రామోజయ్య నాణానికి 2 వైపులా- 1)ఎన్నో కంపెనీలు, ఉపాధి, సేవలు- 2)రామన్న ఎదుగుదలకు పతనానికి? - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2106 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2141 General Articles and views 2,099,840; 104 తత్వాలు (Tatvaalu) and views 237,944.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

Ramojayya 2 sides of the coin - 1) many companies, many employed, many services - 2) and is the reason for the rise and fall of Ramanna? As well as the rise and fall of the Chandranna? really?

*రామోజయ్య నాణానికి 2 వైపులా - 1) ఎన్నో కంపెనీలు, ఎంతో ఉపాధి, ఎన్నో సేవలు - 2) అలాగే రామన్న ఎదుగుదలకు అలాగే పతనానికి కారణమా? అలాగే చంద్రన్న ఎదుగుదలకు అలాగే పతనానికి? నిజమేనా?*

- మన వ్రాత నైవేద్య సేవ Our Writing Naivedya Seva. Conquer Arishadvarga Ashtavyasana, Satsang జయించు అరిషడ్వర్గ అష్టవ్యసన, సత్సంగం 5 min నిమిషాలు.

*1) నాణానికి ఒక వైపు - వెలుగు - కనపడేది - మాయా ప్రపంచం*

ఎన్నో కంపెనీలు, ఎంతో ఉపాధి, ఎన్నో సేవలు మిగతా అన్ని పత్రికలు రాసాయి, టీవీలు చూపాయి. కాబట్టి ఎక్కువ మనం చెప్పక్కర లేదు. దానిని మేమూ స్వాగతిస్తున్నాము అంగీకరిస్తున్నాము. పెద్దాయన ఆత్మకు శాంతి కలగాలి. పెద్ద వయసుకు, పెద్ద మనసుకు శిరస్సు వంచి వందనాలు.

*2) నాణానికి రెండో వైపు - చీకటి - కనపడనిది - అసలు తమో గుణం*

నీతి నిజాయితీ, సంస్కారం, స్తిరత్వం, సత్వగుణం, సజీవ గురువు సేవ గల వారు, అమాంతము ఆస్తులు సంపాదించడం, అడ్డగోలుగా పెరగడం, సామ్రాజ్యాలు స్రుష్టించడం, విన్నారా ఎక్కడైనా?

పాండవులకు ఆస్తులు పోయాయి. కౌరవులు కుట్ర కుతంత్రాలతో ఆస్తులు లాక్కున్నారు, భోగ భాగ్యాలు అనుభవించారు. రాముడు అన్ని వదలి అరణ్యాల వెంట తిరిగారు, కందమూలాలు తిని. మరి రావణుడు, అంతా వైభవమే, ఇతరులది దోచి.

జగనన్న మన చంద్రన్న ను కడుగుతారు, మీకు 2 ఎకరాల నుంచి ఇన్ని కోట్లు ఎలా వచ్చాయి? ప్రపంచమంతా విస్తరించిన, మీ బినామీ ఆస్తులు గురించి చెప్పండి? అని.

అలాగే చంద్రన్న మన జగనన్నను కడుగుతారు, మీకు ఇన్ని కోట్లు ఎలా వచ్చాయి అని, మీ బినామీ ఆస్తులు గురించి చెప్పండి? అని. అంతే గానీ, ఇద్దరు నిజాలు చెప్పరు. మనకు ఉచితాలు ఇస్తే చాలు, అని మనము.

అంటే, ఎవరిలో కూడా, నీతి నిజాయితీ సంస్కారం స్తిరత్వం సత్వ గుణం లేవు, కాబట్టే, ఆస్తులు అడ్డగోలుగా పెరుగుతాయి కదా? వందల మందికి, తమ కంపెనీల ద్వారా ఉపాధి అంతేనా, అంటే పాపం పుణ్యం అవుతుందా? చట్టం ప్రకారం అన్ని ఓకే కావచ్చు, కానీ ఆత్మ ముందు అవి చెల్లవు.

అంటే, ద్రోహం, కుట్ర, అవినీతి, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం లేనిదే ఇవి సాధ్యం కాదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం లో ఎంత మంది కొంపలు ముంచి, కోటీశ్వరులు అయ్యారో చూస్తున్నాము అన్ని పక్కలా. అది ఏ వ్యాపారము అయినా సరే. సాఫ్ట్వేర్ లో బిల్లింగ్ రేట్ల మోసం గురించి మీ పిల్లలను అడగండి. కబ్జాలు తెలుసు కదా. మందుల షాపుల్లో, పచ్చళ్ళలో, కల్తీల వ్యాపారాలలో, మోసాలు అడగండి. చిట్ ఫండ్ మోసాలు విన్నారు కదా.

మనకు తెలిసిన వారు, 10+ ఏళ్ళు సజీవ గురువు సేవ 78+ ఏళ్ళ కన్న తల్లికి చేస్తుంటే, తూలి పడే తల్లిని రోజూ ఒక మైలు 10 ఏళ్ళుగా చెయ్యిపట్టుకుని నడుపుతుంటే, కనీసం సొంత గా కొన్న చిన్న ఇల్లు లేదు, రూపాయ అప్పులేదు. 3+ ఏళ్ళు ఆదాయం లేకపోయినా, 240+ వారాలు 108 ప్రదక్షిణాలు ఉపవాసం తో ఉత్త పాదాలతో 1 గంట పావు సమయం ఉదయం 10 లోపు చేసినా, 20 ఏళ్ళు గా కష్టపడి పనిచేసినా శాఖాహారం తిన్నా నేల మీద నిద్రపోయినా, ప్రపంచం కరగలేదు కరగదు, అనుసరించదు అండగా ఉండదు, అవే త్యాగాలు చెయ్యదు, ధన లక్ష్మిని వేడలేదు, దరి చేరలేదు. సంపాదనంతా తరిగిపోతున్నది, కరిగిపోతున్నది. అయినా, సజీవ గురువు సేవ ఆగదు.

అంటే, మంచివారికి, కష్టపడేవారికి, ఆదర్శముగా ఉండే వారికి, ధన లక్ష్మి దూరము. ఎందుకంటే, వీరు అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వములో ఉండకూడదు అని.

నేటి జన్మ వాసనలను బట్టి, మరు జన్మ ఉంటుంది, కర్మ వీడదు తరతరాలు అని మనకు తెలుసు. నేడో రేపో, మన స్వార్ధ పనుల ఫలితాలు, ఈ జన్మ లేదా మరు జన్మలో స్తితిని నిర్ణయం చేస్తాయని తెలుసు.

ఒక పసి బిడ్డ రోడ్ మీద చెత్త కుప్ప పై ఉన్నాడు, ఇంకో బిడ్డ పూరి గుడిసె లో ఉన్నాడు, ఇంకో బిడ్డ మిద్దె మేడలో ఉన్నాడు. అన్నెం పున్నెం ఎరుగని, 3 పసి పిల్లలలో ఎందుకు తేడా? అది భగవంతుని శాపమా, మన పాపమా? ఎందుకో, కారణం అందరికీ తెలుసు, పూర్వ జన్మ వాసన, అదే కర్మ సిద్దాంతం, మన రజో తమో సత్వ గుణాల పుణ్య పాప ఫలితాలు.

ఆగాలి జనార్ధనయ్య, 20 కోట్లు పెట్టి వెంకన్న కు కెరీటం పెట్టారని, లేదా నిత్య భోజనానికి కోట్లు ఇచ్చారు అని, కాబట్టి ఆయన మహాత్ముడు అందామా? ఆయన కూడా, ఎంతో మందికి జీవనోపాధి కల్పించారు. ఆయనకు తెలుపు, నలుపు ఉన్నాయి కదా? కానీ ప్రభుత్వం ఎందుకు ఏడాది పైగా జైలు లో పెట్టింది? ఇప్పుడు బయట దర్జాగా ఉన్నారు. ఆ పాప 20 కోట్ల కిరీటం కన్నా, 20 రూపాయల ఒక బీదవాని ధనం విలువ ఎక్కువ దైవానికి, సత్వ గుణానికి.

స్టువార్ట్ పురం టైగర్ నాగేశ్వరయ్య, ఎంతో మంది పేదలకు అన్నం పెట్టి అండగా ఉన్నారు, సినిమా చూసాము. కాబట్టి ఆయన మహాత్ముడు అందామా? మరి ఎందుకు పోలీసులు వెంటపడి, పతనం చేసారు? పోనీ వెనుకబడిన వారు, అని వదిలేసారా?

చాలా మంది రౌడీలు, నాయకులు, వినాయకులు, ఎంతో మందికి జీవనోపాధి కల్పిస్తున్నారు, వారి స్తాయిని బట్టి.

అంటే, పైన మంచి పనులు చేస్తే, పలుకుబడితో తప్పించుకోలేరా? అందుకే దొరికిన వాడే దొంగ, దొరకని వాడు ఎల్లప్పుడూ దొర, అది మన కపట నటన 2 నాల్కల ధోరణి ప్రాపంచిక వ్యామోహ సమాజం లో. నాయకుల అండ ఉంటే, మనము ఏది చేసినా, చెల్లుబాటు అవుతుంది.

అందుకే ఒక బిడ్డను మధ్య లోనే పోగొట్టుకున్నారు, పాప ఫలితముగా అని జనాలు అంటారు. కానీ వీరి ఆటలు, పరమాత్మ అలాగే పంచభూతాల ముందు కాదు సుమీ. రేపు మిగతా సామ్రాజ్యం ఎలా నడపబోతున్నారో, మీరే చూడగలరు.

జగనన్న లాంటి వారి దెబ్బకు, ఆసుపత్రిలో మంచం ఎక్కారు, అరెస్ట్ తప్పించుకోవడానికి, ఈ ముదుసలి వయసులో. ఇంకోకాయన, పోయాక ఇంక కేసు ఎందుకు లే అని, ఇప్పుడు కేసు వెనక్కి తీసుకుంటున్నారు, అంటే అర్ధం బతికి ఉంటే కేసు కొనసాగేదే కదా? అదే తప్పుల తడక అనే కదా? బతికినంత కాలం, పలుకుబడితో నెట్టుకు వచ్చారు. రేపు ఇంకొకరు వచ్చి అంతా బయటకు తీయరా? లేదా వీరి నుంచి వారు దోచరా? అంటున్నారు ప్రజలు.

రామన్న పతనానికి, కారణం ఎవరు? చంద్రన్న వెన్నుపోటుకు, అసలు మూల కారణం ఎవరు? తెలుసా? ఒక్క మీడియా చెప్పిందా ఈ 3 రోజుల్లో? ఇదేనా జర్నలిజం అబద్దాల ప్రపంచం? మన పిల్లలకు మనం నేర్పే సంస్కారం ఇదేనా? మాయా ప్రపంచం అంటే అర్ధం అయ్యిందా? మనం వినేది చూసేది అంతా అబద్దం. ఒప్పుకుంటావా?

తెలుగు మీడియా అంతా, నిన్న మొన్న అబద్దాలు చూసారు కదా, రామోజయ్య గురించి, నాణానికి ఒక వైపే చెపుతున్నారు, కానీ 2 వ వైపు నలుపు చెప్పడం లేదు, అవి ఎలా వచ్చాయో ఏ ధర్మ మార్గం లో, శ్రమించి వచ్చాయో, చెప్పడం లేదు.

రామన్న పతనానికి కారణం ఎవరు? చంద్రన్న వెన్నుపోటుకు ధైర్యం ఇచ్చి ఊతం ఇచ్చిన, అసలు మూల కారణం ఎవరు?

చంద్రన్న అమాయకుడు, తాను సొంతగా ఏమీ చేయలేడు, స్వార్ధంతో వెనుక రెచ్చగొట్టి నడిపించింది ఎవరు? ఆ క్రుతజ్ఞత గా, చంద్రన్న మొన్న రామోజయ్య పాడె కూడా మోసారు. తనను ఇంకొకరిని పతనం చేసి, ఆ పదవిలో తనను కూర్చోబెట్టిన సేవకు ఫలితం చేసారు.

విలేఖరులుగా ప్రభుత్వ పరముగా, చంద్రన్న ను వెన్నుపోటు పొడిచారు అంటాం కానీ, ఆయన కాదు అసలు దోషి. ఆయన 2 వ దోషి మాత్రమే. అసలు మొదటి దోషి ఎవరు? తన స్వార్ధానికి, ఒక మహా నాయకుడిని పతనం చేసింది ఎవరు? ఆ నాయకుడు ఉంటే, తెలుగు రాష్ట్రాలు విడిపోయి, ఇంత అప్పుల పాలు అయ్యేవా?

మాయా ప్రపంచం అంటే అర్ధం అయ్యిందా? మనం వినేది చూసేది అంతా అబద్దం.

చక్కగా సినిమాలు చేసుకుని, నటీ నటులతో తన సొంత ప్రపంచములో మహారాజుగా సరదాగా ఉండే, రామన్నను, రాజకీయల ఉచ్చులోకి రెచ్చకొట్టి లాగింది, రామోజయ్య మరియు మొత్తం 4 గురు అంటారు. అమాయకముగా, రామోజయ్య మాయలో చిక్కుకున్నారు.

కేంద్రాన్ని, ఇందిరవ్వను ఓడించాలి రాష్ట్రం లో అంటే, నువ్వే తగిన ఘనుడివి అని చెప్పారు. ఎందుకు అలా? తన సామ్రాజ్యం ఎదగాలి అంటే, ఇతరులను తొక్కాలి అంటే, తనకు రాజకీయ పలుకుబడి ఉండాలి. తన వర్గం టాప్ హీరో అయిన రామన్న బెస్ట్, తేలికగా గెలుస్తారు. తన దగ్గర పేపర్తో టీవీతో ఉన్నవి లేనివి రాసి చెప్పి, ఆకాశానికి ఎత్తేస్తాను, పేదల పెన్నిధి అని. ఎటూ సినిమా మత్తు ఉన్నది, వస్తే కోట్లు పోతే రామన్నకు సినిమాలు. ఈయన అండతో, కేంద్రం అనుమతులు కూడా తేలిక అని చాలా పెద్ద స్కెచ్ వేసారు అని పెద్దలు అంటారు.

వ్యాపారస్తుడికి, ఇతరుల మీద ప్రేమ అభిమానాలు దయ దాక్షిణ్యం ఉండవు. తన స్వార్ధం ఎదుగుదలనే అవసరాలు అవకాశాలు మాత్రమే ముఖ్యం. దానికోసం ఇతరులను పైకి తెస్తారు, అవసరం తీరగానే, కూలదోస్తారు.

కోడి పుంజుకు రోజూ జీడిపప్పు పెట్టి పెంచుతున్నారు, రావు గోపాలరావు సినిమాలో, కోడి చాలా సంతోషం, తనను సొంత బిడ్డగా సాకుతున్నారు అని. అలాగే ఇంకో ఆయన, మేకను పెంచుతున్నారు, అదీ తనను సాకుతున్నారు అనుకున్నది. కానీ అవి తమ భోజనానికి అని, ఏదో ఒక రోజు మూడుతుంది అని, అవి ఏనాడు గ్రహించవు, పిచ్చి మాయలో మోహంలో ఉండి.

రామన్న ను అడ్డుపెట్టుకుని అన్ని రంగాలలో ఆరితేరారు, ఎంతో మందిని తొక్కారు, కాల రాసారు, రామన్న 2 వ పెళ్ళి వరకు, బంధువులు ప్రాణ స్నేహితులుగా. మన స్టేటస్ లో ఫొటో సాక్ష్యం చూసారా, రామన్న రామోజయ్య ల తో రామన్న తండ్రి. పాపం రామన్న నమ్మారు, అన్ని సహాయాలు చేసారు, ప్రతి గా ఆనాడు పేపర్ టీవీ తోడు ఇచ్చారు ఎన్నో ఎన్నికలలో. ఇచ్చి పుచ్చుకున్నారు, తమ సామ్రాజ్యాలు పెంచారు, చక్రవర్తులు అయ్యారు. ఇంకో మీడియా పోటీ లేదు ఆనాడు.

