Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.
నవంబరు లో ఉదయం చీపురు తీసుకుని, ఈ చలి లో బయట వాకిలి చిమ్మే వారు ఉన్నారా, అదే 75 ఏళ్ల కు? అదీ దూర ప్రాంతంలో, అసలు ఉంటారా? వద్దు అన్నా వినడం లేదు, వీలైతే కళ్ళాపి, ముగ్గులు కూడా. దానికి పని మనుషులు ఉన్నారు ఇప్పుడు.
కరోనా దెబ్బ కు, రాత్రి పూట కర్ఫ్యూ లాగా పెడుతున్నారు, అంట ఎక్కడో, రాత్రి 10 నుంచి, ఉదయం 5 దాకా, డిశెంబరు 21 దాకా అంట. మరి జనవరి 2 దాకా పెడతారు ఏమో.
చుట్టుపక్కల తిరిగే వారు చూసి, ఏమిటి ఈమె ఈ వయస్సు లో, ఈ ఓపిక ధైర్యం అని ఆశ్చర్యం.
సాఫ్ట్ వేర్ లేదా ఇతర ఉద్యోగాలు, భౌతిక శ్రమ లేకుండా పోతుంటే, విపరీతంగా అందరం లావు అవుతున్నాము, అధిక రోగాల పాలు అవుతున్నాము.
ఒళ్ళు దాచుకోకుండా, ఉదయం 5 కి లెగిచి, ఓపిక గా తిరగడం అంటే ఈ వయస్సు లోకి వచ్చిన తర్వాత, మనకు కష్టమే.
శనివారం మరీ ఘోరం, ఉదయం 4 కు లెగిచి, 7 కు బయటకు వెళ్లి, మధ్యాహ్నం 12 తర్వాత నే ఇంటికి, అందులోనే మన 108 ప్రదక్షిణలు, కూరగాయలు వారం సరుకులు కొనడం. అంటే, 8 గంటలు నడుము వాల్చకుండా, తిరుగుతూ ఉండటమే.
అమ్మ ఓపిక కు, నాకే భయం వేస్తోంది, ఇంత శక్తి మనకు ఉంటుందా, రాబోయే రోజుల్లో, కృష్ణా అని.
కరోనా దెబ్బకి పాత తరం వెళ్ళిపోతుంది, మనమూ కష్టమే అద్రుష్టము ఉంటే తప్ప, తర్వాత కరోనా ని ఎదుర్కోవాలి.
బాధ్యత కష్టం కనికరం బంధం, అంటే తెలియని కొత్త తరం, ఆ తర్వాత తరాలను, సెల్ ఫోన్, కంప్యుటర్ టాబ్లెట్ లు ఇచ్చి, పెంచడం మొదలు పెట్టారు.
ఇంకా ఎన్ని విచిత్రాలు చూడాలో, ఎన్ని కరోనాలు చూడాలో. అని రాము గొపీతో అన్నాడు.
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,891,450; 104 తత్వాలు (Tatvaalu) and views 227,054
Dt : 20-Nov-2020, Upd Dt : 20-Nov-2020, Category : General
Views : 695
( + More Social Media views ), Id : 820
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
mom ,
get up ,
4 ,
morning ,
go out ,
7 ,
go home ,
12 ,
afternoon
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments