Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
* డెమొక్రాటిక్ అభ్యర్థి జో బిడెన్, కు తోడుగా సెనెటర్ కమలా హారిస్
* తొలి నల్లజాతి మహిళ
* తల్లి భారత్, తండ్రి జమైకా
* దేశ ఉపాధ్యక్షురాలిగా పనిచేసే అర్హత లేదని, తాను విన్నానని, ట్రంప్
* 15 భారతీయ భాషల్లో
* కమల హారిస్ మసాలా దోసె వీడియో
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు.
1 min read time.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్థి జో బిడెన్, కు తోడుగా ఉపాధ్యక్ష పదవిలో కాలిఫోర్నియా సెనెటర్ కమలా హారిస్ నిలిచారు. అప్పటి నుంచి, విపరీతమైన్ ప్రచారం సాగుతుంది, భారత్ కు చెందినా ములాలు ఉండటము వలన. అధ్యక్ష ఎన్నికల్లో, ఒక ప్రధాన పార్టీ తరఫున ఉపాధ్యక్ష పదవికి పోటీపడుతున్న, తొలి నల్లజాతి మహిళగా నిలిచారు.
ఈ నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో, ప్రస్తుత అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌తో తలపడుతున్న, డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌తో కలిసి, ఆమె ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తారు.
తల్లి, భారత్ కు చెందిన వారు అమెరికాకు 1960 లో వచ్చారు, తమిళనాడు కు చెందిన శ్యామలా గోపాలన్. తండ్రి జమైకా దేశస్తులు, డొనాల్డ్ హారిస్. తర్వాత, హారిస్ 7 ఏళ్ళ వయసులో, పేరెంట్స్ విడాకులు తీసుకున్నారు. తాత ను చూడటానికి ఇండియా ఏడాదికి ఒకసారి వచ్చేవారు.
అధ్యక్షుడు ట్రంప్ కూడా, కమల హారిస్ నే లక్ష్యంగా చేసుకుని, వ్యాఖ్యలు చేస్తుండడం, ఆమెకు విపరీతమైన ప్రచారం తెచ్చిపెడుతోంది. దేశ ఉపాధ్యక్షురాలిగా పనిచేసే అర్హత లేదని, తాను విన్నానని, ట్రంప్ వ్యాఖ్యానించారు. తద్వారా.. విమర్శకులు జాతివివక్షతో కూడుకున్నదని, తప్పుపట్టే ఓ న్యాయ సిద్ధాంతాన్ని ఆయన ఎగదోశారు. గతములో ఒబామాకు కూడా ఇలాగే ప్రచారము చేసారు.
15 భారతీయ భాషల్లో కూడా, ప్రచారం చేస్తున్నారు. కింద ఉన్న చిత్రము చూడండి, అమెరికా నాయకుడు ఎలా ఉండాలి అంటే, జో బిడెన్ లాగా ఉండాలి. జో బిడెన్ కు ఓటు వేయండి అంటూ, సోషల్ మీడియాలో పెడుతున్నారు.
కమల హారిస్ కు చెందిన మసాలా దోసె వీడియో, ఒకటి వైరల్ అవుతోంది. గతేడాది, భారత సంతతి అమెరికా టెలివిజన్ నటీమణి వెరా కిండీ కాలింగ్ తో కలిసి, కమలా హారిస్ ఓ షోలో పాల్గొన్నారు. మసాలా దోసె వేయడంలో కిండీ కాలింగ్ కు సహకరించారు.
2 photos available. Please scroll through carousel by click/ touch left(<) and right(>) arrows.
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2216 General Articles and views 2,481,516; 104 తత్వాలు (Tatvaalu) and views 266,458
Dt : 14-Aug-2020, Upd Dt : 14-Aug-2020, Category : News
Views : 1745
( + More Social Media views ), Id : 26
, Country : USA
Tags :
kamala harris ,
joe biden ,
nov ,
us election ,
campaign ,
indian languages ,
trump ,
america
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments