Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.
కరోనా వైరస్ ది జాగ్రత్తలు, శాఖాహారం ఉత్తమం. చేతులు శుభ్రంగా కడుక్కుని, తాకకుండా కొంచెం దూరంలో ఉండటం మంచిది. అందుకే మన వారు నమస్కారం పెట్టారు, కొంతమంది కి షేక్ హాండ్ ఉన్నా కూడా. బయట రోడ్డు మీద తినుబండారాలు, బయట తిండి వద్దు.
కలియుగంలో భూ పాప భారం కు, దైవ అవతారం అవసరం లేదు, చిన్న దోమ చాలు కదూ, చిత్రం కదూ.
వెనకటి చిన్నప్పుడు, పెద్దలు, మనము బయట నుంచి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు మొఖం, శుభ్రం గా కడుక్కుని రమ్మనే వారు. నవ్వుకునే వాళ్ళము. చుట్టాలు వచ్చినా, చెంబు నీళ్ళు తో, ఎదురు వచ్చి ఇచ్చే వాళ్ళు ము. ఇప్పుడు అన్ని వదిలేశాము , పల్లెటూళ్ళలో కూడా.
అందుకే గుర్తు చేయడానికి, ఎబోలా, డెంగ్యూ, కరోనా, కత్రినా, అనుష్క, ఇలియానా, నయనతార లాంటి కొత్త కొత్త పేర్ల తో దోమ గురువు లు వస్తున్నారు.
మనం ఎంత సంప్రదాయం కు దూరంగా పోతామో , అన్ని కీటకాలు/ దోమలు వచ్చి పాఠాలు చెపుతాయి. మనషులకు మనుష్య గురువు లు కావాలి కానీ, జంతువులు కు జంతువులే గురువు లు కదా. పెద్ద ల మాట చద్ది మూట అంటారు.
పాత కాలంలో పనులు కు లేదా బయట ఊరి ప్రయాణాలకు, ఇంట్లో చద్దే తీసుకుని వెళ్ళేవారు, బయట తినకుండా, ముందు చూపుతో. ఇప్పుడు ఏ బయట తిండి చూచినా ఏమున్నది గర్వకారణం, సర్వం కల్తీ మయం, రోగ కారణం.
ఎవరో నాకిన ఎంగిలి చేసిన స్పూన్లు, గ్లాసు లు, పళ్ళాలు. మన పెద్దలు చేతితో మాత్రమే తింటారు, వేళ్ళ నరాల స్పందనతో రుచి పెరుగుతుంది. మన ఇంట్లో అంట్లు తోమితేనే, మెతుకులు లేదా కూర లేదా నూనె అతుక్కుని ఉంటాయి కదా, భార్య, భర్త, పని మనిషి తోమినా కూడా. మరి హోటల్ లో శుభ్రం దేవుడు ఎరుక కదా.
అందుకే ఇల్లు పరిసరాలు శరీరం ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి శాఖాహార నియమం ఉత్తమం, అందులోనూ మనకు తెలియని లేదా తప్పనిసరి కల్తీ ఉండవచ్చు. నవ్వించే లేదా హింసించే, ఒక జీవిత భాగస్వామి చాలు, చిన్నిల్లు పక్క ఇల్లు వద్దు. మనం మన అలవాట్లు మారందే మన పిల్లలు మారరు.
మంచి పాటించే తల్లి దండ్రులు మాత్రమే కనపడే దేవతలు. నారాయణుడు పరమేశ్వరుడు ఒకరే, వారే ఆది గురువు లు.
భవిష్యత్తు తరాలను కరోనా, కత్రినా ల నుంచి కాపాడుదాం. పంచ భూతాల గురించి పిల్లల కు తెలియచెప్పి, దేవుని పై గౌరవం పెంచుదాం.
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,893,631; 104 తత్వాలు (Tatvaalu) and views 227,199
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments