నేరుగా కింద పడితే, ఇంకో మనిషి పట్టుకోకుండా, ఇంక నడుములు, చేతులు, కాళ్ళు, వేళ్ళు, తల ఏదో ఒకటి? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2114 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2149 General Articles and views 2,150,386; 104 తత్వాలు (Tatvaalu) and views 240,901.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

If fall straight down, without another person holding, we will break our waist, arms, legs, fingers, head or something.

*నేరుగా కింద పడితే, ఇంకో మనిషి పట్టుకోకుండా, ఇంక నడుములు, చేతులు, కాళ్ళు, వేళ్ళు, తల ఏదో ఒకటి విరిగేది*

- మన వ్రాత నైవేద్య సేవ Our Writing Naivedya Seva
- మన గాత్ర నైవేద్య సేవ Our Gatra Naivedya Seva
Conquer Arishadvarga Ashtavyasana, Satsang జయించు అరిషడ్వర్గ అష్టవ్యసన, సత్సంగం 5 min నిమిషాలు

మీకు చెప్పేవి ఏవైనా, అవి మన కల్పిత భయ ఊసులు కాదు, ముందు జాగ్రత్తలు. అవి శాస్త్రం మాటలు, గ్రహాల బాటలు, అంటే పంచభూతాల ఊటలు, అంటే పెద్దల అనుభవాల (మాటల/ రాతల) మూటలు, వేదాల పాటలు. మనము ఎవరము మధ్యలో, రేపు ఉంటామో లేదో తెలీదు కదా?

ఖచ్చితముగా ప్రతి ఒక్కరూ, ముఖ్యముగా, రజో తమో గుణ ప్రాపంచిక దాసులు, పెళ్ళి అయినా కాకపోయినా, భాగస్వామి/ పిల్లలు ఉన్నా లేకపోయినా, సంపాదన ఆస్తులు బలగం ఉన్నా లేకపోయినా, అధికారం పదవి ఉన్నా లేకపోయినా, మనము చెప్పిన సాధనలు అంటే మానసిక నియంత్రణ పద్దతులతో తపస్సు తప్పక చెయ్యాలి. ఇప్పుడో ఇంకొకప్పుడో, 60+ కో, పిల్లలు/ అల్లుళ్ళు/ కోడళ్ళు/భాగస్వామి తన్ని తిట్టినాకో, రోగాలు వచ్చినాకో, వచ్చే వచ్చే జన్మలలో నో, ఎవరూ తప్పించుకోలేరు.

ఎప్పుడైనా సాధన తప్పదు, ముక్తి మోక్షమునకు మనశ్శాంతికి. లేదంటే, ఈ జీవిత జన్మ చక్రం, ఈ ఈతి బాధలతో, అలా గానుగెద్దు లా తిరుగుతూనే ఉంటుంది, ప్రాపంచిక వాసనల ఫలితాలు, కష్ట సుఖాల మత్తులో, మానసిక బలహీనతతో.

రేపు ఎవరో ఒకరు, మన పాప ఫలితాలకు, తన్ని తిట్టినాకా సాధన లేదా పరిహారము చేద్దాము అన్నా, అప్పుడు ముదుసలి తనం, రోగం, మానసిక దౌర్భల్యం, చుట్టూ ప్రతికూల మన అదుపు లేని పరిస్తితులు, మనల్ని సాధన చేయనియ్యవు.

అంటే, వచ్చే జన్మకు వడ్డీతో సహా, ఈ పాపాలు తీసుకుని వెళుతున్నావు. మీ ఇష్టం, మీ సుఖం, మీ కష్టం, మీ కన్నీళ్ళు.

మేమెవరం, కేవలం కన్నీళ్ళు కష్టాలు వచ్చినప్పుడు లేదా రాకముందే అప్రమత్తం చేసి, గుండె ధైర్యం ఉచితం గా ఇచ్చే వారం మాత్రమే, అంతే గా.

సంతోషానికి 100 మంది ఉంటారు తోడుగా, కన్నీళ్ళకు ఒక్కరూ ఉండరు, కానీ మేము ఎందరికో 20 ఏళ్ళు పైగా ఉన్నాము ఉంటాము - సత్వ, రజో, తమో గుణ దాసులకు సమానముగా.

23/1 సీట్లు వచ్చిన చంద్రన్న/ పవనన్న కు తోడు నాడు, 11 సీట్లు వచ్చిన జగనన్న కు తోడు నేడు. మానసిక మరియు శారీరక బలహీనులకే, మన అండ, దైవం అండ కూడా. అన్ని బాగున్నవారు, అధికారం లో ఉన్నవారు కు మనం అవసరం లేదు, అదే మాయ. వారు వీరు ఎవరూ, ఆ తర్వాత మనల్ని గుర్తు పెట్టుకోరు అని స్పష్టముగా తెలుసు, అదే నిస్వార్ధ సేవ, అదే గీత చెప్పింది, కర్తవ్యం నిర్వర్తించు, ఫలితం నాకు సమర్పణ చెయ్యి, కేవలం నువ్వు సాక్షీభూతుడివి అని మరువకు, నిన్ను ఆ పాపం అంటదు అని.

