ప్రాణం ఖరీదు - జాలాది - పలుపు తాడు మెడకేస్తే పాడి ఆవు రా, పసుపు తాడు ముడులేస్తే? - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2074 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2109 General Articles and views 1,867,337; 104 తత్వాలు (Tatvaalu) and views 225,053.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

మిత్రమా గొంతు వాక్సుద్ది పెంచు చేతులు కదిలించు క్రుతజ్ఞతలు చూపించు- శ్లోకమో పద్యమో పాటనో మాటనో రాతనో మొదలు పెట్టు. ఎది త్యాగం, ఎది సేవ, ఎది తిరిగి ఇవ్వడం? కనీసం ముదుసలి సాత్విక తల్లిని లాలించు. వారానికి ఒక్క సాత్విక పని, మన స్నేహితులకు పెద్దలకు చెప్పడానికి ఏమీ లేదంటే, ఇక మనము దేవుని ఎదురు, తలవంచుకునే ఉంటాము, బండలా శిక్షకు పాత్రులము అవుతాము, పిల్లలను సంస్కార హీనులను చేస్తున్నాము, ముదుసలి తనములో తోడు ఉండరు.

డబ్బు ఖర్చుపెట్టి ఆనందాన్ని సంపాదిస్తావా? లేక ఆనందాన్ని ఖర్చు పెట్టి డబ్బు సంపాదిస్తావా? నీ కోసము, నీ ఆత్మ కోసం, నీ కర్మ ఫలం కోస, ఓ గంట కేటాయించలేవా? ఈ జన్మ కూడా వ్యర్ధమేనా?

పాట రచయిత జాలాది గారు వాడిన పదాలు, తడి ఉన్న మనసును బరువు ఎక్కిస్తాయి, ఆలోచింప చేస్తాయి. గుండె లోతుల్లోకి వెళ్ళి నాటుకుంటాయి. మనసున్న వారికి, కన్నీళ్ళు తెప్పిస్తాయి, తను పుట్టిన విధం గుర్తుకు వస్తుంది. ఆడమనిషి విలువ తెలుస్తుంది. ఎంత అర్ధం, ఎంత పరమార్ధం, ఎంత వేదాంతం. జీవిత సత్యాలను, తేలిక జానపదాలలో చెప్పేసారు.

సీతమ్మ లాంటి, ఉత్తమ మంచి ఇల్లాళ్ళ కష్టాలను, సూటిగా చెప్పారు. గొడ్డు మెడకు తాడు
వేస్తాము, ఇల్లాలి మెడ లో తాళి కడతాము. కుడితి నీరు తాగి, గొడ్డు పాలు ఇస్తుంది. చెడ్డ భర్త, ఇల్లాలు కు ఎంత కడుపు కోత పెట్టినా కూడా, భరించి అన్ని కడుపులోనే దాచుకుని, మరలా మనిషికే జన్మ ఇస్తుంది.

బొడ్డు పేగు తెంచుకుని, బయటపడ్డ రోజు తలచుకుంటే, అమ్మ విలువ, అలాగే అలాంటి ఆడవారి విలువ తెలుస్తుంది అని మరలా గుర్తు చేసారు.

చెడు బుద్ది తో ఇతర మహిళలను మరియు పిల్లలను చూసే వారు, చెడుతిరుగుళ్ళు తిరిగే వారు, తమ అమ్మ తమ ఇల్లాలు అలాగే తమ కూతురు వైపు కూడా అలాగే 10 మంది చూసి తిరిగితే ఎలా ఉంటుంది అని ఆలోచన చేస్తే, ఎటువంటి తప్పుడు పని చేయలేరు.

నీతి నియమాలు తప్పి ధన లేదా వ్యామోహము లో, పశువులా ఇష్టపడి తిరిగితే కూడా తప్పే, అది వారి ఖర్మ, దానికి ఫలితము ఉంది, అప్పుడూ వారి ఇంట్లో మహిళలు అలాగే ఇష్టపడి తిరుగుతారు సుమా, నీవు నేర్పిన విద్య నే అని.

భర్తలను నడి రోడ్డుకు లాగి లేదా ఇంట్లోపలే గుట్టుగా, రాచి రంపాన పెట్టి, చీల్చి చెండాడే, ఉత్తమ ఇల్లాళ్ళు కూడా ఉన్నారు, అది వేరే విషయము. తమ తప్పులకు అలాగే ఆడవాళ్ళ దెబ్బకు, ఇంట్లో నుంచి పారిపోయి, విడిగా ప్రశాంతముగా ఆడింది ఆట పాడింది పాటగా జీవించే వారు భర్తలు కూడా ఉన్నారు. మధ్యలో నష్టపోయి చెడిపోయేది పిల్లలు.

అందుకే ఉత్తమ ఇల్లాలు సహధర్మ చారిణి దొరకడం అనేది పూర్వ జన్మ సుక్రుతం. అందుకే నిగ్రహం ఉంటే ఆదిశంకరులు గా బ్రహ్మచారిలా ఉండాలి లేదంటే, గుణం చూసి మాత్రమే వివాహం చేసుకోవాలి.

ఎంత తోడుకున్నా, ఏటి లో నీరు అయిపోవు. కానీ మన బాధలతో ఎంత ఏడ్చినా, కుండ నిండదు. అబ్బా ఎంత బాగా చెప్పారు, కష్టాల గురించి, ఇవి తెచ్చుకున్న కష్టాలు కావండి, కాలం తో సహజము గా కలసివచ్చిన కష్టాలు. అవి తోడు గా ఉంటే, నీతి నియమాలతో దేవుడి కి దగ్గరగా ఉంటాము.

సంపాదన తిండి సుఖం బద్దకం నిర్లక్ష్యం లెక్కలేనితనం పెరిగిపోతే, దేవుడు ఎటూ దూరం, బయట వారు ని అసలు మనుషులు గా చూడం, ఇంట్లో వారిని లెక్క చేయం పట్టించుకోము. ఇది మనిషి తత్వం. ఎందుకంటే ప్రపంచాన్ని జయించినా, తనని తాను జయించలేడు.

అందరమూ ఒకటే, వచ్చిన అలాగే పోయే దోవా ఒక్కటే. చీము నెత్తురూ ప్రవహించేది అందరికీ ఒకటే, బానిసలు గా చూడవద్దు. శివయ్య పార్వతిని సగము గా భావించి, అర్ధనారీశ్వరుడు అయ్యాడు. ధనానికి వీసాకు అందానికి పదవికి ఆస్తికి లొంగకుండా, ఉత్తము గుణవతిని చేసుకుంటే, ఎటువంటి ఇబ్బందులు రావు.

బీద అయినా ధనవంతుడు అయినా, బంగళాలో ఉన్నా చెట్టు కుంది ఉన్నా, నిద్ర ముదిరితే అంటే ప్రాణం పోతే, పరలోకానికి ఏగితే, పాడే అలాగే వల్లకాడు, అక్కడ కావాల్సిన 6 అడుగుల గొయ్య కూడా ఒకటే, బేధవాలు వద్దు ఏ విషయము లో కూడా. ఇప్పుడు కరెంట్ తో కాలచడం వచ్చాక, గొయ్య తో కూడా పని లేదు సుమా.

ఉన్న వాడు ఏమి తప్పులు చెప్పినా చేసినా, చప్పట్లు కొట్టే పిచ్చి జనం, అదే సామాన్యుడు ఆకలి బాధతో అరిస్తే, ఏమిటి ఈ కాకి గోల అంటారు.

అందుకే అరిషడ్వర్గాలను జయించే ప్రయత్నము చేస్తూ, పంచభూతాల సాక్షిగా, త్రికరణ శుద్దిగా, మంచి వైపే ఉండాలి, ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా. అదే ధర్మాన్ని కాపాడు అది మనల్ని కాపాడుతుంది అంటే.

యాతమేసి తోడినా.. ఏరు ఎండదూ, పొగిలి పొగిలి ఏడ్చినా.. పొంత నిండదూ 2
దేవుడి గుడిలో దైన, పూరి గుడిసేలోదైనా, గాలి ఇసిరి కొడితే..., ఆ దీపముండదూ,
ఆ దీపముండదు ||యాతమేసి తోడినా||

పలుపు తాడు మెడకేస్తే పాడి ఆవు రా, పసుపు తాడు ముడులేస్తే ఆడదాయేరా 2
కుడితి నీళ్లు పోసినా... అది పాలు కుడుపుతాదీ..
కడుపు కోత కోసినా.. అది మణిసికే.. జన్మ ఇస్తా.ది
బొడ్డు పేగు తెగిపడ్డ రోజు తలుసుకో, గొడ్డు కాదు ఆడదనే గుణం తెలుసుకో
||యాతమేసి తోడినా||

అందరూ నడిసొచ్చిన తోవ ఒక్కటే.., చీము నెత్తురులు పారే తూము ఒక్కటే..2
మేడ మిద్దె లో ఉన్నా... చెట్టు నీడ తొంగున్నా...,
నిదర ముదర పడినాక... పాడె ఒక్కటే, వల్లకాడు ఒక్కటే
కూత నేర్సినోళ్ళ కులం కోకిలంటరా, ఆకలేసి అరిసినోళ్ళు కాకులంటరా
||యాతమేసి తోడినా||

ప్రాణం ఖరీదు సాంగ్స్, Yatamesi Todina Vodeo Song, Chiranjeevi, Jayasudha, రచన జాలాది

Pranam kharidu - Jaladi - Palupu tadu medakeste padi aavu ra, pasupu tadu muduleste adadayera  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2109 General Articles and views 1,867,337; 104 తత్వాలు (Tatvaalu) and views 225,053
Dt : 27-May-2022, Upd Dt : 27-May-2022, Category : Songs
Views : 706 ( + More Social Media views ), Id : 1406 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : pranam , kharidu , jaladi , palupu , tadu , aavu , pasupu , adadayera , chiranjivi , jayasudha
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content