Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.
మనవి, మీరు లేదా ఎవరైనా చదివారా లేరా, స్పందన ఉందా లేదా అన్నది ముఖ్యం కాదు. మన వారికి, సాత్విక గుణం పెంచామా పంచామా, దేవుని మనసులో మన ప్రయత్న లోపం లేదని, మన దోవ తప్పు లేదని, ఆయన తలిస్తే చాలు. ఆయన దయ కలిగిన చాలు.
కానీ ముఖ్యం ఏమిటి, మీరు చేస్తున్న మంచి ప్రయత్నాలు, నిస్వార్ధ సేవ ఏమిటి, ఇతరుల కోసం అంటే కనీసం తల్లి దండ్రుల కోసం మీరు కోల్పోతుంది ఏమిటి, అని మీ మిత్రులు బంధువులు స్నేహితులు కు, తెలియ చెప్పకపోవడం, వారిని మంచి వైపు, మీ ఆచరణలో చేస్తున్న పనులు తో, చైతన్య పరచకపోవడం మాత్రం, నేరం, ద్రోహం.
భగవంతుడు ఇచ్చిన, మేధస్సు ఐశ్వర్యం వాడుకుంటూ గమ్ముగా ఉంటే, ఇదే తిన్న ఇంటి వాసాలు లెక్క బెట్టడం. ఏరుదాటాక తెప్ప తగలేయడం.
మానవ సేవయే మాధవ సేవ అని, కనీసం తల్లి దండ్రులు సేవ కూడా, మీరు లేదా వారు ఒప్పుకోరని, మీకు తెలియకుండా నే మౌనముగా ఒప్పుకున్నట్లు.
మన నిస్వార్ధ సేవల కు, అంటే ధనం లేదా ప్రతిఫలం ఆశించకుండా చేసే పనులకు, మన మొఖాలు కనపడే ఫోటోలు వీడియో లు, అవసరం లేదు. జనం లో కనీసం, మన మాటలు మరియు చేతలు, ఉంటే చాలు కదా.
ఇద్దరు పిల్లలు పెంచిన కష్టం కన్నా, ఒక ముదసలి తల్లి లేదా తండ్రి ని పెంచిన చూసిన కష్టం ఎక్కువ, అని పెద్దలు విజ్ఞులు అంటారు. ఎందుకంటే సొంత పిల్లల మీద, ప్రేమ వ్యామోహం తో, ఎంత కష్టం అయినా ఇష్టం గా చేస్తాం, శారీరక శ్రమ తెలీకుండా.
కానీ అదే మనల్ని కని పెంచిన పెద్దల కోసం, చిన్న పని కూడా, విపరీతమైన కష్టం గా, అయిష్టంగా బలవంతంగా భావిస్తాం, ఇక వారితో ధన అవసరం ఉపయోగం లేదని, పచ్చి అవకాశవాదులుగా క్రుతజ్ఞతలు లేకుండా.
మీ మంచి పనులు మీరు చెప్పకపోవడం, మాలాంటి అజ్ఞాన శిష్యులు అందరికీ, ఆదర్శంగా నిలవకపోవడం మాత్రం, సమాజ, దైవ, దేశ ద్రోహం కూడా మిత్రమా. తప్పవు శిక్షలు, మన తర్వాత తరాలతోనే.
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,894,792; 104 తత్వాలు (Tatvaalu) and views 227,311
Dt : 09-Feb-2021, Upd Dt : 09-Feb-2021, Category : General
Views : 877
( + More Social Media views ), Id : 966
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
good efforts ,
selfless ,
parents ,
social ,
service ,
inform ,
motivating ,
friends ,
crime ,
betrayal
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments