ఫించను ఆస్తి లేదా ఇంకోటి ఆశించకుండా, మన పంచేంద్రియాలు తల్లితండ్రుల పంచేంద్రియాలు గా చేసి సేవ? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2140 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2175 General Articles and views 2,221,635; 104 తత్వాలు (Tatvaalu) and views 245,428.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

*It is not a common thing to make our five senses serve as parents five senses, without expecting any property or anything else.*

*ఫించను ఆస్తి పదవి లేదా ఇంకోటి ఆశించకుండా, మన పంచేంద్రియాలు తల్లితండ్రుల పంచేంద్రియాలు గా చేసి సేవ చెయ్యడం, సామాన్యమైన విషయం కాదు.*

Rajo Tamo Guna Dasa mind is not stable. Depending on the need, time and opportunity, the respect love varies.

రజో తమో గుణ దాసుల బుద్ధి స్ధిరంగా ఉండదు. సమయం అవసరం అవకాశం బట్టి, ప్రేమ గౌరవం మారుతూ ఉంటుంది

- మన వ్రాత నైవేద్య సేవ Our Writing Naivedya Seva

Conquer Arishadvarg Ashtavyasan, Satsang జయించు అరిషడ్వర్గ అష్టవ్యసన, సత్సంగం 5 min నిమిషాలు 12-Jul-2024

ముదుసలి పెద్దలను, ఇంట్లో పంచలోనో ఒక గదిలోనో పని మనుషులతోనో మూలన ఉంచి, ఒక ముద్ద వేసి, కళ్ళతో రోజూ చూడటం పలకరించడం, అది ఆస్తి లేదా పించను లేదా ఇంకో సహాయం ఆశించి, జనం కోసం నటించడం వేరు.

మనల్ని మనం తెలుసుకుని, మనం ఎందుకు భూమిపైకి వచ్చామో అర్ధం చేసుకుని, ఆత్మ సమర్పణతో, బాధ్యత గా రోజూ దేవతలు గా పూజిస్తూ, అన్నం తినిపిస్తూ, నవ్వులు పూయిస్తూ, ఆత్మ విశ్వాసం నింపుతూ, మానసిక చైతన్యం కలిగిస్తూ, రోజు మైలు నడిపిస్తూ, మాటలు చెపుతూ, గుండె అలాగే మానసిక ఆత్మ ధైర్యం ఇస్తూ ఉండటం వేరు.

ఈ ఇంటి కి మీరే దేవతలు, మాకు మూలం మీరే, ఇది అంతా మీ భిక్షనే, మేము నిమిత్త మాత్రులము, పాద దాసులము, అని చాపనిద్రతో మంచం దగ్గర పడుకుంటూ అందుబాటులో, సజీవ గురువు సేవ చెయ్యడం వేరు.

ఫించను ఆస్తి పదవి లేదా ఇంకోటి ఆశించకుండా, మన పంచేంద్రియాలు వారి పంచేంద్రియాలు గా చేసి సేవ చెయ్యడం, సామాన్యమైన విషయం కాదు.

కేవలము సత్వ గుణ సాధకులకు, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం వదిలిన లేదా వదిలే ప్రయత్నం లో ఉన్న వారికి మాత్రమే తెలుస్తుంది.

79+ ఏళ్ళు అమ్మ ను ప్రేమ గా చూసిన, ఎన్ని ఏళ్ళు అయినా, అంటే 30 40 50 60 70 ఏళ్ళు అయినా, అదే ప్రేమ తో గౌరవం తో భాగస్వామి పిల్లలు ను చూడగలము? అది సత్వగుణం లక్షణాలు. అందుకే పెద్దలు అంటారు, ముదుసలి తల్లి తండ్రులను అత్త మామలను చూసే పిల్లలు, తమ కుటుంబాన్ని పెళ్ళిని బాధ్యతగా నడిపిస్తారు సంస్కారముతో.

కాబట్టి రజో తమో గుణ దాసుల బుద్ధి స్ధిరంగా ఉండదు. సమయం అవసరం అవకాశం బట్టి, ప్రేమ గౌరవం మారుతూ ఉంటుంది.

అంటే పెళ్ళికి ముందు ఒక రకముగా, పెళ్ళి అయిన తర్వాత ఒక రకముగా, ఏళ్ళు పెరిగే కొద్దీ ఇంకో రకముగా, అంటే 30 40 50 60 70 ఏళ్ళు రక రకాలుగా మారుతూ, వారి కొంపను, ఇతర కొంపలను కూలుస్తుంది. సొంత అమ్మ అయ్య అత్త మామలకే ద్రోహం.

స్వార్ధ రజో తమో గుణాలకు, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసలకు, అవి తెలియవు. వీరి సంసారాలు కూడా, యాంత్రికమే, మానసిక ప్రేమ ఆత్మ బంధం లేకుండా, కేవలం అవసరం అవకాశం తో, ఆత్మ ద్రోహముతో. ఈ బంధాలు ఏరోజైనా, పేక మేడలా కూలిపోతాయి.

1) మొన్న పాదాల డాక్టర్, 2) తర్వాత జనరల్ డాక్టర్, 3) తర్వాత చెవి గుబులు నర్సు మరియు డాక్టర్ 1 వ సారి, 4) మరలా ఇప్పుడు రెండో సారి.

ఎంతో ఓపికగా పెద్ద వయసు లేదా ఏ వయసు రోగులు అయినా, వారిని పసి పిల్లలు గా కారులో అన్ని ఆసుపత్రులకు అలాగే మిగతా అన్ని చోట్లకు తిప్పుతూ, మానసిక ఆరోగ్యం గా ఉంచి, నమ్మకం పెంచాలి.

అంటే మనకు సహనం, ఓర్పు, నేర్పు, నిస్వార్థ సేవ, త్యాగం, కృతజ్ఞతలు, విశ్వసనీయత ఉండాలి. సకల జీవులలో పరమాత్మను చూడగలగాలి.

అందుకే అంది 60+ వయసు లేదా ఏ వయసు రోగులను చూడటం ప్రేమతో అంటే, ఇద్దరు 6 ఏళ్ళు పిల్లలు ను చూడటం కన్నా ఎక్కువ. ఎందుకంటే పసి పిల్లలు అంటే మక్కువ తో, 100 రూపాయల కష్టం కూడా 50 లా కనపడుతుంది.

అదే పెద్ద వయసు వారికి సేవ చేసేటప్పుడు, సొంత అమ్మ అయ్య అయినా కూడా, చాదస్తం, తలనొప్పి, మతిమరుపు, ఉచ్చ గబ్బు, పొద్దుగూకులు చెయ్యి పట్టుకుని ఏమిటి అంటూ, 100 రూపాయల కష్టం 1000 లా కనపడుతుంది. వారు మన ఎదాన పడి, మనకు తలకు భారమైన బ్రాంతి కనపడుతుంది రజో తమో గుణ దాసులకు.

ఇప్పుడు అర్థం అయిందా సజీవ గురువు సేవ. కోటి రూపాయలు దానం ఇచ్చే వాడు కూడా, ఒక్క వారం కూడా పెద్ద వయసు వారి, సజీవ గురువు సేవ చేయలేరు. రేపు కోటీశ్వరుడి బతుకుకే, నిస్వార్ధ సేవకు, ఎవరూ సాత్వికులు దొరకరు.

ధన ఆశతో ఎవరైనా దొరికినా, వారిని నిందిస్తూ విసిగిస్తూ, ధనం కోసం వారి ప్రాణాలు తీయక మానరు.

నిస్వార్ధ సేవ, సత్వ గుణం వారికే సాధ్యం, రూపాయి ఆశించకుండా, బాధ్యత జాలి దయ కరుణ తో సేవ చెయ్యడం.

అందుకే మిమ్మల్ని ఏళ్ళుగా ఏప్రిల్ లో సాధన చేసే సాత్వికులకు 10 వేలు ఇచ్చి అండగా ఉందాము అని చెప్పింది, వారు మీకు స్థానికముగా తోడు ఉంటారని. మీరు నిర్లక్ష్యముగా ఉన్నారు, అది మీకు మంచి అని తెలిసినా.

నమ్మరు కదూ ఉదాహరణ లేకుండా, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం వలన, అంటే రజో తమో గుణాల లాభనష్టాలు, మన పెద్దలు ఎప్పుడో ప్రత్యక్షంగా నిరూపించారు. పురాణాలు లో కాదు సుమీ, ఈ 50 ఏళ్ళు లో. మీ పెద్దలు ను అంటే, సంస్కారం ఉన్న వారిని అడగండి.

Without a convincing example, you won't understand the profit and loss due to slavery of Arishadvarga Ashtavyasana means Rajo Tamo Guna. Our elders have proved it directly. Not in mythology friend, in these 50 years. Ask your elders i.e. cultured people.

రామన్న, రాజన్న, సావిత్రమ్మ, జయలలితమ్మ, కోడెలయ్య, శ్రీదేవమ్మ‌‌‌, కాఫీడేఅయ్య, మాల్యయ్య, సింఘానియయ్య, వివేకయ్య, మీ ఇంట్లో మా ఇంట్లో, లాంటి మహానుభావుల, అలాగే ఒంటరి లేదా అనాధ ఆశ్రమ ముదుసలి బతుకుల, చివరి పేజీలు చదవండి.

Like Ramanna, Rajanna, Savithramma, Jayalalithamma, Kodelaiah, Sridevamma, CoffeeDayaiah, Malyayya, Singhaniayya, Vivekayya, in your and our house, As well as single or orphan ashram old age folks, read the last pages of the greats.

సత్వ గుణం వారు దొరకలేదు, అవును అందుకే కదా, మా ఇల్లు మాది కాబట్టే పాడుబడుతుంది. అమ్మ ను ఎవరూ చూసేవారు లేరు, కాబట్టి ఇంత ఖర్చు తో ఇంత దూరం వచ్చి ఉంటుంది, రేపు మీరు అంతే కదా అంటే?

రేపు మీరు, మేము అయినా ఇంతే రజో తమో గుణాలను నమ్ముకుంటే నట్టేట వదిలేస్తారు, చివరకు సత్వ గుణం పంచన చేరాలి, బతికి ఉంటే. అదేపని అన్ని బాగున్నప్పుడు ముందే చేస్తే.

అందుకే రోజువారీ సాధన, మానవత్వంతో ముందుగా మనల్ని మనం తెలుసుకోవాలి. నిజమైన వ్యక్తులకు ఎల్లప్పుడూ నిజం చెప్పండి. మనం అరిషడ్వర్గం అష్టవ్యాసన దాస్యంలో ఉన్నట్లయితే, మనకు ఒకే రకమైన అంటే అదే బానిసత్వ మనసు గల వ్యక్తులు లభిస్తారు. అప్పుడు ఒకరినొకరు నిందించుకుంటారు, పతనం చేసుకుంటారు. ప్రతిదానికి మరియు ప్రతి కలయికకు, ఒక కారణం ఉంటుంది, కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి.

మీ గురించి, మీ పిల్లలు భాగస్వామి బంధువులు స్నేహితులు గురించి పొగడ్తలు ఉండాలి అనే కదా, మంచి గుణాలు కర్మలు సాధనలు పంపమని అన్నది వారం వారం, ఇంకా తమోగుణం నుంచి బయటకు రాలేరా? నిన్న అన్న వదిన జవాబు అదే కదా, మానవత్వం సంస్కారం ఉన్న జనాలకు, తమ గురించి తామే తెలుసుకోవాలి అని.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2175 General Articles and views 2,221,635; 104 తత్వాలు (Tatvaalu) and views 245,428
Dt : 12-Jul-2024, Upd Dt : 12-Jul-2024, Category : General
Views : 92 ( + More Social Media views ), Id : 2136 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : common , thing , five senses , serve , expecting , property , anything
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content