నేడు దొరకని, నాటి మనసా వాచా కర్మణా అంటే ఏమిటి? వివరంగా చెప్పండి? - Devotional - శ్రీ స్వామి తత్వాలు
           
మిగతా తత్వం కూడా మనసుతో చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 104 కధనాలు (Articles). ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2110 General Articles and views 1,868,036; 104 తత్వాలు (Tatvaalu) and views 225,119.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

1000 మందిలో ఒకరికి కూడా ఈరోజు ఆ మూడు కలవవు, కుదరవు. మంచివారికి అది సాధ్యమే, కాని నటించే వారికి, అది కష్టము. ముందు శాస్త్రం లో నుంచి ఉదాహరణ లు తీసుకుందాము.

లక్ష్మణ స్వామి మరియు సీతమ్మ తల్లికి , శ్రీరాముడు అంటే ప్రాణము, అది మనసులోను, మాట లోను, చేతల లోనూ ఉంటుంది. అరణ్య వాసం అన్ని రోజులు ఎవరు వెళతారు? రామయ్య కి తప్పదు తండ్రి మాట కోసం, కాని సీతమ్మ కు, లక్ష్మణుని కి అవసరము లేదు. కాని, చేతలలో చూపించారు, రామునితో వెళ్ళి అష్టకష్టాలు పడ్డారు. కానీ చివరకు సుఖపడ్డారు.

ప్రహ్లాదుడు, మనసా వాచా కర్మణా పసితనం లోనే నారాయణుని నమ్మాడు, కొండల మీద నుంచి తోసినా, పాములతో కరిపించినా, అన్నము పెట్టకున్నా, గదిలో బంధించినా, నారాయణ స్మరణ మానలేదు. అన్నిటిలో నారాయణు డే వచ్చి, కాపాడి, చివరకు రాక్షస రాజుని పరలోకానికి పంపాడు.

మరి రావణుడు, శివయ్యను మెప్పించాడు తపస్సుతో, ప్రపంచాన్ని జయించాడు. కానీ మనసును జయించలేక పోయాడు, తర్వాతి కాలంలో. అరిషడ్వర్గాలలో ఒకటైన, కామానికి లొంగిపోయాడు, చేతలలో భక్తిని చూపించలేక పోయాడు. రాజుగా యుద్దము చేసి, రాణులను చేపట్టడము ఉంది ఆ రోజులలో. కాని తను, దొంగ గా రాముడు లేనప్పుడు మారువేషములో వచ్చి, సీతమ్మను అపహరించాడు. ఫలితం అనుభవించాడు.

శకుని, అంతా మీకు మంచే చేస్తున్నా అని నటించారు పక్కనే ఉండి, కానీ చివరకు అందరినీ రాజ్య బ్రష్టులను చేసి, కపటముతో ప్రతీకారము తీర్చుకున్నారు. శకుని మాటలకు రెచ్చిపోయాడే గాని, తెలివితక్కువ దుర్యోధనుడు, కనిపెట్టలేకపోయాడు చివరకు కూడా. ఎందుకంటే తనూ, అలాంటి వాడే కాబట్టి. అంటే, మనసులో ఉద్దేశ్యము వేరు, మాటలు చేతలు వేరు. ఇలాంటి వారు మన చుట్టు చాలా మంది ఉంటారు.

ఈ మూడు లక్షణాలు ఒకే రకంగా ఉండే వాళ్ళు అద్రుష్టం వలన మనకు దొరికితే, వారిని విడువ కూడదు. ఎందుకంటే, మన తప్పులను సరిచేసి, దైవం వైపు మరలిస్తారు.

మరి ఈ రోజుల్లో 3 కలవటము అసలు కుదరదు ఎక్కువ మందిలో. ఎందుకంటే, ప్రతి ఒక్కరు సినిమా వాళ్ళ కంటే ఎక్కువగా జీవిస్తారు నటనలో. ఉదాహరణ బట్టి మీరే నిర్ణయించుకోండి, మనసు మాట చేతలు కలుస్తున్నాయా?

1. ఒక వ్యక్తి, ఉదయం గంట పూజ, రోజు గుడి లో ప్రదక్షిణలు, నాలుగు బొట్లు, నోటితో మంత్రాలు. కానీ భర్త/భార్య, అత్త/అమ్మ , ఆడ బిడ్డ, పని వాళ్ళను, ఇరుగు పొరుగు ను నానా మాటలతో బాధపెడుతూ దుమ్మెత్తిపోస్తారు. అంటే, తన పూజలు మనసుతో చేస్తే, స్వార్ధం కోసం తోటి మనుషులను హింసించలేరు, పరుష వాక్యాలు మాట్లాడలేరు. స్వార్ధం లేకుండా బాగుపడటానికి , పిల్లలను లేదా తను నమ్మిన వారిని అరవడము వేరు.

2. ఇంకొకరు, కన్న తల్లి దండ్రులు అంటే పంచ ప్రాణాలు అని చెపుతారు అందరితో, పనులలో సాయం చేస్తారు. ఫేస్బుక్ వాట్సప్ లో ఫొటోలు అబ్బో ఎన్నో, 40 లేదా 50 ఏళ్ళదాకా లేదా అవసరాలు తీరే దాక లేదా వాళ్ళు శక్తిహీనులు అయ్యేదాక. ఆ తర్వాత వారిని, గాలికి వదిలి వేస్తారు లేదా ఆశ్రమంలో పెడతారు. అందరితో, మా పెద్దలే మా దగ్గరకు రాలేము, మాదగ్గర ఉండలేము అన్నారు అని చెపుతారు.

3. అలాగే చదువుకునే పిల్లలు, ఈ 3 లక్షణాలు ఒకే రకంగా ఉంటే, అన్నిటిలో మొదట వస్తారు. చదువు అబ్బకపోయినా, మాట మీద లక్ష్య శుద్దితో ఉంటారు, క్షణం కొకసారి మారరు. కానీ తల్లి దండ్రుల దగ్గర నటించి మోసగిస్తే, చివరకు వారే ఇబ్బంది పాలు అవుతారు. పిల్లల నటనను ప్రోత్సహించే పెద్దలు, తర్వాత కాలంలో శిక్ష అనుభవిస్తారు. ఎందుకంటే వారు నేర్పిన విద్య ను, చివరలో పిల్లలు, తమ సొంత పెద్దల మీదే ప్రయోగిస్తారు.

4. ఏవండీ మీరు చెప్పేవి అన్నీ బాగుంటాయి, మనసుకు శాంతాన్నిస్తాయి, మీరంటే గౌరవం, ప్రాణాలు ఇస్తాము మీకోసం, డబ్బు కావాలా ఇస్తాము. కానీ పాటించలేను. అంటారా? ఇంక ప్రయోజనము ఏముంది, ముందు ఇచ్చిన మర్యాదకు? రేపు నీ పిల్లలూ లేదా ఇంట్లో వాళ్ళు అవి పాటించరు కదా, తర్వాత నష్టము నీకే గదా.

మంచి పనులలో ఆ 3 పద్దతులు కలవని వారు, పూజలు పునస్కారాలు చేసినా ప్రయోజనం శూన్యము. గత పుణ్యం వలన నేడు బాగా ఉండొచ్చు, కానీ రేపు కాదు. అద్రుష్టం తిరగబడడం క్షణం పని.

ఇలా చెప్పుకుంటూ పోతే, నిత్య జీవితంలో ఎన్నో వస్తాయి మన ప్రతి అడుగులో. ఎందుకంటే, మనలో చాలా మంది, మన బాల్యం నుంచే అబద్దాలతో నటనతో పెరిగాము. మన సంతానాన్ని, అలాగే భ్రమలో పెంచుతున్నాము. కాబట్టి ఫలితం అదే వస్తుంది కదా?

గన్నేరు మొక్క నాటి, మల్లె చెట్టు రాలేదని, చివరలో రోదిస్తే ఉపయోగము శూన్యము. మన పిల్లలే పట్టించుకోరు, ఇంక బయట వాళ్ళు పట్టించుకుంటారా?  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2110 General Articles and views 1,868,036; 104 తత్వాలు (Tatvaalu) and views 225,119
Dt : 23-Jul-2019, Upd Dt : 09-Aug-2019, Category : Devotional
Views : 4349 ( + More Social Media views ), Id : 31 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : manasa vacha karmana , sri rama , prahlada , sakuni
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments

గమనిక - పైన ఉన్న "శ్రీ రామ రక్ష" పిక్చరు ను స్టికర్ గా, ఇంటి గుమ్మం తలుపు మీద, ఫ్రిడ్జ్ మీద, పూజ గది లో, ఇంటిలో కనపడే చోట, వాహనము మీద రక్షణ లేదా గుర్తు(స్మరణ) గా వీలైతే ఉపయోగించుకోవచ్చు.
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content
APLatestNews.com - Sri Swami Tatvaalu శ్రీ స్వామి తత్వాలు