రక్తపరీక్షకు రక్తం తీసేటప్పుడు ఉండి, భయ పడకుండా, ధైర్యం చెప్పాలి. ప్రశ్నలకు జవాబు. యూరిన్ పట్టాలి. - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,882,036; 104 తత్వాలు (Tatvaalu) and views 226,380.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

While drawing blood for blood test we have to give support. Answer the questions asked by them. We should be near and hold Urine.

*రక్తపరీక్షకు రక్తం తీసేటప్పుడు పక్కన ఉండి, భయ పడకుండా ధైర్యం చెప్పాలి. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పాలి. యూరిన్, దగ్గర ఉండి, పట్టాలి.*

ఇప్పుడు 78+ పెద్ద వయసు అమ్మ ను, సంవత్సరం ముందు జాగ్రత్త రక్త పరీక్ష చేయించి, తిరిగి ఇంటికి వచ్చాం.

అందురూ మా గురించి, మా పెద్దల గురించి ఇతరులకు ఎందుకు చెప్పాలి మా ఇష్టం మాది, మా సొమ్ముతో మేము జల్సా చేసుకుంటాము, ఆస్తులు పెంచుకుంటాము, మనశ్శాంతి పోగొట్టుకుంటాము, కనీసం మా పిల్లలకు సంస్కారం తెలుగు రాయడం నేర్పకుండా అని అహంకారముతో, రజో తమో గుణాలతో జవాబు ఇస్తారు లేదా గమ్ముగా ఉంటారు, ఎవరు ఎట్లా చస్తే మనకెందుకు, మన గొయ్యి మనమూ లేదా మన ఇంట్లో వారే కదా తీసేది అన్న బద్దకముతో.

5+ ఏళ్ళు సజీవ గురువు సేవ చేస్తే, ఈ మాటలు కలలో కూడా, సరదాకు రావు, మానవత్వం ఉన్న మనుషులకు. కానీ మన చుట్టూ 80 శాతం మంది ఆలోచన ఇదే. మనది జంతు స్వభావము ఇలాంటివి మనకు పడవు అనుకునే వారిని వారి పాపానికి వదిలేయడమే.

కానీ 50 వయసు లోపు ఉండే ధైర్యం, పంచభూతాల శిక్షణ అప్పుడు, ఉండదు సుమీ. అహంకారముతో పలికిన రావణుడు, దుర్యోధనుడు చివరకు పారిపోయారు దాంకున్నారు. కానీ కర్మ వీడలేదు.

అలాగే రామన్న రోడ్ ఎక్కి, రాండి రాండి తమ్ముళ్ళు అంటే, ఒక్క సంస్కార పెంపకం ఉన్న తెలుగు తమ్ముళ్ళు ఆయనకు అండగా పోలేదు, అవి మన నీచపు కపట నటన 2 నాల్కల బతుకులు. తెలంగాణ చంద్రన్న ని పడకుండా ఎవరూ ఆపలేదు.

అవసరం కు వంద మాటలు ముందు, శూన్య చేతలు చివర, సొంత ముదుసలి తల్లి తండ్రులు అత్త మామలకు. ఇంక బయట వారికి సేవ చేస్తారా?

కానీ మనం, మీ అందరికీ చెప్పాము, మన అమ్మ విషయములో ఏదైనా అజాగ్రత్త జరిగితే, నిలదీసి అడిగే హక్కు మీ అందరికీ ఉంది అని 10 ఏళ్ళుగా. 4 సార్లు పడినా, దేవుని దయవలన, అదే రోజు సర్దుకో గలిగాము ఎమర్జెన్సీకి వెళ్ళి కూడా.

ఆ ధైర్యం చిత్తశుద్ది క్రుతజ్ఞత విశ్వసనీయత దైవ బలం ఎప్పుడు మన అందరికీ రావాలి ఆలోచన చెయ్యండి. రాకపోతె నష్టం ఎవరికి, మీకా, మాకా?

మన పిల్లలది ఎప్పుడు తప్పు కాదు, మనము నేర్పని సంస్కారం, మనకు లేని సంస్కారం, వారికి తెలీదు కదా? ప్రహ్లాదుడు లాంటి సంతానం, కనే అద్రుష్టం మనకు లేదు.

ఉదయం 6.30 కే వెళ్ళాము, చీకటి చలి ఓ వైపు, రాత్రి 7 నుంచి అమ్మ ఏమీ తినలేదు నీళ్ళు తాగడం తప్ప, కాబట్టి వీలైనంత పొద్దున్నే వెళ్ళాలి, నీరసం తో పడి పోతుంది ఏమో అని ఒక టెన్షన్, బీపీ షుగర్ పెరుగుతుంది అని ఇంకో టెన్షన్.

రాత్రి అంతా కలవరిస్తూ ఉన్నా, ఒపికగా జవాబు చెప్పి, నిద్ర పుచ్చాలి. యూరిన్ కి రాత్రి వెళ్ళినప్పుడు, పడకుండా ఉండే జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళు లైట్, టాప్/ పంపు ఆపకున్నా, మనము వెళ్ళి ఆపి రావాలి. మందు వేయమన్నా, నీళ్ళు పోయమన్నా, విసుక్కోకుండా, మన నిద్ర పోతుంది అని ఏడవకుండా, గొంతులో వెయ్యాలి.

రక్తం తీసేటప్పుడు పక్కన ఉండి, భయ పడకుండా ధైర్యం చెప్పాలి. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు, ఓపికగా జవాబు చెప్పాలి. యూరిన్ దగ్గర ఉండి పట్టాలి. చిన్నప్పుడు ఎన్ని సేవలు మనకు చేసారో, అవన్నీ మనము చేయాలి.

ఇలా తమ పెద్దలకు సేవ చేయని వారిని, అవసర అవకాశం కోసం, గుణం లేని పెళ్ళి చేసుకున్న భాగస్వామి బతుకు, రేపు ఏమిటి? వీరి సంతానం వలన, ప్రపంచానికి ఉపయోగం లేకపోయినా, కనీసం వారికైన విలువ ఉందా?

ఇవన్నీ మరియు ఇంతకన్నా ఎక్కువే మీరు మీ ముదుసలి పెద్దలకు, 10 ఏళ్ళు పైగా దగ్గర ఉంచి చేసే ఉంటారు, మీరు సాత్వికులు అయితే, గురువు దైవం పై ఆచరణ భక్తి ఉంటే.

ఇలా మనం చేయాలంటే, చేయించుకోవాలి అంటే, రెండు వైపులా సాత్వికత, స్ధిరత్వం, స్ధితప్రజ్ఞత, అరిషడవర్గ అష్టవ్యసన బానిసత్వం జయించే సంకల్పం, ఉండాలి సుమా.

అబ్బే ఇవన్నీ సోది మాటలు అనేవారు, ఇప్పుడు పడి కుయ్యొ మొయ్యో అంటూ, ఆసుపత్రిలో ఆపరేషన్ తో, 6 వారాలు ఉంటే బాగుంటుందా? వారికి ధనం పలుకుబడి ఉంది, మరి మనకు?

అదే మనము పంపినవి 10 నిమిషాలు చదివి, కుటుంబానికి చెప్పుకుని, తమ కుటుంబాన్ని బాగు చేసుకుంటూ ఉంటే, ఈ తిప్పలు కష్టాలు కన్నీరు ఉండవు కదా?

ధనం పెట్టి కొన్న ఖరీదైన గాజు బొమ్మ ను, పగలకుండా ఎంత జాగ్రత్త గా చూస్తామో, ప్రాణం ఉన్న, అలాగే మనకు ప్రాణం ఇచ్చిన, అలాగే జీవిత భిక్ష పెట్టిన, అలాగే బతకటం నేర్పిన, పెద్ద వారిని అంతకన్నా ఎక్కువగా క్రుతజ్ఞత విశ్వసనీయతతో, జాగ్రత్తగా కనురెప్ప లా కాపాడాలి. అందుకే సాత్విక తల్లి దండ్రుల గురించి, మాత్రు దేవోభవ, పిత్రు దేవోభవ అని చెప్పారు.

సాత్విక జీవులు, మనకు 5 ఏళ్ళుపైగా తమ మానసిక స్పందనను, తెలియ చేస్తాయి. తెలియ చేయకపోతే, వారికి, మనకి కూడా, వారి భవిష్యత్ తెలుసు. వారు నేడు అంగీకరించరు. కానీ రావణ, దుర్యోధన, కర్ణుని లా చరమానకములో, పంచభూతాలే అంగీకరింప చేస్తాయి, బలవంతముగా మొట్టి బుద్ది చెప్పి.

రజో తామస తల్లి దండ్రులకు, తగిన శిక్షలు, వారి పిల్లలే వేసి, ఊళ్ళో తక్కువ సౌకర్యాలతో బంధువులు పని వారి దగ్గర వదలడం లేదా ధనం కట్టి ఆశ్రమములో వేయడం చూస్తున్నాము. ఈ గుణ పెద్దలు మారరు, వారి పిల్లలు వీరి మాట వినరు లెక్క చేయరు. ఎందుకంటే అది వారి వంశ పెంపక సంస్కారం.

స్వార్థ సంతానం, భాగస్వామి, పని వారు, మనము పడ్డాక వచ్చి తీరుబడిగా, ఆసుపత్రికి తీసుకుని వెళతారు.

కానీ స్ధితప్రజ్ఞత గలవారు, అసలు పడకుండా, ఆసుపత్రికే వెళ్ళకుండా, మనసా వాచా కర్మణా ఆయుర్వేద లాంటి, వివిధ రక్షణ లతో జాగ్రత్తలు తో కాపాడుకుంటారు.

మీ ఇంట్లో, మీ బజారు లో, మీ ఊళ్ళో, అలాంటి వారు ఉంటే, నేర్చుకోవాలి, అనుసరించాలి. రేపు మనకూ అవసరం.

కేసీఆర్, రామన్న రాజన్న, జగనన్న, చంద్రన్న, మీ, మా, చుట్టుపక్కల ఎంతో మంది, నష్టం జరిగాక ఏదో మొక్కుబడిగా చేద్దాం అని, పరుగులు తీసే స్వార్థ పరులు గా ఉన్నారే కానీ, ఏదీ జరగక ముందే భద్రం చేద్దాం అన్న, సాత్వికులు లేరు. వీరికి మనలాగా అరచి చెప్పే నిస్వార్ధ గురువులు ఉంటే, వీరి పతనం జరుగదు.

ద్రుతరాష్ట్రుడు రాజు అయ్యి కూడా, ధనం ఇల్లు ఉద్యోగం ఇచ్చి, రోజూ నాకు బుద్ది చెపుతూ ఉండూ, అని విదురుని దగ్గర పెట్టుకున్నారు. విదురుడు మన లాగే రోజూ బుద్ది చెప్పారు. కానీ ఆయన మనసుతో వినలేదు, ఆచరణలో పెట్టలేదు.

మన చుట్టూ 80 శాతం దైవ గురు పూజ అని నటించేవారు ఇంతే, మంచి వినరు, పాటించరు. అబ్బే మాకు మా సొంత ముదుసలి అమ్మ నాన్న అత్త మామ సేవ అంటేనే కష్టం, మీవి 15 నిమిషాలు చదవాలి అంటే, పది మందికి పంపి, మా కుటుంబములో అర్ధము అయ్యేలా ఆచరణలోకి తేవాలి అంటే, మేము ఆసుపత్రిలో రోగముతో చేరినాకే అంటారు. అప్పుడు వారి మాట ఎవరు వినరు, వారి శరీరమే వారి మాట వినదు సుమీ.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,882,036; 104 తత్వాలు (Tatvaalu) and views 226,380
Dt : 15-Dec-2023, Upd Dt : 15-Dec-2023, Category : General
Views : 116 ( + More Social Media views ), Id : 1965 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : drawing , blood , test , support , Answer , questions , hold , Urine , old parents , mom
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content