తనను తాను తెలుసుకున్నోడే మనిషి. ఆ స్తితి లో ఉన్నారు. జీవితాంతము స్తిరముగా నిలబెట్టుకోండి? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,882,090; 104 తత్వాలు (Tatvaalu) and views 226,388.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

*తనను తాను తెలుసుకున్నోడే నిజమైన మనిషి. మీరు ఇప్పుడు ఆ స్తితి లో ఉన్నారు. అది జీవితాంతము స్తిరముగా నిలబెట్టుకోండి.*

Real man who knows himself. You are now in that position. Keep it steady for rest of the life.

ఏవండీ, చెప్పుడు మాటలకు లొంగిపోయి, జీవితములో అన్ని విధాలుగా, దారితప్పిన గొర్రెలము. ఫలితము అనుభవిస్తున్నాము. మా మారిన మతము వేరైనా, మూలము ఒకటే. దేశం లో ఉన్న మతాన్ని నమ్మము, ప్రశ్నిస్తాము, ఎక్కడ నుంచో వచ్చిన వాటిని నమ్ముతాము, సరిగ్గా చదవము, ప్రశ్నించము, అందుకే గొర్రెలము మేము.

మీ దాంట్లో కూడా వేమన, బ్రహ్మం, రాఘవేంద్ర స్వాములు వంటి హైందవ స్థానిక తెలుగు గురువులను వదలి, పరాయి భాషా గురువుల మందిరాల వెంట పడుతున్న, బ్రమల మోహ గొర్రెలు ఊరూరా లెక్కలేనన్ని ఉన్నాయి. మాకు వాటికి పెద్ద తేడా లేదు. ఈ విషయములో అన్ని గొర్రెలు ఒకటే.

వీరికి చెప్పలేము, వారు మారరు. కొన్ని జీవితాలు ఇంతే, కూర్చున్న కొమ్మ నరుక్కుంటున్నాము అని తెలుసు, కాని బాగు చేసుకోము. వీరెవరు, తమ ముదుసలి తల్లి దండ్రులను గౌరవముగా ఇంట్లో ఉంచి చూడరు, కోట్లు ఉన్నా. పిల్లలకు సంస్కారం నేర్పే సమయం లేదు, ప్రాపంచిక బానిసత్వము లో. మనల్ని మనము తెలుసుకోవాలి అని మీరు చెప్పిందానిని చచ్చిన దాకా పాటించము.

మీరు పంపే వాటిలో కనీసం 75 శాతం, మానవత్వం, ముదుసలి వారి అలాగే సజీవ గురువు సేవ, అరిషడ్వర్గాల అష్టవ్యసనాల బానిసత్వం నియంత్రణ, ప్రతి మనిషికి సంభందించినది, ఎవరైనా మెచ్చుకోవాలి, ఇంత ఓపికగా పదాల వరుస రాసి, మనసు లేని స్పందన లేని బండరాళ్ళమైన మాకు, ఇన్నేళ్ళుగా నిస్వార్ధముగా పంచుకున్నందుకు. అమ్మ గారి పెంపక సంస్కారం, మీ ప్రతి బొమ్మలో, మాటలో, పాటలో, పద్యములో కనపడుతుంది, 5 ఏళ్ళుగా.

మా తల్లి దండ్రులు మా ఇంట్లోనే ఉన్నారు గతములో, నేడు లేరు. చెప్పుకుంటే పశ్చాత్తప పడితే, కాస్తైనా పాపం తగ్గుతుంది అని మీకు చెబుతున్నా, మీరు దానిని అందమైన పదాలలో బాగా పెడుతున్నారు, ఇతరులు చెప్పిన గాధలను కధనాలను.

ఏ రోజు కూడా, మా తల్లి దండ్రులు సుఖముగా గౌరవముగా మా ఇంట్లో లేరు, గుణము లేని పెళ్ళితో ఆత్మను అమ్ముకున్న మేము, నోరు ఎత్త లేని పరిస్తితి. అవమానాలను చీత్కారాలను దిగమింగి మింగి, లోలోనే కుళ్ళి క్రుశించి, కాలు చెయ్యి నోరు పడి పోయి, వారు చేసిన పాపానికి వారు గతించారు, మా ఇంట్లో నే, మా ఎదురుగా నే. నిస్సహాయముగా ఏడవడము తప్ప ఏమి చేయలేని వింత పరిస్తితి. ధనం ఆస్తులు అన్ని ఉన్నాయి, మనశ్శాంతి లేదు. అది స్వయక్రుతాపరాధమే.

