జయ మంగళ గౌరీ, జయ జయ మంగళ గౌరీ, అరుంధతీ అనసూయలవలె - ముద్దుబిడ్డ, సారంగధర, శారద - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2074 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2109 General Articles and views 1,866,741; 104 తత్వాలు (Tatvaalu) and views 224,984.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

*జయ మంగళ గౌరీ దేవి, జయ జయ మంగళ గౌరీ, అరుంధతీ అనసూయలవలె - ముద్దుబిడ్డ, సారంగధర, శారద - హారతి పాటలు*

గౌరీ గంగా ఇద్దరూ కలసి, గణపతిని ఎంత బాగా పెంచారు, ఎంత జ్ఞానవంతుని చేసారు అంటున్నదీ పాట, ఎంత సంస్కారము తో గణపతి లోకములో కీర్తించబడుతున్నారో, మన అందరికీ తెలుసు. ఆ గొప్పతనము తల్లి గౌరీదే, శంకరుని కన్నా.

అరుంధతీ అనసూయల వంటి గొప్ప తల్లుల గురించి అందరికీ తెలుసు, వారి లాగా ఉంటే, ఇంట్లో మనశ్శాంతి ఉండి, పిల్లలు గుణ సంస్కార వంతులుగా, అందరి మన్ననలు పొందుతారు. అలాగే చివర రోజులలో, ముదుసలి తల్లి దండ్రిని తమతో పాటుగా ఇంట్లో ఉంచి కంటికి రెప్పలా కాచుకుంటారు.

శ్రావణ మాసం లో, మంగళవారము గౌరీ దేవి పూజలు చేస్తారు. ప్రతి శుక్రవారము కూడా, ఇవి పాడుకోవచ్చు. పేరు పెట్టి పిలవడాన్ని పేరంటము (పేరు అనడము) అంటారు. పేరంటము లో ఆనాటి ఉత్తమ మహిళలు ఈ దైవభక్తి పాటలు పాడే వారు, యుక్త వయస్సు పెళ్ళి కాని పిల్లలు అలాగే ఇతరులు నేర్చుకోవాలి అని. వారూ గొంతు కలిపి పాడి నేర్చుకునేవారు.

మరి ఇప్పుడు సీరియల్ ఇంటెర్నెట్ లేదా ఉద్యోగాలలో తీరిక లేక, సంపాదన లేదా ప్రాపంచిక మత్తులో పడి, అమ్మకు కాని వారి ఆడపిల్లకు మగపిల్లాడికి కానీ, నోటికి ఒక్క పద్యము పలకదు, ఒక్క పాట కూడా రాదు. ఇంకా చాదస్తము ఈ రోజుల్లో కూడా అని, ఒద్దిక మరచి, బతుకులు బజారుకు నెడుతున్నారు.

కడుపున పుట్టిన పిల్లలు ఏమి చేస్తున్నారు, ఎలా తిరుగుతున్నారు, ఏమి నేర్చుకుంటున్నారు అని చూడటానికే మాకు సమయం లేకపోతే, ఇక దేవుళ్ళ పాటలకు సమయం ఎక్కడిది చెప్మా, అని విచిత్రముగా చూస్తున్నారు. మంత్రాలు నోరు పలకవని ఓ వైపు తప్పించుకుంటూ, కనీసం తేలిక పదాల పాటలు కూడా పాడలేని దౌర్భాగ్య స్తితికి వచ్చాము.

పూజలు పాటలు, దేవునికి అవసరము లేదు, మన మనశ్శంతికే అన్న జ్ఞానం ఏనాడో వదిలేశాము, సమానత్వ సంపాదన ఉద్యోగ హోదా ఆస్తుల భావనలో, పిల్లల మంచి చెడు మరచి, వారిని మనసులేని సంపాదించే మర మనుషులుగా తయారు చేసి, చివరకు ముదుసలి తనములో ఒంటరిగా అనాధలుగా భోరుమంటున్నారు.

సాగినంత కాలం మా అంత వారు లేరు అంటున్నారు, సాగకపోతే పట్టించుకునే వారు లేకపోతే, తమ పాపాలు పండినప్పుడు, లబో దిబో మంటూ మానసిక బలహీనులౌతున్నారు.

