Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.
చీరాల మండలం లోని, బోయిన వారి పాలెం గ్రామంలో, మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. దాదాపు 15 లక్షల రూపాయలకు పైగా, ఆస్తినష్టం సంభవించినట్లు ప్రాథమిక అంచనా.
గ్రామంలో ఒకచోట గడ్డివాములు ఉండగా, పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నుండి, నిప్పురవ్వలు ఎగిసిపడి దగ్గరలో ఉన్న వాటిపై పడ్డంతో, అవి అంటుకున్నాయి, పెద్ద మంటలు మొదలు అయ్యాయి.
ఆ గడ్డివాముల సమీపంలో ఉన్న, 4 పూరిళ్లు కూడా దగ్ధమయ్యాయి, 2 పశువులు కూడా చచ్చిపోయినట్లు సమాచారం, ఓ మహిళ కు గాయాలు.
విషయ సమాచారం అందుకున్న ఈపూరుపాలెం ఎస్సై సుబ్బారావు, వెంటనే తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని, మంటలను ఆర్పే సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
ఈ మంటల్లో గాయపడ్డ మహిళను పోలీసు జీపులో, ఆస్పత్రికి తరలించడానికి ఎస్ఐ ఏర్పాట్లు చేయగా, మార్గ మధ్యంలో అంబులెన్స్ రావడంతో, దాని ఆమెను ఆస్పత్రికి పంపారు
విద్యుత్ శాఖ అధికారులు కూడా, ట్రాన్స్ఫార్మర్ ని సందర్శించి, శాఖాపరమైన విచారణ చేపట్టారు. పూర్తి సమాచారం వచ్చాక, తగిన చర్యలు తీసుకుంటామని, ఎస్ఐ కే సుబ్బారావు చెప్పారు.
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2303 General Articles and views 3,488,795; 104 తత్వాలు (Tatvaalu) and views 396,082
Dt : 26-May-2021, Upd Dt : 26-May-2021, Category : News
Views : 2017
( + More Social Media views ), Id : 30
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
fire ,
accident ,
chirala ,
boinavaripalem ,
ipurupalem ,
police ,
si ,
subbarao
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments