2 నిమిషాల ఆధ్యాత్మిక, ఆరోగ్య, సాంప్రదాయ, సనాతన ధర్మ, మాతృభాష, మాతా పిత రుణం, దైవ పలుకులు - Devotional - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2080 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,873,096; 104 తత్వాలు (Tatvaalu) and views 225,559.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 2 min read time.

ఓం నమో నారాయణాయ, ఓం నమో శ్రీమాత్రే నమః, ఓం నమో కరోనా గురువే నమః, ఓం నమో గురవే నమః.

కనపడేది జరిగేది అంతా, మాయా మోహ భ్రమ నటన సుమా, దూరంగా ఉండి ఆనందించాలి, అందులో భాగమైతే పతనం మొదలు. మంచి కై ప్రయత్నిస్తూనే ఉండాలి, ఫలితం లేకున్నా, చెడుకు దూరంగా ఉండాలి.

ఇవి అందుకుని ఇక్కడ మరియు ఫోటో లో ఉన్న మంత్రం పలుకుతూ, నమస్కారం చేసే, ప్రతి సాత్వికునికి, మా ఈ పుణ్య ఫలంలో భాగం.

(1) శుభోదయం, శుభదినం, శుభ సంకల్పం, ఆత్మ స్వరూపులైన గురువు లందరికీ, 7 ఏళ్లుగా జరుగుతున్న యజ్ఞం, శిరస్సు వంచి నమస్సుమాంజలి.

నారాయణ ఆత్మ స్వరూపులైన, మీ అందరి ఆశీస్సులు తో పాటుగా, దైవ ఆశీర్వాదం ఉంటుంది. మనః సంస్కారం తో, సాత్వికులకు, దైవ అనుగ్రహం కోరే వారికి, కష్టాలు లో ఉన్న వారికి, పంపుతారు కదూ.

అందరం బాగుండాలి. దైవం, అందరి మంచి కోరే సద్బుద్ది, సాత్విక గుణం, హృదయ మనసు స్పందన, ప్రతి నమస్కార సంస్కారం ఇవ్వాలి.

మన కోటి ఆలోచనల మాదిరిగా నే, కోటి రూపాలున్నా నామాలున్నా, నిరాకారుడు నిరంజనుడు ఒకరే అని తెలియాలి, అదీ మొదట మనలోనే కనుగొనాలి. మొదటి మెట్టు, బయట చేసే పూజకు 4 రూపాయల పుణ్యం వస్తే, పరిణితి పొందిన లోన చేసే మానసిక ధ్యాన పూజకు 400 ల రూపాయల పుణ్యం, అంటారు పెద్దలు. శివయ్య, విష్ణువు, హనుమాన్ కనులు మూసి ధ్యానం లోనే ఉంటారు కదూ?

(2) ఏమైనా మనదే పూర్తి బాధ్యత అని సంతకం తీసుకుని, రెండు టీకాలు వేసినా, ఇంకా 6 అడుగులు దూరం, రెండు ముక్కు మూతి అడ్డు గుడ్డలు, తప్పనిసరి అంటున్నారు మిత్రమా. మనము చెప్పిన పద్దతిలో రోగనిరోధక శక్తి కావాలి పెరగాలి తప్పదు.

కరోనా గురువు అప్పుడే వీడదు, ఏడాది గా బుద్ధి రాని వారికి, బుద్ధి తెచ్చి, తర్వాత నే వెళుతుంది. అవసరం బట్టి, కరోనా అక్క (ఫ్లేవర్) కూడా రావొచ్చు ఏమో.

రోజూ, మన వాట్సప్ స్టేటస్ లో, 24 గంటలలో మారిపోయే, సాత్వికత పలుకులు చిత్రములు మరువద్దు. మీ సాత్విక పనులు కూడా, మాకు దయచేసి తెలియచెప్ప గలరు. మీరు ఏం చెప్పారు నిజాయితీ గా, మంచి మనసు తో అన్నదే ముఖ్యం, మీది లేక మాది, తప్పు అయినా ఒప్పు అయినా.

* మీ ఊరు మంచి మనిషి, అధికారి మరియు నాయకుడు ఉంటే, వారి మంచి పనులు వెబ్సైట్/ ఫేస్బుక్/ ట్విట్టర్ లో సాక్ష్యం ఉంటే, లింక్ పంపగలరు. పదిమంది కి, వారి మంచితనం రాష్ట్రం అలాగే విదేశాల్లో తెలియచేద్దాం.

