అప్పు చేసి పప్పు కూడు? అప్పు తీసుకునే మనకు, ఆత్మాభిమాన ఉన్నదా? ఇది అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వమే? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,883,302; 104 తత్వాలు (Tatvaalu) and views 226,475.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

*అప్పు చేసి పప్పు కూడు వద్దు అని మన పెద్దలు చెప్పారు. మరి అప్పు తీసుకునే మనకు, ఆత్మాభిమాన ఉన్నదా? ఇది అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వమే కదా?*

Our elders said that we do not want to borrow money. Do we have self-respect if we borrow? Is this the slavery of Arishadvarg and Ashtavyasan?

*ప్రశ్న/ స్పందన* - అప్పు చేసి పప్పు కూడు వద్దు అని మన పెద్దలు చెప్పారు. మనము ఎవరినైనా చేయి చాచి అప్పు అడిగితే, మన తల మరియు వంశము పరువు, వారి ఎదురు దించినట్లే, మనకు ఆత్మాభిమానము లేనట్లే అని మన పెద్దలు చెపుతారు.

మరి ఇప్పుడు అందరి బతుకులు, అప్పుల మీదనే తలవంచి, నీచము గా, అదే గొప్ప గా భావిస్తూ బతుకుతున్నారు - 4 ఇళ్ళు/ స్థలాలు, 3 టీవీలు, పెళ్ళి, 4 చదువు, 4 షికారులు, 4 ఆస్తులు, 4 వ్యాపారాలు అన్ని విషయాలలో.

ప్రాణం పోయేటప్పుడు చేయి చాచడం వేరు, అది మినహాయింపు.

కానీ వీరంతా భోగానికే/ అవసరం/ అవకాశం కోసం, ఇతరులకు ఏదీ తక్కువ రేటుకు దక్కకుండా చేసేటట్లు గా, అప్పు తీసుకోవడం, నీతి నిబద్దతా సమాజ క్షేమమా? పోనీ కనీసం వారికైనా క్షేమమా?

మరి బాంక్ లో అప్పు తీసుకుంటే, ఆ బాంక్ లో డిపాజిట్ చేసిన అందరి ముందు మనము/ వంశము పరువు, తల దించినట్లు కాదా? మనకు ఆత్మాభిమానము ఉన్నదా? ఎందుకు సిగ్గు అనిపించడము లేదు?

మన పురాణాలలో, మానసికము గా ఒక తప్పును కేవలము తలచితేనే దోషము గా చెప్పారు, అంటే బాహ్యముగా ఆ తప్పు చేయకపోయినా, ఎందుకంటే చిత్తశుద్ది అనేది ముఖ్యం.

మరి ఈ బాంకులలో 100 లాది డిపాజిటర్ల ముందు, పైకి మేనేజర్ కనపడినా లేదా ఆన్లైన్ లో తీసుకున్నా, ధనం ఇతరులదే కదా? మరి అప్పు తీసుకునే మనకు ఆత్మాభిమాన ఉన్నదా? ఇది అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వమే కదా?

దొరికినంత వరకు అప్పులతో ఆస్తులు కొని కూడా, చివరకి ఇంట్లో ఒకరు పోతే, మరలా గో ఫండ్ లో, ఊరి మీద పడటం ఎందుకు? బాడీని పంపాలి/ కాల్చాలి, పిల్లలను చదివించాలి, ఇల్లు అప్పు కట్టాలి, అని అడగడం, ఇంకా నీచం కాదా?

మరి అసలు అప్పు లేని వారికి, ఎంత మంది అండగా ఉంటారు/ ఉన్నారు?

వీరి యాత్ర యాగ పూజా పునస్కారాలకు విలువ ఉందా? చిత్తశుద్ది లేదు అని నిరూపణ అయ్యింది కదా, దిగజారిన అప్పు బతుకుతో? పిల్లలకు సంస్కారం అబ్బుతుందా? 80 శాతం కలియుగ పాపానికి వీరు ఆజ్యం పోయడం లేదా?

అదేమంటే రాష్ట్రాలు దేశాలు అప్పులు చేయడం లేదా అంటారు, మరి వారు ఆత్మాభిమానం తాకట్టు పెట్టార్రు, అంటే మన వంశం అంతే అందామా? కొన్ని దేశాలలో/ రాష్ట్రాలలో/ ప్రాంతాలలో, వేశ్యావ్రుత్తి సమ్మతమే అయితే, మన ఇంట్లో కూడా ఓకేనా? మనకు సొంత నీతి నియమాలు నిబద్దత విలువలు ఉండవా? ఇదేనా ఓ దైవ భీతి సాధన నమ్మకమ ఉన్న సంస్కార పెంపక జవాబు?

*జవాబు/ ప్రతిస్పందన* - మరి మీరు అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం లేని, సంస్కార తల్లి దండ్రుల పెంపకంతో, జవాబు రాసి పంపగలరా, మీ ఉత్తమ విలువల వంశ ఆత్మాభిమాన మాటలతో? మా జవాబు త్వరలో అని చెప్పాము.

మరి ఎంత మంది స్పందించారో మీ ఆత్మలకే తెలుసు, మెజారిటీ ఒప్పుకున్నట్లే మీ మాటలకు.

అంతా మీరే చెప్పారు. సంస్కార పెంపకం, సజీవ గురువు సేవ, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వ నియంత్రణ ఉన్న వారు, రేపు ముదుసలి వయసులో తమ పిల్లల దగ్గర దేవతలు గా కీర్తింప బడాలి అని అనుకునే వారు ఎవరైనా, మీ మాటలతో ఏకీభవిస్తారు, అప్పు జోలికి వెళ్ళరు ప్రాణాపాయ స్తితిలో, ఏదో కొంచెము తాత్కాలిక, అరువుకు తప్ప అని పెద్దలు అంటారు.

వారి వంశ సంస్కారానికే వదిలేద్దాము, ఫలితాలు వారికే కదా.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,883,302; 104 తత్వాలు (Tatvaalu) and views 226,475
Dt : 21-Aug-2023, Upd Dt : 21-Aug-2023, Category : General
Views : 231 ( + More Social Media views ), Id : 1887 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : self , respect , borrow , credit , debt , slavery , Arishadvarg , Ashtavyasan
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content