జయవిజయుల కధతో, నేటి రాజకీయ నాయకులు ఆచరణను, అనుచర గణ వీరంగాన్ని పోల్చండి - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,882,703; 104 తత్వాలు (Tatvaalu) and views 226,444.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ముందు చదివిన, పురాణ విష్ణువు జయవిజయుల కధతో, తమ దగ్గర పనిచేసే వారైనా మర్యాద నీతి నియమాలను విస్మరించ రాదు, మెహమాటం లేదు, శిక్ష తప్పదు అని అర్థం అయింది. మరి, నేటి మన రాజకీయ నాయకులు ఆచరణను, వారి అనుచర గణ వీరంగాన్ని పోల్చండి.

జవాబు, ఈరోజుల్లో ఎంత నిస్సిగ్గుగా, తమ అనుచరులు కు అండగా ఉన్నారో, తప్పు చేసినా కూడా, కదా. ఏ పార్టీ అయినా ఒకటే స్వార్థం, తన పర భేదం, ఎందుకంటే అలాంటి ఉత్తములను ఎన్నుకుంది, అలాంటి తప్పుడు బుద్దులు ఆలోచనలు కల వారము, మనమే కాబట్టి. ముందు మనల్ని కూడా మనం తిట్టుకోవాలి, మన తప్పు నూ ఒప్పుకోవాలి కదా.

మన పిల్లలు ఎన్ని తప్పులు చేసినా 30 ఏళ్ల దాకా లేదా తర్వాత కూడా, ఇంకా పసి పిల్లలే. కొడుకు ల కు ఖరీదైన బండ్లు ఇచ్చి, హైవేల పై పరుగుల పందెం లో, వారి ప్రాణాలు పోవడానికి కారణభూతులైన, సొంత తల్లి దండ్రుల కధలు విన్నాం, ఇంకా చూస్తాం. సొంత బిడ్డలు అహంతో, ఇతరుల ప్రాణాలు తీసినా, కాపాడిన నాయకులు ఉన్నారు.

కొత్త వారిని రానీయం, కుల వర్గాల అవకాశవాద బురదలో, పొర్లాడుతూ ఉన్న మనకు, మంచి గంధం విలువ తెలీదు, తెలుసుకోము, తెలియనీయము.

కొత్త వారు వస్తుంటే కదా, కొత్త మార్పులు వచ్చేది? 5 ఏళ్ల కు, 5 లక్షల కన్నా విలువైన అమూల్యమైన ఓటు ను, మంచి వారికి ఉచితంగా వేసి అభివృద్ధి సాధించకుండా, తక్కువ కు తప్పుడు వారికి అందిస్తున్నాం.

గత ప్రభుత్వం లో చింతమలేని, పారాయణ కోచింగ్, ఇంకొంత మంది, ఇలాంటి నాయకుల తప్పులు గాచి, వారిపై లేదా బీనామీ లేదా ఆ సీటు ల పై ప్రేమతో మోహం తో అలా ఉండి, మన వారి కంపెనీలు తో తాత్కాలిక కట్టడాలు తో నడిపించిన మోసం, అని ఇటువర్గం నిందిస్తున్నారు. ఇప్పుడు ఎంత దౌర్భాగ్యం కు, వచ్చిందో చూసాము. క్షణం క్షణం భయం భయం, నాటి ఇష్టారాజ్యంలో, ఏ తప్పులు పడతారో, లోన వేస్తారో నని.

ఎన్నుకున్న ప్రజలు, అంటే మనం కూడా, శిక్షలు అనుభవించాలి సుమా. అనుభవిస్తున్నాం కదా - కరెంటు ఛార్జీలు, భూమి మరియు ఇతర పన్నులు, ఆహార రేట్లు పెరిగాయి. అందరూ మనల్నే దోచి, మనకే పెడుతున్నారు అని మాయ మాటలు, వారి పేర్లు పధకాలు కు పెట్టుకుని. కరోనా వస్తే మనకు దిక్కు లేదు, నాయకులు కు హైదరాబాద్ ఉంది కదా. ఎందుకంటే మనలో కొంతమంది ఓటు అమ్ముకున్నారు, ఓటు వేయకుండా ఇంకొంతమంది ముసుగు తన్ని పడుకున్నారు.

సీఎం అంటే, ఎమ్మెల్యేలు నాయకులు అధికారులు, అందరు చేసిన పాపం లో భాగం పంచుకోవాలి, తలా కొంత. ఎవరు తప్పు చేసినా, దానికి ఫలితాలు నాయకుడు కూడా, భరించాలి మోయాలి నేడో రేపో. కొన్ని సార్లు, వారి బిడ్డలు వంశం కూడా. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి కూడా అంతే, వారి అనుచరుల తప్పులు పాపం భరించాలి. తప్పుడు వాళ్ళ ను అప్పుడే శిక్షిస్తే, ఇంత అవమానం ఇప్పుడు ఉండేది కాదు.

సేమ్, ఇప్పుడు కూడా, కార్పొరేషన్ ఛైర్మన్ టోల్ గేట్ దగ్గర గౌరవం, కొడాలి సంస్కృత భాష మర్యాద, ఇతర నాయకుల ఇష్టారాజ్యం అమర్యాద దురుసు ప్రవర్తన, తర్వాత మరలా ఈ పార్టీ నాయకుడు మరియు అనుచరుగణం అనుభవించాలి. ఓ మంత్రి, మా అనుచరులు తప్పు చేస్తున్న, నాకు తెలుస్తోందా అని, అమాయకంగా చెప్పారు కదా, జన్మ్ ను వెర్రివాళ్ళను చేస్తూ. ఇక నేలపై కట్టడాలు గురించి, అసలు అడగవద్దు. వాళ్ళు తాత్కాలికంగా అయినా కట్టారు, వీరు ఏమీ కట్టకుండా నే, పేద్ద పేద్ద అప్పులతో దిగజార్చారు అని అటువర్గం అంటున్నారు.

చీరాల లో చూడండి, నాయకులు రానంత వరకూ, అది కేవలం జాలర్ల సమస్య. వచ్చిన తర్వాత, అది రాజకీయ అనుచరులు సమస్య గా, రూపం మారింది, పెద్ద పుండు అయింది.

అందుకే అంటారు, అన్నదమ్ములు సమస్యలు ఇంట్లో లేదా దగ్గర మంచి పెద్ద మనుషులు దగ్గర తేల్చుకోవాలి, సర్దుబాటు చేసుకోవాలి, కొంత నష్టం అయినా. లాయర్లు లేదా నాయకులు లేదా బయట పెద్దలు దగ్గరకు పోతే, దానికి లాగి లాగి, పూర్తిగా పెద్ద వైరం చేసి పెడతారు, ఇక మొఖాలు చూసుకోకుండా.

ఇక్కడ కూడా అనుచరులు కు, వారి నాయకులు అండ, వారికి అధికారులు ఎమ్మెల్యే ఎంపీలు మంత్రులు అండ. తిలా పాపం పిడికెడు అందరూ పంచుకుని, పార్టీ నాయకుని నెత్తిన, ఇంత పాపం మూట పెడతారు.

రాబోయే కాలంలో అందరూ (అందరం), ఆ పాప ఫలితాలు అనుభవించాలి, వంశోద్దారకుల రాజకీయ లేదా సామాజిక ఎదుగుదల కు, అవరోధాలు ఇవన్నీ, జాగ్రత్తలు మరి నాయకులు, అధికారులు, ప్రజా మిత్రులారా, కాలం గిర్రున తిరిగి, మన దగ్గరకు వస్తుంది.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,882,703; 104 తత్వాలు (Tatvaalu) and views 226,444
Dt : 16-Dec-2020, Upd Dt : 16-Dec-2020, Category : Politics
Views : 726 ( + More Social Media views ), Id : 862 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : story , jaya vijaya , compare , practice , todays , politicians , followers , support
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content