చలి, జ్వరము, ఒళ్ళు నొప్పులు, దగ్గు - దేహంలో స్పష్టముగా మార్పు - ఆయుర్వేద కషాయం? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,881,823; 104 తత్వాలు (Tatvaalu) and views 226,342.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

Cold, fever, body aches, cough - obvious change in body - Ayurvedic infusion?

Every opportunity should be taken to pay off the mother's debt, with the service of a living Guru. This is Yaga, Yoga, Yajna, Pilgrimage/ teerdhayatra, Moksha, Sadhana, Guru Shushrusha.

తల్లి రుణం తీర్చుకునేందుకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి, సజీవ గురువు సేవ తో. ఇదే యాగం, యోగం, యజ్ఞం, తీర్ధయాత్ర, మోక్షం, సాధన, గురు శుశ్రూష.

మే లో, గురువు గ్రహం మారుతున్నారు, జాగ్రత్తలు సుమా. ఆనందం దుఃఖం గా, దుఃఖం ఆనందం గా మారుతోంది సగం మంది కి. అంటే అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసలు కు, రజో తమో గుణం వారి కి కుదుపులు భరించాలి. సత్వగుణం వారు స్ధిరత్వం తో దానిని ఎదుర్కొంటారు. అందుకే రోజు లు అన్నీ మనవి కావు.

1) సరె ఇప్పుడు మన పరిస్తితి గత *బుధవారం* - చలి జ్వరము ఒళ్ళు నొప్పులు దగ్గు వచ్చినట్లుగా, మొత్తము దేహంలో స్పష్టముగా మార్పు తెలుస్తుంది. 2 ముక్కుల శ్వాసలో లోపం కూడా. ముందు జాగ్రత్తలు గా మన ఆయుర్వేద కషాయం టీ తాగాము, మరియు ఇతర మూలికలు తిన్నాము. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి.

మరి మాట వింటుందో, లేదా రోగంతో పడవేస్తుందో చూడాలి. అందుకే బయట తిండి తినవద్దు, ఎక్కువ జనం లో తిరగవద్దు. మనము రామ ప్రారంభ యజ్ఞానికి, ప్రాణం పోయినా వెళ్ళాలి, వెళ్ళాక వీడియో ఫోటోలు తీసి పంచాలి, ప్రసాదం తినాలి, ఆ తర్వాత బాధ అనుభవించాలి, దానిని సరి చేసుకోవాలి.

దేవుడు సమస్య, పరిష్కారం 2 ఇచ్చారు. కానీ అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం లో ఉంటే, తాడే పాము అవుతుంది. అందుకే మిమ్మల్ని రోజు నిద్ర లేపడం, మీ కుటుంబం గురించి ఆలోచన చెయ్యమని కోరడం.

అవయవాలు నాడులు అన్ని సంపూర్ణ బంద్ పాటించాయి. కానీ మనం ముందు ఆయుర్వేదం పద్దతి లో నిలువరించి, ఇప్పుడు యోగా ప్రాణాయామం జలనేతి అని, ఇతర విద్యలు కూడా వాడి, అంటే ఎస్మా ప్రయోగం లాగా, దానిని సమ్మె విరమణ చేయించాలి. చూద్దాం ఎవరిది పై చేయి అవుతుందో. ఖర్మ ఫలం మనకు, మీకు తప్పక లభిస్తుంది. ఇప్పుడు అయినా మారండి.

నిన్న రెండు రోజులు, వరుసగా రెండు కార్యక్రమాల, ఫోటో వీడియోలు సోషల్ మీడియా ప్రచారం, వెను వెంటనే చేయడం వలన, బాగా వేడి చేసి, కారని జలుబు, జ్వరం, ఒళ్ళంతా నొప్పులు, దగ్గు. మన ప్రయోగం లు ఎన్ని జరిగినా, వేడి తగ్గదేం ఇవి సర్దుబాటు చేసుకోవు.

2) ఇప్పుడు *శుక్రవారం* - అమ్మ కు కూడా ఒంట్లో బాగోలేదు, రాత్రి అంతా నిద్ర లేదు. వయసు ప్రభావం తో కుర్చీ నుండి లేవాలి అంటే 4 సార్లు ప్రయత్నించి కూలబడే పరిస్థితి నుంచి అసలు లేవలేను రెక్కలు పట్టుకుని నడుపు, లేపు అనే పరిస్థితి. బాత్రూం కి వెళ్ళేటప్పుడు, ఆగక నేల మీద పడే చుక్కలు తుడవడం.

మన ఆయుర్వేదం పద్దతి లో ఇప్పుడు పర్లేదు. ఆమె నడవ గలిగితే, గుడి కి. ఎందుకంటే నలుగురు దేవుళ్ళు, ఇళ్ళు, జీవాలను చూసే అవకాశం ఈ ఒక్క రోజుకి మాత్రమే. మరలా వారం రోజులు, ఇంటి ముసుగులో కదా, చలికి. అమ్మా బాగున్నావా, అనే నటన కపటం మాటలు, రేపు మనల్ని విడువవు. మా సుఖాలు మాని, మన కోసం త్యాగం సేవ కృతజ్ఞత విశ్వసనీయత అంటే అవే మనకు వస్తాయి, రాకపోయినా ఆత్మ జ్ఞానం వస్తుంది.

3) ఇప్పుడు *శనివారం* - 12 * 7 ప్రదక్షిణలు చేస్తూ, అమ్మ ను ప్రతిక్షణం అంటే ప్రతి రౌండ్ లో గమనిస్తూ ఉన్నాం. రాత్ర నిద్ర లేక జలుబు జ్వరం ఒళ్ళంతా నెప్పులు నీరసం తో నిద్ర లోక జారుతుంది అని. ఈరోజు వద్దు అన్నా, అక్కడ నే 4 గురు కనపడతారు లేకపోతే ఇంట్లో ఇంకా బాధ అంటే నే వెళ్ళడం జరిగింది కదా.

ఇంక 12*8 లో అమ్మ స్రృహ తప్పి అంటే నిద్ర లో వెనక్కి జారి ఉంది. వెంటనే వచ్చి లేపి, భుజాలు పట్టుకుని చిన్న గా నడిపిస్తు, కారు లో కూర్చునబెట్టీ, నీళ్ళు కాస్త తిండి పెడితే, మరలా బలం వచ్చింది. వేరే ఆయన, మన సంచితో సహాయం కు, వచ్చారు కారు దాకా. నేను నిద్ర పోతా, మిగతావి తిరిగి రా అంటే, 12* 9 కూడా పూర్తిగా చేసి వచ్చాం. జీపీఎస్ లో ఎక్కువ సమయం ఉంటుంది.

మనకు బుధవారం నుంచి, జలుబు జ్వరం ఒళ్ళంతా నెప్పులు ఉన్న కూడా ఏ ఒక్క పని ఆగలేదు. ఆ దేవుని దయవలన 108 ప్రదక్షిణలు కూడా అయినాయి. ఇప్పుడు దాకా, పక్కనే ఉండి, ఒకటి రెండు కు అమ్మ చేయి పట్టుకొని నడిపిస్తూ, కాస్త తిండి వేన్నీళ్ళు, కషాయం, . . . ఇంకా చాలా. . . అందుకే పిల్లలకు కృతజ్ఞతలు విశ్వసనీయత స్ధిరత్వం ధర్మం నేర్పాలి.

సంస్కారం లేని, చదువు సంపాదన పదవి పెళ్లి పిల్లలు, చివరికి మనకే గుదిబండగా మారతాయి. కనికరం కూడా లేకుండా వదిలేస్తారు. ఈరోజు అమ్మ పరిస్థితి ఇది ఒక సేవకుడు తోడుగా, మరి రేపు మన పరిస్థితి?

తెలుగు రాయడం రాదు, స్టేటస్ లో మన ముదుసలి తల్లిదండ్రులు అత్తమామలు సేవ చెప్పలేం, సొంత పిల్లల సంస్కారం చెప్పలేం, దర్జాగా ప్రొఫైల్ బొమ్మ తో రీడ్ రిసీప్ట్ తో చూసే ధైర్యం లేదు, కాబట్టి మన రేపటి బతుకు మనకు తెలుసు. పంచభూతాలు వదలవు.

ఎమర్జెన్సీ కి పోదామా అని కూడా అడిగాము, వద్దు వాళ్ళు మరలా వంద పరీక్షలు, సూదులు, మందులు ఆ నరకం అసలు భరించలేం అంది అప్పుడు. ఇప్పుడు కూర్చుని, ప్రశాంతంగా రామకోటి రాసుకుంటుంది, చూడండి గుడి కి, రామకోటి కి, ఎంత శక్తివంతంగా, మనసు ప్రభావితం అవుతుంది, సాధనతో?

కొన్ని రోజులు తప్పదు, మగతగా నిద్రలో. వయసు బలహీనత, మనం ఎన్ని ఆయుర్వేద మందు/ఆహారం ఇచ్చిన. ఎమర్జెన్సీ కి వెళితే, వారు మనల్ని లేదా ఆమె ను లెక్క చేయకుండా, వాళ్ళ ఇష్టం వచ్చినట్లు, వెళతారు. చివరకు ఫలితాలు మనకు తెలుసు. అందుకే సంస్కారం లేని, చదువు విద్య వైద్యం బంధం, ఎవరికీ పనికి రాదు అవసరం కు.

4) మనకు ఆరోగ్యం బాగోలేదని, అమ్మ కు ఆరోగ్యం బాగోలేదని, స్వార్థం తో ఇతరుల కష్టాలు సుఖాలు వినడం, వారికి సొంత కుటుంబ సభ్యులు లాగా సలహా ఇవ్వడం మానలేదు.

మానవత్వం తర్వాత నే దైవత్వం. ఇతరులు లా బిజీ బిజీ అనే కుసంస్కారం మనకు లేదు. దేవుని ఫోటో లు కూడా లేటు ఈ వారం.

తెలిసిన వారితో 2 గంటలు కష్ట సుఖాలు, వారికి భవిష్యత్తు జాగ్రత్తలు అన్ని కోణాల్లో వారి ప్రశ్నలకు జవాబులు తో. మానవసేవ మాధవసేవ.

5) 60 శాతం మనకు తగ్గినట్టు నటిస్తుంది రోగం, జలుబు జ్వరం ఒళ్ళు నెప్పులు దగ్గు. ఏ ఒక్క పని ఆగలేదు మనకు. కానీ చాపకింద నీరులా, అది నక్కి ఉందా లేదా అహే వీడితో తలనొప్పి నాకెందుకు ఆ కషాయాలు, వేపాకు, కాకర అల్లం వెల్లుల్లి, మూలికలు, ఏందేందే పోస్తున్నాడు. ఇంతకీ వీడు నన్ను బాధిస్తున్నాడా లేకపోతే నేను వాడి ని సాధించడం కు వచ్చానా? ఆ మధ్య లో ఆ మంత్రాలు పూజలు అరుపులు ఏమిటో తూ నా బతుకు. ఎన్ని రోజులు నేను నేర్చుకోవాలి, ఓర్చుకోవాలి? నేనే వెళతా దూరంగా అంటుందా లేదా తిష్ట వేస్తుందా, ఇదేదే వెరైటీగా ఉంది అని బుధవారం నుంచి 1/24?

అమ్మ ది కనీసం 50 శాతం రోగం తగ్గింది, శుక్రవారం 1/26 నుంచి. కానీ నమ్మడం కు లేదు ఇంకొన్ని రోజులు, కేవలం తన మామూలు మందులు మరియు ఆయుర్వేదం. వయసు మరియు బలహీనత జాగ్రత్తలు తీసుకోవాలి. కంటికి రెప్పలా, రాత్రి కూడా విసుగు లేకుండా తిప్పే వారు ఉంటే, ఎంత కష్టం అయినా భరిస్తారు. దేవుడు ఆ సేవా భాగ్యం మనకే కలిగించారు.

తల్లి రుణం తీర్చుకునేందుకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి, సజీవ గురువు సేవ తో. ఇదే యాగం, యోగం, యజ్ఞం, తీర్ధయాత్ర, మోక్షం, సాధన, గురు శుశ్రూష.

Friday starting for Mom, cold fever body pains cough everything same like me, which started for me from Wed. This is 2nd night jagananna to care Mom to hold to restroom and clean, giving tablets and Ayurveda stuff whole night.

As proverb, cold will leave in a week with tablets doctor visits, but without them cold will leave in 7 days. We should understand what is happening inside the body based personal habits and thoughts.

For me nothing stopped till now, usual 1 and 2 and also 108 pradakshin yesterday. So I am good.

For Mom only 2 days, age factor and also my ardhashtam shani effect is there. No special medicine for this. As usual normal Ayurveda. Next God wishes. Hope you also taking care of yourself and older parents after 60 or body weakness.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,881,823; 104 తత్వాలు (Tatvaalu) and views 226,342
Dt : 31-Jan-2024, Upd Dt : 31-Jan-2024, Category : General
Views : 218 ( + More Social Media views ), Id : 1994 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Cold , fever , body aches , cough , change , body , Ayurvedic , infusion , mom , older , parents , son
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content