మీరు అన్నట్లుగా, మా ముదుసలి అత్త మామలను కూడా తెచ్చి మనతో ఉంచి, గౌరవముగా చూద్దాము అని గుణములేని జీవిత భాగస్వామికి చెప్పాను, బతిమాలాను. కానీ అహంకారము తో వినలేదు, సొంత తల్లి దండ్రులపై కూడా దయలేదు. వారి నస నేను భరించలేను, నేను సేవ చేయలేను, పెళ్ళి అయ్యాక నాకేమి పని అని, అటు ఇటు తప్పించుకుని, మాకు వారందరికి సేవ చేసే ఉన్నత స్తితి ఉండి కూడా, అందరి వ్యధకు ఇద్దరము కారణము అయ్యాము.

దాని ఫలితము, పిల్లలు ఈ ధన సౌకర్యాలతో, మా మాటలు వినే స్తితి ఎప్పుడో దాటి పోయారు. పేరుకే మేము కుటుంబం, ఎవరు ఎవరినీ లెక్క చేయరు. సోసైటీలో బయటకు గొప్పగా కనపడినా, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. ఇవి మీకు చెప్పేటప్పుడు రాసే టాప్పుడు కూడా, కన్నీళ్ళు ధారగా కారిపోతున్నాయి, సొంత అమ్మా నాన్నకు అత్త మామలకు మేము ఇద్దరము చేసిన ద్రోహము, మా సుఖ సంతోషాలలో ప్రాపంచిక బ్రమలలో మునిగి.

ఇప్పుడు మా వయసు పెద్దది అవుతున్నాది, రేపు మా భవిష్యత్ తెలీదు. మమ్మల్ని అమ్మలాగా చేయి పట్టి నడిపించే మనసున్న సంతానం, బంధువులు లేరు. అంతా అగమ్య గోచరము. అంటే మేము శిక్షలకు దగ్గర అవుతున్నాము.

మేము ఇప్పుడైనా, మా దగ్గర లో ఉన్న, ఎవరో ఒకరు పెద్దల అంటే ముదుసలి వారి సేవ, సజీవ గురువు సేవ గా చేయాలి. మా దగ్గర ఉన్నది, సత్పురుషులకు పంచాలి. అప్పుడే మాకు మనశ్శాంతి, ప్రాయశ్చిత్తము, 2 వైపులా. అందరికీ మా గాధను మంచి మాటలలో రాసి పంపుతారు కదూ, ధన్యవాదములు.

జవాబు - మేము చెప్పేది ఏమీ లేదు, అంతా మీరే చెప్పేసారు. మీ కధ వింటుంటే నాకు కన్నీళ్ళు ఆగలేదు. మా దాంట్లో కూడా, 20 ఏళ్ళుగా ఎంతో మందికి చెప్పాను, ఇలాంటి పరిస్తితి వస్తుంది అని, ఖర్మ విడువదు అని, వారు నవ్వారు అప్పుడు, అనుభవిస్తున్నారు ఇప్పుడు.

మీరు తప్పకుండా మనశ్శాంతి, ప్రాయశ్చిత్తము కు ప్రయత్నము చెయ్యండి, త్రికరణ శుద్దిగా. ఇప్పుడు మనకు మనమే శిక్ష స్వీకరించకపోతే, దానిని వడ్డీతో మన పిల్లలు లేదా మరు జన్మ తీరుస్తాయి, తప్పించుకోలేము.

దీనికి మతానికి కులానికి భాషకు జాతికి దేశానికి సంబంధము లేదు. మీలో మార్పుకు దేవుడు సహకరించాలి, మీలో ఇంకా మానసిక బలం పెరగాలి, ఆత్మ చైతన్యము కలగాలి. జీవుడే దేవుడు, దేహమే దేవాలయం అన్నది అందరికీ ఒకటే. మీకు ఎప్పుడు ఏ సలహా కావాలి అన్నా, సందేశం పెట్టండి, మీ పాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము.

తనను తాను తెలుసుకున్నోడే నిజమైన మనిషి. మీరు ఇప్పుడు ఆ స్తితి లో ఉన్నారు. అది జీవితాంతము స్తిరముగా నిలబెట్టుకోండి. మరలా మాయలో పడవద్దు. పంచభూతాలు అందరికీ ఒకటే, ఎవరినీ విడువవు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,882,090; 104 తత్వాలు (Tatvaalu) and views 226,388
Dt : 09-Apr-2023, Upd Dt : 09-Apr-2023, Category : General
Views : 352 ( + More Social Media views ), Id : 1745 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Real , man , knows , himself , position , steady , rest , life
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content