మాకు మా పిల్లలకు, ఏ లక్షణాలు లేవో, ఏవి మరచిపోయామో? హైలైట్, ముదుసలి వయస్సు లో పిల్లలు తోనే? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,882,629; 104 తత్వాలు (Tatvaalu) and views 226,441.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

*ఏవండీ, మీ విజయదశమి శుభాకాంక్షలు అద్భుతం, మాకు మా పిల్లలకు, ఏ లక్షణాలు అయితే లేవో, ఏవి మరచిపోయామో, వేటిని రోజూ ఎగతాళి చేస్తూ వదిలేస్తూ పతనం అవుతున్నామో, వాటన్నిటినీ గుర్తు చేస్తూ, మమ్మల్ని మేల్కొలుపుతూ ఆ శక్తిని మాకు ఇవ్వమని దేవుని మీరు కోరడం, బహుశా ఇతరులకు ఇలాంటి ఆలోచన రాదు. హేట్సాప్, వాస్తవం చెప్పారు, మీకు దేవుడి అండ ఉంటుంది, ఉండబట్టే ఇలాంటి ప్రత్యేక మైన మాటలు పనులు చేస్తున్నారు.*

*ఇంకా హైలైట్, మా ముదుసలి వయస్సు లో పిల్లలు తోనే ఆనంద సౌకర్యాల జీవితం కు అన్న వాక్యం, ఇది అన్ని కులాలు, మతాల వారికి కూడే నచ్చే కావాల్సిన విషయం, మా పాపాలకు అది సాధ్యం కాదని మాత్రం ఒప్పుకోలేం ఆత్మద్రోహముతో. కానీ, మా తప్పులకు శిక్ష తప్పదు. మీరు చెప్పే భవిష్యత కష్టాల కన్నా, గరుడ పురాణం లో ఇంకా ఎక్కువ ఉన్నాయి. అవి మన రామన్న, రాజన్న, మన ఇళ్ళ చుట్టూ, మన కుటుంబ జీవితాలలో ప్రత్యక్షముగా చూసాము. కానీ 75 మంది బండ మనుషులము, గట్టి సమ్మెట దెబ్బ తగలనిదే, ఇలాంటి సుతి మెత్తని మాటలకు కరగము, మారము.*

జవాబు - ధన్యవాదములు గురువు గారు. ముందుగా, తమ సొంత మాటలు లేదా సొంత గొంతుతో, శుభాకాంక్షలు దీవెనలు చెప్పిన గురువులకు, శిరస్సు వంచి నమస్కారములు. మల్లెపువ్వు సువాసన ఎక్కడ అయినా ఒకటే. మీ కుటుంబములో ఉన్న మంచి సంస్కారం సమతాస్తితి, మీరు దాచుకోలేరు, మీకు పదవులు అధికారం ఆస్తులు ముఖ్యం కాదు, కేవలం గుణము మాత్రమే ముఖ్యం.

మిమ్మల్ని మీ పిల్లలు, ముదుసలి వయసులో చూస్తారు, మీరు ఇప్పుడు మీ తల్లి దండ్రులను, గౌరవముగా అందరితో మాట్లాడిస్తూ, మీతో తిప్పుతూ, సమాన సౌకర్యాలు ఇస్తూ, మంచిగా చూస్తున్నారు.

మనము అందరము తప్పులు చేస్తాము. కానీ తమ తప్పు ధైర్యముగా ఒప్పుకునే వాడే మనస్పూర్తిగా మనిషి, తనే దేవుడిగా మారాలి, మారతాడు. ఇది మతానికి సంబంధం లేదు. అదే సనాతన ధర్మం గొప్పతనం. మీ అందరి ఎదురు, మీ కన్నా 100 శాతం పాపాత్ముడుని అని ఒప్పుకున్నాము.

కాబట్టి, మీరు మమ్మల్ని పొగిడినా తిట్టినా, మన ఇద్దరికీ ఉపయోగములేదు. కానీ, మనవి చదివి అయినా, ప్రత్యక్ష సాక్ష్యం చూసి అయినా, మీ లాంటి గురువుల మనసులు మారితే, త్రికరణ శుద్ది గా, మంచి వైపు అడుగు వేస్తే, బాగుపడేది మీ చివరి రోజులు, మీ పిల్లల ఉత్తమ భవిష్యత్, మీ కుటుంబము మాత్రమే, మన సమాజం మాత్రమే.

మన కపట మనసుతో, పాము, నక్క, పులి, సిమ్హాల ని ఏనాటికీ ఎన్నుకోలేము, ఇప్పుడు కొత్త నక్కలు వస్తున్నాయి, అయినా మంచి మనసుతో ఆవునే ఎన్నుకుంటాము. మన పిల్లలు, సినిమా నటుల నాయకిల నాయకుల ఫోటోలు పెట్టుకోకుండా, తమకు బుద్ది తిండి జ్ఞానం అంటే కూడు గూడు బుద్ది ఇచ్చిన, తల్లి దండ్రుల ఫోటోలు మాటలు పెట్టుకుంటారు, ప్రొఫైల్ లో స్టేటస్ లో. అదే మీరు ప్రేమతో, ఈ అజ్ఞాన శిష్యులకు ఇచ్చే దీవెన.

5 ఏళ్ళ కు పైగా, మీ లాంటి ఉత్తములు, ఈ కింది వాటిలో ఏదో ఒకటి తమకు లక్షణము గా ఉండి, తాము ఆచరిస్తూ, తమ పిల్లలకు నేర్పుతూ, తమ పెద్దల సంస్కార పెంపకాన్ని బయటకు ప్రత్యక్షముగా చూపిస్తారు, శుభాకాంక్షలు అభినందనలు తో, సొంతగా తెలుగు లో రాస్తూ వారి కన్నతల్లికి వందనాలు అర్పిస్తూ.

ఏ చిన్న మంచి పనిని కూడా, గేళి చేయరు. మౌనముగ మొద్దులా ప్రోత్సాహం చేయకుండా కూర్చోరు, ఎందుకంటే జీవచ్చవం తమ కుటుంబానికి కూడా పనికిరాదు కదా. తమ చివరి రోజులు పతన మార్గం లో తిప్పుకోరు. రోజూ జరిగే యాక్సిడెంట్లు ఉత్పాతాలతో, మనకు రేపు అనేది తెలీదు. ఇంక ఎప్పుడు మంచి చేసిది, చెప్పేది, ఆచరించేది? కరోనా గురువు బుద్ది చెప్పినా, మారని బండ మనుషులు మన చుట్టూ ఉన్నారు.

ఈ గుణాలు లేని వారు, ఈ సొది మరియు ఈ సోది మనుషులతో, మనకు పని ఏమి, ధనం ఆస్తి హోదా అధికారం ఉంది చాలు అన్న భ్రమలో ఉంటారు, అవి అశాశ్వతమని తెలిసి కూడా జీవితం వ్రుధా చేసి, చివరలో మనశ్శాంతి కరువై, మరలా కపట మనుషులను/ బాబాలను/బోధకులను నమ్మి, మరలా మోసపోతారు. ఎందుకంటే, వీరు మాయ బయటకు రాలేరు, చూడలేరు.

చూడండి ఈ గుణాలలో, ఒక్కటి అయినా, తమకు లేని వారు, ఇతరుల మంచిని సమర్ధన చేయలేరు, మెచ్చుకోరు, ఆచరించరు, తమ పిల్లలకు నేర్పరు.

1. 8 ఏళ్ళ, 77 ఏళ్ళ తూలిపడే సజీవ గురువు తల్లి, సేవ
2. రోజూ చేయిపట్టి 2 పూటలా, పూటకి 1 మైలు నడక
3. సొంత ఆయుర్వేదం తో, బీపీ షుగరు అదుపు అమ్మకు
4. 150 పైగా వారాలు, ఉత్త పాదాలతో కొండరాయి మీద, పరగడుపుతో 10 లోపు 108 ప్రదక్షిణలు కరమాల లెక్కతో
5. 20 ఏళ్ళ పైగా శాఖాహార తిండి, నేల నిద్ర, యోగ, వేద శ్లోక పఠనం, ఇంకా ఎన్నో రూపాయి అప్పు లేకుండా
6. ఇలాంటివి ఎన్నో ఇంకా, శని వారం లిస్ట్ లో ఉన్నాయి కదా మిగతా

ఇవి ఎంత మంది చేస్తారు, ఎంత మంది మెచ్చుతారు. వాటి విలువ వారికి జీవితములో ఖచ్చితముగా వస్తుంది, తెలుస్తుంది. ఆ రోజున, వారి బాధ గోడు వినేవారు ఉండరు. ఆ పరిస్థితి రాకూడదనే, మనము దయచేసి ఇప్పుడే మారండి, రేపు మనది కాదు అని, గురువులందరికీ 5 ఏళ్ళు పైగా, శిరస్సు వంచి నమస్కారము చేసి బతిమిలాడుతున్నది.

దేవుడు, ముందు మనలాంటి వారితో సున్నితముగా చెప్పిస్తారు. దానినే అవమానం, మమ్మల్నే తక్కువ చేస్తున్నారు అనేవారికి, వారి భాగస్వామి పిల్లలు కోడలు అల్లుడు చేత, వివరముగా గుణపాఠాలు చెప్పిస్తారు. అది వారు ఏడ్చి గీ పెట్టినా, తప్పించుకోలేరు.

మన కళ్ళ ఎదురు చూస్తున్నాము, సంస్కారం ఇవ్వకుండా కోట్లు ఇచ్చిన వారినే, వారి పిల్లలు ఇంటి ముందు లేదా వెనక షెడ్ లో పెడుతున్నారు లేదా వెన్నుపోటు పొడుస్తున్నారు. ఇప్పుడు చిన్న వయసులోనే, అరిషడ్వర్గాలకు మాదక ద్రవ్యాలకు బానిసలు అవుతున్నారు, ఇది ఖచ్చితము గా ఇలాంటి పెద్దల తప్పుడు పెంపకమే, అని వారే తెలుసుకుంటారు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,882,629; 104 తత్వాలు (Tatvaalu) and views 226,441
Dt : 05-Oct-2022, Upd Dt : 05-Oct-2022, Category : General
Views : 366 ( + More Social Media views ), Id : 1561 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : guna , elders , children , stay , kids , oldage , vijayadasami , dasara
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content