ఒక్క మీడియా చెప్పిందా ఈ 3 రోజుల్లో? ఇదేనా జర్నలిజం అబద్దాల ప్రపంచం? మనం వినేది చూసేది అబద్దం. - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2106 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2141 General Articles and views 2,100,028; 104 తత్వాలు (Tatvaalu) and views 237,952.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

Did the media say anything in these 3 days? Is this the world of journalism lies? Everything we hear and see is a lie. ఒక్క మీడియా చెప్పిందా ఈ 3 రోజుల్లో? ఇదేనా జర్నలిజం అబద్దాల ప్రపంచం? మనం వినేది చూసేది అంతా అబద్దం.

*3 praises, 7 scolds, because their upbringing is hindered. Who is the cause of Ramanna's downfall? Who is the root cause of Chandrannas backstab? Do you know? Did the media say anything in these 3 days? Is this the world of journalism lies? Is this the culture we teach our children? Maya world made sense? Everything we hear and see is a lie. Do you agree?*

*3 పొగుడుతారు, 7 తిడతారు, ఎందుకంటే వారి పెంపక సంస్కారం అడ్డుపడుతుంది. రామన్న పతనానికి, కారణం ఎవరు? చంద్రన్న వెన్నుపోటుకు, అసలు మూల కారణం ఎవరు? తెలుసా? ఒక్క మీడియా చెప్పిందా ఈ 3 రోజుల్లో? ఇదేనా జర్నలిజం అబద్దాల ప్రపంచం? మన పిల్లలకు మనం నేర్పే సంస్కారం ఇదేనా? మాయా ప్రపంచం అంటే అర్ధం అయ్యిందా? మనం వినేది చూసేది అంతా అబద్దం. ఒప్పుకుంటావా?*

నైతిక జర్నలిజం పునాది యొక్క ఐదు విలువలు - ఖచ్చితత్వం, స్వాతంత్ర్యం, నిష్పాక్షికత, మానవత్వం మరియు జవాబుదారీతనం. ఈ విలువలు ఉన్నాయా బులుగు, పసుపు మీడియాలో, నాయకులలో? కనీసం మన ఇంట్లో ఉన్నాయా?

లేదు మిత్రమా, మమ్మల్ని పొగడటం వలన లేదా తెగడటం వలన, రూపాయి ఉపయోగం మీకు లేదు. 3 పొగుడుతారు, 7 తిడతారు, ఎందుకంటే వారి పెంపక సంస్కారం అడ్డుపడుతుంది.

మన వర్గం/ సర్కిల్/ ప్రాంతము లో ఒక చవట/ సన్నాసి కూడా లేడు ఇవి చేసి, మానసిక బలం నియంత్రణ ఉంది అని సాక్ష్యం చూపడానికి, అన్ని అందుబాటులో ఉండి మంచి విందు చిందు పొందు కు దూరముగా ఉండటమే గాక, సజీవ గురువు సేవ సామాజిక సేవ మన సొంత ఖర్చుతో గంటల సమయంతో లేరు, కానీ ఏ ఇంట చూసినా బట్టనెత్తి బానకడుపు రోగాలు తాగుబోతు తిరుగుబోతు అప్పుబోతు చెడు అలవాట్లు తప్ప అని వారి బాధ.

ఉత్త పాదాల నడక ఎవరైనా నడవవచ్చు కదా, అది ఆక్యుపంచరు అంటారు. శాఖాహారం, నేల చాప నిద్ర, పాటలు పద్యాలు శ్లోకాలు, తెలుగు కధనాలు రాయడం, 10 మంది బాధలు విని మనశ్శాంతి ఇవ్వడం, నిస్వార్ధ సామాజిక సేవ, సజీవ గురువు సేవ, మానసిక నియంత్రణ, ఆరోగ్యం విషయం లో, మంచి విషయాలు లో తప్పక పోటీ, పోలిక ఉండాలి. మిత్రమా.

ఆసుపత్రి కి/ రోగానికి, దూరంగా మనందరం ఉండాలి కదా, ధర్మం తో సంపాదించింది, సత్వ గుణ పిల్లలకు ఇవ్వాలి కదా, మన రోగానికే/ విడాకుల కేసులకే/ అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం కే, ఆస్తులు అమ్మితే? మన భాగస్వామి/ పిల్లలు, మనల్ని రోడ్ కు నెడితే? ఎవరూ లేని వాడు అనాధే, కానీ అన్నీ ఉండి అందరూ ఉండి వదిలేసినవారు, జీవితం వ్యర్ధం చేసుకున్న అనాధలు కారా?

ఈ తిట్టే లేదా గమ్ముగా ఉండే చేతి నరాలు పని చేయని వారు, వారి సొంత ముదుసలి తల్లి దండ్రికి ఇంట్లో పెట్టి ఎటూ ముద్ద వేయరు, సమాన సౌకర్యాలు ఇవ్వరు. వారి పిల్లలు వారిని ముదుసలి వయసులో చూస్తారు ఇంట్లో ఉంచి అని కూడా గట్టిగా చెప్పలేరు. అందుకే మన శని వార సాధనలు, మనల్ని మనం తెలుసుకుందాం అని.

నిన్న కధనం చూసాము కదా, 40+ ఏళ్ళ భాగస్వామి అడుగుతున్నది, రోగం వచ్చిన వాడిని, సంపాదనకు పనికిరాని వాడిని, ఇన్ని రోజులు తాను నేర్పిన వంకర తప్పుడు బుద్దులతో, ఇంకా వారి అమ్మ ఊరికి పంపకుండా, తన్ని తగలేయకుండా, ఇంత ముద్ద వేస్తున్నా మాతో ఇంట్లో పెట్టి, మేము తప్పుడు వారిమా అంటే? మన జవాబు ఏమిటి?

తప్పుడు అంటే, సరే మేము తప్పుడు వారిమే కదా అని, ఇంక తనను ఊరికి పంపుతా, అంటే, ఇంక వదిలేయడమే. లేదు కరెక్టే ఆ మాత్రం దయ ఉంది అని ఒప్పుకోవాల్సి వచ్చింది, ఆ అబ్బాయి క్షేమం కోసం. ధర్మం చెప్పడం చాలా కష్టం, వారికి పంచభూతాల శిక్షణ మొదలు అయినప్పుడు. అందుకే మిమ్మల్ని 20 ఏళ్ళుగా దండం పెట్టి బతిమాలేది, మనల్ని మనం తెలుసుకుందాం, సరి చేసుకుందాం, పంచభూతాల శిక్షణ తప్పించుకుందాం.

మీ జవాబు ఎప్పుడూ, నిజమే, మా ఇంట్లో మేము లేదా మా భాగస్వామి లేదా మా పిల్లలు అలాంటి మానసిక బలం కలిగి ఉన్నారు. ఇదిగో మా సోషల్ మీడియాలో గత ఏడాది పైన ఉన్న పొస్టులు ప్రతి వారం లేదా మీకు ఏడాదిగా పంపాము ప్రతి వారం అని మనము కూడా, దైవ భక్తునిగా చిత్త శుద్ది తో పంపాలి, జవాబు చెప్పాలి. సాధనకు ప్రతి సాధన, నమస్కారానికి ప్రతి నమస్కారం. సంస్కారానికి, ప్రతి సంస్కారం.

లేదా మా కుటుంబాం లో, అలాంటి మానసిక నియంత్రణ తప్పుడు పనులు మేము చెయ్యం. మాది పూర్తి గా అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం. మా పిల్లలు బలహీనులు, కాలేజీలో/ ఉద్యోగములో, హీరోయిన్ హీరో ల లాంటి వారి తో, షాపింగ్ కి వెళతారు, చెడిపోతారు. మమల్ని ముదుసలి తనములో చూడరు అని నిజాయితీగా, మన గురించి మనమే ఒప్పుకోవాలి. ఇతరులు ఎవరూ మనకు చెప్పక్కరలేదు. మనం బుకాయించినా, దాచిపెట్టినా, కాలం ఎటూ బయటపెడుతుంది కదా.

నమ్మరా? రామన్న, రాజన్న, సావిత్రమ్మ, జయలలితమ్మ, కోడెలయ్య, శ్రీదేవమ్మ‌‌‌, కాఫీడేఅయ్య, మాల్యయ్య, సింఘానియయ్య, మీ ఇంట్లో మా ఇంట్లో, లాంటి మహానుభావుల చివరి పేజీలు చదవండి.

లేదా చివరలో రామన్న లాగా, ఇన్ని కోట్లు ఇచ్చినా, నా పిల్లలు నిర్దాక్షిణ్యముగా నన్ను వదిలేశారు, కాషాయం కట్టినా 60+ ఏళ్ళు వచ్చినా, ఇతరుల భార్యకు విడాకులు ఇప్పించి, అవతలి ముదుసలి భర్తకు ఉన్న ఆసరా తోడు లాగేసి, నేను మాత్రం సగం వయసు ఆమెతో సేవలు చేయించుకుంటాను, సంసారం చేస్తాను అంటే, అహంకారముతో ఏమి జరుగుతుంది? పతనము, వెన్నుపోటు కాదా?

