పెద్ద తనము, వయసును బట్టి రాదు, గుణమును బట్టి. రజో తమో గుణ దాసులు, సత్వ గుణం కి చిన్న పిల్లలే? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2114 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2149 General Articles and views 2,150,490; 104 తత్వాలు (Tatvaalu) and views 240,916.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

Being older doesnt with age depends on Guna. Rajo Tamo Dasa children for Sattva?

*పెద్ద తనము అనేది, వయసును బట్టి, పదవి ధనమును బట్టి రాదు. గుణమును బట్టి వస్తుంది. రజో తమో గుణ దాసులు, ఎప్పుడు కూడా సత్వ గుణం వారికి చిన్న పిల్లలే, పసి బిడ్డలే. Being older/largeness doesn't come with age position money. It depends on the Guna. Rajo Tamo Guna Dasa are always small children and babies for Sattva Guna.*

- మన వ్రాత నైవేద్య సేవ Our Writing Naivedya Seva

Conquer Arishadvarga Ashtavyasana, Satsang జయించు అరిషడ్వర్గ అష్టవ్యసన, సత్సంగం 5 min నిమిషాలు 25-Jun-24

Any Relation - A breach of Trust - Rebuilding Trust after a breach - Carefull, it is not easy.
ఏ బంధమైనా - విశ్వాస ఉల్లంఘన (నమ్మక ద్రోహం) - ఉల్లంఘన తర్వాత విశ్వాసాన్ని (నమ్మకాన్ని) పునర్నిర్మించడం - జాగ్రత్తగా ఉండండి, ఇది సులభం కాదు.

రవి తమ చుట్టూ ఉండే పెద్దల చిత్రమైన మానసిక గాధలు ఇలా చెప్తున్నాడు, శుభకు. తెల్లవి అన్ని పాలు కాదు, నల్లనివి అన్ని నీళ్ళు కాదు. ఏది ఎమిటో ముందే పసిగట్టి చెప్పగలిగిన వారు, సత్వ గుణం వారు.

స్నేహితులైనా, బంధువులైనా, ప్రేమికులైనా, ఏ ఇద్దరు అయినా, మానసిక నియంత్రణతో మనకు మనము ఎవరమో తెలుసుకోవాలి, మనము రజో తమో గుణములైతే, మానసిక నియంత్రణ కష్టము, ఎన్నో జన్మల సాధన కావాలి. కాబట్టి, సత్వ గుణ వారి మాట తో మనకు మనము తగ్గి, సాధన చెయాలి.

+ + +

నమ్మరు కదూ ఉదాహరణ లేకుండా, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం వలన అంటే రజో తమో గుణాల లాభనష్టాలు, మన పెద్దలు ఎప్పుడో ప్రత్యక్షంగా నిరూపించారు. పురాణాలు లో కాదు సుమీ, ఈ 50 ఏళ్ళు లో. మీ పెద్దలు ను అంటే, సంస్కారం ఉన్న వారిని అడగండి.

రామన్న, రాజన్న, సావిత్రమ్మ, జయలలితమ్మ, కోడెలయ్య, శ్రీదేవమ్మ‌‌‌, కాఫీడేఅయ్య, మాల్యయ్య, సింఘానియయ్య, మీ ఇంట్లో మా ఇంట్లో, లాంటి మహానుభావుల చివరి పేజీలు చదవండి.

+ + +

బాబాయి కి 10-20 ఏళ్ళ ముందు చెప్పినాము స్పష్టముగా - రజో గుణం అయిన ఆవేశం మంచిది కాదు, దానివలన చాల నష్టం జరుగుతుంది. సత్వ గుణం వారికి చేరువ కాలేవు. చివరి దశలో, అవసర అవకాశ రజో తమో గుణాల వారు అండగా ఎల్లకాలం ఉండరు, అవసరం తీరగానే వదిలి వేయడం లేదా వెన్నుపోటు గుండెపోటు తప్పదు అని, అది ఏ ఇంట్లో అయినా అంతే.

ఇతర ఊర్లు వెళ్ళి, సేవలు దానాలు యాత్రలు దండగ, ముందు మనల్ని మనం తెలుసుకుని, సాధనతో మానసిక నియంత్రణ చేసి, మనము ముందు మారదాము, మనల్ని మనం మార్చుకుందాము, మనకు తెలిసిన వారికి సేవ చేద్దాం, అండగా ఉందాం అని. కానీ ఆయన వినలేదు. మన ఇంట్లోనే ఉండమన్నాం, మనతో పైన లేదా విడిగా కింద స్వతంత్రముగా, తన ఇష్టం అని, వినలేదు.

మనకు ఎంత సహాయం చేసినా, తనకు లేదా ఇతరులకు, జరగబోయే భవిష్యత్ నష్టాన్ని, ఆపాల్సిన బాధ్యత మనకు, ప్రయత్న పూర్వకముగా ఉంది.

సొంత తండ్రి అయినా, 3 చుట్టలు వద్దు అని గట్టిగా చెప్పి, 1 కి తెచ్చాము. తాత వాళ్ళు అద్దె ఇస్తాము అన్నా కూడా, తీసుకోవద్దు అని నాన్నకు గట్టిగా ఇంటర్ చదువులోనే చెప్పాము. ఆయన తీసుకోలేదు, కొడుకు మాట విన్నారు, మంచి పని కాబట్టి.

ఆయనే కాదు, భవిష్యత్ తెలిసిన వారు, మన మాట ఎప్పుడూ వింటారు. ఈ రోజు మాయా మోహ బతుకు బతుకుదాము అనుకునే, రజో తమో గుణ దాసులు మన మాట వినరు. అయినా, మన స్నేహితం బంధుత్వం బట్టి, మనము ముందు జాగ్రత్తలు చెప్పాలి. ఆ తర్వాత వారి ఖర్మ.

మొహమాటం తో చెప్పకుండా, వారికి తెలీదా అని వదిలేస్తే, రేపు మన పిల్లలు, మనుమలు, ఆఖరకు మనము పతనము అవుతున్నా, అందరూ అలాగే వదిలేస్తారు, మీరు నేర్పిన విద్యనే కదా అని.

ఒక ఏడాది ముందు బాబాయి వాట్సాప్ లో కనపడితే, మన సాధనలు పంపాము. ఎందుకంటే తను, మనకు తన సాధనలు తెలుపకపోయినా, కనీసం మనవి అర్ధం చేసుకుని తప్పులు ఒప్పులు సరి చేయాలి, పెద్ద మనిషిగా, ఆధ్యాత్మిక సాధకునిగా. కనీసం సజీవ గురువు సేవ చేస్తున్నావు జిల్లా ప్రభుత్వ ఉద్యోగం వదలి, శభాష్, నేను చెయ్యలేక పోయాను ఆనాడు తాత నాయనమ్మకు రోజు దగ్గర ఉండి నడిపించి అని, పశ్చాత్తాపం పొందాలి.

ఏదీ లేదు, బ్లాక్ చేసారు, ఈ సత్వ గుణ గోల పడలేము అని. ఈ నెలలో, వారం ముందు, మరలా అన్ బ్లాక్ చేస్తే మనలను, మరలా శనివార సాధనలు, మంచి చెడు మీకు పంపినవి పంపాము, తన స్పందన అలాగే మార్పు చూడాలి అని. మరలా బ్లాక్ చేసారు.

అంతే గాక, ఎవరైనా సరే, ముదుసలి తల్లి ద్రోహులతో కలిసి తిరిగినా, ఇంకా అధిక పాపం, వారి వారి కుటుంబాలలో. అదే ముదుసలి తల్లికి జరిగిన ద్రోహం, మీకూ జరగాలని, ఆ ముదుసలి గుండే కన్నీటి వ్యధ మీకు అనుభవ పూర్వకం చెయ్యాలని, మీ చుట్టే తిరుగుతుంది. ఎందుకంటే మీరు సమర్ధన చేసారు కదా, వారితో తిరుగుతూ, అదే పతనాన్ని ఆహ్వానిస్తూ.

అంటే, తన రజో గుణాన్ని, ఆవేశాన్ని, తను ఇంకా తగ్గించుకోలేదు. కనీసం మన లోపాలను, తన లోపాలను చెప్పలేదు, సరిదిద్దుకునే ముందు చూపు లేదు. అదే అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం.

మాయ మారనివ్వదు, మానసిక బలహీనులను. ఎందుకంటే, తర్వాత అంకం పూర్తి కావాలి కదా. ఇక పంచభూతాల చేతుల్లోకి వెళ్ళాలి.

ఇదే జాగ్రత్తలు తమో గుణ వడ్డీ రావణ బాబాయికి చెప్పాము 2016 లోనే, మీరు గత కధనాలలో చదివారు, అందరితోనూ చెప్పాము. ఆయన వినలేదు, ఆ తర్వాత వ్యాపార నష్టం, ఎన్నికల నష్టం, కేబుల్ నష్టం మీకు తెలుసు. తమను నమ్మిన అందరిని, నమ్మక ద్రోహముతో, తడి గుడ్డతో గొంతు కోస్తూ, నిలువునా ముంచింది మీకు తెలుసు. ఇంట్లో వారికి సాధ్వీమణి మండోదరి కధ చెప్పినా, కుమారుడు తమో గుణ మేఘనాధుని కధ చెప్పినా, వారూ ఫోన్ ఆపేశారు, మీగోడు మాకు అనవసరం అని.

కన్న తల్లి వైద్యానికి, ధనం కావాలి అన్నా, ఆదాయం లేదు అన్నా కూడా, ఆ కసాయి గుండె, 2018 నుంచి కూడా కరగలేదు. ఇది మీ పిల్లలకు, మనుమలకు శాపం అవుతుంది అని ఎంత నచ్చ చెప్పినా, ఆ కరకు గుండె కరగలేదు నేటికీ. పెద్దలు ఇద్దరిలో ఒకరు పోయాక, కోటి ఇచ్చినా విలువ లేదు అని చెప్పినా, ఆ తమో గుణానికి మనసుకు ఎక్కదు, అదే దురాశ. అదే అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం. బ్లాక్ చేసారు. మనము వారి ఖర్మకు వదిలేశాము. ఎందుకంటే, వారు ఇచ్చేది, అమ్మ 2-3 నెలల వైద్యం ఖరీదు చెయ్యదు, అది వారికీ తెలుసు. కానీ దురాశ అహంకారం ఆస్తులు నీతిని నేర్పవు.

పెద్ద తనము అనేది, వయసును బట్టి, పదవి ధనమును బట్టి రాదు. గుణమును బట్టి వస్తుంది. రజో తమో గుణ దాసులు, ఎప్పుడు కూడా సత్వ గుణం వారికి చిన్న పిల్లలే, పసి బిడ్డలే.

ఇప్పుడు అర్ధం అయ్యిందా, తమో గుణ చంద్రన్నను రజో గుణ జగనన్న ను మా పిల్లలు అనేది ఎందుకో. చూడండి వారు ఇద్దరూ, 2019 లో అలాగే ఇప్పుడు 2024 లో ఎలా కీచులాడుకుంటున్నారో. ఇద్దరూ తజో తమో గుణ దాసులే.

అన్ని సమకూర్చిన రజో/ తమో గుణ తండ్రి హిరణ్యకశిపునికి, బుద్ది చెప్పింది 10 ఏళ్ళ సత్వ గుణ ప్రహ్లాదుడే, మరువద్దు.

కన్నతల్లి రజో గుణ కైక చేసిన పనికి మాలిన పనికి, తండ్రి చావుకు కారణం తెలుసుకుని, సత్వ గుణ భరతుడే తల్లిని చంపబోయాడు.

ఈ గుణ పోలికలు ఆ ఇద్దరి మధ్యనే, ఇంకో వ్యక్తి తో పోలిస్తే, మరలా గుణాల తీవ్రత తేడా వస్తుంది సుమీ. జగనన్న రామన్న ను పోలిస్తే, రామన్న సత్వ గుణం అవుతుంది, జగనన్న రజో గుణమే.

కాబట్టి, మీ ఇంట్లో పెద్దలు లేదా స్నేహితులు/ బంధువులు/ భాగస్వాములు, తప్పు చేస్తుంటే, కపట నటన 2 నాల్కల ధోరణితో ఉంటే, అది భవిష్యత్ లో వారికే వెన్నుపోటు గుండెపోటు కలిగిస్తుంది, అని తప్పక అర్ధం అయ్యేలా చెప్పండి. ధర్మం ను కాపాడలేదు అన్న పాప ఫలితము మీకు ఉండదు. లేకపోతే, ధర్మం మిమ్మల్ని రక్షించదు.

ధర్మం ఉండాలి, పెద్దల మాటలు ప్రవర్తనలో, అందరితో సమానముగా. తప్పును తప్పు అని చెప్పాలి, అది చెప్పలేనప్పుడు, వారు పెద్దలు కాదు, పిల్లలే, అవసర అవకాశవాదులు, నష్టం వారికే సుమీ.

అది లేనప్పుడు, 100 సార్లు కాశీ రామేశ్వరము వెళ్ళినా అక్కడే 10 ఏళ్ళు ఉన్నా యాగాలు చేసినా, ఫలితము శూన్యం, ఎందుకంటే? మానసిక బలం అలాగే సత్వ గుణం లేదు కాబట్టి, ఇది చరిత్ర చెప్పిన సత్యం.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2149 General Articles and views 2,150,490; 104 తత్వాలు (Tatvaalu) and views 240,916
Dt : 25-Jun-2024, Upd Dt : 25-Jun-2024, Category : General
Views : 60 ( + More Social Media views ), Id : 2123 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : older , age , depends , Guna , Rajo , Tamo , Dasa , children , Sattva
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content