శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా? ఏమి తొందర వచ్చింది, అప్పుడే మమ్మల్ని విడిచి? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,881,764; 104 తత్వాలు (Tatvaalu) and views 226,327.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

An ant without the command of Lord Shiva? What's the rush, why you just left us?

నన్ను మొదట పలకరించింది నువ్వే, నిన్ను చివర పలకరించింది నేనే.
You are the one who greeted me first and I am the one who greeted you last.

మంచి వారు ఉండలేరు, చెడ్డవారు వెళ్ళలేరు, వచ్చిన పని అయిపోతే ఉండరు, వచ్చిన పని కాకపోతే పోరు అంటారు. సంకల్పం, వికల్పం. మరి ఏది నిజం, ఏది అబద్దం. ఏది తొందర, ఏది ఆలస్యం. ఏది మంచి, ఏది చెడు.

శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. ఏమి తొందర వచ్చింది అని అన్నా, అప్పుడే మమ్మల్ని విడిచి వెళ్ళావు అన్నా, అనాధలు గా చేసి.

నెల లోపే సందేశం పెట్టావు, మాట్లాడదాం లే అని జవాబుగా, కానీ సేవ చేసే భాగ్యం, సూచనలతో మొదలు పెట్టి, చేతలతో పూర్తి కాకుండానే దూరమయ్యావు అన్నా.

ఇప్పుడే విన్నాము ఆ కఠోర సత్యం, తరలి రాని లోకాలకు వెళ్ళిన, అన్న ఆత్మ కు సద్గతి కలగాలి. ఇదే మా కన్నీటి వీడ్కోలు, తలవంచి నమస్కరిస్తూ, నీ చిరునవ్వు మాటలకు.

4 ఏళ్ళు కలసి మెలసి మాట్లాడుకున్నాము. మన దోవలు వేరు, పనులు వేరు, ఊళ్ళు వేరు, సాధనలు వేరు, తీరులు వేరు, కానీ ఏదో తెలియని బంధము అనుబంధం. మొదటి రోజు నుంచే, స్నేహితులుగా ఎన్నో ఎన్నెన్నో మాట్లాడాము. కేవలం మనసున్న మాటలే మన బంధము.

మనం చర్చించేది ఇద్దరమే అయినా, 10 మందికి వినిపిస్తుంది, గట్టిగా సూటిగా బల్లగుద్ది మరీ, అంత భోళాతనం.

మన ఇంట్లో వారు, మన చుట్టూ అవసర అవకాశవాదులు, మన గురించి పైకి మంచి చెప్పడం కాదు మనకు కావలసింది. అది నిష్ప్రయోజనం. పరలోకములో పనికి రాదు.

అరిషడ్వర్గ అష్టవ్యసన దాసులు కాని వారు, 10+ ఏళ్ళ సజీవ గురువు సేవ చేసినవారు, 219+ వారాలు 108 ప్రదక్షిణాలు చేసినవారు, 20+ ఏళ్ళు పైగా నేల చాపతో శాఖాహారం తినే వారు, గీతను ఆచరణలో చూపుతూ స్తిర గుణం గల వారు, తమంతట తామే నిస్వార్ధముగా, మన గురించి మంచి చెప్పాలి పదిమందికి. అది దేవునికి కూడా చేరుతుంది. అది నువ్వు సాధించావు అన్నా.

దాపరికం, చాటు మాటు, 2 నాల్కలు లేదు, ఉన్నది ఉన్నట్లు నిజాయితీగా మాట్లాడటం, అది తప్పు అయినా ఒప్పు అయినా, ముందుగా మనము పలకరించి, ఎక్కడ కనిపించినా, ఎటువంటి భేషజాలు తేడాలు ఎక్కువతక్కువలు లేకుండా. అదే మంచి గుణం.

మొఖము నిండా నవ్వు, నోటి నిండా మాటలు, ఎవరైనా, ఎక్కడైనా, ఒకటే పలకరింపు, తొలకరింపు. నన్ను మొదట పలకరించింది నువ్వే, నిన్ను చివర పలకరించింది నేనే.

* * *

అందరికీ అదే చెపుతా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన మనము కలిసాము అంటే, ఏదో అర్ధం పరమార్ధం ఉంది, ఒకరి కొకరు అండ కు దేవుడు పంపారు, మనమే గురు శిష్యులము కావచ్చు, బతుకు నిలబెట్టేవారము కావచ్చు. అందుకే గుణవంతులమై గుణవంతులతో మెలగాలి, అది అర్ధము చేసుకుంటే, ఈ రోజు ఎవరూ మనల్ని వీడి పోరు.

చూడు మన ఎదురు నవ్వుతూ తుళ్ళుతూ ఉన్న మనిషి ఈరోజు లేడు. నిర్మొహమాటంగా మాట్లాడతారు గట్టిగా. మరి మనము నేడో రేపో. ఇన్ని జాగ్రత్తలు గా ఉన్నా, మమ్మల్ని అయినా రోగాలు వదలవు, కానీ ఇప్పటి దాకా నెట్టుకు వచ్చాము కదా?

అందుకే మీరు ఆయుర్వేదం రోజూ వాడాలి రోగం రాకుండా ఉండటానికి, అలాగే ఉన్నదానిని అదుపు చేయడానికి. మనం ఇంట్లో తినేది కూడా, విషమే, కల్తీ సంకర జాతి రసాయన తిండే మరువద్దు.

మరి దేనికోసం ఈ జనాల ఆరాటాలు పోరాటాలు కుట్రలు కుతంత్రాలు, ముందు జాగ్రత్తలు చెబితే వినరు కదా, సాధనలకు సమయం లేదు అంటారు.

మరి మనం లేకపోతే, మన పిల్లలకు ఎవరు అండ? ఎవరు ప్రపంచములో మంచి చెడు విడమర్చి చెప్పేది? ఎవరు కనీసం మంచి చేయకపోయినా, చెడు చేయకుండా ఉండేది? ఎవరు నిష్పక్షపాతి? ఎవరు స్తిర స్తితప్రజ్ఞత కలిగి ఉండేది? ఎవరిని నమ్మాలి?

వాతావరణ శాఖ కూడా ముందే తుపాను హెచ్చరికల ను పంపుతుంది. కానీ స్వయం భ్రమల ఆనందం లో, పరుగులు తీసే ప్రాపంచిక దాసులు కు, హఠాత్తుగా ఫోన్ లు చేసే తీరిక ఎలా దొరుకుతుంది, చెప్మా ఉప్మా అన్నా, లేదా కాలుని దగ్గరకు ఎప్పుడు పయనం అన్నా, మనకు తెలీదు. అందుకే, ఈ రోజే మనమూ అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం వీడాలి.

అలా ఊహించుకొని, ఎలా తెలుస్తుంది ఫోన్ దగ్గర ఉండాలని మనకు లేదా రేపు ఖచ్చితముగా ఉంటామని అందుబాటులో మనకు, తెలుసా? ఎవరికెవరు ఈలోకం లో ఎవరికి ఎరుక, ఏ దారెటు పోతుందో ఎవరినీ అడగకా. జై శనీశ్వరా  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,881,764; 104 తత్వాలు (Tatvaalu) and views 226,327
Dt : 01-Jan-2024, Upd Dt : 01-Jan-2024, Category : General
Views : 290 ( + More Social Media views ), Id : 1979 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : ant , without , command , lord , shiva , rush , left , friend , good , person , alameda , oakland
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content