78+ అమ్మ, సజీవ గురువు సేవలో 10 వ ఏడు - కధ కాదు, రేపటి మన ముదుసలి జీవితం - మారతామో మాడతామో? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,881,747; 104 తత్వాలు (Tatvaalu) and views 226,320.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

78+ Mom, 10th year living Guru Seva - This is not a story, tomorrows our old age life - Its up to us to change or not.

78+ ఏళ్ళ వయసు అమ్మ, సజీవ గురువు సేవలో 10 వ ఏడుకు - ఇది కధ కాదు, రేపటి మన ముదుసలి జీవితం - మారతామో మాడతామో మన ఇష్టం?

గత సెప్టెంబర్ కే, అధికారికముగా 78+ ఏళ్ళ వయసు అమ్మ, సజీవ గురువు సేవలో 10 వ ఏడుకు చేరుకున్నాము. బీపీ, షుగర్, వర్టికో తో, మరియు పెద్ద వయసు బాధలతో, బయట సొంత గా 10 అడుగులు చేయి పట్టుకోకుండా నడవలేని మనిషిని, మన వెంట తిప్పుతూ, గుడి సినిమా షికార్ హోటల్ మార్కెట్ కు, సామాన్యమైన విషయము కాదు.

ఇద్దరు 5 ఏళ్ళ పిల్లల పెంపకము తో, సమానం. పిల్లల మీద ప్రేమ, భవిష్యత్ ఆశ ఉంటుంది, ఎంత కష్టమైనా తెలియకపోవచ్చు.

కానీ తరిగిపోయే ముదుసలి తల్లి మీద కాదు కదా? ఏరోజు ఏమి అవుతుందో, ఎప్పుడు తూలి పడిపోతుందో, అనారోగ్యం ఎప్పుడు ముదురుతుందో, ఎప్పుడు నిర్జీవము అవుతుందో, ఏదీ తెలియదు.

నిత్యం ఇంగ్లీష్ మందులు వాడాలి, బూట్లు సాక్స్ వేసి 1 మైలు దూరం నడపాలి, అన్ని కూరలు కాయలు కోసి ఇవ్వాలి, జ్యూస్ పట్టాలి, ఇల్లు చిమ్మాలి, మంచం మీద నేల మీద పోస్తే తుడవాలి ఎత్తి పోయాలి, బాధపడితే ఓదార్పు ను ఇవ్వాలి.

మన సొంత ఆయుర్వేదము, రసాలు, మూలికల పొడి కషాయం ఇవ్వాలి, లేకపోతే ఎప్పుడో కాలం తీరేది, కేవలం ఇంగ్లీష్ మందు అయితే. కరోనా దరికే చేరలేదు సుమీ.

ఏదీ ఉచితము గా రాదు, అన్ని ఖర్చులే, నీతి నిజాయితీ ముక్కుసూటి తనం ఉన్న వారికి దేవుడు తప్ప, ఎవరూ అండ? ఆ దేవుడు కూడా 3 ఏళ్ళు పైగా ఆదాయం లేకుండా, జీవిత కష్ట నష్టాల కన్నీళ్ళ ఆట చూస్తే, ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ, 7 కొండలపై మానవ మ్రుగాలకు దూరం గా నిలచి ఉన్నారు.

బూజు పడుతున్న, శిధిలమౌతున్న ఇల్లుని చూసి, ఏమి చేయలేని పరిస్తితి, కుటుంబ మరియు స్నేహ బంధాలకు విలువ ఇచ్చి.

ఈ 10 ఏళ్ళు లో, ఏలినాటి శని తన ప్రతాపం కూడా 7 న్నర ఏళ్ళు చూపిస్తే - ముదుసలి
అమ్మ ముఖ్యమా? ప్రభుత్వ ఉద్యోగ అధికార సంపాదన సుఖాలు సౌకర్యాలు ఆనందాలు ముఖ్యమా, అంటే?

దేవుడి ముందు మనము, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వమునకు లోనయ్యి, ఓడిపోకూడదు సుమీ. ఒట్టి చేతులతో వచ్చాము, ఇవన్నీ ప్రాపంచిక మాయ, దేవుడు ఆడే ఆట, గెలిపించుకుంటాడో, ఓడించుకుంటాడో, ఆయన ఇష్టం, అని ఉద్యోగం వదిలేసి, అమ్మ పాదాలు గట్టీగా పట్టుకున్నాము, ఈనాటికీ.

మనము పప్పు చారులో కరివేపాకుము, ఏనాటికీ మరువద్దు, అహంకరించవద్దు, ఆత్మ జ్ఞానం విడువద్దు.

దేవుడే విస్తు పోయి, ఏమి చెయ్యాలో తెలీక తలపట్టుకున్నారు, ఆనందముగా, నన్ను జయించావురా అని. ఇలాంటి మొండి వాడిని, స్తిర బుద్ది గల వాడిని, ఎక్కడా చూడలేదు. నన్ను వదలడే ఇన్ని వ్యామోహాలు చుట్టు ఉన్నా పిచ్చి వాడిలా, విరాగిలా, సన్యాసి లా, ప్రపంచ ఆటలు దూరం గా ఉండి చూసే మునిలా.

మరి ఏలినాటి శని కూడా చిన్న బోయాడు, దేవ దేవుడే అండగా ఉంటే, కన్న తల్లి నే అడ్డుపెట్టి, నా ప్రభావాన్ని ఎదుర్కోమంటే, నేనేమి చేయ గలను అని. ఇద్దరకూ నేను హాని చెయ్యలేను, కేవలం ఆదాయం ఆపడం తప్ప అని, ఆ గండం దాటి పోయింది.

ఇప్పుడు అర్దాష్టమ శని కూడా, అదే అమ్మ అండ తో, తట్టుకుని నిలబడుతున్నాము, ఇంకో 2 ఏళ్ళు షుమారు.

మానవత్వం తో, ఎవరు మనకు అండ? అవసరం అవకాశం అంతస్తు అధికారం నివాసం వైభోగం ఆనందం లేనిదే, కనీసం సొంత భాగస్వామి, పిల్లలు, బంధువులు, స్నేహితులు, ముదుసలి తల్లి తండ్రులు అత్త మామల తోనే పలకని, వారికి సమాన సౌకర్యాలతో సేవ చేయని, దౌర్భాగ్యుల సహజీవనం మన చుట్టూ కదూ? అడవి జంతువుల కున్న, కరుణ జాలి, సొంత వారి మీదే లేని మ్రుగాలు మన చుట్టూ.

కన్న తల్లి సేవ లో ఉన్నారు, ఇబ్బంది పెడితే, మనకూ చివరకు పుట్టగతులు ఉండవు అని, మన దగ్గర వారి అవసరానికి అప్పు తీసుకున్న లక్షల బాకీ జనాలకు, జాలి పడుతుందా? లేదు కదా, వారి ఇల్లు పూర్తిగా పతనము అయిన దాకా?

అందుకే, 10 ఏళ్ళుగా దిక్కు లేని వారికి దేవుడే దిక్కు, ప్రతి శని వారపు చుట్టాలు శివయ్య శనయ్య కు నిమ్మ నేతి దీపాలు.

అందుకే ఇది సజీవ గురువు సేవ. ఇంతకు మించి ఏ యాగము, యాత్ర, పూజ, మంత్రము, ఉపాసన, అవపాసన, అవసరము లేదు. ఇదే స్తిత ప్రజ్ఞత, స్తిరత్వం, ఒకే మాట బాట, కపటం నటనం లేకుండుట, ఓర్పు, సహనం, త్యాగం, క్రుతజ్ఞత, విశ్వసనీయత, మాత్రుదేవోభవ ఆచార్యదేవోభవ, మానవత్వం.

మీరూ తోటి మనిషికి శారీరకముగా మానసికముగా సహాయపడుతూ, మీ ముదుసలి తనములో అండ తెచ్చుకుంటారని ఆశిస్తూ, కామ క్రోధ మద లోభ మాత్సర్యాలు అంటే అరిషడ్వర్గం జయించే శక్తి పెంచుకుంటూ, అష్టవ్యసనాలకు దూరముగా ఉంటూ, సంస్కార పెంపక పిల్లల నీడలో సేద తీరాలని ఆశిస్తూ, తల వంచి నమస్కారములు.

దేవుడు మనలో ఉండాలి, మన చేతలు మాటలు ఆలోచనలలో ఉండాలి, బయట కాదు. అంటే మానసిక నియంత్రణ ఉండాలి. మన చెడు ఆలోచనల మీద యుద్దమే, వెలుగుల జ్ఞానమే, నిత్య శుభ దీపావళి.

అదే మన 5 ఏళ్ళుగా మీకు అలవాటు చేసిన, జయించు అరిషడ్వర్గ అష్టవ్యసన, ఆరోగ్యం, సజీవ గురు సేవ, శాంతి, ఆధ్యాత్మికం, మోక్షం, వాక్సుద్ది - తేలిక సాధన ప్రతి వారం - మనల్ని తెలుసుకుందాం.

ఇప్పటికైన, సొంత ఇంటిలోనే ఉండి, సొంతముగా చేసే మాటల, పాటల, ధ్యానాల, సాధన 10 మందికి తెలుపుతారు కదూ. దేవుడు మీలోనూ ఉన్నారు, మనసుకు బట్టిన బూజు దులిపితే.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,881,747; 104 తత్వాలు (Tatvaalu) and views 226,320
Dt : 11-Nov-2023, Upd Dt : 24-Nov-2023, Category : General
Views : 189 ( + More Social Media views ), Id : 1947 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : 78 , Mom , 10th , living , Guru , seva , story , tomorrows , old , age , life
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content