వైకాపా సోషల్ మీడియా మీటింగ్, ఓ కార్యకర్త ప్రశ్నలు, అన్ని పార్టీలకు ఉపయోగము - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2084 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2119 General Articles and views 1,881,436; 104 తత్వాలు (Tatvaalu) and views 226,268.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

వైసీపీకి చెందిన ఆదిరెడ్డి అనే వ్యక్తి, సజ్జల గారి ఫేస్బుక్ లో, ఇటీవల జరిగిన తమ సోషల్ మీడియా సైనికుల, అత్మీయ కలయిక గురించి జరుగుతున్న విషయాల గురించి, నాలుగు మాటలు రాశారు, దిగువన 4 పాయింట్లలో చూడగలరు. ఇది ప్రతి పార్టీకి ఉపయోగము. సోషల్ మీడియా అంటే, ఎదుటి వారిని తిట్టటము కాదు, మన పార్టీ లోని లోపాలను సరి చేసుకోవడము, అని బాగా తెలియ చెప్పారు.

విజయ్ సాయి గారు కూడా, మీటింగ్ లో చక్కగా - మీడియాలో సటైర్లు వేయండి, కానీ పార్టీకి చెడ్డ పేరు తేవద్దు అని చెప్పారు. అంతే గాని, చెడు తిట్లు, వ్యక్తిగత జీవితాల లోకి, పోవడము మంచిది కాదు.

ఏ పార్టీ అయినా, తింటుంది, తన వాళ్ళకు తినిపిస్తుంది, ముఖ్యముగా మన తెలుగు రాష్ట్రాలలో. కానీ నేల మీద అభివ్రుద్ది కనపడాలి కదా?

ఆదిరెడ్డి గారి మాటలు ఇవి, నమస్తే సార్, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా, తప్పుగా అనుకోవద్దు సార్ .

1.అసెంబ్లీ మరియు పార్లమెంట్ పరిధి మండల పరిధిలో, సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా నియమించారు వాళ్ల నుంచి, మీకు నియోజకవర్గ పరిధిలోని సమస్యలు, పార్టీ దృష్టికి వస్తున్నాయా? - లేదు.

మన కామెంట్ - ఆ తీరిక వాళ్ళకు లేదు. మన ఊరికి, ఫిషింగ్ హార్బర్, హైటెక్ ఆసుపత్రి, ఊళ్ళొ ఉండని ఎమ్మెల్యే, చేనేత పార్క్, ఇలాంటి వాటి గురించి రాయరు, గుర్తు చేయరు. తెదేపా, జనసేన, బీజేపీ స్థానిక నాయకులు అంతే ఎక్కువ నియోజక వర్గాలలో.

2.నియోజకవర్గ పరిధిలోని, ప్రతి గ్రామంలో రెండు మూడు గ్రూప్ లుగా విడి పోయి, పార్టీ కి ఎంత నష్టం జరుగుతుందో, మీకు సమాచారం అందిస్తున్నారా. - లేదు

మన కామెంట్ - అసలు తెదేపా నాయకుల గ్రూప్ లు తెచ్చి, వాళ్ళ పుత్రులతో కండువా కప్పి, ప్రోత్సహిస్తుందే మన అధినేత లైతిరే, జగనన్న దగ్గర మెప్పు పొందాలని. అది మన మడమ తిప్పని జగనన్న కు అవమానం కాదా? ఇన్నాళ్ళు విలువలేని వాళ్ళను పోషించిన, చంద్రన్న కు చిన్నతనం కాదా? అన్ని పార్టీలు అంతే.

3.జండా పట్టి తిరిగిన కార్యకర్తల కు విలువ లేకుండా, పక్క పార్టీ లో నుంచి వచ్చిన టీడీపీ వాళ్లను పక్కన పెట్టుకుని తిరుగుతున్న ఎమ్మెల్యే లు, ఎంతో మంది. ఆ సంగతి మీ దృష్టికి వచ్చాయా?

మన కామెంట్ - 2 దాని కామెంటే

4.ఇప్పుడు సోషల్ మీడియా సమావేశం అని జరుపుతున్నారు, అసలు సోషల్ మీడియా ఇంచార్జ్ ఏమీ చేస్తున్నారు? ప్రభుత్వ పథకాలు అమలు గురించి, జగన్ సార్ కష్టపడతున్న దానికి వివరంగా పోస్ట్ లు పెట్టడానికి, టీం ఉందా? కోఆర్డినేటర్ లు చేస్తున్నారా? - లేదు

మన కామెంట్ - టీం ఉంది, కేవలము స్థానిక మరియు పై నాయకుల ఫోటోలు పెట్టుకుని, పంచడము గురించి మాత్రమే ప్రచారం చేస్తున్నారు, స్థానిక సమస్యలు వదిలి. ప్రభుత్వ అధికారులతో, పధకాల అమలును, సోషల్ మీడియాలో రాపించడము కూడా చేయని నాయకులు ఉన్నారు అని మనము లిస్ట్ కూడా ఇచ్చము. Link.

తప్పుగా అడిగుంటే క్షమించండి సార్, అని ఆయన పార్టీ క్షేమం కోసం రాశారు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2119 General Articles and views 1,881,436; 104 తత్వాలు (Tatvaalu) and views 226,268
Dt : 04-Dec-2020, Upd Dt : 04-Dec-2020, Category : Politics
Views : 832 ( + More Social Media views ), Id : 836 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : ysrcp , social media meeting , activist questions , jagan , sajjala , sai , yv , all parties
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content