APLatestNews.com top Banner
         
ట్రంప్ గోడ దెబ్బ - మీరు దిగిరాకుంటే, జాతీయ అత్యవసర పరిస్థితి ఆయుధం ఉపయోగిస్తా - లోకం తీరు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
            
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. నచ్చితే షేర్ చేయగలరు.
షుమారు 18 రోజులు పైగా ప్రభుత్వాని మూసి, రోజూ ఒకరి మీద ఇంకొకరు ఆరోపణలు అంతా మీ వల్లనే అని. ఎదో ఒక మధ్య అంగీకారానికి రావటానికి ఇరు పక్షాలు రోజులు, గంటల తరబడి చర్చలు సాగించాలి, సాగిస్తున్నారు. కాని అది తెగటము లేదు, ఇరు పక్కల భీష్మించుకుని కూర్చున్నారు. సరిహద్దు గోడ పక్కన పెట్టు అని ఒకరు, గోడ తర్వాతే ఎదైనా అని ఇంకొకరు. పూర్తి వివరాలు ముందు ఆర్టికల్(వార్త) లో చదవగలరు.

ఇలాగే కొనసాగిస్తే, జనాన్ని ఇబ్బంది పెడితే, మాట వినకపొతే, జాతీయ అత్యవసర పరిస్థితి(ఎమర్జెన్సీ ) కి నా కున్న ప్రత్యేక అవకాశాన్ని/హక్కును కూడా వాడటానికి వెనుకాడను, అని ప్రెసిడెంట్ ట్రంప్ హెచ్చరించారు.

ప్రెసిడెంట్ ట్రంప్ దానిని వాడితే, అది 32 వ క్రియాశీల జాతీయ అత్యవసర పరిస్థితి గా ఉంటుంది.

అలాంటి పరిస్తితిలో, సరిహద్దు గోడకు ఆయనకు నిధులు మళ్ళించే అధికారం వస్తుంది. అలా చేయడము చాలా తప్పు అని డెమోక్రాటిక్ నేతలు అంటున్నారు. వారు కోర్ట్ కు వెళ్ళే అవకాశము ఉంది. అలాంటి పరిస్థితి తావొద్దని రిపబ్లికన్స్ అంటున్నారు.

Updates : -

Jan 9th - ప్రెసిడెంట్ ట్రంప్, కాంగ్రెస్ డెమోక్రాటిక్ నేతలు నాన్సీ పెలోసీ మరియు చుక్ స్చుమర్లతో సమావేశం అనంతరం, సమయం మొత్తం వ్యర్థం(a toal waste of time), చర్చించి ఒక ఒప్పందానికి బుధవారం ఎలాంటి అవకాశం లేదని ప్రకటించారు.

Jan 10th - ప్రెసిడెంట్ ట్రంప్ - నేను గట్టిగా బల్ల మీద కొట్టలేదు, కోపము తో అరవలేదు, అదంతా ఫేక్ వార్తా పేపర్ల గారడి, అవి అబద్దాలు. 30 రోజుల చర్చల తర్వాత అయినా, గోడకు డబ్బులు ఇస్తారా అని అడిగాను. డెమోక్రాట్లు, కుదరదు అన్నారు. అరవగలిగి ఉండి గమ్మున బై బై చెప్పి వచ్చేశాను, ఇక అనవసరం అని. వారికి నేరాలు, నేర గాంగులు, డ్రగ్స్, కనపడవు, పట్టించుకోరు. కానీ నేను పట్టించుకుంటాను. మా దోవకి రావాలి లేదా మధ్యే మార్గానికి రావాలి, లేదంటే అత్యవసర పరిస్థితి తప్పదు.

డెమోక్రాటిక్ నేత పెలోసీ వివరణ - అధ్యక్షులు చెప్పేది, మాకు నచ్చలేదు, అంత కన్నా మంచిగా చెయ్యొచ్చు. మాకు కూడా దేశ గోడ రక్షణ కావాలి, కాని ఈ పద్దతిలో గాదు. ఆయన అసహనము గా, ముందే అనుకొని(set up) వచ్చినట్లు వెళ్ళిపోతే చేయగలింది లేదు.

Jan 12th - అమెరికా ప్రభుత్వ మూత రికార్డు స్థాయిలో 22వ రోజుకు చేరుకుంది, క్లింటన్‌ టైంలో 21 రోజులు. ప్రెసిడెంట్ ట్రంప్ పిలుపినిచ్చారు ,డెమొక్రాట్స్ మీ సెలవలను ముగించుకొని, త్వరగా రాజధాని వాషింగ్టన్ తిరిగి వచ్చి ,ప్రభుత్వాన్ని తిరిగి తెరిచే ప్రయత్నము చేయడానికి పని చేయాలి, అదే సమయంలో మన దక్షిణ సరిహద్దు వద్ద భయంకరమైన మానవతా సంక్షోభం ను ముగించాలి. నేను మీ కోసం, వైట్ హౌస్ లో ఎదురు చూస్తూ ఉన్నాను!

ఫెడరల్ ఖైదీలలో 23% అక్రమ వలసదారులు. బోర్డర్ అరెస్టులు 240 శాతం పెరిగినాయి . టెక్సాస్ రాష్ట్రములో , 2011 మరియు 2018 ల మధ్య, అక్రమ విదేశీయుల వల్ల మొత్తం 292,000 నేరాలు జరిగాయి , 539 హత్యలు, 32,000 దాడులు, 3,426 లైంగిక దాడులు మరియు 3000 ఆయుధాల ఆరోపణలు . డెమోక్రాట్లు తిరిగి రాండి.

ప్రెసిడెంట్ ట్రంప్ ఇలా చెప్పారు, వాషింగ్టన్ పోస్ట్ నుండి నకిలీ వార్త - వైట్ హౌస్ అస్తవ్యస్తంగా ఉంది, ఈ ప్రభుత్వం తెరవటానికి ఎటువంటి వ్యూహం/పద్దతి కనిపించడం లేదు అని చెప్పింది. ఏ ప్రణాళిక లేదు. వారికి ఫేక్ వార్తలే ఇష్టం, నిజానికి, శ్వేతసౌధం లో దాదాపు ఎవ్వరూ లేరు నేను తప్ప.

డెమొక్రాట్లు, 15 నిమిషాల్లో షట్డౌన్ను పరిష్కరించవచ్చు! మీ డెమోక్రాట్ సెనేటర్ లేదా కాంగ్రెస్ మహిళ/మనిషిని ఫోన్ చేసి చెప్పండి మరియు పిలవండి, మానవతా సంక్షోభం ను, తొలగించమని. అని ట్రంప్ పిలుపినిచ్చారు.

Dt : 09-Jan-2019, Upd Dt : 21-Mar-2019 , Category : America, Views : 257 ( id : 33 )
Tags : President Trump , Wall , Republican , Democrats , Govt Shutdown , USA , national emergency , Pelosi
గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు.

Facebook Comments