తాగి సెడిపోకుమప్పా, తాగితే చేతికి చిప్పా, ఇంట్లో దినమే అప్పా - ఓ అమ్మ కధ - నూతన్ - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1621 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1656 General Articles, 61 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

సరదాకు, విషము ఒక బొట్టు తీసుకుంటామా? లేదు కదా? కానీ వీరు మాత్రం, అద్రుష్టము తో వచ్చిన ధనలక్ష్మిని అగౌరవముతో ఖర్చు చేస్తూ, తాము పతనము అవుతు, తమ కుటుంబాన్ని రోడ్డుకు ఈడుస్తూ, అర్ధం లేని త్యాగము తో ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుతున్నారు, ప్రపంచ జనాభా తగ్గిస్తున్నారు.

ఒకరకముగా త్యాగ మూర్తులు కూడా, తాము నాశనం అవుతూ, తమ కుటుంబాన్ని నాశనం చేస్తూ, దేశ రాష్ట్ర ప్రగతికి, తమ ధనాన్ని, విచ్చలవిడిగా అనవసరముగా, తాగి తగలేస్తుంటారు కాబట్టి.

మత్తులో ఉంటే విచక్షణా జ్ఞానం తగ్గుతుంది అని వీరి కుటుంబములో ప్రతి ఒక్కరికీ తెలుసు, కానీ పాటించరు, ఆపరు.

కరోనాకు మనము చేతులు అల్కాహాలుతో కడుక్కుంటే, వీరు పేగులు నరాలనే ఆల్కాహాల్ తో, ఆనందముగా రోజూ కడిగే, మూర్ఖ ధైర్యవంతులు. వారి భాగస్వామి పిల్లలు అన్నా వీరికి జాలి దయ ఉండదు అనేంత బానిసలు. కాని తాగినప్పుడు మాత్రం సత్యమే పలుకుతారు, తాగుబోతులంత ఉత్తమ పతన స్నేహితులు ఇంకొకరు ఉండరు. దాన కర్ణుడి లా అడిగి మరీ ఉచితముగా పోయిస్తారు, ఇతరుల కొంప కూడా, తమ కొంప లాగే నాశనం అవ్వాలని.

అష్ట వ్యసనాలకు బానిస అయితే, ఏదో ఒక రోజుకు పతనము తప్పదు, వ్యక్తిగత రోగ నిరోధక శక్తిని బట్టి అని వారికీ తెలుసు, కానీ మానసిక బలహీనం. కాలేజీ స్టూడెంట్ గా ఉన్నప్పుడే, బార్లీ బీరులతో చిన్న గా మొదలు పెట్టి లేదా తర్వాత నేర్చుకుని, ఆ తర్వాత ఎదిగి, బారుకు ధనము తో పోతూ ఉంటే, ఇంటికి ఖాళీ జేబుతో తూలుతూ వస్తూ ఉంటే, ఇంట్లో వాళ్ళు బావురు మంటున్నారు, ఇంకొందరు తమకు వీలైన పక్క దోవ తామూ చూసుకుంటున్నారు.

ఇప్పుడు సోషల్ కామన్ అని చెప్పి, తేలిక సకుటుంబ పతనం కు, ఇంట్లో అందరూ కూర్చుని తాగడమో లేదా ధనము కార్లు ఇచ్చి అర్ధరాత్రి యువత ఆడ మగా తేడా లేకుండా బారులకు పంపడమో కూడా, కుటుంబ సాంప్రదాయముగా జరుగుతుంది, కొంతమందిలో. అదే సమాజం లో గొప్ప కల్చర్ గా కొనసాగుతుంది. పెరుగుట విరుగుట కోరకే అంటే ఇదే సుమా.

మామూలు వ్యక్తికే, మైండ్ సగము పని చేయదు. ఇక ఆల్కాహాల్ తాగుతూ, మిగతా సగము కూడా, పని చేయకుండా, చచ్చిన శవము లా పడి ఉంటారు రోడ్లమీద లేదా బారులో/ ఇంట్లో. దొంగ వచ్చి అన్ని ఎత్తుకుపోతున్నా, ఇంట్లో వారు తప్పుడు పనులు చేస్తున్నా తమ ఎదుటే, వారికి పట్టదు, ఎక్కదు, నీతి చెప్పలేరు.

వంద కారణాలు చెపుతారు, ఎందుకు తాగుతున్నారో, ఎందుకు దిగజారారో అని అర్ధం కు. నిజానికి ఏ కష్టము పోదు, ధనము మరియు ఆరోగ్యము కూడా మిగలదు అని వారికి తెలుసు. తెల్లారి లెగిస్తే మరలా అవే బాధలు కష్టాలు.

ఇంక చదువు కున్న వారి, నీతులు గమ్మత్తు గా ఉంటాయి. డాక్టరు కషాయం, కాకరకాయి తీసుకోమంటే మాత్రము తీసుకోరు. మందు మాత్రం రోజుకు ఓ గ్లాస్ తీసుకోమన్నారు అని, ఆత్మ దోహము చేసుకుంటూ, కుటుంబ ద్రోహము కూడా చేస్తారు.

బోస్టన్ లండన్ సియాటిల్ కెనడా చికాగో జమ్ము కాశ్మీర్ లాంటి చలి ప్రదేశాలలో కూడా, ఖరీదైన మందుకు బదులు, భాగస్వామి ఇచ్చిన కషాయం తాగవచ్చు. తక్కువ ఖర్చులో ఇంట్లో జీలకర్ర వాము తో వేడినీళ్ళు తాగినా, ఒంట్లో వేడి వస్తుంది. కాని ఇవి చేయరు, దేశ ఎకానమీ ఎలా పెంచాలని వీరి భావన, కొంప కొల్లేరు అయినా కూడా. మనము గతము లో ఆరోగ్యకరమైన వెజిటేరీన్ డ్రింక్ లు కూడా చెప్పాము లింక్ లో link

ఆరోగ్యము నాశనం అవ్వడానికి, ఎంతో ఖర్చు పెట్టి మందు బ్రాండ్ లు కొని, తమ ఆరోగ్యం పతనము చేసుకుని, కొంప నాశనం చేసి, తాము ఉన్నా లేదా పోయినా, ఇంట్లో వారు పదిమంది ఎదురు చేయి చాపి ఎదురుగా లేదా ఆన్లైన్ లో అడుక్కునే పరిస్తితికి తెస్తారు. లేదా పిల్లలు అదే అలవాటు చేసుకుని, బుద్ది మాంద్యము తో ఎవరినీ లెక్కచేయక, తాతలు సంపాదించిన ఆస్తిని కూడా, తగలబెడుతూ, ఇతరుల చేతిలో మోసపోతారు.

ఏవిధము గా చూసినా, దేవుడిని నమ్మే సాత్విక భక్తులు, అష్ట వ్యసనాలకు, దూరముగా ఉంటారు. కనీసం తమ కుటుంబము పై బాధ్యత ఆత్మశుద్ది ఉన్న వ్యక్తులు అయినా సరే, సరదాకు కూడా, మందు ముట్టుకోరు, అని విజ్ఞులు అంటున్నారు.

తాగి సెడిపోకుమప్పా, తాగితే చేతికి చిప్పా 3
[ఇంట్లో దినమే అప్పా, భోజనాల తద్దినమే అప్పా]

తిత్తులను తినేసునప్పా, నెత్తురుని ఇరిసేసునప్పా 2
అవిటోడిని సేసేను అప్పా, ఆయువును మింగేసునప్పా 2 ||తాగి సెడిపోకుమప్పా||

అమ్మ కీడమ్మా సారా, అమ్మ కీడమ్మా ఘాటూ సారా 2
కీళ్ళ బిగి తగ్గించునప్పా, నరాల సత్తువ చిత్తవునప్పా 2 ||తాగి సెడిపోకుమప్పా||

తాగుడు లో ఉన్న ఆరునొక్క లచ్చనాలను ఈ
నరాల నాగప్ప, ఇవరంగా చెపుతాడు, వినుకోండిరా బాబులు ఇనుకోండి

మొదటి డోసుకు సిలకలా పలుకుతాడు
రెండో డోసుకు కోయిలలా పాడతాడు ఆ ఆ
మూడో డోసుకు కొంగలా తింటాడు

నాలుగో దానికి, పిచ్చి కోతిలా.., కుప్పి గంతులు వేస్తాడు ఓయ్ ఓయ్

ఐదో దానికి, వి..భీషణుడిలా.., ఇంటి గుట్టు బట్టబయలు చేస్తా..డు

ఆరో డోసుకు కర్ణుడిలా దానధర్మాలు చేత్తాడు, చేత్తాడు అంతే, ఒంటి మీద గుడ్డలు కూడా పీకి ఇస్తాడు
ఏడో డోసు వేసాడా, కుంభకర్ణుడి లా గుర్రు పెట్టి బబ్బుంటాడు, ఆయీ గుర్రు పెట్టి బబ్బుంటాడు,
గుర్రు పెట్టి బబ్బుంటాడు .., గుర్రు పెట్టి బబ్బుంటాడు ..
అందుకే ||తాగి సెడిపోకుమప్పా||

ఈ పాడు అలవాటు మూలముగా,
రావణుడు కీచకుడు కూడా, డాక్టర్లు డ్రైవర్లు కూడా, 2
గాయకులు నాయకులు కూడా, స్టూడెంట్ బాబులు కూడా
సినిమాల యాక్టర్లు కూడా, తాగి తాగి సచ్చారు తండ్రో ఓ 2 ||తాగి సెడిపోకుమప్పా||

తాగి సెడిపోకుమప్పా, తాగితే చేతికి చిప్పా 3
[ఇంట్లో దినమే అప్పా, భోజనాల తద్దినమే అప్పా]

Taagi Sedipokumappa Taagite Setiki Sippa - Song - O Amma Katha (1981) - Nutan Prasad  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1656 General Articles, 61 Tatvaalu
Dt : 15-May-2022, Upd Dt : 15-May-2022, Category : Songs
Views : 356 ( + More Social Media views ), Id : 1391 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : tagi , sedipokumappa , tagite , setiki , sippa , amma , katha , nutan , prasad , sharada
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content