అందరము విలువలలో దిగిజారి పోయాక, మంచి వినాలన్నా, ఆచరించాలన్నా, భయం బద్దకం, భరించలేం? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,882,732; 104 తత్వాలు (Tatvaalu) and views 226,444.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

When everyone has gone down in values, they cant bear the fear of listening or practicing good things. Why is it like that?

*అందరము విలువలలో దిగిజారి పోయాక, మంచి వినాలన్నా, ఆచరించాలన్నా, భయం బద్దకం, భరించలేం. ఎందుకంటారు?*

కలియుగ పతనములో, ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతను సక్రమముగా పాటిస్తున్నారు. అందరి లక్ష్యం ఒక్కటే, బతికిన మూడు రోజులు, తప్పో ఒప్పో చేసి, సుఖపడదాము, ఆ తర్వాత సర్వ నాశనం అయినా పర్లేదు అని అనుకుంటున్నారు. తంబీ, ఎవరూ తప్పించుకోవడము లేదు, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం ఫలితాల నుంచి అంటే వినలేరు మత్తులో, అజ్ఞానములో.

రామన్న, రాజన్న, సావిత్రమ్మ, జయలలితమ్మ, కోడెలయ్య, శ్రీదేవమ్మ‌‌‌, కాఫీడేఅయ్య, మాల్య, మీ ఇంట్లో మా ఇంట్లో లాంటి మహానుభావుల, చివరి పేజీలు చదవండి. అయినా బుద్ది రాదు.

పొద్దున్నే 7 కి లెగిచే వాడు, ఇతరులు 8 తర్వాత లెగుస్తున్నారు, నేనే బెస్ట్ అంటాడు. ఉదయం 5 కు కూడా లెగుస్తున్నారు, 78+ ఏళ్ళ పెద్ద వారు కూడా ఉన్నారు అంటే, వారికి పిచ్చి చపలము అనారోగ్యం అని గేళి చేస్తారు, మాకెందుకు ఇన్ని ఆస్తులు అధికారాలు భోగాలు రోగాలు ఆసుపత్రులు ఉంటే అంటారు. మరి పైన చెప్పిన వారికి, ఇవన్నీ లేవా?

తనను తాను మార్చుకోడు, మార్చుకోలేడు. ఎందుకంటే మానసిక బలహీనత. డీ విటమిన్ లోపిస్తే, బుద్ది మాంద్యం వస్తే, తనకు ఎన్ని లక్షల నష్టం ఖర్చు వస్తుందో, తన ఖర్మ కాలిన దాకా తనకు అర్ధం కాదు.

చూడండి, మన తెలుగు జాతిలో నే, ఉచితము అంటే చాలు, ఎవరికైనా ఓటు వేసేస్తారు. రాష్ట్రం అప్పు అయినా, కుటుంబం పన్నులతో వెన్నుపోటులతో దోచబడుతుంది అని తెలిసినా, పక్క వారికి సహాయం కూడా చెయ్యరు. బర్రెలక్క లాంటి సామాన్యులను ఎదగనీయరు. కనీసం ముదుసలి వయసు పెద్దవారిని గౌరవముతో పలకరించరు. ఎందుకంటే, తమకు ముదుసలి తనం రాదని, ఒంటరి బతుకు రాదని, వారి నమ్మకం. పైన ఉదాహరణలు తెలిసి కూడా.

ఎవరైనా మంచి పని చేస్తున్నారు అంటే, ముందు వారిని ఎగతాళి చెయ్యాలి, అది తప్పు అని వారికి అనిపించి అది మానేయాలి, అందరూ మనలాగే మగతలో అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం లో ఉండాలి అని చెప్పి, కేవలము చెడు మాత్రమే ఫార్వార్డ్ చేస్తున్నారు, మంచి వారి దగ్గరే ఆపేస్తున్నారు. రేపు వారి పిల్లలకు మనుమలకు కూడా, మంచి దొరకనీయకుండా చేస్తున్నది ఈ మూర్ఖులే.

అదే మనము 10 ఏళ్ళ దైవ ఉపాసనతో, 215+ వారాల 108 ప్రదక్షణలతో, లక్షల ఆదాయ ప్రభుత్వ ఉద్యోగం వదిలి, శాఖాహారముతో చాప నిద్ర తో, నిస్వార్ధ సజీవ గురువు సేవతో, సొంత ఆయుర్వేద వైద్యముతో, 78+ ఏళ్ళ అమ్మకు వాడి, మ్రుత్యువు నుంచి బయటకు వచ్చి, ఇన్సులిన్ ఇంజెక్షన్ లకు పోకుండా, నిండు బిళ్ళ నుండి అర బిళ్ళకు వచ్చాము అంటే అబ్బో, ఆ 10 ఏళ్ళలో మా పిల్లలు 10 కోట్లు సంపాదించి, 10 కంపెనీలు స్తాపించి, 10 ఇళ్ళు కొని, 10 ఆస్తులు పెంచి, మా ముదుసలి బతుకులు ఒంటరిగా ఇంట్లో లేదా అనాధాశ్రమములో వేసారు అని ఆనందపడతారు.

రేపు తమ పిల్లలకు రోగాలు వచ్చి, మానసిక బలహీనత వస్తే, పైన చెప్పిన ఆస్తులు అన్ని కర్పూరములా కరిగిపోవడమో, వెన్నుపోటుకు గురి కావడమో జరుగుతాయని, ఈ ముర్ఖులకు తెలిసినా, ముందు అంగీకరించలేరు. అదే మానసిక బలహీనత.

సంస్కార పెంపకము లేక పోవడము, ముందు చూపు లేకపోవడము, ధనము మనల్ని కాపాడుతుంది అన్న అహంకారముతో, తాము నాశనం అవుతూ, తమ కుటుంబాన్ని స్నేహితులు బంధువులు అందరినీ నాశనం చేస్తున్నారు.

అందరము విలువలలో దిగిజారి పోయాక, మంచి వినాలన్నా, ఆచరించాలన్నా, భయం బద్దకం, భరించలేం. లంచం లేనిదే కంచం, మంచం లేదు అనే కాడికి, సొంత ఇళ్ళలోనే దిగజారిపోయాము.

శారీరక అనారోగ్యం కన్నా, మానసిక అనారోగ్యం చిన్నప్పటి నుంచే, మంచి వైపు చూడటం మానేసి, ఎగతాళితో, స్వయం గోతుల వెన్నుపోటులతో, ఎప్పుడు ఎవరు ఏమి చేస్తారో, ఎవరిని నమ్మలేని స్తితికి తెచ్చుకున్నాము.

అందుకే, కరోనా లాంటి ఉపద్రవాలు, తుడిచిపెట్టడానికి వస్తున్నాయి, వస్తుంటాయి, పంచభూతాల ప్రళయాలతో పాటుగా.

ఇప్పుడైనా నిద్ర లేచి, జయించు అరిషడ్వర్గ అష్టవ్యసన, ఆరోగ్యం, సజీవ గురు సేవ, శాంతి, ఆధ్యాత్మికం, మోక్షం,వాక్సుద్ది - తేలిక సాధన ప్రతి వారం - మనల్ని తెలుసుకుందాం.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,882,732; 104 తత్వాలు (Tatvaalu) and views 226,444
Dt : 04-Dec-2023, Upd Dt : 04-Dec-2023, Category : General
Views : 158 ( + More Social Media views ), Id : 1958 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : everyone , down , values , bear , fear , listening , practicing , good things , sin
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content