జగమంత కుటుంబం మనది, ఏకాకి జీవితం మనది. క్రిష్ణుడు అందరివాడు, కానీ తాను ఎవరికీ చెందడు. ఒంటరిగా అడవిలో వనములో, చివరి దశ ముగిసింది.

అంత అధికారం ధనం మంది మార్బలం ఉన్న కేసీయార్ ను, ఇంట్లో కాలు జారిపడకుండా, తొంటి ఆపరేషను జరగకుండా, ఎవరూ ముందు చూపుతో కాపాడలేదు. శ్రీదేవిని మైకం లో బాత్రూం తొట్టిలో పడకుండా ఎవరు కాపాడలేదు. కోడెలయ్యకు ధైర్యం చెప్పి ఎవరూ కాపాడలేదు. రామన్నకు, మానసిక ధైర్యం చెప్పి, బతుకు దోవ చూపిన వారు లేరు. జయలలితమ్మకు/ సావిత్రమ్మకు/ సింఘానియాకు/ కాఫీడేయ్యకు భవిష్యత జ్ఞానం చెప్పిన వారు లేరు.

మరి మధ్యతరగతి ఇంట్లో మనము, అమ్మను కింద పడకుండా, మానసికముగా బలహీనపడకుండా, అనారోగ్యపాలు కాకుండా, ఎంత జాగ్రత్తలు చేస్తే, 10+ ఏళ్ళ సజీవ గురువు సేవ జరుగుతున్నది, మీరే ప్రత్యక్ష సాక్ష్యం.

Daily 1 time 9 yrs * 365 days = 3,285 miles + (2nd time 6 * 365 = 2,190 miles) walking by holding hand. రోజూ ఒకసారి 9 ఏళ్ళు * 365 రోజులు = 3,285 మైళ్ళు (2 వ సారి 6 * 365 = 2,190 మైళ్ళు) చేతులు పట్టుకుని నడక. ఎంతమంది కి సాధ్యం ఇది, ఎంత మంది పొందగలరు, ఎన్ని కోట్లు ఇచ్చినా, ఎంత బలగం ఉన్నా?

78+ year old Mom, holding her hand for a mile walk every day for 9+ years, requesting her, for BP sugar health care, with own parody song inside link.

78+ ఏళ్ళ తూలి పడే అమ్మ ను, 9+ ఏళ్ళుగా రోజూ నడకకు మైలు నడకకు చేయి పట్టుకుని నడిపించడానికి, రమ్మనడానికి బతిమాలుతూ, బీపీ షుగరు ఆరోగ్య జాగ్రత్తలు కోసం, సొంత పేరడీ పాట, లింక్ లోపల.

అమ్మ ఈ రోజు కూడా పడింది, చిన్నగా నడుస్తూ, చెప్పు కాలు రెండు సిమెంట్ బాట వేలు అంటే ఇంచె కన్నా తక్కువ మధ్య లో ఎదురు తగిలి. 3 ఏళ్ళ నుంచి నడుస్తున్న అలవాటైన కాలిబాట నే. పక్కన మనం ఉండి కూడా, పడకుండా గట్టిగా పట్టుకున్నా వెంటనే, ఆ బరువుకు ఆపలేకపోయినా, చిన్నగా నేల మీదకు మెల్లి మెల్లి గా జారడం కు ఉపయోగపడ్డాము, పెద్ద దెబ్బ తగలకుండా. అయోమయముగా, ఏమి జరిగిందో అని చిన్నపిల్లలా చుట్టూ బెదురు చూపులు చూస్తున్నది. రేపు మనము అంతే.

ఒక వారం రోజులు కాస్త నెప్పులు ఇబ్బంది ఉంటుంది, ఈ దెబ్బలు మొదలూ కాదు, చివరా కాదు, ఆమె సాధనలు, రామకోటి, నిత్య పూజ, వద్దు అన్నా బయట చిమ్మడం, గుడ్డలు ఉతకడం, వంట, ఏదీ ఆగదు. మన కొండంత ధైర్యం ఏమిటి? నిస్వార్ధం గా, మనకు సేవ చేసే, మనకు అండ ఉండే, మన పూర్వ జన్మ అలాగే ఈ జన్మ సాత్విక పనులే, మన లేదా ఇతర సాత్విక బిడ్డలే.

