భక్త రామదాసు కీర్తనలు - ఏ తీరుగ, పలుకే బంగార, ననుబ్రోవమని - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2083 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2118 General Articles and views 1,880,636; 104 తత్వాలు (Tatvaalu) and views 226,181.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 2 min read time.

భక్త రామాదాసు కీర్తనలు తెలియని వారు లేరు. తను రామయ్య కోసం ఎన్ని కీర్తనలు రాసారో ఎంత ఆవేదనతో పాడారో, మనమూ పాడి అనుభుతి చెందాలి, ఆ రామయ్య క్రుప పొందాలి.

ధనము తో పని లేని, మన సొంత గుణము ల తో, అంటే సత్ప్రవర్తన, పెద్దల ఎడ గౌరవం, మంచి మాటలు రాయడం చెప్పడం ఆచరించడం, కీర్తనలు పాడడం, సజీవ గురువులు ముదుసలి తల్లి దండ్రులను సేవించడం ఎన్నో విధాలుగా రామయ్యను అనుసరించవచ్చు ఆచరణలో. మీరు ప్రయత్నం చేస్తారు కదూ?

1. ఏ తీరుగ నను దయ చూచెదవో, ఇన వంశోత్తమ రామా
నా తరమా భవ సాగరమీదను, నళిన దళేక్షణ రామా

శ్రీ రఘు నందన సీతా రమణా, శ్రితజన పోషక రామా
కారుణ్యాలయ భక్త వరద నిను, కన్నది కానుపు రామా

క్రూరకర్మములు నేరక చేసితి, నేరములెంచకు రామా
దారిద్ర్యము పరిహారము సేయవే, దైవ శిఖామణి రామా

వాసవ నుత రామదాస పోషక వందన మయోధ్య రామా
భాసుర వర సద్గుణములు కల్గిన భద్రాద్రీశ్వర రామా

2. ప: పలుకే బంగారమాయెనా కోదండపాణి || పలుకే ||

చ 1: పలుకే బంగారమాయె పిలిచిన పలుకవేమి
కలలో నీ నామస్మరణ మరువ చక్కని తండ్రి || పలుకే ||

చ 2: ఇరువుగ ఇసుకలోన పొరలిన యుడుత భక్తికి
కరుణించి బ్రోచితివని నెర నమ్మితిని తండ్రి || పలుకే ||

చ 3: రాతి నాతిగజేసి భూతలమందున ప్ర
ఖ్యాతి జెందితివని ప్రీతితో నమ్మితి తండ్రి || పలుకే ||

చ 4: ఎంత వేడినను నీకు సుంతైన దయరాదు
పంతము చేయ నేనెంతవాడను తండ్రి || పలుకే ||

చ 5: శరణాగత త్రాణ బిరుదాంకితుడవుగావా
కరుణించు భద్రాచల వర రామదాస పోష || పలుకే ||

3. ననుబ్రోవమని చెప్పవే సీతమ్మతల్లి న ॥

చరణము(లు):
నను బ్రోవమని చెప్పు, నారీ శిరోమణి
జనకుని కూతురా, జననీ జానకమ్మా

లోకాంతరంగుడు, శ్రీకాంత నినుగూడి
ఏకాంతమున ఏక శయ్యానున్న వేళ

అద్రిజ వినుతుడు, భద్రగిరీశుడు
నిద్ర మేల్కొనువేళ నెలతరో బోధించి

bhakta Ramadasu hymns kirtan - ea teeruga, paluke bangaaram, Nanubrovamani  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2118 General Articles and views 1,880,636; 104 తత్వాలు (Tatvaalu) and views 226,181
Dt : 09-Apr-2022, Upd Dt : 09-Apr-2022, Category : Songs
Views : 1441 ( + More Social Media views ), Id : 1336 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : bhakta , ramadasu , hymns , kirtan , ea teeruga , paluke bangaaram , nanubrovamani
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content