అపాత్రా దానం గ్రహించడం శ్రేయస్కరం? పుణ్య ఫలము లో భాగం వారికి, పాప భారం మనకు? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,891,648; 104 తత్వాలు (Tatvaalu) and views 227,065.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

ఎవరి దగ్గర కూడా ఏమీ తీసుకోకూడదు, అకారణంగా, ప్రాణాపాయ అత్యవసర స్ధితిలో తప్ప. అలాగే అపాత్రా దానం గ్రహించడం కూడా, మనకు శ్రేయస్కరం కాదు.

పదిమంది ని బాధ పెట్టే లేదా ముంచే లేదా బాధ్యత లేని వారి నుంచి, అసలు ఏదీ తీసుకోకూడదు ఆశించకూడదు.

మన పుణ్య ఫలము లో భాగం, దానంతట అదే వారికి వెళుతుంది, అది వారికి బలం అయి, వారి పతనం ను కాపాడుతుంది, మనకు వారి పాప భారం పంచి పెంచుతుంది.

అలాగే వారు మన కన్నా మంచి వారైతే, ఉత్తములు సాత్విక గుణం కలవారు అయితే, ఖచ్చితంగా వారి ఆశీర్వాద దైవ బలం మనకు లభిస్తుంది. అండగా ఉంటుంది. మనం, కాదనకూడదు, తప్పకుండా పత్రం ఫలం తోయమైనా వద్దు అని అవమానించకుండా తీసుకోవాలి.

ఆదిశంకరులు ఉసిరి పండు ను దానంగా తీసుకున్నారు, కనకధారా స్తోత్రం పుట్టుక కధ తెలుసు కదా. తన పుణ్యం ను ఆమె కు ధార పోసారు.

ఓ పెద్దావిడ, 30 రూపాయలు ఇచ్చింది, తనకు మంచి జరగాలని దైవం ను ప్రార్ధించి, స్వీకరించాము. ఆమె కు కష్టం లో, అది సాయ పడుతుంది. వద్దు అని అవమానించలేదు, తక్కువ అని చిన్న చూపుతో. ఎందుకంటే పదివేలు లేదా లక్ష ఇచ్చిన కూడా, ఇంతేనా అని పెదవి విరిచే వారు ఉన్నారు.

కాబట్టి, జాగ్రత్తగా మెలుకువ తో ఉండాలి, ఇచ్చి పుచ్చుకోవడం లో, పాత్రత సాత్వికత ఎరిగి.

రాముడు, బలవంతుడైన వాలి వైపు ఉండలేదు, కేవలం బలహీనుడైన సుగ్రీవుడు తోనే ఉన్నాడు. కృష్ణుడు, బలమైన వందలాది కౌరవుల వైపు లేడు, బలహీనమైన 5 గురు పాండవుల వైపు ఉన్నారు. సాత్విక ధర్మం ముఖ్యం. బలగాలు వైభవాలు ముఖ్యం కాదు.

కొత్త వారు మనకు తెలీదు, ముందూ చెప్పలేదు. ఖచ్చితంగా చెప్పాలి అర్థం అయేవిధంగా. కాకపోతే ఓ సారి మాటలను బట్టి, కొంత అంచనా వేయవచ్చు.

మనం బాధ పడి వెనక్కు వస్తే అబద్దం చెప్పారు అని, మరలా అదొక బాధ అందరికీ. అవతలి వారు ఉత్తములు అయితే, మనకు అదొక అదనపు పాపం సుమా.

అయితే ఎప్పుడు అయినా, మనం సాత్వికులకు ఇచ్చే వారిలో నే ఉండాలి, అదీ మన సక్రమ కష్టార్జితం తో మాత్రమే, ఊళ్ళోళ్ళ సొమ్ము తో కాదు సుమా.

అందుకే ఇరుగు పొరుగు, బంధువులు, స్నేహితులు, జీవిత భాగస్వామి, పిల్లలు, మంచి మనసు గలవారు దొరకడం కూడా, ఓ అదృష్టం.

సర్వే జనా సుఖినోభవంతు అన్న మాటలు, చాలామంది కి గొంతు నుంచి వస్తుంది, కానీ చేతలలో ఆచరణలో రావడం లేదు. తల్లి దండ్రులు ను చూడలేని వారు బాధ్యత గా, జీవిత భాగస్వామి ని అలాగె పిల్లలు ను ప్రేమగా చూడలేరు.

మన చుట్టుపక్కల పచ్చ గా ఉంటే నే, మనం పచ్చగా ఉంటాము. ఇదే భగవద్గీత చెప్పిన సారాంశం.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,891,648; 104 తత్వాలు (Tatvaalu) and views 227,065
Dt : 09-Oct-2021, Upd Dt : 09-Oct-2021, Category : General
Views : 559 ( + More Social Media views ), Id : 1259 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : donation , gift , bad , virtue , sin
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content