4 పిల్లలూ బాగుండాలి, మనము 4 కి మంచి చెప్పినా, విని అర్ధము చేసుకుని మారేది, ఒక్కరే కదా - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,890,591; 104 తత్వాలు (Tatvaalu) and views 226,980.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ఏ పార్టీ అయినా ఒకటే, మన నాయకులు బాగుండాలి, మంచి వారు గా మారాలి. మరలా గెలవాలి అంతే. జగనన్న చంద్రన్న పవనన్న వీరన్న అందరూ బాగుండాలి.

మా అన్న ఆమంచి అయినా, కరణం బాబాయి అయినా, సునీత అక్క అయినా ఒకటే. ఆమంచి, నోరు తగ్గించుకుని మారాలి, అందరితో కలవాలి, మరలా గెలవాలి అంటే అని, గతము లో చెప్పాము. ఇంకా మారలేదు, మాకూ దూరముగా ఉన్నారు అని కూడా గతము లో చెప్పాము కదా, మంచి సందేశాలు అందుకోకుండా.

తెదేపా నాయకుడు బాలాజీ కి కూడా, స్థానికము గా ఉండి, కనీసము నటించడానికి అయినా కరణం బాబాయి ఆమంచి అన్న మీద విమర్శలు చేయాలి, అభివ్రుద్ది గురించి మాట్లాడాలి, ప్రభుత్వ ఆసుపత్రి రూపు మార్చాలి. ఇతర ప్రత్యర్ధుల మీద విమర్శలు అయినా చెయాలి కదా. మీరు గమ్ముగా ఉంటే, అవతలి పార్టీ వారు బాగా చేస్తున్నట్లు ఒప్పుకున్నట్లే, ఇంక మిమ్మల్ని జనము ఎందుకు గెలిపించాలి? అర్ధము చేసుకోకుండా, ఆయనా దూరముగా వెళ్ళారు, తీరు మార్చుకోకుండా, తర్వాత ఎన్నికలలో గెలుపు సిద్దం చేసుకోకుండా. అలాగే ఇతర జిల్లాల నాయకులు, అవసరమైనప్పుడు పేర్లు అనుకుందాము.

అలాగే బీజేపీ జనసేన స్థానిక నాయకుల అసమర్ధతను, పెగలని గొంతును, పస లేని ప్రచారం, పలకని సోషల్ మీడియా గురించి ఎన్నోసార్లు చెప్పాము. అలాగే పార్లమెంట్, జిల్లా, రాష్ట్ర నాయకులకు మంచి చెడు చెప్పాము, ఎవర్నీ వదలలేదు, వెనకేసుకుని రాలేదు.

అందరూ మన వాళ్ళే, మన చుట్టాలే, మన బంధువులే. కానీ ఆమంచి అన్ని మరలా గెలవాలి అంటే, తమ్ముడు వెంకటేష్ గెలవాలి అంటే, బీజేపీ జనసేన చీరాలలో గెలవాలి అంటే, ఉన్నది ఉన్నట్టు గా చెప్పాలి. వీరంతా చీరాల అభివ్రుద్ది గురించి ఎలుగెత్తి చాటాలి. స్థానికము గా వీరు మారితేనే, పైన జగనన్న చంద్రన్న పవనన్న వీరన్న, గెలిసే అవకాశాలు ఉంటాయి.

మీ గురించి ఈ సందేశాలు, అన్ని పార్టీల పెద్దలకు ప్రముఖులకు మంత్రులకు వెళుతున్నాయి అని తెలిసి కూడా, కొందరు నాయకులు మూర్ఖముగా తమ వాట్సాప్ ఆపుకున్నారు, పిరికి వారు లాగా, నిజం వినే ధైర్యము, మార్చుకునే ఆత్మ శక్తి లేక, తమ మరియు పార్టీ భవిష్యత్తును కాల రాసుకుంటూ.

ఆత్మాభిమానం ఉన్నవారు తప్పులు తెలుసుకుని, సరి చేసుకుని, ప్రజలతో మరియు విలేఖరులతో కలసి వెళతారు మనస్పూర్థిగా.

స్థానిక నాయకుడు గా, మీరు వాట్సాప్ ఆపుకుంటే, మీ పార్లమెంట్ జిల్లా రాష్ట్ర నాయకులు ప్రజలు, వాట్సాప్ లో లేదా ఫేస్బుకు ట్విట్టర్లో చూడకుండా ఉంటారా? ఎవరో ఒకరు అధిష్టానానికి, మీ గురించి, పంపకుండా ఉంటారా?

మన 4 గురు పిల్లలూ, వైకాపా తెదేపా బీజేపీ జన బాగుండాలి, మనము 4 కి మంచి చెప్పినా, విని అర్ధము చేసుకుని మారేది, ఒక్కరే కదా, గెలుపు వారిదే. ఇంకో విధముగా మన జనం బుద్దిని బట్టి, మోసపు మాటలతో గెలిచినా, అది శాశ్వతము కాదు.

నాయకులుది తప్పు కాదు, బాధ్యత లేకుండా ఓటు వేసిన మన ప్రజలదే తప్పు అన్న మాట మాత్రం మారదు. మన లోని అవలక్షణాల ఉత్తములనే, మన నాయకులు గా ఎన్నుకుంటాము, ప్రత్యేకముగా మన తెలుగు రాష్ట్రాలలో సుమా.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,890,591; 104 తత్వాలు (Tatvaalu) and views 226,980
Dt : 29-Jan-2021, Upd Dt : 29-Jan-2021, Category : Politics
Views : 843 ( + More Social Media views ), Id : 948 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : 4 children , political parties , good , understand , changes , win , ap , jagan , pawan , chandra babu
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content