ఉడుత కే తెగిన కరెంట్ తీగ - హెచ్చిన జంతు ఆగడాలు, చర్యలకై ఆదేశాలు, జంతు నిరసన, ఓటర్ల ఆలోచన - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,863,211; 104 తత్వాలు (Tatvaalu) and views 224,650.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

తేనెటీగల వల్ల రథం తగలబడటం, ఎలుకలు మందు తాగడం, కుక్కలు తరిమితే భయపడి కోర్టులో కేసు ఆధారాలు ఎత్తుకుపోవడం, ఉడత వల్ల హై టెన్షన్ వైర్ తెగడం వంటివన్నీ, ఎన్నో చిత్ర విచిత్ర సంఘటనలు జరుగుతున్నాయి, దేవుని పాలనలో అంటున్నారు, ఆలోచన లేని అధికార మరియు ప్రతిపక్ష అనుచర భక్తులు.

గత 20 ఏళ్ళు గా వివిధ రూపాలలో, ఇలాంటి విచిత్రాలు ఉన్నాయి. కానీ వారు అధికారం లో ఉండగా వీరు, వీరు అధికారం లో ఉండగా వారు ఎత్తి చూపుకుని, మన ఓటర్ల లోని 2 నాలకలు 2 మాటల ఉత్తమ వంకర లక్షణాలను గుర్తు చేస్తున్నారు.

యధా ప్రజా తధా రాజా అన్నది అందుకే, చేసుకున్న వారికి చేసుకున్నంత. ప్రజలు తప్పుడు వారైతే, అధికారులు నాయకులు వారినుంచే వచ్చారు కాబట్టి, ముందు తప్పు పట్టాల్సింది ప్రజలనే కదా?

అందుకే అధికారులు, నాయకులది ముందు తప్పు కాదు, ప్రజలమైన మనదే మొదటి తప్పు అని మా నినాదం అని మీకు తెలుసు. మన కుక్క తోక వంకరే, దానిని సరి చేయనిదే, మన వ్యవస్థలు బాగుపడవు, మనల్ని కాపాడవు.

కోతులు సాక్ష్యాలను ఎత్తుకెళ్లడం, భూమి ఒక్క రాత్రి లో 11 వేల లీటర్ల డీజిల్ తాగడం, వెండి సింహాలు వాటంతట అవే ఎక్కడికో వెళ్లిపోవడం, ఉద్యోగుల ధనం ఎకౌంటు లో మాయం, ఇలాంటి వన్నీ మనలాంటి ఉత్తముల దగ్గరనే జరుగుతాయి అంటున్నారు. జుట్టు పీక్కుంటూ, మన మూర్ఖపు ఓటే, మనల్ని బలి తీసుకుంటుందా అని, వాపోతున్నారు.

పెనం లో నుంచి, పొయ్యిలో పడ్డామా అని గిల్లి చూసుకుంటున్నారు. పాము ను వదిలించుకుని, పులి చేతిలో పడ్డామా? మరలా పాము కాటుకు వెళదామా? లేక పులి చేతిలో ఆహారం అవుదామా? లేక కొత్త ఆవును ఎన్నుకుందామా? అని తీవ్ర ఆలోచన.

ఎందుకంటే మనం నీతి నిజాయితీ గల వాళ్ళం, అలాంటి పాము పులి వారినే 20 ఏళ్ళుగా, కుటుంబ బానిసత్వం తో విచక్షణ మరచి ఎన్నుకున్నాం, కొత్తవారిని కాలదన్నాము. పాత నీరు పోయి, కొత్త యువ నీరు వస్తేనే, బతుకుల్లో ఆశ వస్తుంది అని అందరికీ తెలుసు, కానీ మోహము మూర్ఖం మంచి చేయనీయదు. ఇలాంటి కరోనాలకు ఇంకా ఎంతో మందిమి బలి అవ్వాలని.

నాడు ఆ అన్న ఉచిత పన్ను ఛార్జీల బాదుడు పధకం, నేడు ఈ అన్న బాదుడు పధకం గా పేరు మార్పు. బాదుడు పంచుడు పధకాలకు కూడా, నీచంగా, మన పేర్లు ఎందుకు అని అడగలేని ప్రజల నాయకుల దుస్తితి. పాత సారా కొత్త సీసాలో. ఏ అన్న పదవి లో ఉన్నా, బాదుడు తప్పదు అని ఊరడింపు, అయినా మన వర్గం మన కులం మన కుటుంబ బానిసత్వం కే, మన ఓటు అంటూ భీష్మించుకు కూర్చున్నారు. ఎందుకంటే, మనల్ని పూర్తిగా భస్మం చెయాలి అంటే, వీరే మనకు తగిన వారని, గట్టి నమ్మకము.

తప్పు చేసిన ఉడతలు, తేనె టీగలు, కోతులు, కుక్క లు, ఇతర జంతువుల పై, నిర్భంధ క్రమశిక్షణ చర్యలు కు పదును పెట్టే ప్రయత్నం జరుగుతున్నది.

కనీసం మనుషులు స్ధాయిలో అయినా, ఎలా నీతి నియమాలు లో అదుపు గా ఉండాలని, జంతువులు కు ఆన్లైన్ కోర్సులు, విదేశీ సంస్థలు తో ఒప్పందం చేసుకుంటే ఎలా ఉంటుంది అని ఆలోచనలు.

జంతువులు కు గూగుల్ కెమెరా లెన్స్, ఇయర్ ఫోన్స్, తేలికపాటి టాబ్ లు ఇవ్వాలని యోచన. సాటిలైట్ ల తో పర్యవేక్షణ. జంతు భాష వచ్చిన భాషా ప్రవీణులకు ప్రోత్సాహాలు.

ప్రతి 100 జంతువులకు కూడా వాలంటీర్లను పెట్టి, వాటి నడవడికను ప్రతి రోజూ గుర్తించాలని సమాలోచన. వాలంటీర్లు గా ఉత్తమ జంతువులను పెడదామా లేక మనుషులకే అప్పగిద్దామా అని ఇంకో ఆలోచన. కనీసం తెంపే ముందు చెపితే, కరెంట్ ఆపే ప్రయత్నాలు. అలా తెలిపిన జంతువులకు ఆహార ప్రోత్సాహాలు, మన అన్న ఆసరా పధకం కింద.

వీలైతే సీఐబీ, సీబీజీ, ఇంటర్ నోల్, అంతరిక్ష పోలీసు సహాయం అభ్యర్థించనున్న అధికారులు.

ఇదంతా ఒక పక్క జరుగుతుంటే, ఇంకోవైపు దేశం లోని ఇతర అడవులతో పాటు మన నల్లమల అడవుల్లో, జంతు ప్రపంచం 130 వ మహాసభలు జరుగుతున్నాయి. ఇదే విషయాలు అక్కడ చర్చకు వచ్చాయి. ఈ మనుషుల అరాచకం ఆపేది ఎవరు - చెట్లు కొట్టేసారు, అడవులు మింగేసారు, గుంటలు తొవ్వెసారు, మనకు నిలువ నీడ లేకుండా చేసారు. ఇప్పుడు వారి చేతగానితనం తో, వారి నేరాలు కూడా మన మీద వేసి, మనకే క్రమశిక్షణ చర్యలు అంటున్నారు, అని తీవ్రముగా చర్చిస్తున్నారు.

అందులో వీర నక్క మహాశయులు లేచి, మనము నేరుగా జంతు రక్షణ చట్టాలు కింది, ముందు మానవులకే నీతి నియమాలు నేర్పాలని, జంతువుల కడుపు కొట్టద్దని హెచ్చరించాలని, సుప్రీం జంతు కోర్ట్లు లో జంతు వాద్యం వేయాలని, అక్కడ కూడా న్యాయం జరగకపోతే, అంతర్జాతీయ జంతు కోర్టులో కేసు వేయాలని, జంతు మిత్రుల సహాయం తీసుకోవాలని, సలహా ఇచ్చారు.

అందుకే, జంతువులన్నీ ఆన్లైన్ లో నిధులు సేకరించే పనిలో నిమగ్నమయినాయి. వాటి వాట్సాప్ గ్రూప్లలో సందేశాలు పంపుతున్నాయి. మరి మీరు వీలైతే సహాయం చేయండి. మానవులనుండి, జంతువుల ప్రాణ మాన మర్యాదలను కాపాడండి.
uduta ke tegina karent tiga hechchina jantu agadalu charyalakai adeasalu jantuvula nirasana voter think  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,863,211; 104 తత్వాలు (Tatvaalu) and views 224,650
Dt : 01-Jul-2022, Upd Dt : 01-Jul-2022, Category : General
Views : 465 ( + More Social Media views ), Id : 1449 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : uduta , karent , tiga , jantu , agadalu , charyalaku , adeasalu , jantuvula , nirasana , voter , think
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content