కనీసం మగవారైనా ఇవి నేర్చుకుని, ఇంట్లో మహిళలకు పిల్లలకు బతిమాలి నేర్పితే, కొంత మనశ్శాంతి ఇంటిల్లిపాదీ ఉంటుంది, కాస్త సంస్కారము అబ్బుతుంది. లేదంటే ధనము పెట్టి మనశ్శాంతిని ఆరోగ్యాన్ని, బయట కాసేపు కు, తాత్కాలికముగా కొనాల్సి వస్తుంది సుమీ. ఎన్ని సార్లు ఎంత పెట్టి కొనగలము?

1) పల్లవి: జయ మంగళ, గౌరీ దేవి.. 2
దయ చూడుము, చల్లని తల్లీ.. ||జయ మంగళ||

కొలిచే వారికి, కొరతలు లేవు
కలిగిన బాధలు, తొలగ జే.యు
కాపురమందున, కలతలు రావు
కమ్మని దీవెన లిమ్మా.. అమ్మా..||జయ మంగళ||

ఇలవేలుపువై, వెలసిన నాడే
నెలకొలిపా..వు. నిత్యానందం.. ఆ ఆ ఆ ఆ ఆ .......2
నోచే నో.ములు, పండించా.వు.
చేసే పూజకె కొమ్మా.. అమ్మా..||జయ మంగళ||

గారాబముగా, గంగా.. నీవు..
బొజ్జ గణపతిని, పెంచిరి తల్లీ..
ఇద్దరి తల్లుల, ముద్దుల పాపకి
బుద్దీ జ్ఞానము లిమ్మా.. అమ్మా..||జయ మంగళ||

Jayamangala Gowri Devi - P. Leela - Mangala Harathi Song, Muddu Bidda Jamuna Jaggaiah
జయ మంగళ గౌరీ దేవి, చిత్రం : ముద్దుబిడ్డ (1956), సంగీతం : పెండ్యాల, గీతరచయిత : ఆరుద్ర, నేపథ్య గానం : పి. లీల

2) జయ జయ మంగళ గౌరీ, జయ జయ శంకరి కౌమారీ 2 ||జయ జయ||

నీవే జగతికి కారణమమ్మా,
పర దేవతవూ నీవే నమ్మా ..- 2 లైన్లు మొత్తము
నీవే మా, ఇల వేలుపు వమ్మా . . . ఆ ఆ 2
దయగొనవమ్మా. అమ్మా.. ||జయ జయ||

చల్లని నీ కను సన్నలలోనా,
కొనసాగును మా కోరికలన్నీ - 2 లైన్లు మొత్తము
నిలబడవే మా వెన్ను కాపుగా 2
జయము నొసంగవే సర్వ మంగళా.. 2 ||జయ జయ||

సారంగధర - జయ జయ మంగళ గౌరీ, చిత్రం : సారంగధర (1957), సంగీతం : ఘంటసాల, సాహిత్యం : సముద్రాల సీనియర్, గానం : పి.లీల
Sarangadhara Movie Songs || Jaya Jaya Mangala Gowri || NTR || Bhanumathi


3) జయ మంగళ గౌరీ. దే.వి., జయ శంకరి జననీ.. శ్రీ 2

అ.రుంధతీ అనసూయలవలె మము 2
రక్షించుమమ్మా, శ్రీ కల్పవల్లీ, దేవీ.. ||జయ మంగళ||

పసుపు కుంకుమలతో..., ముత్తైదు తనముతో ... 2
కల కాలము మము కరుణించు శంకరీ, దేవీ ..||జయ మంగళ||

శారద సినిమా
Sarada Movie - Jaya Mangala Gouri Devi Video Song || Sharada || Shobhan Babu || Jayanthi

jaya mangala gowri devi Muddu Bidda Sarada Jaya Jaya Mangala Gowri Sarangadhara movie songs

మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు, ఆరోగ్యం కు, వాక్సుద్ది కి.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2109 General Articles and views 1,866,741; 104 తత్వాలు (Tatvaalu) and views 224,984
Dt : 05-Aug-2022, Upd Dt : 05-Aug-2022, Category : Songs
Views : 766 ( + More Social Media views ), Id : 1485 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : jaya , mangala , gowri , gouri , devi , muddubidda , sarada , sarangadhara , movie , songs
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content