* ఏప్రిల్ నెలలో 10 మంది కి ధన సహాయం చేద్దాం అని, వారి లక్షణాల లింకు పంపాము, మీ స్నేహితులు బంధువులు సంఘాలు ద్వారా, వారికి సహాయం అందే విధంగా చేయగలరు. మీకు తెలిసిన, చెప్పగలరు.

(3) మన లోని పశు లేదా రాక్షస గుణాలనే అరిషడ్ వర్గాలు ను, నిరంతర సాధన తో మనమే అంతమొందించి జయించి, సాత్విక గుణం కూడా దాటాలి, దేవుని అండతో. దానికి ఏళ్ళు, కొన్ని సార్లు జీవిత జన్మ లు కావాలి.

మంచి విన్నా, చూసినా, చేసినా పుణ్యం, అదీ సత్సంగమే. ఇవి అందుకునే, ప్రతి ప్రాణికి, దైవ రక్ష కలగాలి.

ప్రత్యక్ష దైవాలు, ముదుసలి అమ్మా నాన్న ల పూజా రుణం తర్వాతే, దేవుని పూజకు విలువ ఫలితం. సాంప్రదాయం, ఆరోగ్యం, మనశ్శాంతి, గ్రహశాంతి.

భౌతిక ఆడంబర ఖర్చు పూజ కన్నా, మానసిక పూజ ఉత్తమం. భక్తి, త్యాగం ప్రేమ దయ ని నేర్పాలి, కఠిన పరిస్థితి కి కూడా, నీతి గా నిలబడే ధైర్యం ఇవ్వాలి.

(4) 7 ఏళ్లుగా తెల్లారే 4.30 కు లెగిచి, ఇంట్లో పూజ ఆ తర్వాత తర్వాత, వేద మంత్రోచ్ఛారణతో 75 ఏళ్ల అమ్మ పాదాలు కడిగి, ఆకులు పూలు పూజ, ఆ నీళ్లు నెత్తిన చల్లుకుని, 3 ప్రదక్షిణలు. తల్లి ని కన్న కూతురు లా చూసుకునే వ్రతం. 20 ఏళ్ల చాపనిద్ర మరియు శాఖాహార వృతం.

7 ఏళ్లుగా, 10 కిమీ దూరం గుడి లో శివ శనైశ్చర నేతి దీపం, అమ్మ తూలి పడకుండా, చేయి పట్టి నవగ్రహ 9 ప్రదక్షిణలు. ఇంటి హాల్లో, నిత్య తులసి కార్తీక నువ్వుల దీపం, 2 పూటలా.

(5) ఆ దేవుని దయ వలన, 78 వ వారం, 108 ప్రదక్షిణలు, పరగడుపున, ఉదయం 10 లోపు, కరమాల చేతి వేళ్ళ గీతల లెక్క తో, నారాయణ మంత్ర ఉచ్చారణ జపంతో, ఉత్త పాదాలతో, 1 గంట 15 ని లోపు, 3 బై 3 గది విస్తీర్ణం లో, ఆగకుండా తిరిగే భాగ్యం శక్తి కలిగించారు. కరోనా ముక్కు మూతి కవచం, భౌతిక దూరం తో. సాక్ష్యం స్టేటస్ లో బొమ్మలు.

దైవ నమ్మకం లేని వారికి, వృధా ధన రోగ జిమ్ లేదా దుమ్ము ధూళి రోడ్డు లేదా గ్రౌండ్ లో నరదృష్టితో వాకింగ్ కంటే, అంటే, ఆగకుండా 2.5 మైళ్ల 6500 అడుగుల 350 కాలరీల నడక (పంచ భూతాల సాక్షి గా ఉచిత త్రెడ్ మిల్), ఉత్తమ స్ధలంలో, కుటుంబ సమక్షంలో, వ్యాయామం అనవచ్చు. కాళ్ళు మోకాళ్ళు కీళ్లు పాదాలు గట్టిపడతాయి, లావు బరువు అదుపు. నరాల కండరాల వ్యవస్థ లు కుదుపు.

శనివారం వెంకన్న కు స్నానం చేపిస్తూ, పూజారులు హరతి ఇస్తుంటే వేదోచ్ఛారణ తో, కమ్మని సువాసనలతో ధూప దీపాలతో వెలుగొందుతుంటే,

వారికి కాపలా నారాయణ సేవకుడి లా, గంట చుట్టూ తిరుగే, భాగ్యం ఆరోగ్యం మనోధైర్యం కలిగించి, తడిచే వానకి వణికే చలికి కాలే ఎండ బారిన పడకుండా, తగిన శక్తిని ఇచ్చే, ఆ దైవ రుణం ఏవిధంగా తీర్చుకోగలము, కన్నీళ్ళు తో తప్ప.

(6) మీ పెద్దలు కు మీరు, అలాగే మీ పిల్లల తో మీకు పాద పూజ భాగ్యం కలిగించి, మాకు చూసే భాగ్యం కలిగించి, స్నేహితులు బంధువులు పిల్లల కు, అలవాటు చేసే ప్రయత్నం చేస్తారని, చేతులు జోడించి విన్నపము, గురువు లు అందరికీ.

10 ఏళ్ల వయసు లోపు నేర్చుకున్న, పురాణమే, సంస్కారమే, ధ్యాన మే, ఆధ్యాత్మిక తే, వందేళ్ళు వాళ్ళ ను మాయా మోహం లో పడకుండా, నీతివైపు మనశ్శాంతి తో నడుపుతుంది.

సంస్కారం కు తొలిమెట్టు, మన ఇంట్లో, మన ఈ చిన్న ధర్మ ఆచరణలో, ధ్యానం, జపం, ప్రదక్షిణ, పెద్దల గౌరవం, మర్యాద, బాధ్యత, రామ శ్లోకం లేదా మంత్రం వేద ఉచ్చారణ, . . .

ధనం తో, భక్తిని పూజని కొనలేము, కొన్నా వృధా. అందుకే మన సొంత శారీరక, మానసిక శ్రమతోనే దైవం ను పట్టుకోవాలి పూజించాలి.

అందుకే బీదలకే సామాన్యులకే దైవం దగ్గర. ఉదాహరణకు కన్నప్ప, రామదాసు, అన్నమయ్య, . . .

(7) మీ కన్నా పాపాత్ముడిని, పాప కర్మల ఫలం తగ్గడానికి ఇవి చేస్తున్నా, మరి పుణ్యాత్ములైన మీరు చేస్తే, ఇంకా పుణ్యం రెట్టింపు కదా, ప్రయత్నము చేస్తారని ఆ భాగ్యం ఆ మనసు దేవుడు కలిగించాలని ఆశిస్తూ.

(8) 9th week, SAT , (ముందు రోజు 6 pm భోజనం) 5 am to  6 pm దాకా, నీళ్లు, కప్పు పసుపు పాలతో, సూర్య Fasting. ఒక ఆపిల్, అరటి, ఖర్జూరం ఓకే.

ఉదయం కాకర రసం అల్లం వెల్లుల్లి, మిరియాల కషాయం, ఆకలి ఇంకా ఎక్కువ.

కడుపు కాలి, కొవ్వు కరిగి, ఆరోగ్యం పెరగాలి.  పేగులు కేకలు పెట్టినా, జీర్ణ వ్యవస్థ కు సెలవు, బుద్ధి కి నెలవు. ఉపవాసం పెద్దల దీవెన.

(9) పొద్దున్నే లెగిచి ఇవి చూడాలని, రాత్రి పంపినా మన్నిస్తారని, ప్రతి వారం, తినగ తినగ వేము లా , మరలా మరలా చదివి, మనలో సాత్వికతతో, ఆచరణ పెరగాలని కోరుతూ,

ముందు అమ్మా నాన్న పాద దాసుడు, ఆ తర్వాత హరి హర దాసుడు, శ్రీనివాసుడు  

Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,873,096; 104 తత్వాలు (Tatvaalu) and views 225,559
Dt : 10-Apr-2021, Upd Dt : 10-Apr-2021, Category : Devotional
Views : 855 ( + More Social Media views ), Id : 1085 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : spiritual , health , traditional , sanatana , dharma , mother tongue , parents , divine , words
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content