యుగపురుషుడు అని మనము అబద్దాలతో బతికితే, ప్రచారం చేస్తే, నిజాలు దాచిపెడితే, మన పిల్లలు అదే అబద్దాల మాయలో పడి, నాశనం కారా? అది జర్నలిజం అవుతుందా?

అలాంటి పెద్ద మనిషికే, వెన్నుపోటు పొడిచిన ఘనుడు మనకు నాయకుడు అంటే, మనము ఎంత దిగజారి పోయాము, ఆలోచన చెయ్యండి. పంచభూతాలు క్షమిస్తాయా? రేపు వరదలు/ వానలు/ ఎండలు/ భూకంపాలు/ ప్రమాదాలు ఆక్సిడెంటులు/ త్సునామీ/ కరవు/ అధిక ధరలు పన్నులు/ మోసాలు/ ద్రోహాలు/ అనాధ శరణాలయాలు/ వితంతువులు/ దివ్యాంగులు/ ఒంటరి బతుకులు/ రోగాలు, వీటికి మనము బాధ్యులం కాదా? మనుషుల మాటలు విననప్పుడు, పంచభూతాలు వాటి పని అవి చెయ్యాలి కదా?

ఆవును ఎన్నుకునే, మానసిక బలం మనకు లేదా? మీరే గా జవాబు చెప్పారు, 3 ఏళ్ళ క్రితం, బిక్కు బిక్కుమంటు ఎప్పుడు ఎటువైపు నుంచి వచ్చి చంపుతుందో తెలియని నక్క పాము కన్నా నేరుగా చెప్పి అరచి చంపే పులే నయ్యం అని?

పిల్లలు మానసిక బలం ఎలా పెరుగుతుంది? వారికి నిజాలు చెప్పాలి, సినిమా రాజకీయ ప్రపంచాన్ని జయించినా, తన మనసును అంటే తనను తాను జయించలేక, రామన్న లాంటి డక్కా ముక్కీలు తిన్న వారే, 60+ ఏళ్ళకు పిల్లి మొగ్గలు వేసారు మానసిక బలహీనతతో, పతనము అయ్యారు అని నిజాలు చెప్పాలి.

తెలుగు మీడియా అంతా, నిన్న మొన్న అబద్దాలు చూసారు కదా, రామోజయ్య గురించి, నాణానికి ఒక వైపే చెపుతున్నారు, దానిని మేమూ స్వాగతిస్తున్నాము అంగీకరిస్తున్నాము, ఎంతో మందికి జీవనోపాధి అని. కానీ 2 వ వైపు నలుపు చెప్పడం లేదు, అవి ఎలా వచ్చాయో ఏ ధర్మ మార్గం లో శ్రమించి వచ్చాయో చెప్పడం లేదు.

రామన్న పతనానికి కారణం ఎవరు? చంద్రన్న వెన్నుపోటుకు ధీర్యం ఇచ్చి ఊతం ఇచ్చిన, అసలు మూల కారణం ఎవరు? అది మనము త్వరలో చెపుదాము.

చంద్రన్న అమాయకుడు, తాను సొంతగా ఏమీ చేయలేడు, వెనుక రెచ్చగొట్టి నడిపించింది ఎవరు?

విలేఖరులుగా ప్రభుత్వ పరముగా, చంద్రన్న ను వెన్నుపోటు పొడిచారు అంటాం కానీ, ఆయన కాదు అసలు దోషి. ఆయన 2 వ దోషి మాత్రమే. అసలు మొదటి దోషి ఎవరు? తన స్వార్ధానికి, ఒక మహా నాయకుడిని పతనం చేసింది ఎవరు? ఆ నాయకుడు ఉంటే, తెలుగు రాష్ట్రాలు విడిపోయి, ఇంత అప్పుల పాలు అయ్యేవా?

మాయా ప్రపంచం అంటే అర్ధం అయ్యిందా? మనం వినేది చూసేది అంతా అబద్దం.

* * *

రామన్న అభిమానులం అని, నాలికపై ఉత్తినే, చెప్పుకోవడం కు సిగ్గు లేదూ? కోపం ఎవరి మీద రావాలి, రామన్న ను పతనం చేసిన వారి మీదనా? లేదా నిజాలు రాసిన గుర్తు చేసిన వారి మీదనా?

