అసాధ్యుడు - చవటాయను నేను, ఒట్టి చవటాయను, కోట్లు వెనకేసా - నేటి రాజకీయ పరిస్తితి పేరడీ - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2082 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2117 General Articles and views 1,878,235; 104 తత్వాలు (Tatvaalu) and views 225,969.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Asadhyudu - Ninnu chusi navvida, Chavatayanu nenu otti - Krishna, Vanisri, KR Vijaya, Rama krishna, Chalam

ఎవరు చవట? ఆ పార్టీ నాయకులా? ఈ పార్టీ నాయకులా? అమ్ముడు బోయి నక్క పులి పాము కు ఓట్లు వేసి, తలపై ఎక్కించుకున్న, ఉచితాలకు రాష్ట్రాన్ని అమ్ముకున్న, పన్నులతో తన్నించుకుంటున్న మనమా?

నేటి రాజకీయాలు చూసారా, ఒక నాయకుని గురించి 10 తిడితే, ఇంకో నాయకుడు ఇతని గురించి 20 దొంగ పనులు బయటపెడుతున్నారు. వీరు - మీరు వెన్నుపోటుదారులు అంటే, వారు - మీరు ఫాక్షన్ రాజకీయాలకు వారసులు అంటున్నారు. జనాలు, మీరు మీ కుటుంబాలే మాకు ఉత్తములు అంటున్నారు.

2 రాష్ట్రాలు, తమ అత్యుత్తమ నాయకుల భాషతో, జనాల మానసిక లక్షణాలకు విపరీత ప్రచారం కలిగిస్తూ, ప్రపంచ వ్యాప్తముగా ఉన్న తెలుగు వారికి, మాయా మోహ వినోదం కలిగిస్తున్నారు.

మన నినాదం తెలుసు కదా - ప్రజాస్వామ్య పద్దతిలో ఓట్లతో గెలిచిన నాయకులది తప్పు కాదు, అవసర అవకాశ ధన వర్గ కులాలకు అమ్ముడుబోయిన, ఓటర్లమైన మనదే మొదటి తప్పు. మనకన్నా ఎక్కువ తప్పుడు వారినే, చూసి ఏరి ఎన్నుకుంటాము.

మన అవలక్షణాలు లేని వారిని, అసలు మెచ్చము, 100 కోట్లు కన్నా ఆస్తి తక్కువ ఉంటే అసలు గెలిపించము. ఉత్తమ పాలన మనకొద్దు, ఉత్త పాలనే చాలు.

సినిమా నటులు గుడ్డలు విప్పి ఫోజులు ఇస్తున్న, తమకున్న మాయా మోహ అభిమానుల అవలక్షణాలు చూపుతూ ఉంటే, మా ఓటర్లకు మాత్రం మా అవ లక్షణాలు చూపించవద్దా అని, ఎమ్మెల్యేలు ఎంపీలు నాయకులు గుడ్డలు విప్పడం లేదా ఫోన్లలో అరగంట గంట అంటూ, జనరంజకముగా యువతకు శ్రేయముగా, జయప్రదముగా చెడు నూరిపొస్తున్నారు.

ఏ టీవీ/ యూట్యూబ్ చానెల్ చూసినా వీరి గొప్ప పనులే. అసలు చెడ్డ పనులు చేయకపోతే, మీడియా అలాగే ఊళ్ళో జనాలు గుర్తించరేమో, అన్న పరిస్తితికి తీసుకు వచ్చారు.

వారి ఎమ్మెల్యే, ఎంపీలు తప్పుడు వారని వీరు సాక్ష్యాలు చూపిస్తే, వారి గత పాలనలోనే ఇంత కన్నా ఎక్కువ అప్పులు అన్యాయాలు అని వీరు సాక్ష్యాలు చూపిస్తారు. మీది కుల పార్టీ అని వీరు 300 మంది ఉన్న లిస్ట్ పంపితే, వారూ అదే మాట అని 400 లిస్ట్ పంపుతున్నారు.

మీరు మోసం, మీరు మోసం అంటూ ఇద్దరూ తిట్టుకుంటూ, చెడు పదాలతో దూషించుకుంటూ, సవాళ్ళు విసురుకుంటూ, ప్రజల మనోభావలకు తగిన గుర్తింపునిస్తూ, మీ ఓట్లతో మా నోట్లతో గెలిచాము, మీరు ఎంత కుసంస్కారులో మేము మీకన్నా ఎక్కువ కుసంస్కారులుగా, మీ నాయకులుగా బాగా నటిస్తున్నామా, పన్నులు సరిపోయాయా ఇంకా పెంచాలా, ఏ బ్రాండ్ మద్యం కావాలి, మాటలు మడమలు తిప్పామా ఇంకా తిప్పాలా, అని నాయకులు ఇల్లు ఇల్లు తిరిగి గొప్పగా అడుగుతున్నారు.

ఏమి పర్లేదు దేవరా, మీ కుటుంబ బానిసత్వములో, వచ్చే ఎన్నికల్లో ఇంకొంచెం ఎక్కువ ఓట్లకు నోట్లు, కాసింత మజ్జిగ, 2 అదనపు పాకెట్లు బిర్యానీ ఇస్తే, భాంచెన్ మీ కాళ్ళకే మొక్కి, మీకో మీ వారసులకో, ఓటువేసి, రాష్ట్రం పై అప్పుల భారాన్ని, మా పిల్లలు వారి పిల్లలపై ఆనందముగా మోపుతామని, తలవంచి నమస్కరించి నాయకులకు జేజేలు కొడుతున్నారు. ఎప్పటికైనా వెనిజులా, శ్రీలంక లాంటి ఉత్తమ రోజులు రాకపోతాయా, అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

క్రిష్ణ నటించిన అసాధ్యుడు సినిమా గుర్తుందా? అందులో ఓ స్టేజీ నాటకములో, వాణిశ్రీ చలం ఆనాటి హాస్యనటులు బాలక్రిష్ణ ల మీద ఓ గమ్మత్తైన పాట ఉంది, నేటి రాజకీయాలకు సరిగ్గా సరిపోతుంది.

కొసరాజు రాసిన పాట, నిన్నుచూసి నవ్విందా నన్ను చూసి నవ్విందా, ను పిఠాపురం, మాధవపెద్ది సత్యం పాడారు. ఇందులో భాగమే చవటాయను నేను.., ఒట్టి చవటాయను నేను. నీ కంటే పెద్ద చవటాయను, నేను ఒట్టి చవటాయను నేను. ఎలక్షన్లలో లక్ష ఖర్చు తో, ఎమ్మెల్యే నై పోయాను. పర్మిట్లు లైసెన్సులు పట్టి, 10 లక్షలు వెనకేసాను, అని గర్వముగా ఆనాడు చెప్పారు. మరి ఈనాడుకు సరిపోయే పేరడీ పాట కూడా చూడండి.

* * * అసలు పాట ఇది -

వీధిలో పోవు అమ్మాయి వెంట నంటి., ఈలలను వేసి, చాలా గగ్గోలు చేసి.., ఇంటికేతెంచి ఇకిలించు (కొంటె, చవట, నాప ఎవ్వడో...) - 2, ఆతని చూసి నవ్వినాను ఆ ఆ ఆ

చవట, ఒట్టి చవట
శుద్ద చవట, పరమ చవట

చవటాయను నేను.., ఒట్టి చవటాయను నేను
నీ కంటే పెద్ద చవటాయను, నేను ఒట్టి చవటాయను నేను

కావాలంటే క్వాలిఫికేషన్, చెబుతా వింటేను... ||చవటాయను ||

మునిసిపాలిటీ మెంబరునై, 3 ఏళ్ళు దాక నే గడిపాను
ఏడాదికొక్క పార్టీ చొప్పున, 3 పార్టీలు మార్చాను ||చవటాయను ||

ఎలక్షన్లలో లక్ష ఖర్చు తో, ఎమ్మెల్యే నై పోయాను
పర్మిట్లు లైసెన్సులు పట్టి, 10 లక్షలు వెనకేసాను ||చవటాయను|| ||నీ కంటే పెద్ద ||

అనాధ పిల్లల, హాస్టల్లంటూ, గ్రాంటులు బాగా కొట్టాను
పస్తులు పెట్టి, పైవాని గిలిచి, మేడలు మిద్దెలు కట్టాను

ఏడుకొండలా, వెంకన్న గుడికి, ఏటేటా పొయ్యొస్తాను
వచ్చిన దాంట్లో చెరిస్వాహా అని ముడుపులు చెల్లించొస్తాను||చవటాయను||

టిక్కెట్ లేక, రైల్లో ఎక్కి, ఫ్రీ గా ట్రావెల్ చేసాను
పక్క స్టేషన్, వచ్చే దాకా, కక్కసు లో దాక్కున్నాను

బడా బడా కాంట్రాక్టులు చేసి, ప్రాజెక్ట్ లు కట్టించా.ను
వరద దెబ్బతో కొట్టుకు పోతే, మళ్ళీ టెండర్ పెట్టాను||చవటాయను|| ||నీ కంటే పెద్ద ||

నిన్నుచూసి నవ్విందా నన్ను చూసి నవ్విందా - పిఠాపురం, మాధవపెద్ది సత్యం - రచన: కొసరాజు

* * * పేరడీ పాట ఇది -

100 కోట్ల పైన సంపాదించి, కేసులు స్టేలు వెన్నుపోట్లు ఉండి, ఉచిత ఉత్తమ విద్య వైద్యం రక్షణ ఇవ్వకుండా, గౌరవ సంపాదన మార్గాలు చూపకుండా, ఊరిలో ఉండు ఓటరు వెంట పడి., నోట్లు పంచి, చాలా మాయలు చేసి.., ఓట్లకై ఇంటి కే తెంచి ఇకిలించు, మాకన్నా పెద్ద (మోస, చవట, కపట, 2 నాల్కల, అబద్దాల, అవసర, అవకాశ, కేటు ఎవ్వరో...) - 2, ఆతని చూసి మా నాయకులు గా ఓటేస్తాము ఆ ఆ ఆ

చవట, ఒట్టి దొంగ
శుద్ద మోసం, పరమ నటన

చవటాయలు వాళ్ళు.., ఒట్టి చవటాయలు వాళ్ళు
ఓటరు కంటే, పెద్ద చవటాయలు వాళ్ళు, ఒట్టి చవటాయలు వాళ్ళు
కావాలంటే క్వాలిఫికేషన్, చెబుతా వింటేను... ||చవటాయలు ||

రాష్ట్ర కేంద్ర నాయకులై, 5 ఏళ్ళు దాకా, దోచి దాచారు
అవసరానికో పార్టీ చొప్పున, ఎన్నో పార్టీలు మార్చారు ||చవటాయలు ||

ఎలక్షన్లలో కోటి పై ఖర్చు తో, ప్రభుత్వ నాయకు లై పోయారు
పర్మిట్ లైసెన్సులు పట్టి, 100 కోట్లువెనకేసారు ||చవటాయలు || ||మన కంటే పెద్ద ||

అనాధ పిల్లల, హాస్టల్లంటూ, గ్రాంటులు బాగా కొట్టారు
పస్తులు పెట్టి, పైవాని గిలిచి, మేడలు మిద్దెలు కట్టారు

ఏడుకొండలా, వెంకన్న గుడికి, ఏటేటా పొయ్యొస్తారు
వచ్చిన దాంట్లో చెరిస్వాహా అని, ముడుపులు చెల్లించొస్తారు||చవటాయలు ||

టిక్కెట్ లేక, రైల్లో ఎక్కి, ఫ్రీ గా ట్రావెల్ చేసారు
పక్క స్టేషన్, వచ్చే దాకా, కక్కసు లో దాక్కున్నారు

బడా బడా కాంట్రాక్టులు చేసి, ప్రాజెక్ట్ లు కట్టించా.రు
వరద దెబ్బతో కొట్టుకు పోతే, మళ్ళీ టెండర్ పెట్టారు||చవటాయలు|| ||మన కంటే పెద్ద ||

ప్రజల పన్నుల, పంచే పధకాలకు, వారి పేర్లు పెట్టారు
అప్పులు తెచ్చి, అందరికి పంచి, కుటుంబ బానిసత్వం పెంచారు

ఓటుకు నోటు, బిర్యాని మజ్జిగ, ఇచ్చి ఓటర్లను కొనేసారు
గెలిచాక, పన్నులు పెంచి, వారి మాడు పగలకొట్టారు, ఇచ్చినదానికి 100 ఇంతలు దోచారు.||చవటాయలు || ||మన కంటే పెద్ద ||

దర్శకత్వం వి. రామచంద్రరావు, నిర్మాణం నెల్లూరు కాంతారావు, ఎస్.హెచ్. హుస్సేన్, తారాగణం కృష్ణ, కె.ఆర్.విజయ, సంగీతం టి.చలపతిరావు

మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు, వాక్సుద్ది కి.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2117 General Articles and views 1,878,235; 104 తత్వాలు (Tatvaalu) and views 225,969
Dt : 04-Aug-2022, Upd Dt : 05-Apr-2024, Category : Songs
Views : 876 ( + More Social Media views ), Id : 1483 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : asadhyudu , ninnu , chusi , navvida , chavatayanu , nenu , otti , krishna , vanisri , andhra , politics , jagan , chandranna , pawan
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content