పద్యంతో పరమార్ధం - అడవిపక్షుల కెవ్వ డాహార మిచ్చెను - శేషప్ప కవి నరసింహ శతకం తెలుగు పద్యాలు - Songs - శ్రీ స్వామి తత్వాలు
           
మిగతా తత్వం కూడా మనసుతో చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 104 కధనాలు (Articles). ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,873,627; 104 తత్వాలు (Tatvaalu) and views 225,611.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Spirit with Poem- adavipakshula kevaa daahaara michche, Narasimha satakam, Seshappa, Telugu Padyalu

శ్రీ నరసింహ శతకము తెలుగు శతక సాహిత్యంలో ప్రముఖమైనది . ఈ శతకమును రచించినది కరీంనగర్ జిల్లా ధర్మపురికి చెందిన శేషప్ప కవి.

శేషప్ప కవి రచించిన నరసింహా శతకం నుండి, భగవంతుని లీలలు వర్ణిచే, మనసు కదిలించే, భక్తి రగిలించే, ముక్తి చూపించే, ప్రపంచ బ్రమలు వదిలించే పద్యాలు ఎన్నో, మొత్తము 100 పద్యాలు. అందులో మచ్చుకి ఒకటి ఈ 44 వ పద్యము, వనాలలో తిరిగే వారికి భోజనం అందిస్తున్న దెవరు? ఆ వనాలలో పెరుగు తున్న వృక్షాలకు నీరు తెచ్చి పోస్తున్న దెవరు? గాలీవెలుతురు లేని స్త్రీల గర్భకోశాలలో శిశువు లను నవమాసాలు పెంచి సంరక్షిస్తున్న దెవరు?

44. అడవిపక్షుల కెవ్వ డాహార మిచ్చెను
                         మృగజాతి కెవ్వడు  మేతబెట్టె
           వనచరాదులకు భోజన మెవ్వ డిప్పించె
                         జెట్ల కెవ్వడు నీళ్ళు  చేదిపోసె
           స్త్రీలగర్భంబున  శిశువు నెవ్వడు పెంచె
                         ఫణుల కెవ్వడు పోసె బరగ విషము
            మధుపాళి కెవ్వడు మకరంద మొనరించె
                          బసుల మెవ్వ డొసంగె బచ్చిపూరి
తే.గీll జీవకోట్లను బోషింప నీవెకాని
          వేఱె యొక దాత లేడయ్య వెదకిచూడ.
          భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
          దుష్టసంహార ! నరసింహ! దురితదూర !

ఓ నారసింహదేవా!

అడవిలో పక్షులకు తిండి పెడుతున్న దెవరు?

మృగాలకు మేత పెడుతున్న దెవడు?

వనాలలో తిరిగే వారికి భోజనం అందిస్తున్న దెవరు?

ఆ వనాలలో పెరుగు తున్న వృక్షాలకు నీరు తెచ్చి పోస్తున్న దెవరు?

గాలీవెలుతురు లేని స్త్రీల గర్భకోశాలలో శిశువు లను నవమాసాలు పెంచి సంరక్షిస్తున్న దెవరు?

పాముల తలలో విషాన్ని నింపుతున్న దెవరు?.

తుమ్మెదలకు మకరందాన్ని అందిస్తున్నదెవరు?

పశువులకు పచ్చికను మొలిపిస్తున్న దెవడు?

ఇవి మాత్రమే కావు సమస్త జీవరాశుల ఆలనా పాలనా చూస్తున్న వాడెవ్వడు?

అని విచారించి చూస్తే...

ఆ మహాదాతవు నీవే నని, నీవు తప్ప ఇంకొకడు లేడేలేడని తెలుస్తున్నది.

అందుకే నిన్ను నమ్మి త్రికరణ శుద్ధిగా నీకు శరణాగతుడనై వున్నాను.

నీచే సృష్టింపబడిన ఎనభై నాలుగు లక్షల రకాల జీవరాశులలో ఏ ఒక్కజీవి, నాకింత తిండి పెట్టమని అడక్కపోయినా, నీవే వేళకింత వాటికి ఆహారాన్ని ఏదోరీతిగా అందిస్తూనే వున్నావు.

ఆ జీవ రాశులలో నేనొకణ్ణి.

వాటి అన్నిటికి అందుతున్నట్లే నాకూ ఆహారం అందుతూనే వున్నది.

లేకపోతే నేను ఈ భూమి మీద ఇన్నాళ్ళు ఎలా బతికి బట్ట కట్టగలిగే వాణ్ణి?.

నారు పోసిన వాడే, నీరు పోస్తాడని నా చిన్నప్పటి నుండీ వింటూనే వున్నాను.

వినటమే కాదు  నేను ఇన్నాళ్ళు బతికివుండటమే అందుకు సాక్ష్యం.

జీవులచే, వారి వారి పురాకృత సుకృత దుష్కృతాలను సుఖదుఃఖాల రూపేణ అనుభవింప జేయాలంటే అవి బతికి వుండాలి కదా!

స్వామీ!ఆభరణాలచే నొప్పు వాడా!

దుష్ట సంహారా!

పాపాలను దరిచేర నీయని వాడా!

ధర్మపుర వాసీ!

ఓ నరసింహ స్వామీ! నీ కిదే నా నమస్కారము...

సకల మృత్యుభయ నివారిణి..శ్రీ నారసింహ మంత్ర ధ్యానం  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,873,627; 104 తత్వాలు (Tatvaalu) and views 225,611
Dt : 16-Mar-2023, Upd Dt : 16-Mar-2023, Category : Songs
Views : 1721 ( + More Social Media views ), Id : 90 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : spirit , poem , adavipakshula , kevaa , daahaara , michche , narasimha , satakam , seshappa , telugu , padyalu
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments

గమనిక - పైన ఉన్న "శ్రీ రామ రక్ష" పిక్చరు ను స్టికర్ గా, ఇంటి గుమ్మం తలుపు మీద, ఫ్రిడ్జ్ మీద, పూజ గది లో, ఇంటిలో కనపడే చోట, వాహనము మీద రక్షణ లేదా గుర్తు(స్మరణ) గా వీలైతే ఉపయోగించుకోవచ్చు.
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content
APLatestNews.com - Sri Swami Tatvaalu శ్రీ స్వామి తత్వాలు