వెన్నుపోటు, గుండెపోటు, నోటా- దేనికి విజయం? ప్రజల మానసిక బలహీనత, కుటుంబ కుసంస్కారం దాటి? - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2094 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2129 General Articles and views 1,925,321; 104 తత్వాలు (Tatvaalu) and views 229,951.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

Backstab, Heart attack, Nota - success for what? Public mental weakness, beyond family bad culture, can not come to the side of the Cow? Jaggaiah and Chandraiah conversation.

Conquer Arishadvarga Ashtavyasana, Satsang జయించు అరిషడ్వర్గ అష్టవ్యసన, సత్సంగం 5 min నిమిషాలు - మన వ్రాత నైవేద్య సేవ Our Writing Naivedya Seva

*వెన్నుపోటు, గుండెపోటు, నోటా లో దేనికి విజయం? ప్రజల మానసిక బలహీనత, కుటుంబ కుసంస్కారం దాటి, ఆవు వైపు రాలేరా? జగ్గయ్య, చంద్రయ్య సంభాషణ.*

చంద్రన్న, జగనన్న ఇద్దరూ మా బిడ్డలే, సమాన ప్రేమ, మా పిల్లలది తప్పు లేదు పాపాత్ములైన ప్రజలదే తప్పు, ఇద్దరు కలకాలం ఆరోగ్యాలతో ఉండాలి. రజో, తమో గుణాలు తగ్గి, సత్వ గుణం పెరగాలి. ఎవరు గెలిచినా, పాప ఫలితము వదలదు. వాస్తవం పిల్లలకు చెప్పాలి, మానసిక సత్వ గుణ బలవంతులుగా తీర్చి దిద్దాలి. మనకు ముదుసలి తనములో అండగా నిలవాలి.

రామన్న, రాజన్న, సావిత్రమ్మ, జయలలితమ్మ, కోడెలయ్య, శ్రీదేవమ్మ‌‌‌, కాఫీడేఅయ్య, మాల్యయ్య, సింఘానియయ్య, మీ ఇంట్లో మా ఇంట్లో, లాంటి మహానుభావుల చివరి పేజీలు చదవండి.

జగ్గయ్య, చంద్రయ్య ప్రాణ స్నేహితులు, ఉన్నది ఉన్నట్లుగా, కపటం నటనం 2 నాల్కల ధోరణి లేకుండా మాట్లాడుతారు. వేరు వేరు పార్టీలు అయినా, కపటం లేదు కాబట్టి, స్నేహితం వేరు, ఎన్నికలు వేరు అని స్పష్టముగా తెలుసు.

కలియుగ పతనం తొందరగా జరగాలి అన్నా, రోగాలతో కష్టాలు కన్నీళ్ళతో, పంచభూతాల ప్రళయములో తొందర గా పోవాలన్నా, నక్క, పాము, పులి గుణాలకే తమ మద్దతు ఇవ్వాలని గట్టిగా నమ్ముతారు.

యాత్రకు గుడికి ప్రసాదానికి ఖర్చుకు ఆభరణాలు అంతస్తు అధికారం పలుకుబడి చూపడానికి, టైం పాసుకు తప్ప, రామ క్రిష్ణ దైవ గుణాలు త్యాగాలు ఓర్పు సహనం సేవ తమ ఆచరణలో చూపలేమని, ధర్మాన్ని కాపాడు అది మనల్ని కాపాడుతుంది అంటే నమ్మలేని, పశు బలం లేని కీడు చేయని సత్వ గుణ ఆవు/ మనిషి ని వీరు సమర్ధన చేయలేరు, అండగా ఉండలేరు.

అవే అంతిమ కాల బుద్దులతో, తమ పిల్లలు ముదుసలి తనములో చూడలేరు అని, ధనముతో అనాధాశ్రమాలు పెంచాలని వీరి కోరిక. అక్కడ కూడా, నడవ లేక పోతే ఉంచరని, ఒకవేళ ఉంచితే అవయవాలు ఉంచరని కూడా వీరికి తెలుసు.

దోచైనా ఆస్తులు పెంచితే, నీతి నియమాలతో బతకలేని సంపాదించలేని, తర్వాత తరాలు మంద బుద్దులుగా, తిని తాగి చెడ తిరుగుతూ, గుణం లేని పెళ్ళి రాక్షస/ జంతు సంసార సంతానముతో లేదా గుణ సర్దుబాటు లేని విడాకులతో, మానసిక బలహీనులు గా ఉండాలి, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసలు గా ఉండాలి అని వీరి ముందు చూపు.

* * *జగ్గయ్య* * *- అన్నా, ఎలా ఉందే ఎన్నికల జోరు. మా గుండెపోటు గెలుస్తుంది ఇంకో పదేళ్ళు, గతము లో వెన్నుపోటుకు 10 ఏళ్ళు అవకాశం ఇచ్చారు అలాగే మాకు ఇస్తారు, దయగల దేవుళ్ళు, రజో తమో గుణ దాసులు ఓటర్లు అనే నమ్మకం నాది. మరి మీ సైడ్?

* * *చంద్రయ్య* * * - లేదు అన్నా, వెన్నుపోటు కే, ఈ సారి ప్రజలు మొగ్గు చూపుతారు. రజో తమో గుణ దాసులు ఓటర్లు, మాకు మాత్రమే అండ. మేము మా పార్టీలో అందరికీ వెన్నుపోటు విద్య నేర్పాము. సొంత వారైనా సరే, మనకు పదవి ధనం అధికారం ముఖ్యం, మన వర్గమైనా సరే వెన్నుపోటు పొడవండి అని చెప్పాము.

1. చూసారు కదా, మా ఎన్నారై టీడీపీ సొంత మీటింగ్ లోనే, ఎవరో వెన్నుపోటు పొడిచి, వీడియో బయటికి పంపారు. అలాగే మా నాయకురాలు, ఎప్పటిలాగే బండ బూతులు తిడుతుంటే, ఆ వీడియో కూడా తీసి బయటకు పంపారు. భూ హక్కులు రద్దు అని, అభివ్రుద్ది లేదు అని, వాలంటీర్లు వేస్ట్ అని ముందు అంటే, మా పేటీయం పసుపు మంద మీ పేటీయం బులుగు మంద లాగా, వెనకా ముందు చూడకుండా అలాగే ప్రచారం చేస్తారు.

2. భూ హక్కులు మా బినామీ లకు పోతే, మావి పోయినట్లు కాదా? మా నల్ల ధనం భూమి, ప్రభుత్వం కనిపెడితే కష్టం కదా? ఈటీవీలో, కొత్త భూ హక్కు చట్టం మంచిది అని మా వారే చెప్పలేదా, తర్వాత మేము దాచలేదా? మీ నాయకుడు, 70 గదుల ఇల్లు కట్టుకుని పబ్లిక్ గా ఆస్తి చూపెడితే, మేము 70 డాబాలు నే కనపడకుండా దాచి బినామీలతో పెట్టాము. అదే మా జనానికి నచ్చుతుంది.

3. చూడు సొంత అమ్మా నాన్నకు కూడా, వెన్నుపోటుకు మా పార్టీలో వెనుకాడరు. మా బాలయ్యను అడుగు, తండ్రికి వెన్నుపోటు పొడిచారా మీరు అని, అబ్బే అది వెన్నుపోటు ఎందుకు అవుతుంది, బతిమాలాము, వినలేదు, విశ్రాంతి ఇచ్చాము అంటారు.

4. మరి మెంటల్ సర్టిఫికేట్ తో, కోర్టు ను ఒప్పించి, ఎన్నికలలో ఎలా నిలిచావు అంటే, ఇది బాబాయి గుండెపోటు కు సమర్ధన లాగా కాదా అంటే, మా నియోజకవర్గ/ రాష్ట్ర ప్రజలు కూడా అంతే, కాబట్టి మమ్మల్నే గెలిపిస్తారు, వారికి ఆవు గుణాలు, వాస్తవ నిజాలు నచ్చవు కదా.

5. సింగపూర్ కి తాకట్టు పెడతాము రాజధానిని అన్నా, రాజధాని కోసం 3 పంటల భూములు కాంక్రీట్ అన్నా, ధనం వస్తే చాలు అంటారు మా వాళ్ళు. కాబట్టే, మాదే విజయం.

6. సినీ నటి ప్రత్యూషమ్మ, చావుకు న్యాయం కోసం, వాళ్ళ అమ్మ ఎన్ని కోర్టులు తిరిగింది. ఇంక అలాంటివి బోలెడు కేసులు. అలా ఏదీ తొందరగా తేలకుండా, అలా సాగదీయాలి.

7. పధకాలకు మా పేర్లు బొమ్మలు పెట్టుకున్నాము, కానీ జగనన్న లాగా, పాస్ పుస్తకాలపై, సరి హద్దు రాళ్ళపై కూడా ఫోటో ఆలోచన రాలేదు, మట్టి బుర్రలు మావి. ఈ దెబ్బ గెలిస్తే, బియ్యం గోధుమ గింజలపై, చక్కెర పలుకులపై, అలాగే కిరోసిన్ పెట్రొల్ మంచి నీటి పై కూడా బొమ్మ నిలుస్తుంది ఏమో పరిశోధన చెయ్యమని, మా పార్టీ శాస్త్రవేత్తలకు చెప్పాము.

* * *జగ్గయ్య* * * - అన్నా మంచి ఆలోచన ఇచ్చావు, అసలు పధకాలకు పేర్ల మరియు బొమ్మల జబ్బు మిమ్మల్ని చూసే నేర్చుకున్నాము. సొంత వారు బాబాయి అయినా మా వర్గమైనా వదలము కదా, ఇద్దరమూ ఒకటే.

1. కపటం నటన మీరు నేర్పిన విద్యయే, 3 రాజధానులు, అన్ని రత్నాలు. రూపాయి విదిలించు, 5 రూపాయలు లాగెయ్యి ఇది మీ పధకమే, మేము అమలు చేస్తున్నాము. అప్పు తాకట్టు అమ్మకము, ఇదే మేము చేస్తున్నది. మాది సొంత పార్టీ, మీది లాగిన పార్టీ. మీరు కొడుకుని గెలిపించలేక ఎమ్మెల్సీ గా పదవి ఇచ్చారు. మేము తమ్ముడు అవినాష్ ను ఎన్నికలలో నిలబెట్టి గెలిపించాము నాడు. రేపు అంతే. మా చెల్లి తగవుతో నీకు లాభము కన్నా, ఆ ఓటు చీలితే, నీకు నష్టమే మరువద్దు.

2. మామ పెట్టిన మందు నిషేదం, తీసి బెల్ట్ షాపులు తెచ్చింది మీరు. కాబట్టి, మేము ఆదాయం కోసం మందు ఉంచి, తక్కువ ధరలో ఇస్తే తప్పేముంది. మీరూ, రేటు పెంచి నాణ్యముగా ఇచ్చి, తాగమనే చావమనే చెపుతున్నారు గాని, మందు తాగొద్దు అని మీరు చెప్పటం లేదు, ఏ రాయి ఐతే ఏముంది, పళ్ళు రాలడానికి.

3. రామన్న పేరు తీసి చంద్రన్న పేరు మీరు బెట్టారు. మేము రాజన్న పేరు తీసి జగనన్న పేరు పెట్టాము. షేం టు షేం, ఇద్దరం విశ్వసనీయత, సిగ్గు శరం, మానం లేని వారిమే. మాట తప్పడం మడమ తిప్పడం ఇద్దరికీ అలవాటే. ఇది తప్పు, మన కుటుంబ పేర్లు వద్దు, పన్నులతో నడిచే పధకాలకు, అనే ఒక్క నీతి జాతి దమ్ము గల, అన్నము తినే సంస్కార కుటుంబము నుంచి వచ్చిన వాడు, మన 2 పార్టీలలో లేరు అని పెద్దలు అంటారు.

4. కాబట్టి, ఈ దెబ్బ గెలిస్తే, బియ్యం గోధుమ ఉప్పు పప్పు గింజలపై, చక్కెర పలుకులపై, అలాగే కిరోసిన్ పెట్రొల్ మంచి నీటి పై కూడా, మన పేరు బొమ్మ నిలుస్తుంది ఏమో పరిశోధన చెయ్యమని, మా పార్టీ శాస్త్రవేత్తలకు కూడా చెపుతాము. అలాగే మా కార్యకర్తల నుదుటి మీద, చేతి మీద, గుండెల మీద, వీపు పైన కూడా, మన బొమ్మ పేరు జెండా, పచ్చబొట్లు వేపించుకుంటేనే పధకాలు, పదవులు అంటే బాగుంటుంది ఏమో చూద్దాము. ముదుసలి తల్లి దండ్రుల అత్తామామల ద్రోహులైన మన అనుచరులు దేనికైనా సిద్దమే, మొన్న రక్తం తో తిలకం పెట్టారు మాటలు రాశారు కదా. దేవాలయాల అధికారులు, నాయకులలో సారా కాంట్రాక్టర్లు, ఇతర మతస్తులను మీరూ పెట్టారు, మేము అదే పెట్టాము. ఇద్దరమూ ఒకటే.

5. గుండె పోటుకే విలువ ఎక్కువ. పాము నక్క ల తో ప్రాణ భయం తో రోజులు చస్తూ బతికే బదులు, పులి తో తొందరగా విషయం తేలుతున్నది అని ప్రజల గట్టి నమ్మకం. మా కొడాలి నాని, మెంటల్ క్రిష్ణ పబ్లిక్ గానే బుతులు తిడతారు, పిల్లలకు నేర్పుతారు. రేపు ఆ పిల్లలే కదా, మా పార్టీ కార్యకర్తలు, వాలంటీర్లు.

6. మీరు మామ కు చేసిన గౌరవం, కనీసం తన బిడ్డలు తనకు వెన్నుపోటు పొడిచారు అని చెప్పలేని స్తితికి తెచ్చారు, పాపం టీవీ ల చుట్టూ, రోడ్లపై తిరిగారు. మేము బాబాయికి అంత దుస్తితి తీసుకు రాలేదు. ప్రశాంతముగా అంతా, ఒక రాత్రి లో అయిపోయింది. మెంటల్ సర్టిఫికేట్ లాంటి కపట నాటకాలు లేవు. ఇంకో ఎమ్మెల్యే, తన అనుచరుని, దేహాన్ని, డోర్ డెలివరి చేసారు. అంతా సింపుల్ గా ఉంటుంది.

7. మా పార్టీ వారినే మీకు కోవర్టు లు గా పంపితే, దిక్కు లేని విధముగా, వారినే మీరు తీసుకున్నారు. ప్రజలకు ఆ మాత్రం తెలీదా? అక్కడా మావాళ్ళు అయినప్పుడు, మేమే గెలవడం, కరెక్ట్ కదా? మాది తప్పుడు పాలన ఎందుకు అవుతున్నది? తప్పుడు అయితే, మా ఎమ్మెల్యేలకు మీరు ఎలా టిక్కెట్ ఇచ్చారు?

* * *చంద్రయ్య* * * - సరే చూద్దాం, ఇంకొన్ని రోజులేగా. ఒకటి మాత్రం మన ఇద్దరు కు, అలాగే మన చెంచాలకు ఇష్టం - ఆవు గుణాలు మనకు లేవు, ఆవు గుణాలను గెలిపించం, ముదుసలి అమ్మ నాన్న అత్త మామను దగ్గర ఉంచి సేవ చెయ్యం. మన పిల్లలు మనల్ని ముదుసలి తనములో ఇంట్లో పెట్టుకోరు, మన నక్క పులి పాము లక్షణాలు చూసి.

భూకంపాలు వరదలకు, ప్రజలను దానం చెయ్యమని అడుగుదాం. కానీ మన 500 కోట్ల నుంచి మాత్రం ఓ 300 కోట్లు ప్రజల సేవకు ఇవ్వం, మన ఎమ్మెల్యే ఎంపీలు అంతే.

అలాగే మన గుంటూరు ఎంపీ 4000 కోట్లతో ప్రజా సేవకు వచ్చారు ఎన్నారైగా, మన బినామీలకు అంత కన్నా ఎక్కువే ఉంది కదా. ఆయనను మాత్రం 1000 కోట్లు ఇవ్వు, రాజధానికి అలాగే ప్రజల సౌకర్యాల సేవ కు, అని మాత్రం అడగొద్దు.

ఆయన కూడా 5000 కోట్ల ఆస్తి కి ప్రజా సేవలో, వచ్చే ఎన్నికలకు పెరగాలి, మనలో ఏదో ఒక పార్టీ అభ్యర్ధిగా తన మరియు మన సేవ చేసుకోవాలి, సరేనా. ప్రజలు నోటా వాడరు, పాపము తగ్గించరు, వారి ఖర్మ.

మోదీ, యోగీ లాంటి వారిని, మనం గెలిపించం. ముందు మోదీ ని తిడతాం, తర్వాత కాళ్ళు మొక్కుతాం. ఇద్దరమూ ఒకటే. మన కేసులు, స్టేలు ఇప్పుడల్లా తేలవు, ప్రజలు అడగరు. మోదీ మనకన్నా తెలివిగా, మనలో ఎవరు గెలిస్తే వారి అండ తీసుకుంటారు, సారీ, మనమే మన కేసులకు లొంగిపోతాము, వంగిపోతాము. తెలుగు వారి ఆత్మాభిమానం అన్న మా మామ మాట, మేము ఎప్పుడో పూడ్చి పెట్టాము, కేసులు ముఖ్యం.

* * *జగ్గయ్య* * * - అలాగే అన్నా, ప్రజా సేవ అంటే అదే. ఓటుకు నోటు సారాయి బిర్యాని వర్గం అవసరం అవకాశం కు, ప్రజలు అమ్ముడుపోతారు, కూతురు లాంటి ఓటును, నక్క పులి పాము చేతిలో పెడతారు.

మనము మాత్రం రాష్ట్రం ను తాకట్టు అప్పులు అమ్మకాలతో పతనము చేస్తూ, మన ఆస్తులు మాత్రం, 100, 300, 500, 1000, 4000 వేల కోట్లు పైన పెంచుకుని, ఇతర రాష్ట్రాలు/ దేశాలలో స్తిరపడదాము. ప్రజలు నోటా వాడరు, పాపము తగ్గించరు, వారి ఖర్మ.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2129 General Articles and views 1,925,321; 104 తత్వాలు (Tatvaalu) and views 229,951
Dt : 09-May-2024, Upd Dt : 09-May-2024, Category : Politics
Views : 119 ( + More Social Media views ), Id : 2099 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Backstab , Heart , attack , Nota , success , Public , mental , weakness , family , bad , culture , Cow , Jaggaiah , Chandraiah , conversation , election , jagan , chandranna , pawan
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content