంటుందా? కాల్చిన తర్వాత కూడా వారి చేతిలో తుపాకి ఉంటుందా కింది లేదా దూరముగా పడిపోకుండా? పారిపోతుంటే లేదా రాయి విసురుతుంటే లేదా కాలుస్తూ ఉంటే , చేతులు కాళ్ళ మీద కాల్చి గాయపరుస్తారా లేక మనిషినే చంపేస్తారా? నలుగురిని అదే విధముగా? బేడీ లు తీసి ఎలా జరిగింది, అని చూప మంటారా?

2. నలుగురు నిందితులకు, తగినంత భద్రతతో జాగ్రత్త తో, పోలీసులు తీసుకు వెళ్ళారా? మన పోలీసు కు బాడీ కెమెరాలు డ్రోన్‌ కెమెరా లేవా? పని చేయలేదా? ఇలాంటి కేసులలో, అందరితో ఇలాగే రిహార్సల్స్ చేపిస్తారా? బాడీ వేర్ కెమెరాలను పోలీసులు ప్రవేశపెట్టారు కదా, స్మార్ట్ పొలీసు వ్యవస్థతో భాగముగా.

3. ఒక ఫోటో లేదా వీడియో గ్రాఫర్ ని, మొత్తం పద్దతి లేదా కార్యక్రమం రికార్డు చేయడానికి తీసుకుని వెళ్ళరా? కనీసం ఒక పోలీసు కూడా, తమ సెల్ ఫోన్ లో, నిందితుల ప్రతిఘటన ను రికార్డు చేయలేదా చేయరా?

4. ప్రతి దానికి, సీసీటీవీ చూసే పోలీసులు, ఈ సంఘటన వీడియో రికార్డు చేసే బాధ్యత లేదా మరచే అవకాశము ఉంటుందా?

ఏదో ఒక సాక్ష్యం ఉంటే మానవ హక్కుల సంఘం కి చూపడానికి పనికి వస్తుంది కదా. నీరు పల్లమెరుగు నిజం దేవుడెరుగు అనే సామెత తెలుసు కదా.

మనం, మన వాళ్ళు, మన ఇల్లు మారనిదే, మన సమాజం మారదు గదా. అలాంటి భావాలు ఆలోచన లు రాకుండా మొగ్గలోనే తుంచి వేయాలి.

మరి ఇంటర్నెట్ లో వచ్చే వీడియో లు, చెత్త సినిమా లు, చెత్త సీరియల్స్, చెత్త సాహిత్యం ను ఎవరు అదుపులో పెట్టాలి. మన మనసులోని భావాలు ఎవరు కడిగివేయాలి.  

Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2175 General Articles and views 2,221,166; 104 తత్వాలు (Tatvaalu) and views 245,394
Dt : 06-Dec-2019, Upd Dt : 06-Dec-2019, Category : News
Views : 1144 ( + More Social Media views ), Id : 245 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : disa , encounter , justice

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content