Sri Vishnu Sahasranamam uttara peethika శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర ఉత్తర పీఠిక - Devotional - శ్రీ స్వామి తత్వాలు
           
మిగతా తత్వం కూడా మనసుతో చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 104 కధనాలు (Articles). ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,873,058; 104 తత్వాలు (Tatvaalu) and views 225,555.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర ఉత్తర పీఠిక - అంత్య భాగం శ్లోకాలు అర్ధము
Sri Vishnu Sahasranamam uttara peethika phalashruti final part

స్తోత్రం ఉత్తర పీఠిక (ఫలశ్రుతి) లో ఈ శ్లోకం, ధర్మార్థులకు ధర్మము, అర్థార్థులకు అర్థము, కామార్థులకు కామము, ప్రజార్థులకు ప్రజను ప్రసాదించును అని చెప్పబడింది.
In the preface of the hymn (Phalasruti), it is said that this hymn bestows righteousness on the righteous, bhagya for the bhagya need, lust for lustful, and etc.

రెండవది గరుడపురాణములో విష్ణు సహస్రనామ స్తోత్రము ఉంది. మూడవది పద్మపురాణములో కూడా దీని ప్రస్తావన ఉంది.
Second, there is a hymn to Vishnu Sahasranama in the Garuda Purana. Thirdly, it is also mentioned in the Padma Purana.

మీరూ ఈ శ్లోకాలు పాడి, ధన్యులు కాగలరు. You too can sing these hymns and be blessed.

మంత్రం మనసు మీద పనిచేస్తుంది. మనలను మాయకు దూరముగా ఉంచుతుంది. విచక్షణ తో ధైర్యముగా సమస్యను ఎదుర్కొనే దోవ చూపుతుంది. మనశ్శాంతి నిలవాలన్నా, రావాలన్నా, మనకు ఏకాగ్రతతో కూడిన, మంత్ర సాధన, ధ్యానం రోజూ ఉండాలి. తెలుగు లేదా సంస్క్రుత భాష (స్థానిక గోంగూర ఆవకాయ పచ్చడి లాగా) రుచి, అది ఆస్వాదించిన వారికే తెలుస్తుంది, మిగతావారికి అర్ధం కాదు.

Mantra works on the mind. Keeps us away from delusion. Shows courage to face the problem with discretion. Whether we want to keep or get peace of mind, we need to practice with concentration, mantra and meditation daily. The taste of Telugu (mother tongue) or Sanskrit language (like local Gongura Avacaya Pachdi) is known only to those who have tasted it, not understood by others.

మన త్రికరణ శుద్ది సాధన, మన ప్రతి అడుగులో పనిలో త్యాగంలో సహాయంలో మానవసేవలో మాటలో, రోజూ కనపడుతుంది సుమా. అది ముందు ఇంట్లోని ముదుసలి తల్లి దండ్రుల సేవలోనే మరియు పిల్లల సంస్కారంలో, కనపడాలి చిత్తశుద్ది ఉంటే.

The practice of our threefold purity will appear, in our every step, in work, in sacrifice, in help, in human service, in speech, daily. It should be seen in the service of the elderly parents and kids samskar, in our house, if there is sincerity.

అర్జున ఉవాచ : Arjuna Uvacha
పద్మపత్ర! విశాలాక్ష! పద్మనాభ! సురోత్తమ!|
భక్తానా మనురక్తానాం త్రాతా భవ జనార్ధన!||23
Arjuna Uvaca:
Padmapatra Vishalaksha Padmanabha Surottama |
Bhaktanaam Anuraktanam Trata Bhava Janardana ||23||

శ్రీ భగవానువాచ :Sri Bhagavanuvacha
యో మాం నామ సహస్రేణ స్తోతు మిచ్చతి పాండవ!|
సో హ మేకేన శ్లోకేన స్తుత ఏవ న సంశయః||24
స్తుత ఏవ న సంశయ ఓమ్ నమ ఇతి
Sri Bhagavan Uvaca:
Yo mam namasahasrena Stotum Icchati Pandava |
Soham Ekena Shlokena Stuta Eva Na Samshayah ||24||
Stuta Eva Na Samshaya Om Nama Iti

వ్యాస ఉవాచ :Vyasa Uvacha
వాసనాద్ వాసు దేవస్య వాసితం తే జగత్త్రయమ్!|
సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే||25
శ్రీ వాసు దేవ నమోస్తుత ఓం నమ ఇతి
Vyasa Uvaca:
Vaasanad Vasudevasya Vasitam Bhuvanatrayam |
Sarvabhuta Nivaasosi Vasudeva Namostu te ||25||
Shree Vaasudeva Namostuta Om Nama iti

పార్వత్యువాచ : Parvati Uvacha
కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకమ్|
పఠ్యతే పండితై ర్నిత్యం శ్రోతు మిచ్చామ్యహం ప్రభో||26
Parvati Uvaca:
Kenopayena Laghuna Vishnor Nama Sahasrakam |
Pathyate Panditair Nityam Shrotum Icchaamyaham Prabho ||26||

ఈశ్వర ఉవాచ : Ishvara Uvacha
శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే!
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే!||27
శ్రీ రామ నామ వరానన ఓం నమ ఇతి
Ishvara Uvaca:
Sri Rama Rama Rameti Rame Raame Manorame |
Sahasranama Tat tulyam Rama Nama Varanane ||27||
---
బ్రోహ్మోవాచ : Brahma Uvacha

నమో స్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే|
సమస్రనామ్నేపురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః||28
శ్రీ సహస్రకోటి యుగధారిణే ఓమ్ నమ ఇతి
Bramha Uvaca:
Namostvanantaaya Sahasramurtaye
Sahasra PadakshiShirorubahave
Sahasranamne Purushaaya Shaashvate
Sahasrakoti Yugadhaarine Namah ||28||
Sahasrakoti Yugadhaarine Nama Om Nama iti

సంజయ ఉవాచ : Sanjaya uvacha
యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్ధో ధనుర్ధరః|
తత్ర శ్రీః విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ||29
Sanjaya Uvaca:
Yatra Yogeshvarah Krishno Yatra Paartho Dhanurdharah |
Tatra Shreer Vijayo Vishnuh Dhruvaa Neetir Matir Mama ||29||

శ్రీ భగవానువాచ : Sri Bhagavanuvacha
అనన్యా శ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే|
తేషాం నిత్యాభి యుక్తానాం యోగక్షేమం వహా మ్యహమ్||30
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్|
ధర్మసంస్దాపనార్దాయ సంభవామి యుగే యుగే||31
ఆర్తా విషణ్ణా శ్శిదిలాశ్చ భీతాః ఘోరేషు చ వ్యాధిషు వర్తమానాః|
సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖా స్సుఖినో భవంతి||32
యదక్షర పదభ్రష్టం మాత్రహీనం తు యద్భవేత్|
తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే||33
కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ద్యాత్మనా వా ప్రకృతే స్స్వభావాత్|
కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయమి||34
Sri Bhagavan Uvaca:
Ananyas Chintayanto Mam Ye Janaah Paryupasate |
Tesham Nityaabhiyuktanam Yogakshemam Vahamyaham ||30||

Paritranaya Sadhunaam Vinashaya cha Dushkritam |
Dharma Samsthaapanaarthaaya Sambhavami Yuge Yuge ||31||

Aartaah Vishannah Shithilaashcha Bhitah
Ghoreshu Cha Vyadhishu Vartamanah
Sankeertya Narayana Shabda Matram
VimuktaDuhkhah Sukhino Bhavantu ||32||

Kaayena Vachaa Mana-Sendriyair Va Budhyaatmana Va Prakruteh Swabhaavaat |
Karomi Yadyad Sakalam Parasmai Narayana Yeti Samarpayaami ||34

శ్రీ మన్నారాయణాయేతి సమర్పయామి
ఓమ్ తత్ సత్, సర్వం శ్రీకృష్ణార్పణ మస్తు.
OM NAMO NARAYANAAYA, HARI OM TAT SAT

ఇతి శ్రీ మహాభారతే శతసహస్రికాయాం సంహితాయాం వైయాసిక్యామ్ ఆనుశాస నికపర్వణి మోక్షధర్మే శ్రీ భీష్మ యుధిష్ఠిర సంవాదే శ్రీవిష్ణోః దివ్య సమస్రనామ స్తోత్రం నమ చతుః పంచాశ దధిక ద్విశత తమో ధ్యాయః

ఉపదేశాలు
అర్జునుడు - పద్మనాభా! జనార్ధనా! అనురక్తులైన భక్తులను కాపాడు అని కోరగా

కృష్ణుని సమాధానం - నా వేయి నామములు స్తుతించగోరే వారు ఒకే ఒక శ్లోకమును స్తుతించినా గాని నన్ను పొందగలరు

వ్యాసుడు చెప్పినది - ముల్లోకములు వాసుదేవుని వలన నిలచియున్నాయి. అన్ని భూతములలోను వాసుదేవుడు అంతర్యామి. వాసుదేవునకు నమోస్తుతులు

పార్వతి ప్రభో! ఈశ్వరా! విష్ణు సహస్ర నామమును పండితులు నిత్యం క్లుప్తంగా ఎలా పఠిస్తారు? సెలవీయండి అని విన్నవించగా

ఈశ్వరుడు ఇలా చెప్పాడు - శ్రీరామ రామ రామ యని రామనామమును ధ్యానించనగును. రామనామము వేయి నామములకు సమానము
శ్రీరామ రామ రామేతి రమేరామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే

బ్రహ్మ చెప్పినది - అనంతుడు, వేలాది రూపములు, పాదములు, కనులు, శిరస్సులు, భుజములు, నామములు గల పురుషునకు నమోస్తు. సహస్రకోటి యుగాలు ధరించిన వానికి నమస్కారములు

సంజయుడు చెప్పినది - యోగీశ్వరుడైన కృష్ణుడు, ధనుర్ధారియగు అర్జునుడు ఉన్నచోట ఐశ్వర్యము, విజయము నిశ్చయంగా ఉంటాయి.

శ్రీ భగవానుడు చెప్పినది - "ఇతర చింతనలు లేక నన్నే నమ్మి ఉపాసన చేసేవారి యోగక్షేమాలు నేనే వహిస్తాను. ప్రతియుగం లోను దుష్ట శిక్షణకు, సాధురక్షణకు నేను అవతరిస్తాను

నారాయణ నామ స్మరణ ప్రభావము - దుఃఖితులైనవారు, భయగ్రస్తులు, వ్యాధిపీడితులు కేవలము నారాయణ శబ్దమును సంకీర్తించినయెడల దుఃఖమునుండి విముక్తులై సుఖమును పొందుతారు.

సమర్పణ
శరీరముచేత గాని, వాక్కుచేత గాని, ఇంద్రియాలచేత గాని, బుద్ధిచేత గాని, స్వభావంచేత గాని చేసే కర్మలనన్నింటినీ శ్రీమన్నారాయణునకే సమర్పిస్తున్నాను. భగవంతుడా! నా స్తోత్రంలోని అక్షర, పద, మాత్రా లోపములను క్షమించు. నారాయణా! నీకు నమస్కారము.
అన్న ప్రణతులతో ఈ పుణ్యశ్లోకము ముగుస్తుంది.


పైన రాసింది చదివి అర్ధం చేసుకున్నప్పుడు, ఆచరణ భక్తుని సమాధానం ఎప్పుడూ భావముతో ఉంటుంది -

మేమూ మరియు మా పిల్లలూ రోజూ చదువుతాము (లేదా ఇక మొదలు) విష్ణు/ శివ/ ఇతర నామాలు శ్లోకాలు. 60 తర్వాత, మా తల్లి దండ్రులు మాతోనే ఉన్నారు/ ఉండేవారు/ ఉంటారు. మేమూ 60 తర్వాత, మా పిల్లలతో ఉంటాము/ ఉన్నాము.

ఇలాంటి స్పందన వలన, ఇతరులకు కూడా, మేము ఎందుకు చేయలేము అన్న స్పూర్తి కలగాలి/ కలుగుతుంది. ఒక్క వ్యక్తి త్రికరణ శుద్ది గా మొదలు పెట్టినా, అదే దైవ మానసిక పూజ మనకు, సోషల్ మీడియా ద్వారా. ఉత్త లైక్ లు షేర్ వలన, మన సాధన నిబద్దత ఆచరణ, ఎలా ఇతరులకు ఉపయోగం అవుతుంది?  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,873,058; 104 తత్వాలు (Tatvaalu) and views 225,555
Dt : 03-Jul-2022, Upd Dt : 03-Jul-2022, Category : Devotional
Views : 841 ( + More Social Media views ), Id : 50 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : vishnu , sahasranamam , uttara , peethika , phalashruti
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments

గమనిక - పైన ఉన్న "శ్రీ రామ రక్ష" పిక్చరు ను స్టికర్ గా, ఇంటి గుమ్మం తలుపు మీద, ఫ్రిడ్జ్ మీద, పూజ గది లో, ఇంటిలో కనపడే చోట, వాహనము మీద రక్షణ లేదా గుర్తు(స్మరణ) గా వీలైతే ఉపయోగించుకోవచ్చు.
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content
APLatestNews.com - Sri Swami Tatvaalu శ్రీ స్వామి తత్వాలు