పాటతో పరమార్ధం - సీతారత్నం గారి అబ్బాయి - పసివాడో ఏమిటో - వినోద్ కుమార్, రోజా, వాణిశ్రీ - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2140 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2175 General Articles and views 2,221,549; 104 తత్వాలు (Tatvaalu) and views 245,426.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Seetharatnam Gari Abbayi - Pasivaado Emito - Vinod Kumar, Roja, Vanisri

- మన గాత్ర నైవేద్య సేవ Our Gatra Naivedya Seva
- మన వ్రాత నైవేద్య సేవ Our Writing Naivedya Seva

*ఏది నిజం? 1) పసివాడో ఏమిటో ఆ పైవాడు; తను చేసిన బొమ్మ లతో తలపడతాడు 2) పసివాడో ఏమిటో ఈ జీవుడు; తన మోహ బ్రమ లతో. తలపడతాడు.. మరి మిగతాది చదవండి తెలుసుకోవడానికి*

Our Vocal/ Song/ Gatra, Writing/ Article, Photo, Video, Voice/ Talk, Social service, Ayurveda, Mental Physical Naivedya Seva, Campaign about Good, for Manasik Chaitanya AcharaNa divine devotees - Conquer Arishadvarga Ashtavyasana, Satsang 5 min

మన పాట/గాత్ర, రచన/ కథనం/వ్రాత, ఫోటో, వీడియో, వాయిస్/మాట, సామాజిక సేవ, ఆయుర్వేద, మానసిక శారీరక నైవేద్య సేవ, ప్రచారం మంచి గురించి, మానసిక చైతన్య ఆచరణ దైవ భక్తులకు - జయించు అరిషడ్వర్గ అష్టవ్యసన, సత్సంగం 5 నిమిషాలు

+ + +

ఏది నిజం? 1) పసివాడో ఏమిటో ఆ పైవాడు; తను చేసిన బొమ్మ లతో తలపడతాడు - గేయ రచయిత బాధ్యత మరచి రాసిన మాటలు 2) పసివాడో ఏమిటో ఈ జీవుడు; తన మోహ బ్రమ లతో తలపడతాడు - మనం బాధ్యత తో గుర్తు చేస్తున్న, ఆత్మ విమర్శ, మనల్ని మనం తెలుసుకోవడం.

దేవుడు నోరు తెరిచి అడగలేడు అని అందరూ, ఆయన మీద ఆడిపోసుకుంటారు. నిజం చెప్పండి, మనం అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వములో చేస్తున్న మాయా ప్రపంచపు మోహాల తప్పుడు పనులకు, దేవుడు ఎందుకు కారణం? కేవలం ఆ మనిషి యొక్క మానసిక బలహీనతే కారణం.

క్యారెక్టర్/ లక్షణాలు, గుణ & అర్హత/ పాత్రత తెలియకుండా, ఎవరికైనా సహాయం చేస్తే లేదా ఎవరితోనైనా కలిసి నడిస్తే, అది పాపాన్ని పెంచుతుంది మరియు త్వరలో లేదా తరువాత, వెన్నుపోటు మరియు గుండెపోటు వస్తుంది, సొంత ఇంట్లో అయినా, జీవితం, వివాహం, ఉద్యోగం మరియు వ్యాపారంలో.

నమ్మరు కదూ ఉదాహరణ లేకుండా, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం వలన, అంటే రజో తమో గుణాల లాభనష్టాలు, మన పెద్దలు ఎప్పుడో ప్రత్యక్షంగా నిరూపించారు. పురాణాలు లో కాదు సుమీ, ఈ 50 ఏళ్ళు లో. మీ పెద్దలు ను అంటే, సంస్కారం ఉన్న వారిని అడగండి.

రామన్న, రాజన్న, సావిత్రమ్మ, జయలలితమ్మ, కోడెలయ్య, శ్రీదేవమ్మ‌‌‌, కాఫీడేఅయ్య, మాల్యయ్య, సింఘానియయ్య, వివేకయ్య, మీ ఇంట్లో మా ఇంట్లో, లాంటి మహానుభావుల, అలాగే ఒంటరి లేదా అనాధ ఆశ్రమ ముదుసలి బతుకుల, చివరి పేజీలు చదవండి.

పసివాడో ఏమిటో ఈ జీవుడు, తన మోహ బ్రమ లతో తలపడతాడు? నిజం కాదా? దేవుడికి సంబంధం ఉందా? మనం గుణం చూడకుండా, ధనం ఆస్తులు అందం వీసా అధికారం అవసరం అవకాశం కు అమ్ముడుపోతే, అది దేవుడి తప్పా? ఆయన భగవద్గీతలో అలా ఆత్మ అమ్ముకోమని చెప్పారా, మానసిక బలహీనత తో? ధర్మం ముఖ్యమని గీత చెప్పిందా, లేక బంధం ముఖ్యమని చెప్పిందా? అదే మరి ఆచరణలో గీత ను పాటించడం లో, మానసిక బలం కావాలి.

అధర్మం దోవ లో నడవడం మొదలు పెట్టాక, ఒక సారి మోహం లో చిక్కు కున్నాక, ఆ వేధించే పంతాలు ఏమిటో, ఫలితాలు వేటాడే ఈ ఆటకంతు ఎక్కడో, ఎవరికి తెలుసు, పూర్తి పతనము జరిగిన దాకా?

ఒక ఇంట్లోనే లేదా లోకములో ఇలాంటి వారిని ఎంతో మందిని చూస్తున్నాము. తాళెరుగని సంతానం ఉన్న తల్లోక్కరు. ఇతరులతో సర్దుకోలేక, తమ దురాశలకు అంతులేక, ప్రాపంచిక విరహాలలో అల్లాడుతూ, తోడెరుగని మోడొక్కరు. పెళ్ళయినా కూడా, కొడుకుండి తండ్రవలేక, సతులుండి పతి కాలేక, తమ తప్పులకు కుళ్ళి క్రుశించిపోతూ, వారితో నానా మాటలు పడుతూ, తన సొంత మోహ తలరాతకు తలవంచి, ఫలితముగా శిలలాగే బ్రతికే దొకరు. ఆ వ్యామోహ బంధాలే సంకెళ్లు వేయగా, బ్రతుకంతా చెరసాల లాగా మారగా, పాపం అనే వారు లేరు. వీరికి నిస్వార్ధ చిత్తశుద్ది ఉన్న, పూజలు సేవలు దానాలు ఉంటాయా?

అన్ని తప్పుడు దోవలలో ప్రయాణం చేసి, జీవితాన్ని నాశనం చేసుకుని కూడా, చేజేతులా, ఏ ఒక్కరు, ఏ నేరము మేము వ్యామోహం లో, ప్రాపంచిక బ్రమలు లో, మానసిక బలహీనతతో చేసామనరు. తమను తాము తెలుసుకోరు. తెలిసెవరూ దోషులు కారు, కానీ తప్పుకోలేని ఫలితం మాత్రం మోశారు. పరులంటూ ఎవరూ లేరు ఇంట్లో లేదా చుట్టుపక్కలా, ఐనా అంతా పగవారు అయ్యారు మిత్రమ, మీ మోహ పనుల వలన. ఇకనైనా ఈ గుండె మంటలారునా, ఇకనైనా, ఈ ఆత్మ పరమాత్మ జంట చెంత చేరునా?

+ + +
ఏది నిజం?

(పసివాడో ఏ.మిటో ఆ పై.వాడు
తను చేసిన బొమ్మ లతో. తలపడతాడు..)
పసివాడో ఏ.మిటో ఈ జీవుడు
తన మోహ బ్రమ లతో. తలపడతాడు..
వేధించే.. పంతాలు ఏమిటో.
వేటాడే.. ఈ ఆటకంతు ఎక్కడో. ||పసివాడో||

తాళెరుగని.. తల్లోక్కరు, తోడెరుగని.. మోడొక్కరు
కొడుకుండి. తండ్రవలేక, సతులుండి. పతి కాలేక
తన తలరాతకు తలవంచి, శిలలాగే. బ్రతికే దొకరు

బంధాలే. సంకెళ్లు వేయగా, బ్రతుకంతా. చెరసాల లాగా మారగా..||పసివాడో||

(చేజేతులా. ఏ ఒక్కరు, ఏనే.రము. చేసెరగరు)
చేజేతులా. ఏ ఒక్కరు, ఏనే.రము. చేసామనరు
తెలిసెవరూ దోషులు కారు, ఫలితం మాత్రం మోశారు
పరులంటూ. ఎవరూ లేరు, ఐనా. అంతా పగవారు

ఇకనైనా. ఈ మంటలారునా., ఇకనైనా. ఈ జంట చెంత చేరునా.||పసివాడో||  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2175 General Articles and views 2,221,549; 104 తత్వాలు (Tatvaalu) and views 245,426
Dt : 24-Jul-2024, Upd Dt : 24-Jul-2024, Category : Songs
Views : 46 ( + More Social Media views ), Id : 2149 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Pasivaado Emito , Seetharatnam Gari Abbayi , Pasivado Yemito , Vinod Kumar , Roja , Vanisri , Sitaratnam Gari Abbayi
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content