లేదంటే, నేరుగా కింద పడితే ఇంకో మనిషి పట్టుకోకుండా, ఇంక నడుములు, చేతులు, కాళ్ళు, వేళ్ళు, తల ఏదో ఒకటి విరిగేది. ఒంటరిగా పెద్దలను ఇంట్లో అయినా విడువద్దు, కర్ర లేదా ఇంకో దానితో నడవమని పంపవద్దు, సత్వ గుణ తోడు లేకుండా. రజో తమో గుణ తోడు ఉన్నా ఉపయోగం లేదు, వారు పడ్డాక స్పందిస్తారు.

ఇంకోటి మనము అప్పుడు ప్రేమగా, మాట్లాడే ప్రతి మాటా, వారి మనసుపై అలాగే వారికి తగిలిన దెబ్బ పై, మందులాగా పని చేస్తుంది. పసి పిల్లలు పడితే కూడా, మనము ఏదో ఒక మాయ చేసి నవ్విస్తే, వెంటనే అసలు పడిన బాధ మర్చిపోతారు కదా. అలాగే పెద్దలు కూడా, మన పసి పిల్లలే, మనకు క్రుతజ్ఞత విశ్వసనీయత ఉండి కడుపుకు అన్నం తింటుంటే.

అర్ధం అయ్యిందా, మా 78+ ఏళ్ళ కూతురు అంటే, ఎంత జాగ్రత్తగా అపురూపముగా, గాజుబొమ్మ కన్నా జాగ్రత్తగా పగలకుండా, విరగకుండా చూస్తే, 10 ఏళ్ళు గడిచిందో, 2014 నుంచి. ఎన్నో సార్లు విమాన, బస్సు, రైలు, కారు అలాగే మైళ్ళ నడక ప్రయాణాలు, వారి ఆరోగ్యం దెబ్బ తినకూడదు అని.

అర్ధం అయ్యిందా, కర్ర ఇచ్చి బయట వదిలితే, ఎంత ప్రమాదమో. ధనం కోసం చూసే, రజో తమో గుణ, పిల్లలు బంధువులు ఆశ్రమాల వారు పడకుండా ఆపగలరా? పడి అంతా అయినాక, గంటకో పూటకో, వైద్యం దొరికేది. చుట్టాల నిట్టుర్పులు, లేదంటే మాతో వద్దు తీసుకెళ్ళు అంటారు. కానీ కిందపడకుండా, అంటే దెబ్బ తగలకుండా ఆపలేరు.

60+ ఏళ్ళ వయసు ఉన్న సాత్వ గుణ సంపన్నులకు, వారు కనీసం 1+ ఏళ్ళు సజీవ గురువు సేవ చేసి ఉంటే, మనము వారికి కూడా అమ్మకు కు చేసిన అన్ని సేవలు చేస్తాము అని మీకు చెప్పింది, అర్ధించింది మీకు తెలుసు, వెతుకుతున్నారు కదూ ఆ పుణ్య తల్లి దండ్రులను.

గతములో గుర్తు ఉందా, గుడి దగ్గర నేల మీద పడుతుంటే, తల కింద చెయ్యి పెట్టి, కొండ రాయి మీద పడకుండా ఆపాము. ఇంకా బయట వాకిలి చిమ్ముతూ వద్దు అన్నా, అలాగే బాత్రుం ఇంట్లో అలాగే బయట ఎన్నో సార్లు, పడటం. కానీ సత్వ గుణ మనిషి కనిపెట్టుకుని, వెంటనే కూత దూరంలో అప్రమత్తముగా ఉండటం వలన, అవి చిన్న ప్రమాదాలు/ గండాలు గా తప్పాయి.

ఇప్పుడైనా, మీ ముదుసలి తల్లి దండ్రులను, అత్తా మామలను దగ్గర ఇంట్లో ఉంచి, సొంత పిల్లలు గా ప్రేమగా చూడండి. అది చేయలేనప్పుడు, మనది/ మనకు జంతు సంసారం అలాగే జంతు సంతానం, మన భవిష్యత్ మనకు తెలుసు, ఘోర పతనమే.

ఎంతో మంది, కుక్కలు ఇతర జంతువులను, పెట్టుకుని పట్టుకుని తిరుగుతున్నారు. కానీ వారి తోటి మానవ జీవాలు అయిన, ముదుసలి తల్లి దండ్రులను అత్తా మామలను, పెట్టుకుని పట్టుకుని తిరగాలి అంటే మాత్రం నామోషీ, బిజీ, ఇంకా ఎన్నో ఇబ్బందులు కదూ? రేపు మన బతుకు అంతే, ముదుసలి తనములో.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2149 General Articles and views 2,150,386; 104 తత్వాలు (Tatvaalu) and views 240,901
Dt : 18-Jun-2024, Upd Dt : 18-Jun-2024, Category : General
Views : 139 ( + More Social Media views ), Id : 2117 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : fall , straight , down , person , holding , break , waist , arms , legs , fingers , head , older , parents
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content