Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.
*వృద్ధులను ఆదుకుంటున్నాము* - చుట్టుపక్కల వృద్ధులను ఆదుకుంటున్నాము. చాలామంది వృద్ధుల పిల్లలు, ఇక్కడ వీరిని ఒంటరిగా వదిలేసి, విదేశాల్లో లేదా ఇతర నగరాల్లో/ చోట్ల ఉంటున్నారు. ప్రతిరోజు వారిని పలకరించడం, ఆరోగ్యం గురించి వాకబు చేస్తుంటాము. ఎప్పుడైనా ఆరోగ్యం సహకరించకున్నా వైద్యం కోసం డబ్బులు సమకూర్చుతాము. 35 శాతం వృద్ధులు సంతోషంగా ఉండటానికి కారణం ప్రభుత్వమిచ్చే పింఛన్లే అనుకుంటున్నాను. – జీహెచ్‌ఎంసీ ఆసరా కమిటీ మెంబర్
*చట్టం అమలు చేస్తే మేలు* - తల్లిదండ్రుల సంక్షేమం కోరి 2007లో కేంద్రం ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. 2011లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆ చట్టాన్ని అడాప్ట్ చేసుకుంది. దీన్ని అమలు చేస్తే చాలావరకు వృద్ధుల సమస్యలు తీరుతాయి. కుటుంబంలో ఒకరినొకరు గౌరవించుకోవాలి. లేదంటే భవిష్యత్తు తరాలు ఇంకా నిలకడలేని స్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. – హెల్ప్ ఏజ్ ఇండియా ప్రతినిధి
*ఇలా ఫిర్యాదు చేయొచ్చు* - సమాజంలో, కుటుంబసభ్యుల ద్వారా వేధింపులకు గురవుతే వృద్ధులు నేరుగా హెల్ప్ ఏజ్ ఇండియా వయోవృద్ధుల సహాయ కేంద్రం 1-800-180-1253 నంబర్‌ను సంప్రదించొచ్చు. ఫిర్యాదు అందిన వెంటనే పిల్లలకు అవగాహన కల్పించడంతోపాటు మానవతా విలువలు పెంపొందించేలా చేస్తారు.
* మనకు జీవితాన్ని ఇచ్చి, ఇంత వారిని చేసిన, మన ఇంటి పెద్దల పై వివక్ష, వేధింపులు, నిర్లక్ష్యం మానండి
* జీవితాన్ని ధారపోసి పెద్ద చేసిన వారిని ఆదరించాలి, కుక్క కూడా విశ్వాసం చూపిస్తుంది కొంచెం అన్నం పెడితే, మరి మనం?
* చూసే కొద్ది వారు కూడా, సూటిపోటి మాటలతో వారిని కుంగనీయొద్దు, మా ఎదాన పడ్డారు, మీ నస చాదస్తం భరించలేము అన్న మాటలు అనవద్దు. చిన్నప్పుడు అంతకన్నా ఎక్కువ నస బాధ మనమూ పెట్టాము.
* కుటుంబ విలువలను నేటి యువత గౌరవించాలి. లేదంటే, వారి కుటుంబ విలువలు కూడా, అడుగంటుతాయి.
* సూటిపోటి మాటలతో 53 శాతం వృద్ధుల వేదన
* 60 శాతం మంది నిరాదరణ: హెల్ప్ ఏజ్ ఇండియా నివేదిక
* 35 శాతం వృద్ధులు ఆసరా పింఛన్‌తో సంతోషం
ఇంకొన్ని కన్నీటి గాధలు -
* పిల్లలు పెద్దయ్యాక, స్థిరపడిన తర్వాత, వృద్ధాప్యానికి చేరిన తల్లిదండ్రులను కన్నపేగులు పట్టించుకోవడం లేదు.
* వృద్ధ దంపతులు తీవ్రంగా కుంగిపోతూ అనారోగ్యం పాలవుతున్నారని హెల్ప్ ఏజ్ ఇండియా జాతీయ నివేదిక వెల్లడించింది.
* హెల్ప్ ఏజ్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం హిమాయత్‌నగర్‌లోని కామ్రేడ్ సత్యనారాయణరెడ్డి భవన్‌లో - అంతరాన్ని తగ్గించండి..వృద్ధుల అవసరాలు అర్థం చేసుకోండి - అనే అంశంపై సమావేశం జరిగింది.
* స్వేచ్ఛ కాదు..ఉమ్మడి కుటుంబాలే ఉత్తమం
* మాటలు, నడక నేర్పడం నుంచి మొదలుకొని జీవితగమనాన్ని రూపొందించేందుకు ప్రతినిత్యం తల్లిదండ్రులు కష్టపడిన విధానానికి ఎన్నటికీ వెలకట్టలేమని.. వారు చూపించే చను వు, చొరవ, ప్రేమ, ఆప్యాయతలు ఎవ్వరూ ఇవ్వలేరని స్పష్టం చేశారు.
* కుటుంబంలో వృద్ధులు ఉంటే.. వారిద్వారా జ్ఞానం, సంస్కృతి, సంప్రదాయాలు, విజ్ఞానాన్ని తెలుసుకోవచ్చన్నారు.
* కుటుంబంలోని పెద్దలను గౌరవించకుండా అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు పంపించే ఆలోచన ఏమాత్రం భవిష్యత్తు తరాలకు మంచిది కాదని హితవుపలికారు.
* తరాలను (రూట్స్) మరిచిపోనివారే చరిత్రలో ఉత్తములుగా నిలుస్తారని, కుటుంబీకుల్ని గౌరవించకపోతే..గుర్తించకపోతే.. మనల్ని మనమే అవమానపర్చుకున్నవారమవుతామని గుర్తుచేశారు.
* ఉమ్మడి కుటుంబాల్లో ఉన్న సంతోషం, నేడు చిన్న కుటుంబాల్లో ఉండటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
* కనీసం వారానికి ఒకసారైనా తల్లిదండ్రులు, అమ్మమ్మ, నానమ్మ, తాతలు, బంధువులతో మాట్లాడటానికి యత్నించాలన్నారు.
నమస్తే తెలంగాణ వారి సమాచార సౌజన్యము/ ఆధారము తో, వృద్ధులకు అండగా, ఉపయోగకరమైన సమాచారం.
https://www.ntnews.com/hyderabad/hyderabad-district-news-1680-629156
60 percent parents are suffering ill treatment from own children HelpAge India report
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2216 General Articles and views 2,481,512; 104 తత్వాలు (Tatvaalu) and views 266,458
Dt : 15-Jun-2022, Upd Dt : 15-Jun-2022, Category : News
Views : 1030
( + More Social Media views ), Id : 33
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
parents ,
suffering ,
ill ,
treatment ,
children ,
helpage ,
india ,
report
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments