పాటతో పరమార్ధం - సాహసం నా పథం (భక్తి పేరడీ) - మహర్షి - రాఘవ, శాంతిప్రియ, వంశీ, ఇళయరాజా - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2140 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2175 General Articles and views 2,221,554; 104 తత్వాలు (Tatvaalu) and views 245,426.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Saahasam Naa Patham (Bhakti Parody) - Maharshi - Raghava, Shanti Priya, Vamsi, Ilayaraja

- మన గాత్ర నైవేద్య సేవ Our Gatra Naivedya Seva
- మన వ్రాత నైవేద్య సేవ Our Writing Naivedya Seva

Our Vocal/ Song/ Gatra, Writing/ Article, Photo, Video, Voice/ Talk, Social service, Ayurveda, Mental Physical Naivedya Seva, Campaign about Good, for Manasik Chaitanya AcharaNa divine devotees - Conquer Arishadvarga Ashtavyasana, Satsang 5 min

మన పాట/గాత్ర, రచన/ కథనం/వ్రాత, ఫోటో, వీడియో, వాయిస్/మాట, సామాజిక సేవ, ఆయుర్వేద, మానసిక శారీరక నైవేద్య సేవ, ప్రచారం మంచి గురించి, మానసిక చైతన్య ఆచరణ దైవ భక్తులకు - జయించు అరిషడ్వర్గ అష్టవ్యసన, సత్సంగం 5 నిమిషాలు

+ + +

సినిమాలో రజో గుణ ప్రభావం ఉన్న పాటను, సత్వ గుణ పాటగా, పదాల గారడీతో ఎలా మార్చామో చూడండి.

రజో తమో గుణాల నుంచి, సత్వ గుణం వైపు మారాలి అంటే, సాహసం, సహనం, ఓర్పు, త్యాగం,సత్యం ఉండాలి. సాహసం అంటే 10 మందిని కొట్టడం కాదు, 10 ఇళ్ళు అప్పుతో లేదా 10 మందిని దోచి కొనడము కాదు. కనీసం ముదుసలి తల్లి తండ్రుల అత్త మామల 5+ ఏళ్ళ సజీవ గురువు సేవ చేయడం, అరిషడ్వర్గం అష్టవ్యసనం ను జయించడం. ప్రపంచాన్ని జయించిన వారు కూడా, తమను తాము జయించలేక, పతనము అయినారు చివరలో. అధికారం, ఆస్తులు, బలగం వారిని కాపాడలేదు స్వార్ధంతో.

మరి మన సత్వ గుణ సాధన ఎలా ఉండాలి? సాహసం మన పథం గా ఉండాలి, సత్వ గుణ మే మన రధం గా ఉండి, సాగితే ఆపడం ఎన్ని కష్టాలకైనా సాధ్యమా? మన సహనమే ఆయుధం, ఓర్పులో నేర్పులో జీవితం, ఎప్పుడూ మనసు శాంతిగా ఉండటం కష్టమా? మన సాధనలో, మనసు బానిసై, చేయదా ఊడిగం, మన మాట లాంటి శాశనం దాటటం సఖ్యమా? మన పదగతిలో, ఏ ప్రతిఘటనా, ఈ సాధనలో, మన దగ్గర తానొదుగునుగా?

నిశ్చయం గా నిశ్చలం గా ఉండాలి, స్తిరంగా. నిర్భయం మన హయం గా ఉండాలి, ఎన్ని కష్టాలు వచ్చినా. ప్రపంచములో కానిదేముంది మనం కొరుకుంటే, పూని సాధించుకోమా? సత్వ గుణం లో మనశ్శాంతి తప్ప, మనకు ఏదీ అవసరము లేదు కదా? లాభమేముంది కలకాలముంటే, మన మనసు ను జయించకుండా? తప్పని ఒప్పని తర్కమే చేయము, కష్టమో నష్టమో లెక్కలే వేయము, మంచి పని చేసుకుంటూ, సజీవ గురువు సేలో తరించడమే. తిని కూర్చుని ఊరుకుంటే, కాలమంతా జారిపోదా, బ్రమలవెంటా? అప్పుడు మానసిక బలహీనులము అవుతాము కదా? మనం మనసు పడితే ఏ సాధన నైనా, ఈ మనసు తడుతు, మనం హ్రుదయములో కొలువమా?

మనది అదరనీ బెదరని ప్రవ్రుత్తి గా ఉండాలి, బ్రమలకు మోహాలకు లొంగకూడదు, అది దైవం పరీక్ష, చెదరని సత్వగుణమే మహర్షి. దామ్మా దామ్మా అని వేడితే మనసు ధ్యానం చేరుతుందా, పట్టుదలతో సాధన సాగాలి కాదా? మనం ఓడితే జాలి చూపేన కాలం, కాల రాసేసి పోదా? అంతము సొంతము పంతమే వీడము, మందలొ పందలా ఉండనే ఉండము. ధీరువల్లే పారిపోము, రేయి వొళ్ళొ దూరిపొము, దాంకోము.

మేం మొదలు పెడితే ఏ సాధనైనా, మాకెదురుపడునా ఏ అపజయం, అని మీరు ధైర్యముగా సాధన కొనసాగించాలి ఎన్ని కష్టాలు కన్నీళ్ళు ఎదురైనా. మీరే చెప్పండి? దేవుని దయతో 10+ ఏళ్ళ సజీవ గురువు సేవ, జిల్లా ప్రభుత్వ ఉద్యోగం వదలి 3+ ఏళ్ళ ఆదాయం పోయినా 79+ ఏళ్ళ అమ్మను వదలలేదు, 240+ వారాల పైగా 108 ప్రదక్షిణలు, 20+ ఏళ్ళ పైగా చాపనిద్ర శాఖాహారము, 10+ ఏళ్ళు గా ప్రతి శని వారం నియమముగా శని శివ నిమ్మ నేతి దీపాలు, ఇంకా బోలెడు శని వార సాధన లిస్ట్ లో ఉన్నాయి కదా? మరి మీరూ సత్వ గుణ వైపు, సజీవ గురువు సేవ వైపు, అరిషడ్వర్గం అష్టవ్యసనం ను జయించడం వైపు ప్రయాణం మొదలు పెడుతారు కదూ.

+ + +

Parody

సాహసం మన పథం, సత్వమే మన రధం, సాగితే ఆపడం సాధ్యమా.
సహనమే ఆయుధం, ఓర్పులో జీవితం, శాంతిగా ఉండటం కష్టమా.
మనసు బానిసై, చేయదా ఊడిగం, శాశనం దాటటం సఖ్యమా..
మన పదగతిలో., ఏ ప్రతిఘటనా., ఈ సాధనలో., తానొదుగునుగా||సాహసం మన పదం||

నిశ్చయం నిశ్చలం..హా హా నిర్భయం మన హయం..హా ఆ ఆ
కానిదేముంది మనం కొరుకుంటే, పూని సాధించుకోమా.
లాభమేముంది కలకాలముంటే, మనసు జయించకుండా..
తప్పని ఒప్పని, తర్కమే చేయము, కష్టమో నష్టమో, లెక్కలే వేయము
ఊరుకుంటే. కాలమంతా, జారిపోదా. బ్రమలవెంటా
మనం మనసు పడితే ఏ సాధన నైనా, ఈ మనసు తడుతు మనం కొలువమా ||సాహసం మన పదం||

హేహేహేహేహే...
అదరనీ బెదరని ప్రవ్రుత్తి, చెదరని సత్వగుణమే మహర్షి ఆ ఆ
వేడితే మనసు ధ్యానం చేరుతుందా.., సాధన సాగాలి కాదా...హా..హా
ఓడితే జాలి చూపేన కాలం, కాల రాసేసి పోదా..
అంతము సొంతము పంతమే వీడము, మందలొ పందలా ఉండనే ఉండము
ధీరువల్లే. పారిపోము, రేయి వొళ్ళొ. దూరిపొము
మేం మొదలు పెడితే ఏ సాధనైనా, మాకెదురుపడునా ఏ అపజయం ||సాహసం మన పదం||
తకిటజం తరితజం తనతజం జంతజాం
తకిటజం తరితజం జంతజాం....

Original

సాహసం నా పథం, రాజసం నా రధం, సాగితే ఆపడం సాధ్యమా.
పౌరుషం ఆయుధం, పోరులో జీవితం, కైవసం కావటం కష్టమా.
లొకమే బానిసై, చేయదా ఊడిగం, శాశనం దాటటం సఖ్యమా..
నా పదగతిలో., ఏ ప్రతిఘటనా., ఈ పిడికిలిలో., తానొదుగునుగా
సాహసం నా పదం, రాజసం నా రధం, సాగితే ఆపడం సాధ్యమా.

నిశ్చయం నిశ్చలం..హా హా నిర్భయం నాహయం..హా ఆ ఆ
కానిదేముంది నే కొరుకుంటే, పూని సాధించుకోనా.
లాభమేముంది కలకాలముంటే, కామితం తీరకుండా.
తప్పని ఒప్పని, తర్కమే చేయను, కష్టమో నష్టమో, లెక్కలే వేయను
ఊరుకుంటే. కాలమంతా, జారిపోదా. ఊహవెంటా
నే మనసు పడితే ఏ కలలనైనా, ఈ చిటిక కొడుతు నే పిలువనా ||సాహసం నా పదం||

హేహేహేహేహే...
అదరనీ బెదరని ప్రవ్రుత్తి, ఒదగని మదగజమే మహర్షి ఆ ఆ
వేడితే లేడి ఒడి చేరితుందా.., వేట సాగాలి కాదా...హా..హా
ఓడితే జాలి చూపేన కాలం, కాల రాసేసి పోదా..
అంతము సొంతము పంతమే వీడను, మందలొ పందలా ఉండనే ఉండను
ధీరువల్లే. పారిపోను, రేయి వొళ్ళొ. దూరిపొను
నే మొదలు పెడితే ఏ సమరమైనా, నాకెదురుపడునా ఏ అపజయం ||సాహసం నా పదం||
తకిటజం తరితజం తనతజం జంతజాం
తకిటజం తరితజం జంతజాం....

చిత్రం : మహర్షి (1987). సంగీతం : ఇళయరాజా. సాహిత్యం : సిరివెన్నెల. గానం : బాలు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2175 General Articles and views 2,221,554; 104 తత్వాలు (Tatvaalu) and views 245,426
Dt : 16-Jul-2024, Upd Dt : 16-Jul-2024, Category : Songs
Views : 99 ( + More Social Media views ), Id : 2142 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Saahasam Naa Patham , Bhakti , Parody , Maharshi , Raghava , Nishanti , Shanti Priya , Vamsi , Ilayaraja , Balu
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content