ఎప్పుడైతే, లక్ష్మమ్మ వచ్చిందో, ఇంక కన్ను కుట్టింది. రామోజయ్య ఆటలు సాగడం లేదు. అన్నిటికీ, లక్ష్మమ్మ అంటే భార్య కు చెప్పండి, అనుమతి తీసుకోండి అంటున్నారు, అది తలకొట్టేసినట్లు అయ్యింది, రామోజయ్యకు అలాగే ఇతర నాయకులకు. ఇటు ఇంట్లో చంద్రన్న ఆటలు సాగడం లేదు. ఇద్దరు కలిసారు, గోడు వెళ్ళబోసుకున్నారు. ఇంట్లో వారిని రెచ్చగొట్టారు, ముందుకు నెట్టారు. తమ రాక్షస తమో గుణ ఆలోచనలకు పదును పెట్టారు.

రామన్న స్నేహితునిగా, రామన్న సహాయం పొందిన వానిగా ఏమి చెప్పాలి, క్రుతజ్ఞత విశ్వసనీయత, తల్లి దండ్రుల సంస్కార పెంపకం, కడుపుకు అన్నం తింటూ ఉంటే? రామన్న పతనములో నేను చెయ్యి పెట్టను, దేవుడు క్షమించడు, నా పిల్లలు కూడా ఈ ఫలితాలు అనుభవించాలి, వచ్చే జన్మలో నాకు తిండి కూడా దొరకదు, అని దండం పెట్టి పంపాలి. కానీ అలా మంచి చెప్పి పంపలేదు.

రామన్న ను కూల్చడానికి, రంగం సిద్దం అయ్యింది. పేపర్లో, రామన్న కు పిచ్చి చపలం తను ఇక పాలించలేడు జన సమీకరణ చెయ్యలేరు ఇతరులతో సరిగ్గ ఉండలేరు పెళ్ళాం చేతిలో కీలుబొమ్మ అని హోరెత్తించారు. ఫోటో పెద్దగా చేసి చూడండి. రామన్నను తీవ్రముగా అవమానించారు, మానసిక క్షోబకు గురి చేసారు, మానసిక బలహీనుడిని చేసారు, చేతగాని వాడిగా, తెలుగు జాతి అలాగే ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టారు. నరకం చూపించారు. అప్పుడు అర్ధం అయ్యింది, రామన్నకు, తన ఇన్నాళ్ళ పాపాల ఫలితాలు ఇప్పుడు ఈ రూపములో తనను పతనం చేస్తున్నాయి అని.

చంద్రన్న కు అండగా నిలిచారు, మామను కూల్చడానికి అంతా రెడీ. అందరూ ఎమ్మెల్యేలు చంద్రన్న తో ఉన్నారు, అని అబద్దాలు పుంఖాను పుంఖాలు గా ప్రచారం చేసారు, బెదిరించారు, ధన పదవుల ఆశలు చూపారు. అది నిజమని నమ్మి, ఎమ్మెల్యేలు ఎక్కువ మంది చంద్రన్న వైపు దూకారు. రామన్న ఒంటరి అయ్యారు, కుమిలి పోయారు, రామోజయ్య మోసానికి ద్రోహానికి. కానీ తనని ఏమీ అనలేరు పబ్లిక్ గా, తన లోపాలు మోసాలు అన్ని రామోజయ్య చేతిలో ఉన్నాయి. ఇంట్లో పిల్లలను అనలేరు, ద్రుతరాష్ట్ర వ్యామోహం. కేవలం బయట అల్లుడుని మాత్రం అన్నారు ఉక్రోషం పదవి వ్యామోహం భార్య చేతిలో బాధ భరించలేక, టీవీలు పేపర్ల చుట్టూ తిరిగి ఆవేదన చెందుతూ.

చంద్రన్న ను పైకి తెచ్చారు, రామన్న ను కూల తోసి. ఆ అవమానం భరించలేక, బయటకు చెప్పుకోలేక, కుళ్ళి కుళ్ళి, రామన్న పతనం చెందారు. ఆప్పటి దాకా, రామన్న ఉప్పు తిన్నవారు, నిస్సిగ్గుగా తమ కుటుంబ కుసంస్కార పెంపకాన్ని లోకాని చాటుతూ, చంద్రన్న మోచేతి నీరు తాగడం, పాదాలు వత్తడం, మొదలు పెట్టారు.

చంద్రన్న తో తన సామ్రాజ్యాలు పెంచారు రామోజయ్య, ఎన్నో తొక్కుకుంటూ, స్టూడియోలు, ఇంకా ఎన్నో ఎన్నో సామ్రాజ్యాలు వ్యాపారాలు పెంచారు. చంద్రన్న గుట్టు కూడా రామోజయ్య చేతిలో ఉంది. ప్రభుత్వాలను శాసించే స్తాయికి రామన్న సమయములో నే వెళ్ళారు. సూపర్ స్టార్ క్రిష్ణయ్య తీసిన రాజకీయ సినిమాలలో ఇవి మీరు చూడవచ్చు, కొన్ని భాగాలు. రామన్న ఎప్పుడూ, క్రిష్ణయ్యను ఏమీ అనలేదు.

రామోజయ్య పత్రికా టీవీ సామ్రాజ్యం ఉంది అండగా అని, చంద్రన్న ఎన్నో పాప క్రుత్యాలు చేసారు. వంగవీటి పతనం చేసారు. ఎన్నో సార్లు ఓడిపోయారు, జగనన్న చేతిలో, ప్రతి ఎలక్షన్ లో ఈ 5 ఏళ్ళలో. ఇక తన వల్ల కాదు అని వగస్తూ ఉంటే, జైలు లో ఉండి, పవన్ తన త్యాగముతో చంద్రన్న కు జీవితం, అధికారం, సంతోషం మనశ్శాంతి ఇచ్చారు, కేంద్రం సహాయం తీసుకుని.

ఇలా ఎన్నో ఎన్నో చీకటి కధలు ఉన్నాయి మిత్రమా. ఇప్పుడు చెప్పు 10 మందిని తొక్కి లేదా కుట్రలతో మోసాలతో అప్పులతో రాజ్యాన్ని సామ్రాజ్యాన్ని పెంచి, 10 మందికి అన్నం పెడితే అది దైవం మెచ్చుతుందా? ఆ అన్నం తిన్నవారికి కూడా, తమో గుణం వస్తుంది. నీతి అర్ధం కాదు. అందుకే, 75 శాతం, పాపం రోజు రోజుకూ పెరిగిపోతున్నది. ప్రక్రుతి విలయాలు పెరుగుతున్నాయి.

లేదా, నీతి నియమాలతో, సత్వ గుణం సేవ త్యాగం తో, ఉన్న సత్వ గుణ రూపాయితో, కనీసం ఇంట్లో భాగస్వామి, గుణ పిల్లలు, ముదుసలి తల్లి దండ్రులకు అన్నం పెడితే పుణ్యం వస్తుందా?

నిర్ణయం మీదే, అవే ఫలితాలు మీకు నేడో రేపో వచ్చే జన్మలోనో, సత్వ రజో తమో గుణాలను బట్టి.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2141 General Articles and views 2,099,840; 104 తత్వాలు (Tatvaalu) and views 237,944
Dt : 11-Jun-2024, Upd Dt : 11-Jun-2024, Category : Politics
Views : 167 ( + More Social Media views ), Id : 2113 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Ramojayya , coin , companies , employed , services , reason , rise , fall , Ramanna , Chandranna
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content