1.
జూబ్లీహిల్స్, మాదాపూర్ కలిపితే ఎంతుంటదో వైజాగ్ అంత ఉంటుంది.. దానికి కూడా మెట్రో ఇచ్చారు: రేవంత్ రెడ్డి - 2026-06-15T17:06:08+05:30
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖను ఉద్దేశించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపించిన ఆయన.. ఈ క్రమంలోనే విశాఖ గురించి ప్రస్తావించారు. అహ్మదాబాద్‌కు మెట్రో ఇచ్చారని.. జూబ్లీహిల్స్, మాదాపూర్ కలిపితే ఎంత ఉంటుందో.. అంత ఉండే విశాఖకు కూడా చివరకి మెట్రో ఇచ్చారని.. కానీ హైదరాబాద్ ఆపేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపై వివక్ష చూపడం సరికాదన్నారు.
ఇంకా
2.
నీరు, ఆహారంలో పెస్టిసైడ్స్ ఉన్నాయా.. క్షణాల్లో గుర్తించే పరికరం, హైదరాబాద్ బిట్స్ పిలానీ ఆవిష్కరణ - 2026-06-15T17:01:07+05:30
హైదరాబాద్ బిట్స్ పిలానీ పరిశోధకులు ఆహారం, నీటిలో ఉండే పెస్టిసైడ్స్‌ను గుర్తించే ‘పెస్టీసేఫ్’ అనే పోర్టబుల్ పరికరాన్ని అభివృద్ధి చేశారు. రూ.7 వేల ఖర్చుతో తయారైన ఆ పరికరంతో క్షేత్రస్థాయిలోనే కచ్చితమైన పరీక్షలు నిర్వహిస్తుంది. బ్లూటూత్, మొబైల్ యాప్‌తో పనిచేసే ఈ డివైజ్.. రైతులు, ఆహార భద్రత అధికారులు, వినియోగదారులు వేగంగా ఆహార నాణ్యతను అంచనా వేయడంలో కీలకంగా ఉపయోగపడనుందని పరిశోధకులు చెబుతున్నారు.
ఇంకా
3.
యూపీ ఎన్నికల్లో అసదుద్దీన్ ఒవైసీతో పొత్తు.. కాంగ్రెస్, ఎస్పీలో భిన్నాభిప్రాయం - 2026-06-15T16:53:45+05:30
వచ్చే ఏడాది మార్చి ఏప్రిల్‌లో ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీని ఓడించడానికి సమాజ్‌వాదీ పార్టీ నాయకత్వంలోని ఇండియా కూటమి వ్యూహాలు రచిస్తోంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన ప్రతిపక్ష కూటమి సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఐకమత్యంగా ఉంటే నిలబడతామని.. లేకపోతే పడిపోతామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా, ఎంఐఎం పార్టీతో యూపీ ఎన్నికల్లో పొత్తుపై కాంగ్రెస్, ఎస్పీల వైఖరి భిన్నంగా ఉండటం గమనార్హం.
ఇంకా
4.
ఇప్పటికీ తెలంగాణ, ఏపీ మధ్య ఆస్తుల పంపకాలు, వారసత్వ సమస్యలున్నాయి.. పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు - 2026-06-15T16:15:46+05:30
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీ, తెలంగాణలను కాంగ్రెస్ పార్టీ విభజించిన తీరు సరిగ్గా లేదని ఆరోపించారు. ఇప్పటికీ రెండు రాష్ట్రాల మధ్య వారసత్వ సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. అంతేకాకుండా ఆస్తుల పంపకాలు ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తీరు ఇంకా మారలేదని.. అందుకే జనసేన సభకు అనుమతులు ఇవ్వలేదని మండిపడ్డారు.
ఇంకా
5.
