మానసిక రోగాలు పుచ్చుకునే, దౌర్భాగ్యం ఆపుకోలేని నిస్సహాయ స్తితి, మానసిక దౌర్భల్యం మనది కాదా? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,882,619; 104 తత్వాలు (Tatvaalu) and views 226,440.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

Is it not our, helpless state, where mental illnesses are rampant, misery is unbearable?

78+ ఏళ్ళ వయసులో చలి ఎండ జల్లు అయినా, పొద్దున్నే చిమ్మి కడిగి ముగ్గు వేసే, అలాగే 16 లక్షల రామకోటి రాసే, ఎన్ని నెప్పులు రోగాలు ఉన్నా రోజూ చేయి పట్టుకుని 1 మైలు నడిచే, నీతి నిబద్దత పట్టుదల నియమము, మనలో ఎంత మందికి ఉంది? రేపు మనము చేయగలమా?

కనీసం సినిమా, సీరియల్, ఓటీటీ, సోషల్ మీడియా చూడకుండా ఉండలేక, కళ్ళ జోడు తెచ్చుకునే, మానసిక రోగాలు పుచ్చుకునే, దౌర్భాగ్యం ఆపుకోలేని నిస్సహాయ స్తితి, మానసిక దౌర్భల్యం మనది కాదా?

ఆఖరికి మన ఫోటోలు పోర్న్ సైట్ లకు పోతూ మార్ఫిగ్ అవుతాయని, మన ఫోటోలు పెట్టుకుని సోషల్ మీడియాలో మోసాలు చేస్తూ అడుక్కుంటున్నారు అని తెలిసినా, ఫోటో పెట్టడం, రీల్స్ వీడియోలలో ఇంటిల్లి పాదీ మూగ అభినయాల తో గెంతడం, ఇంట్లో దొంగతనం చెయ్యడానికి లేదా ఆడంబరాలు తెలుసుకోవడానికి వీలుగా ఇల్లు మొత్తము అందరికీ ఆన్లైన్ లో చూపించడం, ఓరి మీ మానసిక దిగజారుడు తగలెయ్యా.

ఇంట్లో వారే వెన్నుపోటుకు రెడీ గా ఉంటే, ఇంక బయటవారితో కూడా తగలపెట్టించు కోవడానికి తొందర ఎందుకురా? రేపు రోగం వస్తే, భాగస్వామే మనల్ని గౌరవముగా చూడరు అని, మీకు 20, 40 ఏళ్ళ పెళ్ళి తర్వాత కూడా విడాకులకు పోతున్న వార్తలు, కళ్ళకు ఆనడం లేదా?

జ్వరం దగ్గు జలుబు వస్తేనే, మంచం ఎక్కి గగ్గోలు పెడుతూ, కార్పొరేట్ ఆసుపత్రికి పరుగులు, పాప/ దొంగ సంపాదన తరుగులు, ఇదేనా మన రోగ నిరోధక శక్తి సామర్ధ్యం?

కనీసం ఆ 78+ వయసుకు ఉంటామో లేదో తెలీదు. ఒకవేళ ఉన్నా కాళ్ళు చేతులు కదులుతాయో లేదో తెలీదు. కాకర అల్లం వెల్లుల్లి రసం కషాయం ఇచ్చే వారు ఉన్నారా/ ఉంటారా ఆనాడు, ఇచ్చినా తాగగలమా ఆ వయసులో?

ఇంట్లో వండుకోవటం చేతగాక లేదా బద్దకముతో, హోటెల్ లో మసాలా దట్టించి 4 సార్లు కాచిన నూనెతో వండిన ఏదో తెలియని కుళ్ళిన మాంసం, వేడి చేసిన సద్ది అన్నము కూరలు, లొట్టలు వేసుకుంటు తినే దిగజారిన బతుకులా, ఊదర వళ్ళుతో?

స్టేటస్ లో పెడుతున్న ఘోరాలు చూస్తున్నారా? లేక చివరలో, ఆసుపత్రి లేదా అనాధశరణాలయము లో ఉన్నప్పుడు, కనపడని కళ్ళతో చూసి, కదలలేని ఒళ్ళు తో, వగచి వగచి పాముకునేది ఏముంటుంది అన్నా?

థూ మన బతుకులు చెడ, నీతి నియమం, జాతి సిగ్గు ఎగ్గు, వాక్సుద్ది చిత్తశుద్ది గాత్రశుద్ది, సహనం ఓర్పు, సజీవ గురు సేవ వదిలేసి, అబద్దాలు అప్పులతో తలవంచి ఇతరుల పాదాలకు మొక్కుతూ, రోగాలతో నటనలతో 2 నాల్కల తో, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం తో, నక్క పులి పాము కు ఓటేస్తూ,

మనశ్శాంతి లేకుండా, ఇంట్లో ముదుసలి తల్లి దండ్రిని అత్త మామను చూడకుండా సేవ చేయకుండా, మన సంస్కార పిల్లల ఇంట్లో కూడా మనల్ని ముదుసలి తనం లో చూస్తారని చెప్పలేని దౌర్భాగ్య జీవితమా మనది? జంతువులు కని పారేసిందానికి, మనకు తేడా ఏమిటి? కుక్క కున్న విశ్వసనీయత క్రుతజ్ఞతలు మనకు లేవు కదూ?

విలేఖరినా, అన్న నా, తమ్ముడినా, తండ్రినా, కొడుకునా, శిష్యుడినా, గురువునా? అహే, సొంత ముదుసలి తల్లి తండ్రి అత్త మామల ద్రోహులకు, అంత అర్ధం పరమార్ధం ఏడిచిందా, అని నవ్వారు కదూ?

హ హ హ, పంచ భూతాలు వదలవు అన్నాయ్/ అక్కాయ్, అలాగే నవ్వి, మనకు శుద్దిని కలిగించే మార్గాలు చూపుతాయి. రేపు పిల్లలు అల్లుడు కోడలే, తాట తీసి, తీయగా నేర్పుతారు సంస్కారాన్ని మనకు లేదా అనాధలా వదిలేస్తారు, ఇప్పుడైనా బుద్ది తెచ్చుకుని మారకపోతే.

Jai Shaneeswara జై శనీశ్వరా

You know that mistakes will be corrected and posted in the website soon. Please teach our saturday sadhanas to family and try to practice. Teached ayurveda protection marg also from above 5 yrs.

తప్పులు సరిచేసి వెబ్సైట్ లో పెడతామని మీకు తెలుసు త్వరలో. మన శనివారం సాధనలు కుటుంబములో నేర్పుతూ, ఆచరణలో పెట్టే ప్రయత్నం చేయగలరు. ఆయుర్వేద రక్షణ మార్గం కూడా మీకు నేర్పాము 5 ఏళ్ళు పైన.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,882,619; 104 తత్వాలు (Tatvaalu) and views 226,440
Dt : 29-Nov-2023, Upd Dt : 29-Nov-2023, Category : General
Views : 150 ( + More Social Media views ), Id : 1954 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : helpless , state , mental , illnesses , rampant , misery , unbearable , arishadvarg , ashtvyasan
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content