ఇదేనా మీ తల్లి దండ్రులు నేర్పిన సంస్కారం? ఇదేనా మీ ఇంట్లో భాగస్వామి, పిల్లల కు నేర్పుతున్న మంచి బుద్దులు? కనీసం తెలుగు లో మమ్మల్ని తిడుతూ రాయలేవా ఇదేనా సంస్కారం, మీ కన్న తల్లి పాలకు కి కృతజ్ఞతలు? 5 ఏళ్లుగా?

ఇదేనా మీ చిత్తశుద్ది దైవ పూజ? ఇదేనా గురువు సేవ? ఇదేనా సామజిక బాధ్యత? ఇదేనా ఆత్మ జ్ఞానం? నిజం చెప్పిన వారిని నోరు మూయించు, దూరంగా పెట్టు. అందరికీ తెలిసిన, నిజాన్ని ఒప్పుకునే ధైర్యం మీ వంశం లో లేదా? ఇదేనా మన మానసిక బలం, నియంత్రణ?

మీకన్నా పెద్ద నాయకులు కు వెళుతున్నాయి, వారు సైతం నిజం కాబట్టి గమ్ముగా ఉన్నారు, బులుగు పసుపు ను సమానంగా శుద్ధి కాబట్టి.

రేపు మన ఇంట్లో, అదే వెన్నుపోటు, మనం, మన భాగస్వామి, మన పిల్లలు భరించగలరా?

అవసర అవకాశ వాదులం అను. ఆత్మ జ్ఞానం ఇప్పుడు అయినా నేర్చుకోవాలి. రజో తమో గుణ దాసులు గా ఒప్పుకో, బ్లాక్ చేయి ప్రస్తుతం కు, ఇబ్బంది లేదు.

మా అందరి బిడ్డల క్షేమం మేము కోరాలి, కాబట్టి పంపాలి, మీరు తూ ఛీ అన్నా పలకకపోయినా. ఈ మా సందేశాలు, ప్రతినిత్యం మీ మనసు, అరిషడ్వర్గం కు దూరంగా ఉండేలా చేసి, పంచభూత శిక్షణ నుంచి కాపాడతాయని, మా ఆశ.

మా కన్నా మీ క్షేమం కోరేవారు, మీ వంశం లోనే లేరు. మీకు పంచభూతాల శిక్షణ అయిన తర్వాత నే, మానసిక శుద్ది జరిగిన తర్వాతనే, అన్ బ్లాక్ చెయ్యి, తిరిగి పలకరించు. మా మనసు స్వచ్చం, మీ మనసు కలత లో ఉంటే, మీ ఇష్టం.

రేపు మీ ఇంట్లో మీ పతనం రోజున, ఆ మీ మంచి గోడు వినేవాడూ ఉండడు, ఎందుకంటే మంచిని వాస్తవాన్ని సమర్ధన చేయను అన్నావు, రేపు మీకు వచ్చే ఫలితము అదే కదా? మీ కర్మ ఫలం మీ వెంట పడుతుంది కదా? రామన్న, రండి తమ్ముళ్ళు రండి తమ్ముళ్ళు అంటే, ఒక్క కడుపుకు అన్నం తినే వారు వచ్చారా, అన్ని ఏళ్ళు ఆయనను వాడుకుని? మీకు ఫలితం అదే కావాలా?

బీజేపీ, తెదేపా, వైకాపా, జనసేన, కాంగ్రెస్స్ మా బిడ్డలు. సమాన గౌరవం, సమానంగా తలంటడం. ఎందుకంటే వారు అలాగే మీరు పంచభూత శిక్షణ కు పోకూడదు. కలకాలం చల్లగా ఉండాలి, మాకు అండగా, అంటే ధర్మం కు అండగా, దైవం కు అండగా, అంటే మీ ముదుసలి తల్లి తండ్రులు అత్త మామలకు కు అండగా ఇంట్లో పెట్టి సమాన గౌరవం వైద్యం ఇప్పిస్తూ. ఇది విదేశ్శాల్లో ఉన్న మన ఎన్నారై మిత్రులకు కూడా కదా.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2141 General Articles and views 2,100,028; 104 తత్వాలు (Tatvaalu) and views 237,952
Dt : 10-Jun-2024, Upd Dt : 10-Jun-2024, Category : General
Views : 113 ( + More Social Media views ), Id : 2111 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : media , anything , 3 days , world , journalism , lies , everything , hear , double , standard , unethical
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content