పాటతో పరమార్ధం - వేయి నామాల వాడ - ఓం నమో వెంకటేశాయ - నాగార్జున, అనుష్క, సౌరభ్, జగపతి బాబు - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,882,769; 104 తత్వాలు (Tatvaalu) and views 226,445.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

వెంకటేశా శ్రీనివాసా శేషశైలవాసా Song Spirit - Venkatesa.. Srinivasa.. Seshasailavasa. - Veyi Naamaala Vaada - Om Namo Venkatesaya - Nagarjuna, Anushka, Saurabh, Jagapathi Babu, Pragya Jaiswal वेंकटेश श्रीनिवास शेषशैलवसा - हजार नामों का - ओम नमो वेंकटेशाय - नागार्जुन, अनुष्का, सौरभ, जगपति बाबू

మంత్రం మనసు మీద పనిచేస్తుంది. దేవునికి మన పూజ అవసరము లేదు. మన అమ్మ, మనల్ని పూజ చెయ్యండి, పిండివంటలు వండి పెట్టండి, లేకపోతె మీకు మంచి చెయ్యను అంటుందా? దేవుడు అంతే.

కానీ ఇతర మతాలలో, వారి గురువు/ దేవతను నమ్మకపోతే, పాపులుగా నరకాని పోతారు అని అబద్దాలు చెపుతారు. ఎందుకంటే, వాళ్ళు ఇక్కడే ఇప్పుడే, నరకం లో ఉన్నారు, ఉంటారు కాబట్టి.

కానీ మన మనశ్శాంతికి, మానసిక నియంత్రణకు, దైవ పూజ కావాలి. అందుకే హైందవ సనాతన ధర్మములో, మానవుల భిన్న సత్వ రజో తమో గుణముల ప్రకారము, పూజా నియమాలను పెట్టి, మానసిక నియంత్రణ నేర్పే విధముగా, మనిషికి నచ్చిన దైవాన్ని కొలవచ్చు అని పెద్దలు చెప్పారు.

వారి అసలు ఉద్దేశ్యం వదిలేసి, మనం 4 టెంకాయలు, 40 పిండి వంటలతో పూజలు చేస్తున్నాము, అసలు మానసిక నైవేద్యం వదలి. కుటుంబ కలహాలు, రోగాలతో, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వములో పతనము అవుతున్నాము.

దైవ పూజ అంటే, మన ఆత్మ పూజే, అదే పరమాత్మ పూజే. అది మనసుతో చేయాలి, అందుకే మనము చేసే ప్రతి వ్రతములో కూడా, చిత్తశుద్ది త్రికరణశుద్ది అన్న పదాలు ఉంటాయి. దాని అర్ధం వదిలేసి, మిగతా పూజ, మొక్కుబడిగా మమ అని, కానిచ్చేస్తాము. యాగాలు వ్రతాలు యాత్రలు దానాలు చేస్తాము, ధర్మం నీతి నియమము వదిలేసి, ఫలితము శూన్యం.

చిత్తశుద్ది అంటే, మన ఆలోచన, పలుకు, పనులు అన్ని కలవాలి. సత్యనారాయణ స్వామి పూజ చేసి, బయట అంతా కపటం నాటకం 2 నాల్కల ధోరణి అబద్దాలు ఉంటే, మనకు చిత్తశుద్ది లేనట్లే. ఆ పూజ ఫలించదు.

మరి మన తెలుగు వారి పుట్టింటి దేవుడు తిరుమల తిరుపతి శ్రీనివాసుడు పాట ఇంటిల్లి పాదీ పాడి తరిద్దామా. ఈ పాట మొత్తములో, దైవ నామాలే ఉన్నాయి సుమీ.

పరమాత్మ, పరంధామ, పరమానంద అంటే, ఆయనకన్నా ఈ ప్రపంచములో, అంతకన్నా శాశ్వత ఆనందం ఉందా? కోరుకున్న వారి, కొంగు బంగారు స్వామీ అంటే, శరీరానికి ధరించే బంగారం కాదు, దొంగలు కోసుకుని వెళుతున్నారు కదా. మనసుకు కావాల్సిన మానశ్శాంతి ఏ ఆ కొంగు బంగారం. అజ్ఞానపు చీకట్లను అణిచెదవయ్య, మాధవ కేశవా అంటే, మోహాలను వదిలే మానసిక సాధన నేను చేస్తాను, అది కొనసాగించే శక్తి ఇవ్వమని అడగడం. మంచి మార్గమున మమ్ము నడిపేవయ్య, అంటే, ఆయనను వెలుగు గా భావించి, మన కర్మలు నిస్వార్ధముగా త్యాగ భావముతో ఉండాలి సుమీ, తామరాకు పై నీటి బొట్టు గా.

అదేమిటండీ అప్పు చేసి పప్పు కూడు తింటా, 4 డాబాలతో, 4 అప్పులతో, 4 మోహ బంధువులు స్నేహితులతో, 4 నాలుక రుచులతో, 40 రోగాలతో పోవాలి, సంపాదించినది ఊడ్చుకుని అని అంటారా, మనం ఏది కోరితే అదే వస్తుంది కదా, మీ ఇష్టం. రాబోయే కాలం, గుణపాఠాలు నేర్పుతుంది కదా.

* * *
Veṅkaṭēśā.. Śrīnivāsā.. Śēṣaśailavā.Sā.
Mādhavā, kēśavā, madhusū.Dhanā. 2
Nanda nandanā.., Narahari nārāyaṇa..
Paramātma, parandhāma, paramānanda..
Acyuta, ananta, gō.Vindā..

వెంకటేశా.. శ్రీనివాసా.. శేషశైలవా.సా.
మాధవా, కేశవా, మధుసూ.ధనా. 2
నంద నందనా.., నరహరి నారాయణ..
పరమాత్మ, పరంధామ, పరమానంద..
అచ్యుత, అనంత, గో.విందా.. 2

వేయి నామాల వాడ, వెంకటేశుడా.
మూడు నామాల, ముద్దు శ్రీనివాసుడ..- 2 సార్లు మొత్తము
కోటి కోటి దండాలయ్యా, కోనే.టిరా.యడ 2
కోరుకున్న వా.రి, కొంగు బంగా.రు దేవుడా..
మురహర, నగధరా, మురళీ.ధర..
శ్రీకర, శ్రీధర, శ్రిత, మందా.ర.
సర్వేశ్వరా, పరమేశ్వర, శాంతాకార.
శంక చక్ర, ధర సప్త, శైలే.శ్వర.

సుప్రభాత సేవలో సూర్యుడవయ్యా.., సూర్యుడవయ్యా..
అజ్ఞానపు చీకట్లను అణిచెదవయ్య, మాధవ కేశవా
అభిషేక సేవలో మురిసేవయ్య, మురిసేవాయ
ఆత్మ కల్మషముల కడిగి కాచేవయ్యా,శ్రీకర శ్రీధర ||కోటి కోటి ||

పద్మనాభ, హ్రిషికేశ,
పద్మనాభ హ్రిషికేశ పన్నగ శయన
పరశురామ బలరామ రఘుకుల రామ
పురుషోత్తమ పుణ్య పురుష పుండరీకాక్ష
వామన, వాసుదేవ, వాంఛిత వరద ||వేయి నామాల||

నిజ పాద దర్శనమున, నిలిచేవయ్య, నిలిచేవయ్య
నీ పాదాలే దిక్కు అని చాటెదయ్యా, అచ్యుత అవ్యయా
నేత్ర దర్శనాన్ని మాకు యిచ్చేవయ్యా, యిచ్చేవయ్యా
మంచి మార్గమున మమ్ము నడిపేవాయ
మురహర, నగధరా,
కోటి కోటి దండాలయ్యా ..

కోటి కోటి దండాలయ్యా, కోనే.టిరా.యడ 2
కోరుకున్న వా.రి, కొంగు బంగా.రు దేవుడా..

వేయి నామాల వాడ, వెంకటేశుడా.
మూడు నామాల, ముద్దు శ్రీనివాసుడ..
కోటి కోటి దండాలయ్యా, కోనే.టిరా.యడ 2
కోరుకున్న వా.రి, కొంగు బంగా.రు దేవుడా..  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,882,769; 104 తత్వాలు (Tatvaalu) and views 226,445
Dt : 01-Mar-2024, Upd Dt : 01-Mar-2024, Category : Songs
Views : 147 ( + More Social Media views ), Id : 2044 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Veyi Naamaala Vaada , Om Namo Venkatesaya , Nagarjuna , Anushka , Saurabh , Jagapathi Babu , Pragya Jaiswal
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content