తహసీల్దార్ కార్యాలయంలో కేతిరెడ్డి తనిఖీ, మిగతా జిల్లాల ఎమ్మెల్యేలు ఎప్పుడు కదులుతారో? - Politics - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1208 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1238 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
* కేతిరెడ్డి and RDO
* సజ్జల, వేమిరెడ్డి, బాలినేని
* చీరాల, ఒంగోలు, బాపట్ల ఎమ్మెల్యే ఎంపీలు
* వార్డుల జనం వెంట కనీసం ప్రతి నెలా
* జగనన్న సలహా దారులు అయినా
* అనంత కలెక్టర్ చంద్రుడు
* తాడిపత్రి లో కోవిడ్ ఆసుపత్రి
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 2 min read time.

ఈ ఫేస్బుక్ వీడియో చూడండి, ముదిగుబ్బ మండలం (MRO) తహసీల్దార్ కార్యాలయంలో, ఎక్కువగా అవినీతి ఆరోపణలు రావడంతో, ఆకస్మిక తనిఖీ చేసిన ధర్మవరం MLA కేతిరెడ్డి and RDO.

ప్రకాశం జిల్లా లో DRO, RDO, MRO lu వాట్సాప్ ఫోన్ లు, మీడియా కు ఆపేసినా, అడిగే నాధుడు లేడు. ఇక సామాన్య జనం మాట, వీరు చక్కగా వింటారా, అర్ధం చేసుకుంటారా? పెద్దలు సజ్జల, వేమిరెడ్డి, బాలినేని గార్లు పట్టించుకోకుండా ఉన్నారు.

మా చీరాల ఎమ్మెల్యే కరణం, ఒంగోలు ఎమ్మెల్యే మంత్రి బాలినేని, బాపట్ల ఎమ్మెల్యే ఉపసభాపతి కోన, ఒంగోలు ఎంపీ మాగుంట, బాపట్ల ఎంపీ సురేష్ గార్లు కూడా,

ఇలా ఎప్పుడూ ధైర్యంగా, ప్రతి నెలా, అధికారుల దగ్గరకు వెళ్లి కూర్చుని, గట్టిగా అడిగి నిలదీసి, వివరాలు బయటకు తీసి, ప్రజలకు వెంటనే మేలు కలిగే పని చేస్తున్న వీడియో పెడతారని,

అలాగే వార్డుల జనం వెంట కనీసం ప్రతి నెలా, జగనన్న ఖ్యాతి ని పెంచే విధంగా తిరుగుతూ ఉంటే, పొగడాలని 2 ఏళ్లుగా, కళ్ళు లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నాము, అని అభిమానులు ఆవేదన చెందుతున్నారు.

కనీసం తోటి వైసీపీ ధర్మవరం ఎమ్మెల్యే ను అయినా చూసి, నేర్చుకోవాలి కదా. అన్ని విషయాలు, జగనన్న, స్పూన్ తో కలిపి నోట్లో పెట్టిన విధంగా ఎలా చెపుతారు? అనుభవం తో అర్థం చేసుకోవాలని, గుసగుసలు.

జగనన్న సలహా దారులు అయినా, అందరికీ నచ్చ చెప్పి, జనం లో అధికారులు తో తిరిగి, ఫోటోలు వీడియో లు సాక్ష్యం గా, ప్రతి వారం సమాచారం ఉంచాలి, అని అందరి అభిప్రాయం.

మేము ఎప్పుడూ, అనంతపురం జిల్లా కలెక్టర్ చంద్రుడు గారి ని, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి గారినే పొగుడుతున్నాము, ఎందుకంటే ఎన్నో ఫోటోలు లేదా వీడియోల సాక్ష్యం అక్కడ ఉంది కాబట్టి. మిగతా వారి గురించి ఎవరూ గొప్పగా చెపుతూ, సోషల్ మీడియా లింక్ లు పంపలేదు.

మరి మా నాయకులు వీధుల్లో తిరిగి, అధికారులు చే పనిచేయించి, అధికారుల సోషల్ మీడియా లో సమాచారం ఎప్పుడు పెట్టిస్తారో మరి?

జగనన్న ఈ వారంలో, అనంత తాడిపత్రి లో కోవిడ్ ఆసుపత్రి భేషుగ్గా పెట్టారు, శభాష్ చంద్రుడు గారు అని కలెక్టర్ ను పొగిడారు. మేమూ సంతోష పడ్డాము. కానీ, అంతలోనే ప్రమోషన్ ఇచ్చి, బదిలీ చేశారు, రాజకీయ శక్తుల పనితో.

ఇంక అనంత జిల్లా అభివృద్ధి కుంటుపడుతుంది ఏమో, రాజకీయ నాయకుల శక్తుల ప్రాబల్యం జోక్యం పెరిగి అని, నిజమైన జగనన్న అభిమానులు, ఆ ప్రాంత వాసులు ఆవేదన చెందుతున్నారు.

మీ ప్రాంత ఉత్తమ ప్రజా అధికారులు, ఎమ్మెల్యే, ఎంపీ ల వీడియో లు ఫోటోలు ఉంటే మాతో పంచుకోండి, వారి మంచి పదిమందికి చేరవేద్దాం. జగనన్న ప్రభుత్వం, పదికాలాలు కొనసాగేలా చూద్దాం.

రాజు ఎవరైనా, మనం వారి మంచే కోరాలి, అది ప్రజలకు క్షేమం.

చంద్రన్న, పవనన్న రాజులు అయినా, ఇదే క్షేమం సుమా.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1238 General Articles, 47 Tatvaalu
Dt : 06-Jun-2021, Upd Dt : 06-Jun-2021, Category : Politics
Views : 85 ( + More Social Media views ), Id : 1194 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : kethireddy , dharmavaram , inspects , tehsildar , prakasam , district , mla , learn , public
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content