నా బాధను అర్థం చేసుకోండి.. అలాంటి కామెంట్లు పెట్టొద్దు.. దండం పెట్టి వేడుకున్న జ్ఞానేశ్వరి తల్లి.. - 2026-06-15T16:07:34+05:30
కాకినాడ జిల్లాలో చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు మిస్టరీ వీడటం లేదు. చిన్నారి కనిపించకుండా పోయి పది రోజులైంది. చిన్నారి కోసం పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు జల్లెడ పడుతున్నాయి. అయినా కూడా పాప ఆచూకీ తెలియడం లేదు. ఈ కేసులో కీలక ఆధారంగా ఉన్న పెంపుడు కుక్క కూడా చనిపోవటం పోలీసులకు సవాలుగా మారింది. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా కొంతమంది పెడుతున్న కామెంట్లు, వీడియోలు.. తమ ధైర్యాన్ని దెబ్బతీస్తున్నాయని పాప తల్లి భవానీ వాపోయారు. దయచేసి అలాంటి కామెంట్లు పెట్టొద్దంటూ వేడుకున్నారు.
ఇంకా
6.
నీట్ యూజీ విద్యార్థులకు ఎన్టీఏ అలర్ట్.. నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకే పరీక్ష ఫీజు రీఫండ్, ఎలా చెక్ చేసుకోవాలంటే? - 2026-06-15T16:46:32+05:30
నీట్ యూజీ రాసే లక్షలాది మంది అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఒక కీలకమైన సూచన చేసింది. పరీక్ష ఫీజును నేరుగా విద్యార్థుల బ్యాంక్ ఖాతాల్లోకే రీఫండ్ చేస్తామని వెల్లడించిన ఎన్టీఏ.. తాజాగా విడుదల చేసిన రీ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్‌లను డౌన్లోడ్ చేసుకునే ముందే అభ్యర్థులు తమ బ్యాంక్ వివరాలను ధ్రువీకరించుకోవడం తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఒకవేళ సర్వర్ సమస్యల వల్ల హాల్ టికెట్ డౌన్లోడ్ కాకపోయినా, వివరాల్లో తప్పులున్నా విద్యార్థులు ఏం చేయాలో చూసింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.
ఇంకా
7.
‘కుంకుమ భాగ్య’ నటి సంచిత ఆత్మహత్య.. చనిపోవడానికి కొన్ని గంటల ముందు ఇన్‌స్టా వీడియో - 2026-06-15T16:19:06+05:30
ప్రముఖ టీవీ సీరియల్ నటి సంచిత ఉగాలే ముంబైలోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. సూపర్ హిట్ సీరియల్ ‘కుంకుమ భాగ్య’ (తెలుగులో ‘కుంకుమ భాగ్యం’) లో దియా టాండన్ పాత్రతో పాటు ‘వాగ్లే కి దునియా’ వంటి షోల ద్వారా ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముంబై పరిసర ప్రాంతమైన నలసోపరాలో నివసిస్తున్న సంచిత.. ఆదివారం సాయంత్రం కుటుంబ సభ్యులు బయటకు వెళ్లిన సమయంలో బెడ్రూమ్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకున్నారని సమాచారం.
ఇంకా
9.
హైదరాబాద్: ఆరేసిన బట్టల నుంచి నీరు కారడంతో ఇరుగుపొరుగు మధ్య గొడవ.. రంగంలోకి భారీగా పోలీస్ బలగాలు - 2026-06-15T16:17:27+05:30
ఆరేసిన తడి బట్టల నుంచి నీరు కిందకు కారడంపై రెండు కుటుంబాల మధ్య అర్థరాత్రి మొదలైన వాగ్వాదం.. క్షణాల్లోనే పరస్పర దాడుల వరకు వెళ్లింది. దీంతో తీవ్రంగా భయపడిపోయిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో చార్మినార్ జోన్ డీసీపీ కిరణ్ ఖారే స్వయంగా భారీ బలగాలతో రంగంలోకి దిగి గొడవను ఆపారు. ఇరువర్గాలపై కేసు నమోదు చేసి మరీ.. దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగానే డీసీపీ మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేసే వారిపై కఠిన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇంకా