పురుషుల దినోత్సవం, గురువు మకరం లో, పుష్కరాలు, పవన్ అమరావతి, గణపతి విగ్రహం మెడలో - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2094 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2129 General Articles and views 1,919,265; 104 తత్వాలు (Tatvaalu) and views 229,439.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
* నాన్నగా పాలిస్తావు, అన్నగా రక్షణ కల్పిస్తావు..
* గురువు శని అధీనంలోని మకర రాశి లో
* తుంగభద్ర పుష్కరాలు
* పవన్ కళ్యాణ్ అమరావతి రైతుల
* గులాబీ కండువా, గణపతి విగ్రహం మెడలో
1 min read time.

* నాన్నగా పాలిస్తావు..అన్నగా రక్షణ కల్పిస్తావు..భర్తగా ప్రేమను పంచుతావు.. కొడుకుగా బాధ్యతలు పంచుకుంటావు.. ఒత్తిళ్లను జయించి.. కుటుంబాన్ని ముందుకు నడుపుతావు..కష్టాన్ని కళ్లలోనే దాచుకుని, మమకారాన్ని పంచుతావు..పురుష సేవలకు జోహార్లు..- అంతర్జాతీయ పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు, నవంబర్ 19

* దేవతల గురువుగా భావించే బృహస్పతి, శని అధీనంలోని మకర రాశిలో ప్రవేశించనుంది. నవంబరు 20 శుక్రువారం నాడు గురుడు మకరంలోకి ఆగమనం చెందనున్నాడు. ఈ రాశిలో ఈ ఏడాది చివరకి వరకు ఉండనున్నాడు. బృహస్పతిని సంపద, సౌకర్యాలు కారకంగా పరిగణిస్తారు. గురుడు ప్రయాణం వల్ల రాశిచక్రం గుర్తులపై ప్రభావం పడనుంది. ఇలాంటి పరిస్థితిలో గురుడు ఉండటం వల్ల రాశుల వారిక ఆనందం, శ్రేయస్సు కలగనున్నాయి. దీంతో పాటు సంపద కూడా పెరగనుంది. ఇదే సమయంలో మరికొన్ని రాశులపై ప్రతికూల ప్రభావం పడనుంది.

* ఈ నెల 20 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు తుంగభద్ర పుష్కరాలు. బృహస్పతి మకరరాశిలో ప్రవేశించే సమయంలో తుంగభద్ర నదికి పుష్కరాలు నిర్వహిస్తారు. ఈ పుష్కరాలు జరిగే 12 రోజుల్లో ముక్కోటి దేవతలు ఆ నదిలో కొలువై ఉంటారని ప్రతీతి.

నదీ స్నానాలకు అనుమతి లేదని, సంప్రదాయ పూజలకు మాత్రమే అనుమతి ఉందన్నారు.

* జనసేనాని పవన్ కళ్యాణ్ సినిమాల్లో నుండి, మళ్ళీ తిరిగి రాజకీయాల్లోకి. గత 2 రోజులుగా గుంటూరు జిల్లా మంగళగిరి వేదికగా కార్యకర్తలు, నాయకులతో సమావేశమయ్యారు. అమరావతి రైతుల సమస్యలను తెలుసుకున్నారు. పవన్ చాలా రోజుల తరువాత, సమావేశం నిర్వహించడం కూడా, ఆ పార్టీ నేతల్లో సంతోషాన్నిస్తోంది.

* అధికార టీఆర్ఎస్ పార్టీ గులాబీ కండువాను, దేవాలయంలోని గణపతి విగ్రహం మెడలో వేసి, పూజలు చేయడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. గణపతి దేవుడిపై టీఆర్ఎస్ పార్టీ కండువా వేయడంపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్రంగా మండిపడ్డారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీతోనే బీజేపీకి పోటీ అని, టీఆర్ఎస్ కాదని అరవింద్ అన్నారు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2129 General Articles and views 1,919,265; 104 తత్వాలు (Tatvaalu) and views 229,439
Dt : 19-Nov-2020, Upd Dt : 19-Nov-2020, Category : Politics
Views : 745 ( + More Social Media views ), Id : 818 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : intl mens day , guru , capricorn , tungabhadra , pushkaram , pawan , amravati , towel , ganapati , idol , neck
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content